Brunei Sultan
-
7000 కార్లు ఉన్న బ్రూనే సుల్తాన్.. ప్రధాని మోదీకి ఆతిథ్యం
న్యూఢిల్లీ: ప్రధానమత్రి నరేంద్ర మోదీ నేడు(మంగళవారం) బ్రూనే వెళ్తున్నారు. ఆ దేశ సుల్తాన్ హస్సనాల్ బోల్కియా.. మోదీకి ఘన స్వాగతం పలకనున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఇరు దేశాల మధ్య ఉన్న 40 ఏళ్ల దౌత్య సంబంధాలను బలోపేతం చేయనున్నారు. భారత ప్రధాని బ్రూనై పర్యటనకు వెళ్లడం ఇదే తొలిసారి కావడం విశేషం. బ్రూనై పర్యటన తర్వాత అక్కడి నుంచి మోదీ సింగపూర్ వెళతారు.కాగా బ్రూనే సుల్తాన్ హస్సనాల్ బోల్కియా.. ప్రపంచంలోని సంపన్న వ్యక్తుల్లో ఒకరు. బ్రిటన్ క్వీన్ ఎలిజబెత్ రాణి 2 తరువాత ప్రపంచంలోనే రెండవ అత్యధిక కాలం పాలించిన చక్రవర్తి సుల్తాన్ పేరుగాంచారు. ఆయన చాలా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. ఆయన వద్ద అత్యధిక సంఖ్యలో ఖరీదైన ప్రైవేటు కార్లు ఉన్నాయి. సుమారు 5 బిలియన్ల డాలర్ల ఖరీదైన లగ్జరీ కార్లు(సుమారు 4 లక్షల కోట్లు) ఉన్నాయి.సుల్తాన్ బోల్కియా సంపద దాదాపు 30 బిలియన్ డాలర్లు. ఆయనకు సంపద ప్రధానంగా బ్రూనై చమురు, సహజ వాయువు నిల్వల నుంచి వస్తుంది. సుల్తాన్ బల్కియా వద్ద సుమారు ఏడు వేల లగ్జరీ వాహనాలు ఉన్నాయి. వాటిల్లో 600 రోల్స్ రాయిస్ కార్లు ఉన్నాయి. సుల్తాన్ పేరిట గిన్నిస్ వరల్డ్ రికార్డు ఉంది. ఆయన కలెక్షన్లలో 450 ఫెరారీలు, 380 బెంట్లీ కార్లు కూడా ఉన్నాయి. పోర్షె, లాంబోర్గిని, మేబాచ్, జాగ్వార్, బీఎండబ్ల్యూ, మెక్లారెన్ కార్లు కూడా అతని వద్ద ఉన్నాయి.బోల్కియా కలెక్షన్లో బెంట్లీ డామినేటర్ ఎస్యూవీ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నది దాని విలువ సుమారు 80 మిలియన్ల డాలర్లు. పోర్షె 911 హారిజన్ బ్లూ, 24 క్యారెట్ల గోల్డ్ ప్లేట్ రోల్స్ రాయిస్ సిల్వర్ స్పర్-2 కార్లు ఉన్నాయి. కస్టమ్ డిజైన్డ్ రోల్స్ రాయిస్ విత్ ఓపెన్ రూఫ్ కారు కూడా ఉంది. కూతురు, యువరాణి మజేదేదా పెళ్లి కోసం 2007లో గోల్డ్ కోటింగ్ రోల్స్ రాయిస్ కారును ఆయన ఖరీదు చేశారు.సుల్తాన్ జీవన విధానం చాలా విలాసవంతమైనది. ఆయన ఇల్లు ‘ఇస్తానా నూరుల్ ఇమాన్’ ప్యాలెస్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్యాలెస్. 20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో దీనిని 1984లో నిర్మించారు. బ్రిటన్ నుంచి బ్రూనై స్వాతంత్ర్యం పొందిన సమయంలో నిర్మించారు. దీని ధర రూ.2,250 కోట్లు. ఈ ప్యాలెస్‌లో 22 క్యారెట్ల బంగారు గోపురాలు, 1,700 గదులు, 257 స్నానపు గదులు, ఐదు ఈత కొలనులు ఉన్నాయి. 110 గ్యారేజీలు ఉన్నాయి. ఆయన వద్ద ఒక ప్రైవేట్ జంతు ప్రదర్శనశాలను కూడా ఉంది. ఇందులో 30 బెంగాల్ పులులు, వివిధ పక్షి జాతులు ఉన్నాయి. అతనికి బోయింగ్ 747 విమానం కూడా ఉంది. -
అందులోని వాహనాల ఖరీదే వేలకోట్లు.. ఆ ప్యాలెస్ గురించి తెలిస్తే షాకవుతారు!
World Biggest Palace Istana Nurul Iman: ఇప్పటి వరకు భారతదేశంలో మాత్రమే కాకుండా ప్రపంచంలోని అత్యంత ఖరీదైన భవనాల జాబితాలో 'యాంటిలియా' ఉన్న విషయం తెలిసిందే. ఈ భవనం కంటే కూడా ఇంకా ఖరీదైన.. విశాలమైన & విలాసవంతమైన ప్యాలెస్ గురించి ఈ కథనంలో తెలుసుకుందాం. ఇస్తానా నూరుల్ ఇమాన్.. నివేదికల ప్రకారం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన భవనం 'ఇస్తాన నూరుల్ ఇమాన్'. ఇది ఇండోనేషియాకు సమీపంలో ఉన్న చిన్న దేశం బ్రూనైలో ఉంది. దీని యజమాని బ్రూనై సుల్తాన్ 'హసనల్ బొల్కియ'. ఈయన ఆ దేశ ప్రధాన మంత్రి కావడం కూడా ఇక్కడ గమనించవలసిన విషయం. నిజానికి బోల్కియా దేశానికి సుల్తాన్‌గా పట్టాభిషేకం చేసినప్పటి నుంచి చాలా దశాబ్దాలుగా ఆ రాజప్రసాదంలో నివసిస్తున్నారు. ఇది కేవలం అంబానీ యాంటిలియాకి మాత్రమే కాదు భారతదేశంలోని లక్ష్మీ విలాస్ ప్యాలెస్ కంటే కూడా చాలా పెద్దది. దీని విస్తీర్ణం సుమారు 2.15 మిలియన్ చదరపు అడుగుల వరకు ఉంటుందని సమాచారం. ఇదీ చదవండి: ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లపై కీలక ప్రకటన - ఆ రెండు బ్యాంకులు.. ది లైట్ ఆఫ్ ఫెయిత్ ప్యాలెస్.. అత్యంత సుందరంగా రూపుదిద్దుకున్న ఈ భావనాన్ని 'ది లైట్ ఆఫ్ ఫెయిత్ ప్యాలెస్' (The Light Of Faith) అని కూడా పిలుస్తారు. ఇందులో చాలాభాగం తెలుపు రంగులో, గోపురాలు బంగారు రంగులో ఉంటాయి. అంతే కాకుండా ప్యాలెస్ గోపురం 22 క్యారెట్ బంగారంతో ఉన్నట్లు సమాచారం. ఇందులోని పైకప్పులు బ్రూనై ఇస్లామిక్ సంస్కృతి & మలయ్ సంప్రదాయాల ప్రకారం నిర్మించారు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్.. ఇస్తాన నూరుల్ ఇమాన్ ప్యాలెస్ ప్రపంచంలోనే అతి పెద్ద భవనంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో కూడా చోటు దక్కించుకుంది. ఈ భవన నిర్మాణానికి అయిన ఖర్చు అంచనా ప్రకారం రూ. 2,550 కోట్ల కంటే ఎక్కువ అని నివేదికలు చెబుతున్నాయి. హస్సనల్ బోల్కియా ఇందులో చాలా సంవత్సరాలుగా నివాసముంటున్నాడు. వీరి వద్ద 7000 కంటే ఎక్కువ లగ్జరీ కార్లు ఉన్నట్లు సమాచారం. వీటి విలువ సుమారు రూ. 41,600 కోట్లు. ఇదీ చదవండి: అకౌంట్లో డబ్బు లేకున్నా రూ. 80000 విత్‌డ్రా చేసుకోవచ్చు ఇస్తాన నూరుల్ ఇమాన్ 1,788 గదులను కలిగి ఉన్నట్లు, ఇందులో 257 బాత్రూమ్లు, 5,000 మంది అతిథులకు సరిపోయే హాల్, ఐదు స్విమ్మింగ్ పూల్స్, హెలిప్యాడ్ వంటి మరెన్నో సదుపాయాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద రాజభవనం కూడా అని చెబుతారు. -
కటింగ్ రూ.15 లక్షలు, 7వేలకుపైగా లగ్జరీ కార్లు.. ఈ సుల్తాన్ రూటే సెపరేటు!
దర్పంగా సెల్యూట్ చేస్తున్న ఈ పెద్దమనిషి బ్రునెయి సుల్తాన్ హసనల్ బొల్కియా. ప్రపంచంలోని అపర కుబేరుల్లో ఒకరిగా రికార్డులకెక్కిన ఘనత ఈయన సొంతం. నిజానికి 1980 వరకు ప్రపంచంలోని అత్యంత ధనవంతుడిగా ఈయన కొనసాగాడు. తర్వాతి కాలంలో వ్యాపార దిగ్గజాలు భారీగా సంపద పోగేసుకోవడం మొదలుపెట్టాక, కొద్దిగా వెనుకబడ్డాడు. ఈ ఫొటోల్లో కనిపిస్తున్న బంగారు వన్నె కారు ఈ సుల్తాన్‌గారి వాహనమే! కేవలం రంగు కాదు, అచ్చంగా బంగారు తాపడం చేయించిన రోల్స్‌రాయ్స్ కారు ఇది. ఈయనగారి రాజప్రాసాదంలో ఏడువేలకు పైగా లగ్జరీకార్లు కొలువుదీరి కనిపిస్తాయి. వీటిలో మూడువందలకు పైగా ఫెరారీ, ఆరువందల రోల్స్‌రాయ్స్ కార్లు ఉంటాయి. ఈ సుల్తాన్గారికి సొంతగా బోయింగ్–747 విమానం కూడా ఉంది. సంపదను పోగు చేయడంలోనే కాదు, విలాసవంతంగా ఖర్చు చేయడంలోనూ బ్రునెయి సుల్తాన్ అభిరుచే వేరు! ఒకసారి క్షౌరం చేయించుకోవడానికి ఈయన ఏకంగా 20వేల డాలర్లు (రూ.15.85 లక్షలు) ఖర్చుచేస్తాడంటే, ఎంతటి విలాస పురుషుడో అర్థం చేసుకోవాల్సిందే! ఈ ఫొటోల్లో కనిపిస్తున్న భవంతి ఈయన రాజప్రాసాదం. ఇందులో విలాసమైన 1700 గదులు, అధునాతనమైన సౌకర్యాలతో అడుగడుగునా కళ్లుచెదిరేలా కనిపించే ఈ ప్రాసాదం బురుజులకు బంగారు తాపడం అదనపు ఆకర్షణ. చదవండి: రాకేష్ ఝున్‌ఝున్‌వాలా నిర్మించిన బాలీవుడ్ మూవీలు ఏవో తెలుసా? -
బ్రూనై సుల్తాన్ ఎలా వచ్చారంటే..
సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల్లో ఒకరంటే ఆ హంగామా, దర్పం వేరు. వాళ్లు మనలా కార్లు, విమానాలను నడుపుకుంటూ రావడం జరిగే పనికాదు. వారు వచ్చారంటే వారి పరివారం..ఆ హడావిడే వేరు. అయితే ఇలాంటి సీన్ ఈ వీవీఐపీ విషయంలో మాత్రం రివర్స్ అయింది. భారత రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన బ్రూనై సుల్తాన్ హసనై బొకీ తన జంబో జెట్‌ను డ్రైవ్ చేసుకుంటూ నేరుగా ఢిల్లీలో ల్యాండవడంతో ఆయనకు స్వాగతం పలికేందుకు వచ్చిన అధికారగణం సంబ్రమాశ్చర్యాల్లో మునిగితేలింది. ఆయనను కాక్‌పిట్‌లో చూసిన వారంతా విస్తుపోయారు. 2014లో మోదీ సర్కార్ అధికారంలోకి వచ్చిన అనంతరం బ్రూనై సుల్తాన్ భారత్‌కు రావడం ఇదే తొలిసారి. ఇతర దక్షిణాసియా దేశాల మాదిరిగా బ్రూనై వార్తల్లో నిలవకపోయినా 71 ఏళ్ల సుల్తాన్ చేసిన ఈ ఫీట్‌తో ఆ దేశం హైలైట్ అయిందని అధికారులు చెప్పుకుంటున్నారు. 2008, 2012లో సుల్తాన్ భారత్ పర్యటనకు వచ్చినప్పుడూ తన విమానాలకు ఆయనే కెప్టెన్‌గా వ్యహరించారని అధికారులు గుర్తుచేసుకున్నారు. విదేశీ పర్యటనల సందర్బంగా సుల్తాన్ తన 747-700 ఎయిర్‌క్రాఫ్ట్‌కు ఆయనే పైలెట్‌గా వ్యవహరిస్తారు. గత ఏడాది అక్టోబర్ 5తో ఆయన అయిదు దశాబ్దాల సుదీర్ఘ అధికార ప్రస్ధానం పూర్తిచేసుకోవడం గమనార్హం. -
సింగపూర్, బ్రూనై సుల్తాన్లతో మోదీ భేటీ
న్యూఢిల్లీ: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మయన్మార్‌లో బిజీబిజీగా గడుపుతున్నారు. బుధవారం మోదీ పలువురు ఆగ్నేయాసియా ప్రముఖులతో భేటీ అయ్యారు. సింగపూర్ ప్రధాని లీ హీన్ లూంగ్, బ్రూనై సుల్తాన్ హసానల్ బొల్కయాలతో మోదీ సమావేశమయ్యారు. భారత్, బ్రూనై మిత్ర దేశాలని, తమ సహకారం ఇలాగే కొనసాగుతుందని మోదీ.. బ్రూనై సుల్తాన్‌తో చెప్పగా, ఆయన స్వాగతించారు. ఇక సింగపూర్ ప్రధానితో మోదీ పట్టణాభివృద్ధికి సంబంధించి చర్చించారు. మోదీ ఇదే రోజు మయన్మార్ ప్రతిపక్ష నాయకురాలు, నోబెల్ బహుమతి గ్రహీత అంగసాన్ సూకీతో సమావేశమయ్యారు.