న్యూఢిల్లీ: ప్రధానమత్రి నరేంద్ర మోదీ నేడు(మంగళవారం) బ్రూనే వెళ్తున్నారు. ఆ దేశ సుల్తాన్ హస్సనాల్ బోల్కియా.. మోదీకి ఘన స్వాగతం పలకనున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఇరు దేశాల మధ్య ఉన్న 40 ఏళ్ల దౌత్య సంబంధాలను బలోపేతం చేయనున్నారు. భారత ప్రధాని బ్రూనై పర్యటనకు వెళ్లడం ఇదే తొలిసారి కావడం విశేషం. బ్రూనై పర్యటన తర్వాత అక్కడి నుంచి మోదీ సింగపూర్ వెళతారు.
కాగా బ్రూనే సుల్తాన్ హస్సనాల్ బోల్కియా.. ప్రపంచంలోని సంపన్న వ్యక్తుల్లో ఒకరు. బ్రిటన్ క్వీన్ ఎలిజబెత్ రాణి 2 తరువాత ప్రపంచంలోనే రెండవ అత్యధిక కాలం పాలించిన చక్రవర్తి సుల్తాన్ పేరుగాంచారు. ఆయన చాలా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. ఆయన వద్ద అత్యధిక సంఖ్యలో ఖరీదైన ప్రైవేటు కార్లు ఉన్నాయి. సుమారు 5 బిలియన్ల డాలర్ల ఖరీదైన లగ్జరీ కార్లు(సుమారు 4 లక్షల కోట్లు) ఉన్నాయి.
సుల్తాన్ బోల్కియా సంపద దాదాపు 30 బిలియన్ డాలర్లు. ఆయనకు సంపద ప్రధానంగా బ్రూనై చమురు, సహజ వాయువు నిల్వల నుంచి వస్తుంది. సుల్తాన్ బల్కియా వద్ద సుమారు ఏడు వేల లగ్జరీ వాహనాలు ఉన్నాయి. వాటిల్లో 600 రోల్స్ రాయిస్ కార్లు ఉన్నాయి. సుల్తాన్ పేరిట గిన్నిస్ వరల్డ్ రికార్డు ఉంది. ఆయన కలెక్షన్లలో 450 ఫెరారీలు, 380 బెంట్లీ కార్లు కూడా ఉన్నాయి. పోర్షె, లాంబోర్గిని, మేబాచ్, జాగ్వార్, బీఎండబ్ల్యూ, మెక్‌లారెన్ కార్లు కూడా అతని వద్ద ఉన్నాయి.
బోల్కియా కలెక్షన్‌లో బెంట్లీ డామినేటర్ ఎస్‌యూవీ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నది దాని విలువ సుమారు 80 మిలియన్ల డాలర్లు. పోర్షె 911 హారిజన్ బ్లూ, 24 క్యారెట్ల గోల్డ్ ప్లేట్ రోల్స్ రాయిస్ సిల్వర్ స్పర్-2 కార్లు ఉన్నాయి. కస్టమ్ డిజైన్డ్ రోల్స్ రాయిస్ విత్ ఓపెన్ రూఫ్ కారు కూడా ఉంది. కూతురు, యువరాణి మజేదేదా పెళ్లి కోసం 2007లో గోల్డ్ కోటింగ్ రోల్స్ రాయిస్ కారును ఆయన ఖరీదు చేశారు.
సుల్తాన్ జీవన విధానం చాలా విలాసవంతమైనది. ఆయన ఇల్లు ‘ఇస్తానా నూరుల్ ఇమాన్’ ప్యాలెస్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్యాలెస్. 20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో దీనిని 1984లో నిర్మించారు. బ్రిటన్ నుంచి బ్రూనై స్వాతంత్ర్యం పొందిన సమయంలో నిర్మించారు. దీని ధర రూ.2,250 కోట్లు. ఈ ప్యాలెస్‌లో 22 క్యారెట్ల బంగారు గోపురాలు, 1,700 గదులు, 257 స్నానపు గదులు, ఐదు ఈత కొలనులు ఉన్నాయి. 110 గ్యారేజీలు ఉన్నాయి.
ఆయన వద్ద ఒక ప్రైవేట్ జంతు ప్రదర్శనశాలను కూడా ఉంది. ఇందులో 30 బెంగాల్ పులులు, వివిధ పక్షి జాతులు ఉన్నాయి. అతనికి బోయింగ్ 747 విమానం కూడా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment