Brunei
-
బ్రూనైలో మోదీ లంచ్ మెనూ ఇదే..!
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బ్రూనే పర్యాటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఆ దేశ సుల్తాన్ హస్సనల్ బోల్కివయా మోదీకి ఘటన స్వాగతం పలికారు. ఇరువురి మద్య దౌత్య సంబంధాలను బలోపేతం చేసే దిశగా చర్చలు జరిగాయి. రెండు రోజులు పర్యటనలో ప్రధాని మోదీకి ఆ దేశ సుల్తాన్ బోల్కియా గొప్ప ఆతిథ్యం ఇచ్చారు. సుల్తాన్ తన నివాసం ఇస్తానా నూరుల్ ఇమాన్‌లో ప్రధాని మోదీకి ప్రత్యేక విందును ఏర్పాటు చేశారు. ఈ విషయాన్ని భారత రాయబార కార్యాలయం అధికారిక సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. మోదీకి అందించిన లంచ్ మెనూలో.. మన భారతీయ ప్రసిద్ధ వంటకాల తోపాటు మన జాతీయ జెండాను తలపించే రంగులతో వంటకాలను ఆకర్షణీయంగా తయారు చేయడం విశేషం. మొదటి కోర్సులో అవోకాడో, దోసకాయ, ఆస్పరాగస్, ముల్లంగి పికిల్ వడ్డించారు. ఆ తర్వాత క్రిస్పీ టోర్టిల్లా, బ్రోకలీతో లెంటిల్ సూప్ అందించారు. మూడవ కోర్సులో వెజిటబుల్ క్విచ్, స్పినాచ్, ఫారెస్ట్ మష్రూమ్ విత్ బ్లాక్ ట్రఫుల్, గుమ్మడికాయ, గ్రీన్ పురీ ఉన్నాయి. ఇక్కడ గ్రీన్ పీస్ పూరీలో భారత త్రివర్ణ పతకాన్ని గుర్తుకు తెచ్చేలా ఆకర్షణీయమైన రంగులతో సర్వ్ చేశారు. Quiche, Truffle at the Istana Nurual Iman 🙏🌸🙏 pic.twitter.com/noCRlMJKCn— India in Brunei (@HCIBrunei) September 4, 2024అంతేగాదు ఈ మెనూలో జీరా రైస్, చన్నా మసాలా, వెజిటబుల్ కోఫ్తా, భిండి టామటర్, గ్రిల్డ్ పీతలు, టాస్మానియన్ సాల్మన్, కొబ్బరి బార్లీ రిసోట్టోతో రొయ్యల స్కాలోప్స్ వంటి రెసిపీలు కూడా ఉన్నాయి. ఈ మెనూ భారతీయ ప్రసిద్ధ స్వీట్ డెజర్ట్‌లు కూడా ఉన్నాయి. అవి వరుసగా.. మామిడితో చేసిన పేడా, మోతీచూర్ లడ్డూ, సూర్తి ఘరీ పిస్తా తదితరాలు. ఈ వంటకాలన్నీ అందమైన మెరూన్ కలర్, గోల్డ్ డిజైన్‌తో ఉన్న ప్లేట్లలో అందించారు. కాగా ఇరు దేశాల దౌత్య సంబంధాల 40వ వార్షికోత్సవం నేపథ్యంలో ప్రధాని మోదీ రెండు రోజుల బ్రూనే పర్యటన జరిగింది. అదీగాక మోదీకి ఈ పర్యటన తొలిసారి కావడం విశేషం.Official Luncheon by His Majesty in honour of Prime Minister Shri Narendra Modi Ji in Brunei Darussalam 🇮🇳 🇧🇳 🙏@narendramodi @PMOIndia @borneo_bulletin @MediaPermata pic.twitter.com/A0o6UwX5zf— India in Brunei (@HCIBrunei) September 4, 2024 (చదవండి: బాడీబిల్డింగ్ వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయా..?) -
కలిసి పని చేస్తేనే కలిమి
బందర్‌సెరీ బెగవన్/సింగపూర్: అభివృద్ధి విధానానికి తాము మద్దతు ఇస్తామని, విస్తరణవాదాన్ని తిరస్కరిస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తేలి్చచెప్పారు. చైనా పేరు ప్రస్తావించకుండా పరోక్షంగా ఆ దేశ వైఖరిని ఎండగట్టారు. ద్వైపాక్షిక పర్యటనలో భాగంగా మోదీ బుధవారం బ్రూనై సుల్తాన్ హసనల్ బొలి్కయాతో సమావేశమయ్యారు. భారత్–బ్రూనై మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యంతోపాటు రక్షణ, వ్యాపారం, వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, ఆహార భద్రత, విద్య, ఇంధనం, అంతరిక్ష సాంకేతికత, ఆరోగ్యం, సంస్కృతి, ఇరుదేశాల ప్రజల మధ్య సంబంధాల వంటి కీలక అంశాలపై విస్తృత స్థాయిలో చర్చలు జరిపారు. ఇరు దేశాల మధ్య భాగస్వామ్యాన్ని మరింత ఉన్నత స్థాయికి చేర్చాలని, వివిధ నూతన రంగాల్లో పరస్పరం కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నారు. కలిసి పని చేస్తేనే ఇరు దేశాలకు మేలు జరుగుందని స్పష్టంచేశారు. సమావేశం అనంతరం మోదీ, సుల్తాన్ హసనల్ బొలి్కయా ఒక ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. భారత్, బ్రూనై మధ్య లోతైన చరిత్రాత్మక, సాంస్కృతిక సంబంధాలు ఉన్నాయని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. రెండు దేశాల నడుమ దౌత్య సంబంధాలకు 40 ఏళ్లు నిండుతున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత పెంపొందించుకోవాలని నిర్ణయించామన్నారు. ఆగ్నేయ ఆసియా దేశాల కోసం ఒక ప్రవర్తనా నియామవళిని ఖరారు చేసుకోవాలని నిర్ణయానికి వచ్చామని వివరించారు. యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ ద లా ఆఫ్ ద సీ–1982(అన్క్లాస్) తరహాలో ఆగ్నేయ ఆసియా ప్రాంతంలో నౌకలు, విమానాల స్వేచ్ఛా విహారానికి ఒక తీర్మానం ఆమోదించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఈ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం, భద్రతకు తాము కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. బ్రూనై అత్యంత కీలక భాగస్వామి భారతదేశ ‘తూర్పు కార్యాచరణ’, ఇండో–పసిఫిక్ దార్శనికత విషయంలో బ్రూనై తమకు అత్యంత కీలక భాగస్వామి అని ప్రధాని మోదీ తేల్చిచెప్పారు. బ్రూనై సుల్తాన్‌తో సమగ్ర చర్చలు జరిపామని, ఆర్థిక, శాస్త్ర సాంకేతిక, వ్యూహాత్మక రంగాల్లో పరస్పరం సహరించుకోవాలని తీర్మానించామని చెప్పారు. ఫిన్‌టెక్, సైబర్ సెక్యూరిటీ, వ్యవసాయం, ఫార్మాస్యూటికల్, ఆరోగ్యం తదితర రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవాలన్నదే తమ లక్ష్యమని వివరించారు. తనకు ఘనమైన ఆతిథ్యం ఇచి్చన బ్రూనై రాజ కుటుంబానికి నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలియజేశారు. భారత్‌లో పర్యటించాలని సుల్తాన్‌ను ఆహా్వనించారు. ఉపగ్రహాలు, ఉపగ్రహ ప్రయోగ వాహనాల కోసం టెలిమెట్రీ, ట్రాకింగ్, టెలికమాండ్ స్టేషన్ నిర్వహణ విషయంలో సహకరించుకోవడానికి భారత్, బ్రూనై ఒక అవగాహనా ఒప్పందం(ఎంఓయూ)పై సంతకాలు చేశాయి. మోదీకి సింగపూర్ ప్రధాని విందు భారత ప్రధాని నరేంద్ర మోదీ గౌరవార్థం సింగ్‌పూర్ ప్రధాని లారెన్స్ వాంగ్ బుధవారం రాత్రి విందు ఇచ్చారు. ఇరువురు నేతలు గురువారం చర్చలు జరుపనున్నారు. అంతకముందు బ్రూనై పర్యటన ముగించుకొని సింగపూర్ చేరుకున్న మోదీకి ఘన స్వాగతం లభించింది. సింగపూర్ హోం, న్యాయ శాఖ మంత్రి కె.షన్ముగంతోపాటు ప్రవాస భారతీయులు స్వాగతం పలికారు. మోదీ రెండు రోజులపాటు ఇక్కడ పర్యటిస్తారు. -
Video: మోదీ సింగపూర్ పర్యటన.. ఢోలు వాయించిన ప్రధాని
న్యూఢిల్లీ: బ్రూనై పర్యటన ముగించుకున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ బుధవారం సింగపూర్ చేరుకున్నారు. సింగపూర్‌లో ప్రవాస భారతీయులు మోదీకి నృత్యాలు, సంగీత ప్రదర్శనలతో ఘనస్వాగతం పలికారు. మోదీకి ఓ మహిళ రాఖీ కూడా కట్టింది. ఈ సందర్భంగా అక్కడ బస చేస్తున్న హోటల్ వద్ద మోదీ ఢోలువాయించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.మహారాష్ట్రకు చెందిన జానపద నృత్యం 'లావణి'ని వివిధ మహిళలు ప్రదర్శిస్తుండగా.. ప్రధాని మోదీ ఢోలు వాయించారు. అనంతరం సింగపూర్ ప్రధాని లారె న్స్ వాంగ్, అధ్యక్షుడు థర్మన్ షణ్ముగరత్నం, ఇతర మంత్రులతో భేటీ కానున్నారు.ఇక సింగపూర్ పర్యటనపై మోదీ ట్వీట్ చేశారు. ‘ఇప్పుడే సింగపూర్‌లో ల్యాండ్ అయ్యాను. భారత్-సింగపూర్ స్నేహాన్ని పెంపొందించే లక్ష్యంతో జరిగే వివిధ సమావేశాల కోసం ఎదురు చూస్తున్నాను’ అంటూ పేర్కొన్నారు.VIDEO | PM Modi (@narendramodi) tried his hands at 'dhol' as he received a warm welcome upon arrival at Marina Bay, #Singapore. (Source: Third Party) pic.twitter.com/hY4WAyELFy— Press Trust of India (@PTI_News) September 4, 2024కాగా మోదీ బ్రూనై, సింగపూర్ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. రెండు రోజుల ద్వైపాక్షిక పర్యటనలో భాగంగా మంగళవారం బ్రూనై వెళ్లారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధానికి 40 ఏళ్లయిన సందర్భంగా మోదీ ఈ పర్యటన చేపట్టిన విషయం తెలిసిందే. భారత ప్రధాని బ్రూనై వెళ్లడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ సందర్భంగా బ్రూనై రాజు హాజీ హసనల్ బోల్కియాను మోదీ భేటీ అయ్యారు. ఈ పర్యటనలో ఇరు దేశాల మధ్య పలు కీలక ఒప్పందాలు జరిగినట్లు భారత విదేశాంగ శాఖ అధికారులు వెల్లడించారు. రెండు దేశాల మధ్య త్వరలోనే నేరుగా విమాన సర్వీసులను ప్రారంభించేందుకు అంగీకారం కుదిరినట్లు తెలిపారు. ఈ ఏడాది చివరి నాటికి చెన్నై నుంచి బ్రూనై రాజధానికి విమాన సర్వీసులు ప్రారంభించేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు పేర్కొన్నారు. -
బలమైన బంధానికి ఇదే సంకేతం
బందర్ సేరీ బేగావాన్: బ్రూనైలో నూతన రాయబార కార్యాలయం భారత్, బ్రూనైల బలమైన బంధానికి సంకేతమని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. బ్రూనైలో రెండ్రోజుల పర్యటనలో భాగంగా అక్కడికి చేరుకున్న మోదీ మంగళవారం మధ్యాహ్నం బందర్ సేరీ బేగావాన్ సిటీలో భారత నూతన రాయబార కార్యాలయాన్ని ప్రారంభించారు. అక్కడి ఇండియన్ హైకమిషన్ ప్రాంగణంలో దీనిని ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడి భారతీయ సంతతి ప్రజలతో మోదీ మాట్లాడారు.‘‘ఇరు దేశాల దౌత్యబంధానికి సజీవ సేతువులుగా మీరు నిలిచారు. భారత వైద్యులు, ఉపాధ్యాయులు బ్రూనై వైద్య, ఆరోగ్య రంగాల అభివృద్ధిలో తమ వంతు పాత్ర పోషిస్తున్నారు’’ అని శ్లాఘించారు. అంతకుముందు మోదీకి బ్రూనై రాజధాని నగర ఎయిర్‌పోర్ట్‌లో ఘన స్వాగతం లభించింది. అక్కడి యువరాజు హజీ అల్–మహతాదీ బిల్లాహ్ సాదరంగా మోదీని ఆహ్వానించారు. ఆసియాన్‌సదస్సు కోసం 2013లో నాటి ప్రధాని మన్మోహన్ బ్రూనైలో పర్యటించగా దౌత్య పర్యటనలో భాగంగా భారత ప్రధాని ఒకరు బ్రూనైలో పర్యటించడం ఇదే తొలిసారి. బుధవారం బ్రూనై సుల్తాన్ హసనల్ బోల్కియాతో మోదీ ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. -
7000 కార్లు ఉన్న బ్రూనే సుల్తాన్.. ప్రధాని మోదీకి ఆతిథ్యం
న్యూఢిల్లీ: ప్రధానమత్రి నరేంద్ర మోదీ నేడు(మంగళవారం) బ్రూనే వెళ్తున్నారు. ఆ దేశ సుల్తాన్ హస్సనాల్ బోల్కియా.. మోదీకి ఘన స్వాగతం పలకనున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఇరు దేశాల మధ్య ఉన్న 40 ఏళ్ల దౌత్య సంబంధాలను బలోపేతం చేయనున్నారు. భారత ప్రధాని బ్రూనై పర్యటనకు వెళ్లడం ఇదే తొలిసారి కావడం విశేషం. బ్రూనై పర్యటన తర్వాత అక్కడి నుంచి మోదీ సింగపూర్ వెళతారు.కాగా బ్రూనే సుల్తాన్ హస్సనాల్ బోల్కియా.. ప్రపంచంలోని సంపన్న వ్యక్తుల్లో ఒకరు. బ్రిటన్ క్వీన్ ఎలిజబెత్ రాణి 2 తరువాత ప్రపంచంలోనే రెండవ అత్యధిక కాలం పాలించిన చక్రవర్తి సుల్తాన్ పేరుగాంచారు. ఆయన చాలా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. ఆయన వద్ద అత్యధిక సంఖ్యలో ఖరీదైన ప్రైవేటు కార్లు ఉన్నాయి. సుమారు 5 బిలియన్ల డాలర్ల ఖరీదైన లగ్జరీ కార్లు(సుమారు 4 లక్షల కోట్లు) ఉన్నాయి.సుల్తాన్ బోల్కియా సంపద దాదాపు 30 బిలియన్ డాలర్లు. ఆయనకు సంపద ప్రధానంగా బ్రూనై చమురు, సహజ వాయువు నిల్వల నుంచి వస్తుంది. సుల్తాన్ బల్కియా వద్ద సుమారు ఏడు వేల లగ్జరీ వాహనాలు ఉన్నాయి. వాటిల్లో 600 రోల్స్ రాయిస్ కార్లు ఉన్నాయి. సుల్తాన్ పేరిట గిన్నిస్ వరల్డ్ రికార్డు ఉంది. ఆయన కలెక్షన్లలో 450 ఫెరారీలు, 380 బెంట్లీ కార్లు కూడా ఉన్నాయి. పోర్షె, లాంబోర్గిని, మేబాచ్, జాగ్వార్, బీఎండబ్ల్యూ, మెక్లారెన్ కార్లు కూడా అతని వద్ద ఉన్నాయి.బోల్కియా కలెక్షన్లో బెంట్లీ డామినేటర్ ఎస్యూవీ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నది దాని విలువ సుమారు 80 మిలియన్ల డాలర్లు. పోర్షె 911 హారిజన్ బ్లూ, 24 క్యారెట్ల గోల్డ్ ప్లేట్ రోల్స్ రాయిస్ సిల్వర్ స్పర్-2 కార్లు ఉన్నాయి. కస్టమ్ డిజైన్డ్ రోల్స్ రాయిస్ విత్ ఓపెన్ రూఫ్ కారు కూడా ఉంది. కూతురు, యువరాణి మజేదేదా పెళ్లి కోసం 2007లో గోల్డ్ కోటింగ్ రోల్స్ రాయిస్ కారును ఆయన ఖరీదు చేశారు.సుల్తాన్ జీవన విధానం చాలా విలాసవంతమైనది. ఆయన ఇల్లు ‘ఇస్తానా నూరుల్ ఇమాన్’ ప్యాలెస్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్యాలెస్. 20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో దీనిని 1984లో నిర్మించారు. బ్రిటన్ నుంచి బ్రూనై స్వాతంత్ర్యం పొందిన సమయంలో నిర్మించారు. దీని ధర రూ.2,250 కోట్లు. ఈ ప్యాలెస్‌లో 22 క్యారెట్ల బంగారు గోపురాలు, 1,700 గదులు, 257 స్నానపు గదులు, ఐదు ఈత కొలనులు ఉన్నాయి. 110 గ్యారేజీలు ఉన్నాయి. ఆయన వద్ద ఒక ప్రైవేట్ జంతు ప్రదర్శనశాలను కూడా ఉంది. ఇందులో 30 బెంగాల్ పులులు, వివిధ పక్షి జాతులు ఉన్నాయి. అతనికి బోయింగ్ 747 విమానం కూడా ఉంది. -
బ్రూనై పర్యటనకు ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ మంగళవారం(సెప్టెంబర్3) ఉదయం బ్రూనై పర్యటనకు బయలుదేరారు. భారత ప్రధాని బ్రూనై పర్యటనకు వెళ్లడం ఇదే తొలిసారి కావడం విశేషం. బ్రూనై పర్యటన తర్వాత అక్కడి నుంచి మోదీ సింగపూర్ వెళతారు. సింగపూర్‌లో ప్రధాని సెప్టెంబర్ 4,5 తేదీల్లో రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. PM @narendramodi is set to visit Brunei and Singapore from Sept 03-05, 2024.🎥 Take a quick look at 🇮🇳’s engagements with the two countries. pic.twitter.com/9yJ3nEgK1I— Randhir Jaiswal (@MEAIndia) September 2, 2024ఈ పర్యటనలో భాగంగా సింగపూర్ ప్రధాని లారెన్స్ వోంగ్‌తో పలు కీలక అంశాలపై చర్చలు జరుపుతారు. బ్రూనై పర్యటనకు బయలుదేరే ముందు ప్రధాని ‘ఎక్స్’లో ఒక ట్వీట్ చేశారు. బ్రూనై, సింగపూర్‌లతో భారత్ సంబంధాలు బలోపేతమవడానికి ఈ పర్యటన ఉపయోగపడుతుందని తెలిపారు. -
3 నుంచి ప్రధాని బ్రూనై, సింగపూర్ పర్యటన
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ సెప్టెంబర్ మొదటి వారంలో సింగపూర్, బ్రూనై దేశాల్లో పర్యటించనున్నారు. సెప్టెంబర్ 3–4వ తేదీల్లో ప్రధాని మోదీ బ్రూనైలో పర్యటిస్తారని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ తెలిపారు. భారత ప్రధాని ఒకరు బ్రూనైలో పర్యటించడం ఇదే మొదటిసారని ఆయన చెప్పారు. రెండు దేశాల మధ్య సంబంధాలకు 40 ఏళ్లవుతున్న సందర్భంగా ప్రధాని అక్కడికి వెళ్తున్నారన్నారు. బ్రూనై నుంచి ప్రధాని సెప్టెంబర్ 4–5 తేదీల్లో సింగ్‌పూర్‌ను సందర్శిస్తారని చెప్పారు. సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్ ఆహా్వనం మేరకు మోదీ ఈ పర్యటన చేపట్టనున్నారని జైశ్వాల్ వివరించారు. -
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హాట్ ప్రిన్స్ పెళ్లి, పిక్స్ వైరల్
ఆసియాలోని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్లలో ఒకరైన బ్రూనై యువరాజు ఒక ఇంటివాడయ్యారు. బ్రూనై దేశానికి చెందిన యువరాజు అబ్దుల్ మతీన్ ఒక సామాన్యురాల్ని వివాహ మాడటం ఆసక్తికరంగా మారింది. పదిరోజులపాటు అత్యంత వైభవంగా ఈ వేడుకలు జరుగనున్నాయి. 1788 గదులున్న ప్యాలెస్‌లో సోమవారం జరిగే ఊరేగింపు వేడుకతో వివాహం ముగింపు దశకు చేరుకుంటుంది. 32 ఏళ్ల బ్రూనై యువరాజు అబ్దుల్ మతీన్ 29 ఏండ్ల యాంగ్ ములియా అనీషా రోస్నాను ఇస్లామిక్ సంప్రదాయంలో పెళ్లాడారు. ఈ వివాహానికి సంబంధించిన నెట్లో చక్కర్లు కొడుతున్నాయి. ప్రపంచంలోని అత్యంత సంపన్న కుటుంబాల్లో ఒకటైన బ్రూనై రాజకుటుంబంలోకి సాధారణ అమ్మాయి అనీషా అడుగుపెట్టబోతోంది. అనిషా తండ్రి సుల్తాన్ హసనల్ బోల్కియాకు నమ్మకమైన సలహాదారు.ప్రపంచంలోనే ఎక్కువ కాలం పాలించిన సుల్తాన్ హసన్నల్ బొల్కియాకు మతీన్ 10వ సంతానం. ప్రిన్స్ మతీన్, హాలీవుడ్‌గా హీరోకి మంచి తన ఫ్యాషన్ స్టయిల్‌ను చాటుకుంటూ ఉంటాడు. ఫైటర్ జెట్స్,, స్పీడ్ బోట్లను నడుపుతూ వర్కౌట్లు బేరీ బాడీ ఫోజులతో చాలా పాపులర్. ఖరీదైన క్రీడ పోలో, బాక్సింగ్ , ఫోటోగ్రఫీ అంటే ఆసక్తి ఎక్కువ. అలాగే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే మతీన్ మిలిటరీ యూనిఫాంలో పోజులను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ ఉంటాడు. -
ఆ ప్రాంతంలో స్వేచ్ఛాయుత విధానాలపై దృష్టి: మోదీ
న్యూఢిల్లీ: ఇండో ఫసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛాయుత, బహిరంగ విధానాలపైనే ప్రధానంగా తమ దృష్టి ఉంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. ఈ ప్రాంతంలో ఆసియాన్ దేశాలు కేంద్రీకృతంగా ఉండడానికే తాము మద్దతునిస్తామన్నారు. బ్రూనై ఆతిథ్య దేశంగా బుధవారం నిర్వహించిన 16వ తూర్పు ఆసియా సదస్సులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోదీ ప్రసంగించారు. వివిధ దేశాల ప్రాదేశిక సార్వభౌమత్వాన్ని , అంతర్జాతీయ సరిహద్దులు, అంతర్జాతీయ న్యాయాన్ని భారత్ ఎప్పుడూ గౌరవిస్తుందని, అన్ని దేశాలు పాటించే విలువల్ని మరింత పటిష్టం చేయడానికి కట్టుబడి ఉంటుందని అన్నారు. ఇండోఫసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛాయుత, బహిరంగ విధానాలపైనే భారత్ ప్రధానంగా దృష్టి సారిస్తోందని, ఆసియాన్ దేశాల విధానాలకు కట్టుబడే ముందుకు వెళతామని ఆ సదస్సులో పేర్కొన్నట్టు ప్రధాని ఒక ట్వీట్ ద్వారా వెల్లడించారు. -
ఇకపై అలా చేస్తే రాళ్లతో కొట్టి చంపేయడమే..!
బందర్ సెరి బేగవాన్(బ్రూనై) : ఆసియా దేశం బ్రూనై వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. వివాహేతర సంబంధాలు పెట్టుకున్న వారిని, స్వలింగ సంపర్కులను రాళ్లతో కొట్టి చంపాలని తీర్మానించింది. షరియా చట్టాల ప్రకారం అనైతిక చర్యలకు పాల్పడిన వారికి కఠిన శిక్షలు అమలు చేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ దేశ అధికారులు పేర్కొన్నారు. ఈ మేరకు ఇటువంటి శిక్షలు వచ్చే వారం నుంచి అమల్లోకి వస్తాయని తెలిపారు. అదే విధంగా దొంగతనానికి పాల్పడిన వారి చేతులు, పాదాలు నరికివేసే శిక్ష వచ్చే బుధవారం నుంచి అమలు చేస్తామని తెలిపారు. ఇందులో భాగంగా మొదటిసారి దొంగతనానికి పాల్పడితే కుడిచేతిని, రెండోసారి కూడా అదే తప్పు పునరావృతం చేస్తే ఎడమ పాదాన్ని నరికివేస్తారు. అయితే ముస్లిం మెజారిటీ దేశమైన బ్రూనైలో కేవలం ఆ వర్గానికి మాత్రమే ఈ కఠిన శిక్షలు వేస్తారు. కాగా ప్రభుత్వ నిర్ణయం హక్కులను ఉల్లంఘించేలా ఉందని మానవ హక్కుల సంస్థలు, ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. తక్షణమే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ విఙ్ఞప్తి చేసింది. ఇక ఈ విషయం గురించి హ్యూమన్ రైట్స్ వాచ్ సభ్యులు ఫిల్ రాబర్ట్సన్ మాట్లాడుతూ..‘ఇలాంటి చర్యల వల్ల అంతర్జాతీయ సమాజం నుంచి బ్రూనేను బహిష్కరించాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. ఆగ్నేయ ఆసియా దేశంలో ఇటువంటి శిక్షలు అమలు చేసే తొలి దేశంగా గుర్తింపు పొందడం ద్వారా వివాదాస్పద దేశంగా బ్రూనై ముద్రపడుతుంది. తద్వారా విదేశీ పెట్టుబడులు, పర్యాటకుల సంఖ్య తగ్గి భారీగా ఆదాయం నష్టపోవాల్సి ఉంటుంది’ అని ఆందోళన వ్యక్తం చేశారు. ఇక తమ విధానం గురించి బ్రూనై మత వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి మాట్లాడుతూ.. ‘ 2013 నుంచి అనైతిక చర్యలకు పాల్పడే వారికి కఠిన శిక్షలు అమలు చేసే విషయమై.....లోతుగా చర్చించాం. ప్రస్తుతం వీటిని అమల్లోకి తేవాలని భావిస్తున్నాం. ఈ విషయం గురించి మా మంత్రి సుల్తాన్ హసనాల్ బోల్కా ఏప్రిల్ 3న అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది’అని తెలిపారు. -
బ్రూనైలో క్రిస్మస్ వేడుకలపై కఠిన ఆంక్షలు
బ్రూనై: దేశంలో క్రిస్మస్ వేడుకలపై బ్రూనై సుల్తాన్ హసనల్ బోల్కియా కఠిన ఆంక్షలు విధించారు. ఆంక్షలు ఉల్లంఘించిన వారికి భారీ జరిమానాలతో పాటు ఐదేళ్ల వరకు జైలుశిక్ష విధించే చట్టాన్ని తీసుకొచ్చారు. క్రైస్తవులు బహిరంగంగా క్రిస్మస్ వేడుకలను జరుపుకోరాదని, క్రిస్మస్ చెట్లను ఏర్పాటుచేయడం, మతపరమైన పాటలు పాడడం, క్రిస్మస్ గ్రీటింగ్స్ చెప్పుకోవడం లాంటి చర్యలన్నింటినీ నిషేధిస్తున్నట్లు బ్రూనై మత విశ్వాసాల మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ముస్లింలు ఎవరూ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనరాదని, అలా చేస్తే ఐదేళ్ల వరకు జైలుశిక్ష విధిస్తామని ఆ ఉత్తర్వుల్లో ప్రభుత్వం ప్రకటించింది. క్రిస్మస్ రోజు సెలవుదినం కాబట్టి, క్రైస్తవులు తమ కమ్యూనిటీ మధ్యనే వేడుకలు జరుపుకోవాలని సూచించింది. అమెరికాలోఉన్న తన 'బెవర్లీ హిల్స్ హోటల్, హోటల్ బెల్ ఎయిర్'లకు చెందిన హోటళ్ల చైన్ అన్నింటిలో కూడా క్రిస్మస్ వేడుకలను ఈ ఏడాది నుంచి బ్రూనై సుల్తాన్ నిషేధించారు. సుల్తాన్ ఆదేశాలను కచ్చితంగా ఆచరించాలని ఇమామ్‌లు కూడా తమ అనుచరులను ఆదేశించారు. ప్రపంచంలోనే అత్యంత ధనవంతమైన చిట్టి దేశంగా గుర్తింపు పొందిన బ్రూనైలో ముస్లింలు దాదాపు 80 శాతం ఉండగా, మిగతా 20 శాతంలో క్రైస్తవులు, బౌద్ధులు ఉన్నారు. దాదాపు నాలుగున్నర లక్షల జనాభా కలిగిన బ్రూనై ఆర్థిక వ్యవస్థ పూర్తిగా చమురు, సహజవాయువు వనరులపైనే ఆధారపడి ఉంది. వీటిపై కుప్పతెప్పలుగా డబ్బు వచ్చిపడుతున్న కారణంగా సుల్తాన్ ప్రజలపై ఎలాంటి పన్నుల భారాన్ని మోపలేదు. దీనివల్ల సుల్తాన్ విలాసవంతమైన జీవితాన్ని కూడా ప్రజలెవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు. ఆయన ప్యాలెస్‌లో 1788 గదులు, 350 టాయ్‌లెట్స్, ఐదు స్విమ్మింగ్ పూల్స్, 110 కార్లకు గ్యారేజీలు ఉన్నాయి. బ్రూనైలో ఇప్పటికే కఠినమైన ఇస్లాం చట్టాలు అమల్లో ఉండగా, 2014 మే నెల నుంచి షరియా మొదటి దశ చట్టాలను, 2015, మే నెలలో షరియా రెండో దశ చట్టాలను తీసుకొచ్చారు. ఈ చట్టాల కింద ఇస్లాం మినహా ఇతర మతాల గురించి ప్రచారం చేయరాదు. ముస్లింలు మద్యం సేవించరాదు. ప్రజలెవరూ బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం సేవించరాదు. పెళ్లికి ముందు సెక్స్ అనుభవం ఉండకూడదు. వివాహేతర సంబంధాలు కలిగి ఉండరాదు. దొంగతనం లాంటి నేరాలు చేయకూడదు. ఇందులో ఏ నేరానికి పాల్పడినా.. చేతులు, కాళ్లు నరికేయడం లాంటి కఠిన శిక్షలు కూడా ఉన్నాయి. వచ్చే ఏడాది మే నెల నుంచి రాళ్లతో కొట్టి చంపడం, తలలు తెగ నరకడం లాంటి శిక్షలను కూడా అమలు చేస్తామని 68 ఏళ్ల సుల్తాన్ బోల్కియా ఇదివరకే ప్రకటించారు. అయితే సుల్తాన్ తమ్ముడు ప్రిన్స్ జెఫ్రీ మాత్రం 'ప్లే బాయ్'గా గుర్తింపు పొందిన శృంగార పురుషుడు. ఆయనకు అత్యంత ఖరైదీన భారీ క్రూయిజ్ షిప్ కూడా ఉంది. అందులో తన సరదాలు తీర్చుకుంటాడని అంటారు. -
విదేశీ పర్యటన ముగించుకుని తిరిగొచ్చిన ప్రధాని
భారత ప్రధాని మన్మోహన్ సింగ్ నాలుగు రోజుల విదేశీ పర్యటన ముగించుకుని శనివారం స్వదేశం తిరిగొచ్చారు. ప్రధాని బ్రూనై, ఇండోనేసియాలను సందర్శించారు. బ్రూనైలో జరిగిన తూర్పు ఆసియా, ఏసియాన్ సదస్సులలో మన్మోహన్ పాల్గొన్నారు. ఆ ప్రాంతంలోని దేశాలతో వాణిజ్య ఒప్పందాల గురించి చర్చించారు. సత్సంబంధాలు కొనసాగించేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించినట్టు భారత్ ప్రకటించింది. ఇందుకోసం పూర్తి స్థాయిలో రాయబారిని నియమించేందుకు సుముఖత వ్యక్తం చేసింది.