న్యూఢిల్లీ: ప్రధాని మోదీ మంగళవారం(సెప్టెంబర్3) ఉదయం బ్రూనై పర్యటనకు బయలుదేరారు. భారత ప్రధాని బ్రూనై పర్యటనకు వెళ్లడం ఇదే తొలిసారి కావడం విశేషం. బ్రూనై పర్యటన తర్వాత అక్కడి నుంచి మోదీ సింగపూర్ వెళతారు. సింగపూర్‌లో ప్రధాని సెప్టెంబర్ 4,5 తేదీల్లో రెండు రోజుల పాటు పర్యటించనున్నారు.
PM @narendramodi is set to visit Brunei and Singapore from Sept 03-05, 2024.
🎥 Take a quick look at 🇮🇳’s engagements with the two countries. pic.twitter.com/9yJ3nEgK1I— Randhir Jaiswal (@MEAIndia) September 2, 2024
ఈ పర్యటనలో భాగంగా సింగపూర్ ప్రధాని లారెన్స్ వోంగ్‌తో పలు కీలక అంశాలపై చర్చలు జరుపుతారు. బ్రూనై పర్యటనకు బయలుదేరే ముందు ప్రధాని ‘ఎక్స్’లో ఒక ట్వీట్ చేశారు. బ్రూనై, సింగపూర్‌లతో భారత్ సంబంధాలు బలోపేతమవడానికి ఈ పర్యటన ఉపయోగపడుతుందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment