న్యూఢిల్లీ: ఇండో ఫసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛాయుత, బహిరంగ విధానాలపైనే ప్రధానంగా తమ దృష్టి ఉంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. ఈ ప్రాంతంలో ఆసియాన్ దేశాలు కేంద్రీకృతంగా ఉండడానికే తాము మద్దతునిస్తామన్నారు. బ్రూనై ఆతిథ్య దేశంగా బుధవారం నిర్వహించిన 16వ తూర్పు ఆసియా సదస్సులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోదీ ప్రసంగించారు.
వివిధ దేశాల ప్రాదేశిక సార్వభౌమత్వాన్ని , అంతర్జాతీయ సరిహద్దులు, అంతర్జాతీయ న్యాయాన్ని భారత్ ఎప్పుడూ గౌరవిస్తుందని, అన్ని దేశాలు పాటించే విలువల్ని మరింత పటిష్టం చేయడానికి కట్టుబడి ఉంటుందని అన్నారు. ఇండోఫసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛాయుత, బహిరంగ విధానాలపైనే భారత్ ప్రధానంగా దృష్టి సారిస్తోందని, ఆసియాన్ దేశాల విధానాలకు కట్టుబడే ముందుకు వెళతామని ఆ సదస్సులో పేర్కొన్నట్టు ప్రధాని ఒక ట్వీట్ ద్వారా వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment