ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బ్రూనే పర్యాటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఆ దేశ సుల్తాన్ హస్సనల్ బోల్కివయా మోదీకి ఘటన స్వాగతం పలికారు. ఇరువురి మద్య దౌత్య సంబంధాలను బలోపేతం చేసే దిశగా చర్చలు జరిగాయి. రెండు రోజులు పర్యటనలో ప్రధాని మోదీకి ఆ దేశ సుల్తాన్ బోల్కియా గొప్ప ఆతిథ్యం ఇచ్చారు. సుల్తాన్ తన నివాసం ఇస్తానా నూరుల్ ఇమాన్‌లో ప్రధాని మోదీకి ప్రత్యేక విందును ఏర్పాటు చేశారు. ఈ విషయాన్ని భారత రాయబార కార్యాలయం అధికారిక సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది.
మోదీకి అందించిన లంచ్ మెనూలో.. మన భారతీయ ప్రసిద్ధ వంటకాల తోపాటు మన జాతీయ జెండాను తలపించే రంగులతో వంటకాలను ఆకర్షణీయంగా తయారు చేయడం విశేషం. మొదటి కోర్సులో అవోకాడో, దోసకాయ, ఆస్పరాగస్, ముల్లంగి పికిల్ వడ్డించారు. ఆ తర్వాత క్రిస్పీ టోర్టిల్లా, బ్రోకలీతో లెంటిల్ సూప్ అందించారు. మూడవ కోర్సులో వెజిటబుల్ క్విచ్, స్పినాచ్, ఫారెస్ట్ మష్రూమ్ విత్ బ్లాక్ ట్రఫుల్, గుమ్మడికాయ, గ్రీన్ పురీ ఉన్నాయి. ఇక్కడ గ్రీన్ పీస్ పూరీలో భారత త్రివర్ణ పతకాన్ని గుర్తుకు తెచ్చేలా ఆకర్షణీయమైన రంగులతో సర్వ్ చేశారు.
Quiche, Truffle at the Istana Nurual Iman 🙏🌸🙏 pic.twitter.com/noCRlMJKCn
— India in Brunei (@HCIBrunei) September 4, 2024
అంతేగాదు ఈ మెనూలో జీరా రైస్, చన్నా మసాలా, వెజిటబుల్ కోఫ్తా, భిండి టామటర్, గ్రిల్డ్ పీతలు, టాస్మానియన్ సాల్మన్, కొబ్బరి బార్లీ రిసోట్టోతో రొయ్యల స్కాలోప్స్ వంటి రెసిపీలు కూడా ఉన్నాయి. ఈ మెనూ భారతీయ ప్రసిద్ధ స్వీట్ డెజర్ట్‌లు కూడా ఉన్నాయి. అవి వరుసగా.. మామిడితో చేసిన పేడా, మోతీచూర్ లడ్డూ, సూర్తి ఘరీ పిస్తా తదితరాలు. ఈ వంటకాలన్నీ అందమైన మెరూన్ కలర్, గోల్డ్ డిజైన్‌తో ఉన్న ప్లేట్‌లలో అందించారు. కాగా ఇరు దేశాల దౌత్య సంబంధాల 40వ వార్షికోత్సవం నేపథ్యంలో ప్రధాని మోదీ రెండు రోజుల బ్రూనే పర్యటన జరిగింది. అదీగాక మోదీకి ఈ పర్యటన తొలిసారి కావడం విశేషం.
Official Luncheon by His Majesty in honour of Prime Minister Shri Narendra Modi Ji in Brunei Darussalam 🇮🇳 🇧🇳 🙏@narendramodi @PMOIndia @borneo_bulletin @MediaPermata pic.twitter.com/A0o6UwX5zf
— India in Brunei (@HCIBrunei) September 4, 2024
Comments
Please login to add a commentAdd a comment