East Asia summit
-
Narendra Modi: సమస్యలకు పరిష్కారాలు యుద్ధక్షేత్రంలో కాదు
వీయెంటియాన్: ప్రపంచంలో పలుచోట్ల కొనసాగుతున్న సంఘర్షణలు, ఉద్రిక్త పరిస్థితులతో గ్లోబల్ సౌత్ దేశాలపై తీవ్ర ప్రభావం పడుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తంచేశారు. యూరేషియా, పశి్చమాసియాలో సాధ్యమైంత త్వరగా శాంతి నెలకొనాలని ఆకాంక్షించారు. చర్చలు, దౌత్య మార్గాల్లో శాంతియుత వాతావరణాన్ని పునరుద్ధరించాలని సూచించారు. లావోస్ రాజధాని వీయెంటియాన్లో శుక్రవారం 19వ తూర్పు ఆసియా శిఖరాగ్ర సదస్సులో ప్రధాని మోదీ ప్రసంగించారు. ఇండో–ఫసిఫిక్ ప్రాంతంలో సంపూర్ణ శాంతిని, అభివృద్ధిని కోరుకుంటున్నామని చెప్పారు. ఇందుకోసం స్వేచ్ఛాయుత, సమగ్ర, సౌభాగ్యవంతమైన, నిబంధనల ఆధారిత ఇండో–పసిఫిక్ అవసరమని తేలి్చచెప్పారు. ఇండో–పసిఫిక్‌లో డ్రాగన్ దేశం చైనా విస్తరణవాదాన్ని మోదీ పరోక్షంగా తప్పుపట్టారు. భారత్ ప్రతిపాదించిన తూర్పు కార్యాచరణ(యాక్ట్ ఈస్ట్) విధానానికి తూర్పు ఆసియా సదస్సు ఒక మూలస్తంభమని ఉద్ఘాటించారు. ప్రధానమంత్రి ఇంకా ఏం మాట్లాడారంటే... విశ్వబంధుగా బాధ్యతలు నిర్వర్తిస్తాం ‘‘గౌతమ బుద్ధుడు జని్మంచిన దేశం నుంచి వచ్చా. ఇది యుద్ధాల యుగం కాదని పదేపదే చెబుతున్నా. సమస్యలకు పరిష్కారాలు యుద్ధక్షేత్రం నుంచి రావు. మానవతా దృక్పథంతో వ్యవహరించాలి. సంక్షోభాలు సమసిపోవాలంటే శాంతి చర్చలు, దౌత్య మార్గాల్లో సంప్రదింపులపై తప్పనిసరిగా దృష్టి పెట్టాలి. విశ్వబంధుగా మా బాధ్యతలు నిర్వర్తిస్తాం. ప్రపంచంలో శాంతి కోసం అన్ని ప్రయత్నాలూ చేస్తూనే ఉంటాం. మనమంతా ఒక్కటై పోరాడితే ఉగ్రవాదం నామరూపాల్లేకుండాపోవడం ఖాయం. అలాగే సైబర్ భద్రత, అంతరిక్షం తదితర రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవాలి. మన దృష్టి అభివృద్ధి పైనే ఉండాలి మొత్తం ఇండో–పసిఫిక్ ప్రాంత ప్రయోజనాల కోసం దక్షిణ చైనా సముద్రంలో శాంతి, భద్రత, స్థిరత్వం అత్యవసరం. ఈ ప్రాంతంలో వివిధ దేశాల నౌకలు, విమానాలు స్వేచ్ఛగా రాకపోకలు సాగించే వాతావరణం ఉండాలి. సముద్ర చట్టంపై ఐక్యరాజ్యసమితి తీర్మానం (అన్‌క్లోస్) తరహాలో దక్షిణచైనా సముద్రంలోనూ కార్యకలాపాల కోసం ఒక స్పష్టమైన విధానం అవసరం. ప్రభావవంతమైన ప్రవర్తనా నియమావళిని అభివృద్ధి చేయాలి. మన దృష్టి ఎప్పుడూ అభివృద్ధిపైనే ఉండాలి తప్ప విస్తరణవాదంపై కాదు’’ అని ప్రధాని మోదీ స్పష్టంచేశారు.కెనడా ప్రధాని ట్రూడోతో మోదీ భేటీ ప్రధాని మోదీ లావోస్‌లో కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడోతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వారు ఏం మాట్లాడుకున్నారన్నది తెలియరాలేదు. ఇది స్వల్పకాలం జరిగిన సమావేశమని ట్రూడో పేర్కొన్నట్లు కెనడా వార్త సంస్థ వెల్లడించింది. ఖలిస్తాన్ ఉగ్రవాది నిజ్జర్ హత్య వెనుక భారత్ హస్తం ఉందంటూ ట్రూడో ఆరోపించడంతో గతేడాది భారత్–కెనడా మధ్య సంబంధాలు కొంత బలహీనపడిన సంగతి తెలిసిందే. మోదీతో సమావేశం అనంతరం ట్రూడో మీడియాతో మాట్లాడారు. కెనడా పౌరుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. చేపట్టాల్సిన కార్యాచరణపై భారత ప్రధానితో చర్చించానని అన్నారు. మరోవైపు థాయ్‌లాండ్ ప్రధానమంత్రి షినవత్రా, అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్, లావోస్ ప్రధానమంత్రి సోనెక్సే సిఫాండోన్తోనూ నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. ఆయా దేశాలతో భారత్ సంబంధాల పురోగతిని సమీక్షించారు. వ్యాపార, వాణిజ్యపరమైన అంశాలపై చర్చించారు.భారత హస్త కళాకృతుల బహూకరణ ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం లావోస్, థాయ్‌లాండ్, న్యూజిలాండ్ దేశాల అధినేతలకు భారత హస్తకళాకృతులను, విలువైన వస్తువులను బహూకరించారు. మహారాష్ట్రలో తయారు చేసిన వెండి ప్రమిదలను న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్‌కు అందజేశారు. లావోస్ అధ్యక్షుడు సిసోలిత్కు బుద్ధుడి విగ్రహాన్ని బహూకరించారు. లద్దాఖ్‌లో తయారు చేసిన బల్లను థాయ్‌లాండ్ ప్రధానికి, పశి్చమబెంగాల్లో రూపొందించిన వెండి నెమలి బొమ్మను జపాన్ ప్రధానమంత్రికి అందజేశారు. -
భారత్ వృద్ధికి కీలక చర్చలు: పీయూష్ గోయల్
లావోస్‌లోని వియంటైన్లో జరిగిన 12వ తూర్పు ఆసియా ఆర్థిక మంత్రుల సమావేశంలో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి 'పీయూష్ గోయల్' దక్షిణ కొరియా.. మయన్మార్ దేశాల సహచరులతో సమావేశమయ్యారు. వాణిజ్య సంబంధాలను పెంపొందించడం, ఉద్యోగ కల్పన, ఆర్థిక వృద్ధిని పెంచడానికి పెట్టుబడి అవకాశాలను పెంపొందించడం గురించి ఈ సమావేశంలో చర్చించారు.కొరియా వాణిజ్య, పరిశ్రమల, ఇంధన మంత్రి 'ఇంక్యో చియోంగ్'తో చర్చలు జరిపిన విషయాన్ని మంత్రి పీయూష్ గోయల్ తన ఎక్స్ ఖాతాలో పేర్కొంటూ.. ఫోటోలను కూడా షేర్ చేశారు. భారత్ - కొరియా సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందాన్ని మరింత బలోపేతం చేయడానికి ఈ చర్చలు జరిపినట్లు వెల్లడించారు.ఇదీ చదవండి: రూ.1.5 లక్షల కంటే తక్కువ ధర వద్ద లభించే బైకులు.. ఇవే!భారతదేశంలో దక్షిణ కొరియా పెట్టుబడులు ఉపాధి.. పారిశ్రామిక వృద్ధిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. దక్షిణ కొరియాతో మాత్రమే కాకుండా.. మయన్మార్ విదేశీ ఆర్థిక సంబంధాల మంత్రి డాక్టర్ 'కాన్ జా'తో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పెంపొందించే మార్గాలను గురించి పీయూష్ గోయల్ చర్చించారు. మొత్తం మీద ఇప్పుడు జరిగిన చర్చలు దేశాన్ని ఆర్థికంగా మరింత ముందుకు తీసుకెళ్లడానికి ఉపయోగపడుతాయని పలువురు భావిస్తున్నారు.Held productive talks with Mr. Inkyo Cheong, Minister of Trade, Industry and Energy, Republic of Korea. 🇮🇳🤝🇰🇷Deliberations were held on achieving more balanced trade, upgrading the India-Korea Comprehensive Economic Partnership Agreement (CEPA), promoting investments linked to… pic.twitter.com/5mgXtK6rSI— Piyush Goyal (@PiyushGoyal) September 21, 2024 -
కిమ్‌కు సమష్టిగా చెక్ అమెరికా, జపాన్, కొరియా నిర్ణయం
నాంఫెన్ (కంబోడియా): వరసగా క్షిపణి పరీక్షలతో కొరకరాని కొయ్యగా మారిన ఉత్తర కొరియాను కట్టడి చేయడానికి కలసికట్టుగా పని చేయాలని అమెరికా, జపాన్, దక్షిణ కొరియా నిర్ణయించాయి. కంబోడియాలో జరుగుతున్న తూర్పు ఆసియా సదస్సులో జపాన్ ప్రధాని కిషిడా, దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యెల్‌తో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ విడిగా సమావేశమై ఈ మేరకు చర్చించారు. రష్యాతో యుద్ధంలో ఉక్రెయిన్‌కు అన్నివిధాలా అండగా ఉండాలని తీర్మానించారు. ఫసిఫిక్ ప్రాంతంలో చైనాను ఎదుర్కోవడంపైనా మూడు దేశాలు చర్చించాయి. -
ఆ ప్రాంతంలో స్వేచ్ఛాయుత విధానాలపై దృష్టి: మోదీ
న్యూఢిల్లీ: ఇండో ఫసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛాయుత, బహిరంగ విధానాలపైనే ప్రధానంగా తమ దృష్టి ఉంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. ఈ ప్రాంతంలో ఆసియాన్ దేశాలు కేంద్రీకృతంగా ఉండడానికే తాము మద్దతునిస్తామన్నారు. బ్రూనై ఆతిథ్య దేశంగా బుధవారం నిర్వహించిన 16వ తూర్పు ఆసియా సదస్సులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోదీ ప్రసంగించారు. వివిధ దేశాల ప్రాదేశిక సార్వభౌమత్వాన్ని , అంతర్జాతీయ సరిహద్దులు, అంతర్జాతీయ న్యాయాన్ని భారత్ ఎప్పుడూ గౌరవిస్తుందని, అన్ని దేశాలు పాటించే విలువల్ని మరింత పటిష్టం చేయడానికి కట్టుబడి ఉంటుందని అన్నారు. ఇండోఫసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛాయుత, బహిరంగ విధానాలపైనే భారత్ ప్రధానంగా దృష్టి సారిస్తోందని, ఆసియాన్ దేశాల విధానాలకు కట్టుబడే ముందుకు వెళతామని ఆ సదస్సులో పేర్కొన్నట్టు ప్రధాని ఒక ట్వీట్ ద్వారా వెల్లడించారు. -
ఆసియా–పసిఫిక్‌లో భారతే కీలకం
బ్యాంకాక్: ఆసియా–పసిఫిక్ ప్రాంతంలో భారత్ పలుకుబడి పెరుగుతోందనటానికి తాజా ఉదాహరణ ఇది. ఈ ప్రాంతంలో కీలకంగా మారిన భారత్‌కు బ్యాంకాక్‌లో జరుగుతున్న ఆగ్నేయాసియా దేశాల సంఘం(ఆసియాన్) శిఖరాగ్ర సమావేశం మద్దతు తెలిపింది. భారత్‌తో వ్యూహాత్మక సంబంధాలను మరింత విస్తృతం చేసుకోవడంతోపాటు ఉగ్రవాదం వంటి పెను సవాళ్లను ఉమ్మడిగా ఎదుర్కోవాలని ఆసియాన్ నిర్ణయించిందని విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి విజయ్ ఠాకూర్ సింగ్ తెలిపారు. ఆసియాన్, చైనా మధ్య దక్షిణ చైనా సముద్రంపై ఆధిపత్యంపై వివాదం కొనసాగుతుండటం, ఆసియా పసిఫిక్ ప్రాంతంలో భౌగోళిక రాజకీయ ప్రాబల్యం కోసం జరుగుతున్న పోటీ నేపథ్యంలో ఆసియాన్ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుందన్నారు. దక్షిణ చైనా సముద్రం అంశాన్ని కూడా ఆసియాన్ చర్చించిందని, అంతర్జాతీయ చట్టాలు, నియమాల ఆధారిత వ్యవస్థ కీలకమని ఇరువర్గాలు గుర్తించాయన్నారు. అనుసంధానతే ముఖ్యం ఆసియాన్‌తో సంబంధాలను మరింత విస్తృతం చేసుకునేందుకు భారత్ సానుకూలంగా ఉందని ప్రధాని మోదీ తెలిపారు. ఆదివారం ఇక్కడ జరిగిన ప్రారంభ సమావేశంలో ఆసియాన్‌తో సాన్నిహిత్యం పెంచుకునేందుకు గల అవకాశాలపై ప్రధాని మోదీ కార్యాచరణను ప్రకటించారు. ఆసియాన్‌లోని 10 దేశాలతో భూ, వాయు, సముద్ర అనుసంధానత పెంపు ద్వారా ప్రాంతీయ వాణిజ్యం, ఆర్థిక ప్రగతి గణనీయంగా మెరుగవుతాయన్నారు. డిజిటల్ అనుసంధానత కూడా చాలా కీలకమైందన్నారు. థాయ్‌లాండ్‌తో రక్షణ రంగంలో సహకారం రక్షణ పరిశ్రమల రంగంలో ద్వైపాక్షిక సహకారాన్ని విస్తృతం చేసుకునేందుకు ప్రధాని మోదీ, థాయ్‌లాండ్ ప్రధాని ప్రయుత్ చనోచా అంగీకరిం చారు. బ్యాంకాక్ నుంచి గువాహటికి నేరుగా విమాన సర్వీసులను ప్రారంభించాలని, థాయ్‌లాండ్‌లోని రణోంగ్ పోర్టుతో భారత్‌లోని కోల్‌కతా, చెన్నై, విశాఖ నౌకాశ్రయాల మధ్య అనుసంధానత పెంచాలని నిర్ణయించారు. వాణిజ్యం పెంపుపైనా ఇద్దరు నేతలు చర్చించారు. అనంతరం ఇండోనేసియా అధ్యక్షుడు జోకో విడోడోతో కూడా ప్రధాని మోదీ భేటీ అయ్యారు. -
ఉగ్ర మూలాల్ని నాశనం చేశాం
బ్యాంకాక్/న్యూఢిల్లీ: దేశంలో ఉగ్రవాదం, వేర్పాటువాదం వేళ్లూనుకునేందుకు గల కారణాన్ని గుర్తించి, తొలగించినట్లు ప్రధాని మోదీ తెలిపారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం శనివారం థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్ చేరుకున్న ప్రధాని భారత సంతతి ప్రజలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘దేశంలో వేర్పాటువాదం, ఉగ్రవాదం వేళ్లూనుకునేందుకు మూలాలను నాశనం చేశాం. ఆగస్టు 5న ఆర్టికల్ 370ను రద్దు చేశాం. జమ్మూకశ్మీర్‌కు సొంత రాజ్యాంగాన్ని కల్పించడం వంటి అనేక తాత్కాలిక నిబంధనలను తొలగించాం. మన నిర్ణయం సరైందే అని ప్రపంచం గుర్తించింది. థాయ్‌లాండ్‌లోనూ అదే విషయం ప్రతిధ్వనించింది. మీరిచ్చే ప్రశంసలు భారత్ పార్లమెంట్, పార్లమెంట్ సభ్యులకే చెందుతాయి’అని ప్రధాని పేర్కొన్నారు. దీంతో అక్కడి వారంతా లేచి నిలబడి హర్షధ్వానాలు వ్యక్తం చేశారు. పనిచేసి, ఫలితం చూపేవారి నుంచే ప్రజలు ఎక్కువగా ఆశిస్తారని ప్రధాని పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉజ్వల యోజన వంటి పథకాలు, కర్తార్‌పూర్ కారిడార్‌తో ప్రయోజనాలను ప్రధాని వారికి వివరించారు. ఈ నెల 3వ తేదీన బ్యాంకాక్ సమీపంలోని నొంతబురిలో జరిగే ఆసియాన్–ఇండియా 16వ శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని పాల్గొంటారు. 4న 14వ తూర్పు ఆసియా శిఖరాగ్ర సమావేశం, ఆర్సెప్ మూడో శిఖరాగ్ర సమావేశంలోనూ మోదీ హాజరవుతారు. తూర్పు ఆసియా శిఖరాగ్ర భేటీలో ఆసియాన్‌లోని 10 దేశాలతోపాటు భారత్, చైనా, జపాన్, దక్షిణ కొరియా, రష్యా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, అమెరికా పాల్గొననున్నాయి. ప్రయోజనాన్ని బట్టే ఆర్సీఈపీ దేశానికి ఒనగూరే ప్రయోజనాలను బేరీజు వేశాకే ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య(ఆర్సీఈపీ) ఒప్పందంపై సంతకం చేస్తామని మోదీ తెలిపారు. బ్యాంకాక్ పర్యటనకు వెళ్లే ముందు ఆయన ఒక ప్రకటన చేస్తూ.. ‘ఈ నెల 4వ తేదీన జరిగే భేటీ సందర్భంగా ఆర్సీఈపీ చర్చల్లో పురోగతిని పరిశీలిస్తాం. మన సరుకులు, సేవలు, పెట్టుబడులకు సంబంధించిన ప్రయోజనాలు ఈ ఒప్పందంతో ఎంతవరకు నెరవేరతాయనే అంశాన్ని పరిశీలిస్తాం. ఈ ఒప్పందం అందరికీ ప్రయోజనకరంగా ఉండాలి. ఈ శిఖరాగ్రం సందర్భంగా ప్రపంచ నేతలతో ద్వైపాక్షిక సంబంధాలపై చర్చిస్తాం. ఆసియాన్‌కు సంబంధించిన ఈ సమావేశాలు మనకు చాలా ముఖ్యం. అనుసంధానత, సామర్థ్యం పెంపు, సాంస్కృతిక, వాణిజ్యపరమైన ప్రాథమ్యాంశాలపై ఆసియాన్‌తో మన భాగస్వామ్యం ఆధారపడి ఉంది’అని తెలిపారు. -
శాంతి, ప్రగతి మా ప్రాథమ్యాలు
సింగపూర్: ఇండో–పసిఫిక్ ప్రాంతంలో శాంతి, అభివృద్ధికి భారత్ కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. సభ్య దేశాల మధ్య బహుళ రంగాల్లో సహకారం, సంబంధాలు పరిపుష్టం కావాలని ఆకాంక్షించారు. సింగపూర్ పర్యటనలో ఉన్న ఆయన గురువారం జరిగిన 13వ తూర్పు ఆసియా దేశాల సదస్సులో పాల్గొన్నారు. తూర్పు ఆసియా సమావేశానికి మోదీ హాజరుకావడం ఇది 5వ సారి. ‘సభ్య దేశాల మధ్య ఆర్థిక, సాంస్కృతిక సంబంధాలతో పాటు బహుళ రంగాల్లో సహకారం పెరగాలని తూర్పు ఆసియా దేశాల సదస్సు(ఈఏఎస్)లో నా ఆలోచనలు పంచుకున్నా. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో శాంతి, అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశా’ అని మోదీ ఆ తరువాత ట్వీట్ చేశారు. అంతకుముందు, జపాన్ ప్రధాని షింజో అబేతో పాటు పలువురు దేశాధినేతలతో మోదీ సమావేశమై ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై చర్చలు జరిపారు. దానికి ముందు జరిగిన ఆసియాన్–ఇండియా అల్పాహార సమావేశంలో మోదీ మాట్లాడుతూ..వ్యూహాత్మక ఇండో–పసిఫిక్ ప్రాంత అభివృద్ధికి తీర భద్రతలో సహకారం, వాణిజ్య వికేంద్రీకరణ కీలకమని నొక్కిచెప్పారు. కేడెట్ మార్పిడి కార్యక్రమంలో భాగంగా సింగపూర్‌లో పర్యటిస్తున్న ఎన్సీసీ కేడట్లను కలుసుకున్న మోదీ వారితో కాసేపు ముచ్చటించారు. మోదీ రెండు రోజుల సింగపూర్ పర్యటన ముగించుకొని సాయంత్రం తిరుగు పయనమయ్యారు. హ్యాకథాన్ విజేతలకు సత్కారం.. ఇండియా, సింగపూర్ సంయుక్తంగా నిర్వహించిన తొలి హ్యాకథాన్ విజేతల్ని మోదీ సత్కరించారు. 36 గంటల పాటు జరిగిన గ్రాండ్ ఫినాలేలో రెండు దేశాల నుంచి మూడేసి చొప్పున జట్లు ఈ పోటీలో గెలుపొందాయి. భారత్ నుంచి విజేతలుగా నిలిచిన జట్లలో ఐఐ టీ ఖరగ్‌పూర్, ఎన్ఐటీ తిరుచ్చి, పుణే ఎంఐటీ ఇంజినీరింగ్ కాలేజ్ బృందాలున్నాయి. సింగ పూర్ మంత్రి ఓంగ్ యే కుంగ్‌తో కలసి మోదీ విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. -
ఉగ్ర ఆనవాళ్లన్నీ అక్కడే!
సింగపూర్: అంతర్జాతీయంగా జరుగుతున్న అన్ని ఉగ్రదాడుల ఆనవాళ్లు, మూలాలు ఒకే ప్రాంతంలో ఉన్నాయని ప్రధాని మోదీ అన్నారు. ఆయన ప్రత్యేకంగా ఏ దేశాన్ని ప్రస్తావించకున్నా పాకిస్తాన్‌ను ఉద్దేశించే అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్‌తో నర్మగర్భంగా ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ఆసియాన్–ఇండియా సదస్సుకు హాజరయ్యేందుకు రెండు రోజుల సింగపూర్ పర్యటనకు వెళ్లిన మోదీ బుధవారం పలువురు దేశాధినేతలతో సమావేశమై ద్వైపాక్షిక చర్చలు జరిపారు. మైక్ పెన్స్‌తో పాటు సింగపూర్ ప్రధాని లీ సీన్ లూంగ్, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్, థాయిలాండ్ ప్రధాని జనరల్ ప్రయూత్ చాన్–ఓ–చాలతో భేటీ అయ్యారు. భారత్‌లో రక్షణ రంగ ఉత్పత్తుల తయారీ కేంద్రాలను ఏర్పాటుచేయాలని అమెరికా కంపెనీలను కోరారు. పెన్స్ నోట ముంబై దాడుల మాట.. మోదీ–పెన్స్ భేటీలో ఉగ్రవాదం ప్రముఖంగా ప్రస్తావనకు వచ్చింది. ఎలా చూసినా కూడా ప్రపంచంలో జరుగుతున్న అన్ని ఉగ్రదాడుల మూలాలు ఒకే ప్రాంతంలో కేంద్రీకృతమై ఉన్నాయని పరోక్షంగా పాకిస్తాన్‌ను ఉద్దేశించి మోదీ వ్యాఖ్యానించారు. ఇటీవల పలు దేశాల్లో చోటుచేసుకున్న ఉగ్రదాడుల్లో పాకిస్తాన్ సంతతి ప్రజల పాత్ర సంగతి ఉన్న నేపథ్యంలో ఆయన ఈ మేరకు స్పందించినట్లు తెలుస్తోంది. ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ పార్టీ పాకిస్తాన్ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీచేయడంపై మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. మోదీ, పెన్స్ భేటీ వివరాల్ని విదేశాంగ శాఖ కార్యదర్శి విజయ్ గోఖలే వెల్లడించారు. ఈ సందర్భంగా భారత్‌లో పర్యటించాలన్న మోదీ ఆహ్వానానికి పెన్స్ అంగీకరించారు. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు.. సింగపూర్ ప్రధాని లీ సీన్ లూంగ్‌తో భేటీ అయిన మోదీ..ఆర్థిక సాంకేతికత, ప్రాంతీయ అనుసంధానత, ద్వైపాక్షిక సహకారం తదితరాలపై విస్తృతంగా చర్చలు జరిపారు. మోదీ, లూంగ్ మధ్య సమావేశం ఫలప్రదంగా జరిగిందని విదేశాంగ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ చెప్పారు. తర్వాత ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్, థాయిలాండ్ ప్రధాని జనరల్ ప్రయూత్ చాన్‌లతో సమావేశమైన మోదీ..వాణిజ్యం, రక్షణ, భద్రత తదితర రంగాల్లో సంబంధాల బలోపేతంపై చర్చలు జరిపారు. -
లావోస్ పర్యటనకు ప్రధాని మోదీ
న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటన నిమిత్తం బుధవారం లావోస్ బయల్దేరి వెళ్లారు. 14వ భారత్-ఏసియా, 11వ తూర్పు ఆసియా శిఖరాగ్ర సదస్సులో ఆయన పాల్గొననున్నారు. ముందుగా మోదీ భారత్-ఏసియా సద్ససులో పాల్గొంటారు. ఇక గురువారం తూర్పు ఆసియా శిఖరాగ్ర సదస్సుకు హాజరు అవుతారు. భారత్-ఏసియా సదస్సుకు ఇండోనేషియా, మలేషియా, ఫిలిఫ్పైన్స్, సింగపూర్, బ్రూనే, కంబోడియా, లావోస్, మయన్మార్, వియత్నాం, థాయ్‌లాండ్ దేశాలు హాజరవుతున్నాయి. ఇక తూర్పు ఆసియా శిఖరాగ్ర సదస్సుకు భారత్, చైనా, జపాన్, సౌత్ కొరియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూకే, రష్యా నేతలు పాల్గొంటారు. రక్షణ, భద్రత, వాణిజ్యం వంటి కీలక రంగాల్లో పరస్పర సహకారాన్ని పెంపొందించుకునే అంశంపై మోదీ ఈ సదస్సుల్లో చర్చించే అవకాశముంది. -
మతం, ఉగ్రవాదం.. వేర్వేరు!
-
మతం, ఉగ్రవాదం.. వేర్వేరు!
* ఆ రెండిటి మధ్య ఏ సంబంధాన్నైనా ప్రపంచం తిరస్కరించాలి * ‘తూర్పు ఆసియా సదస్సు’లో ప్రధాని మోదీ పిలుపు * ఉగ్రవాదంపై పోరులో నిజమైన భాగస్వామ్యం కావాలి * సైబర్, స్పేస్‌లను అభివృద్ధి కోసం ఉపయోగించుకోవాలి * ఎబోలా నిర్మూలనకు కలసికట్టుగా కృషిచేయాలి * ఇప్పుడు భారత విధానం ‘లుక్ ఈస్ట్’ కాదు ‘యాక్ట్ ఈస్ట్’ * రష్యా, చైనా సహా పలు దేశాల నేతలతో ప్రధాని భేటీ నేప్యితా: మతం, ఉగ్రవాదం.. రెండూ వేరువేరని, వాటి మధ్య ఎలాంటి సంబంధాన్నైనా అంతర్జాతీయ సమాజం తిరస్కరించాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. అన్ని రకాల ఉగ్రవాద కార్యకలాపాలపై పోరులో నిజాయితీతో కూడిన అంతర్జాతీయ భాగస్వామ్యం ఏర్పడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మయన్మార్ రాజధాని నేప్యితాలో గురువారం జరిగిన తూర్పు ఆసియా దేశాల సదస్సు(ఈఏఎస్)లో ఆయన ప్రసంగించారు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, రష్యా ప్రధాని మెద్వదెవ్, చైనా ప్రధాని లీకెకియాంగ్ సహా 18 దేశాల నేతలు ఆ సదస్సులో పాల్గొన్నారు. సదస్సులో మోదీ మాట్లాడుతూ.. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థపై ఈ సదస్సు ఆమోదించిన తీర్మానాన్ని స్వాగతిస్తున్నామన్నారు. అదే సమయంలో, ఉగ్రవాద చర్యలకు వ్యతిరేకంగా నిజమైన అంతర్జాతీయ భాగస్వామ్యంతో కూడిన స్పందన అవసరమన్నారు. మానవత్వమున్న అందరూ ఇందులో కలసిరావాలన్నారు. ‘ఉగ్రవాద, తీవ్రవాద సవాళ్లు పెరిగాయి. వాటికి.. ఆయుధాల స్మగ్లింగ్, డ్రగ్స్ అక్రమరవాణా, నగదు అక్రమ చెలామణీకి దగ్గరి సంబంధం ఉంది’ అని పేర్కొన్నారు. సైబర్, అంతరిక్షం.. వీటిని విభేదాలకు కాకుండా అభివృద్ధికి, అనుసంధానతకు ఉపయోగించుకోవాలని సూచించారు. ఆర్థిక రంగ సహకారంపై మాట్లాడుతూ.. ఈఏఎస్ సదస్సు సభ్యదేశాలు ‘సమతుల ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం’పై అవగాహనకు రావాల్సిన అవసరం ఉందన్నారు. వస్తు, సేవల రంగాలకు సమాన ప్రాధాన్యతనిచ్చే ఈ ఒప్పందం వల్ల ప్రాంతీయ సమైక్యత, ఆర్థిక ప్రగతి సాధ్యమవుతుందని మోదీ వివరించారు. 2015లోగా విశాల ‘ఆసియాన్ కమ్యూనిటీ’ని ఏర్పాటు చేయాలన్న లక్ష్యాన్ని ఆయన ప్రశంసించారు. సమగ్ర ఆసియా,పసిఫిక్ ప్రాంత సమైక్యతకు అది దారులు వేస్తుందన్న విశ్వాసం తనకుందన్నారు. ‘లుక్ ఈస్ట్’ టు ‘యాక్ట్ ఈస్ట్’ ఆర్నెళ్ల క్రితం తన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గత విధానమైన ‘లుక్ ఈస్ట్’ విధానాన్ని మరింత క్రియాశీలంగా మార్చే ఉద్దేశంతో ‘యాక్ట్ ఈస్ట్’గా మార్చామని మోదీ వివరించారు. తూర్పు ఆసియా దేశాల సదస్సు తమ యాక్ట్ ఈస్ట్ విధానానికి ప్రధాన భూమికగా నిలుస్తుందన్నారు. ‘మరే ఇతర అంతర్జాతీయ వేదిక కూడా ఇంత భారీ స్థాయిలో విశ్వ జనాభాను, యువతను, ఆర్థిక, సైన్య సంపత్తిని ప్రతిబింబించదు. అలాగే మరే ఇతర వేదిక కూడా ఈ స్థాయిలో శాంతి, సుస్థిరత, అభివృద్ధి కోసం కృషి చేయదు’ అని ఈఏఎస్‌లోని 18 దేశాల శక్తి సామర్ధ్యాలను మోదీ చాటిచెప్పారు. గత 8 సదస్సుల్లో అనేక రంగాల్లో పరస్పర సహకారానికి దారులు వేసుకున్నామన్న మోదీ.. ఇంధన రంగంలో.. ముఖ్యంగా స్వచ్చమైన సౌరశక్తి ఉత్పత్తిలో సభ్య దేశాలు భాగస్వామ్యాన్ని పెంచుకోవాలని సూచించారు. ఎబోలా వైరస్ వ్యాప్తిపై ఆందోళన వ్యక్తం చేస్తూ.. అంటువ్యాధులను నిర్మూలించడంలో అంతర్జాతీయంగా అవసరమైన పరస్పర సహకారాన్ని ఆయన నొక్కిచెప్పారు. ఎబోలా నిర్మూలనకు భారత్ 1.2 కోట్ల డాలర్లను అందించిన విషయాన్ని మోదీ గుర్తు చేశారు. ఎబోలీ తీవ్రంగా ఉన్న లైబీరియాలో ఐరాస కార్యక్రమంలో భాగంగా భారత్‌కు చెందిన పోలీసులు 251 మంది ఉన్నారన్నారు. సదస్సు సందర్భంగా నేప్యితాలోని మయన్మార్ ఇంటర్నేషనల్ కాన్ఫెరెన్స్ సెంటర్లో పలువురు కీలక ప్రపంచ నేతలతో మోదీ వేర్వేరుగా భేటీ అయ్యారు. మోదీ చైనా పర్యటన కోసం ఎదురుచూస్తున్నాం త్వరలో మోదీ చేయనున్న చైనా పర్యటన కోసం ఎదురుచూస్తున్నామని చైనా ప్రధాని లీ కెఖ్వియాంగ్ పేర్కొన్నారు. నేప్యితాలో గురువారం మోదీ, లీ మొదటిసారి సమావేశమయ్యారు. దాదాపు అరగంట పాటు జరిగిన ఈ భేటీలో ఇరుదేశాల్లోని ఆర్థిక సంస్కరణలపై ప్రధానంగా చర్చ జరిగింది. చైనా అధ్యక్షుడు గ్జి జిన్‌పింగ్ భారత పర్యటన తమకు మరపురాని జ్ఞాపకమని ఈ సందర్భంగా మోదీ లీ కెఖ్వియాంగ్తో అన్నారు. భారత్ మాకు విలువైన భాగస్వామి భారత్ రష్యాకు అత్యంత సన్నిహితమైన, విలువైన భాగస్వామి అని రష్యా ప్రధాని దిమిత్రి మెద్వదేవ్ వ్యాఖ్యానించారు. గురువారం మోదీతో మెద్వదేవ్ భేటీ అయ్యారు. రెండు దేశాల రాష్ట్రాలు, ప్రాంతాల సమాఖ్య కేంద్రాల అవసరాన్ని మోదీ వివరించారు. దానివల్ల ప్రాంతీయ సహకారం మరింత పెరుగుతుందన్నారు. 2001లో తన రష్యా పర్యటనను ఈ సందర్భంగా మోదీ గుర్తు చేసుకున్నారు. మలేసియా దేశ పనితీరు సమీక్షా విధానం భేష్ బుధవారం మలేసియా ప్రధాని నజీబ్ రజాక్‌తో భేటీ సందర్భంగా.. ఆ దేశ ప్రభుత్వ పనితీరు సమీక్షా విధానాన్ని మోదీ ప్రశంసించారు. భారత్‌లోనూ ఆ తరహా విధానాన్ని అవలంబించే విషయంపై చర్చించారు. భారత గృహనిర్మాణ రంగంలో మలేసియా కంపెనీలు పాలు పంచుకోవాలని కోరారు. ఉగ్రవాదం, డ్రగ్స్, ఆయుధాల అక్రమరవాణాలపై ఆసియాన్ దేశాలు, భారత్‌లు కలసికట్టుగా పోరు సాగించాల్సి ఉందన్నారు. ఫిలిపై్పన్స్ అధ్యక్షుడు బెనినో అక్వినో, ఇండోనేసియా అధ్యక్షుడు జోకో విదోడొలతోనూ మోదీ సమావేశమయ్యారు.