న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటన నిమిత్తం బుధవారం లావోస్ బయల్దేరి వెళ్లారు. 14వ భారత్-ఏసియా, 11వ తూర్పు ఆసియా శిఖరాగ్ర సదస్సులో ఆయన పాల్గొననున్నారు. ముందుగా మోదీ భారత్-ఏసియా సద్ససులో పాల్గొంటారు. ఇక గురువారం తూర్పు ఆసియా శిఖరాగ్ర సదస్సుకు హాజరు అవుతారు.
భారత్-ఏసియా సదస్సుకు ఇండోనేషియా, మలేషియా, ఫిలిఫ్పైన్స్, సింగపూర్, బ్రూనే, కంబోడియా, లావోస్, మయన్మార్, వియత్నాం, థాయ్లాండ్ దేశాలు హాజరవుతున్నాయి. ఇక తూర్పు ఆసియా శిఖరాగ్ర సదస్సుకు భారత్, చైనా, జపాన్, సౌత్ కొరియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూకే, రష్యా నేతలు పాల్గొంటారు. రక్షణ, భద్రత, వాణిజ్యం వంటి కీలక రంగాల్లో పరస్పర సహకారాన్ని పెంపొందించుకునే అంశంపై మోదీ ఈ సదస్సుల్లో చర్చించే అవకాశముంది.