నాంఫెన్ (కంబోడియా): వరసగా క్షిపణి పరీక్షలతో కొరకరాని కొయ్యగా మారిన ఉత్తర కొరియాను కట్టడి చేయడానికి కలసికట్టుగా పని చేయాలని అమెరికా, జపాన్, దక్షిణ కొరియా నిర్ణయించాయి.
కంబోడియాలో జరుగుతున్న తూర్పు ఆసియా సదస్సులో జపాన్ ప్రధాని కిషిడా, దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యెల్‌తో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ విడిగా సమావేశమై ఈ మేరకు చర్చించారు. రష్యాతో యుద్ధంలో ఉక్రెయిన్‌కు అన్నివిధాలా అండగా ఉండాలని తీర్మానించారు. ఫసిఫిక్ ప్రాంతంలో చైనాను ఎదుర్కోవడంపైనా మూడు దేశాలు చర్చించాయి.
Comments
Please login to add a commentAdd a comment