క్రైమ్: కన్నవాళ్లే బిడ్డల పట్ల అమానుషంగా.. కర్కశంగా వ్యవహరిస్తున్న ఘటనలూ చూస్తున్నాం. తాజాగా అలాంటి ఘటనే ఒకటి పశ్చిమ బెంగాల్‌లో వెలుగు చూసింది. ఎనిమిది నెలల పసికందును అమ్మేసి.. ఆ డబ్బుతో జల్సాలకు దిగింది ఓ జంట. పైగా ఇందులో తల్లి పాపం ఎక్కువగా ఉండడం గమనార్హం.
పశ్చిమ బెంగాల్ ఉత్తర 24 పరగణాల జిల్లాలో ఈ ఘటన జరిగింది. జయదేవ్ ఘోష్, సతీ ఇద్దరూ భార్యభర్తలు. భర్త చిరుద్యోగి కావడంతో తన సరదాలు నెరవేరడం లేదని తీవ్ర అసంతృప్తిలో ఉంటూ వస్తోంది సతీ. ఈ క్రమంలో భర్తను ఒప్పించి.. తమ ఎనిమిది నెలల బిడ్డను డబ్బు కోసం అమ్మేశారు. ఆ డబ్బుతో కాస్ట్‌లీ ఫోన్లు కొనుక్కోవడంతో పాటు దేశంలోని కొన్ని ప్రాంతాలు తిరిగొచ్చారు.
అయితే బిడ్డ కనిపించకపోవడం, పైగా నెల తర్వాత ఆ జంట తిరిగి ఇంటికి రావడంతో స్థానికులకు అనుమానం కలిగింది. చుట్టుపక్కలవాళ్లు నిలదీయడంతో వాళ్లు తడబడగా.. పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వాళ్లు నిలదీయడంతో రూ.2 లక్షలకు బిడ్డను అమ్మేసినట్లు ఆ తల్లిదండ్రులు ఒప్పుకున్నారు. పైగా సతీ ఓ అడుగుముందుకు వేసి.. బిడ్డను అమ్మేసిన తర్వాత తన స్నేహితులను ఇంటికి రప్పించుకుని గంజాయి మత్తులో మునిగి తేలిందని పోలీసులు గుర్తించారు.
జయదేవ్-సతీతో పాటు బిడ్డను కొనుగోలు చేసిన ప్రియాంక ఘోష్ అనే మహిళను సైతం పోలీసులు అరెస్ట్ చేశారు. చంటి బిడ్డను శిశుసంక్షేమ గృహానికి తరలించారు అధికారులు. ఈ దంపతులకు మరో కూతురు కూడా ఉండడంతో.. ఆమెను మాత్రం బంధువులను అప్పగించారు.
ఇదీ చదవండి: రాధను హత్య టైంలో సీసీ కెమెరాలు ఆఫ్?
Comments
Please login to add a commentAdd a comment