Baby sold
-
కాస్ట్లీ ఫోన్ కోసం పసికందును అమ్మేసి..
క్రైమ్: కన్నవాళ్లే బిడ్డల పట్ల అమానుషంగా.. కర్కశంగా వ్యవహరిస్తున్న ఘటనలూ చూస్తున్నాం. తాజాగా అలాంటి ఘటనే ఒకటి పశ్చిమ బెంగాల్లో వెలుగు చూసింది. ఎనిమిది నెలల పసికందును అమ్మేసి.. ఆ డబ్బుతో జల్సాలకు దిగింది ఓ జంట. పైగా ఇందులో తల్లి పాపం ఎక్కువగా ఉండడం గమనార్హం. పశ్చిమ బెంగాల్ ఉత్తర 24 పరగణాల జిల్లాలో ఈ ఘటన జరిగింది. జయదేవ్ ఘోష్, సతీ ఇద్దరూ భార్యభర్తలు. భర్త చిరుద్యోగి కావడంతో తన సరదాలు నెరవేరడం లేదని తీవ్ర అసంతృప్తిలో ఉంటూ వస్తోంది సతీ. ఈ క్రమంలో భర్తను ఒప్పించి.. తమ ఎనిమిది నెలల బిడ్డను డబ్బు కోసం అమ్మేశారు. ఆ డబ్బుతో కాస్ట్లీ ఫోన్లు కొనుక్కోవడంతో పాటు దేశంలోని కొన్ని ప్రాంతాలు తిరిగొచ్చారు. అయితే బిడ్డ కనిపించకపోవడం, పైగా నెల తర్వాత ఆ జంట తిరిగి ఇంటికి రావడంతో స్థానికులకు అనుమానం కలిగింది. చుట్టుపక్కలవాళ్లు నిలదీయడంతో వాళ్లు తడబడగా.. పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వాళ్లు నిలదీయడంతో రూ.2 లక్షలకు బిడ్డను అమ్మేసినట్లు ఆ తల్లిదండ్రులు ఒప్పుకున్నారు. పైగా సతీ ఓ అడుగుముందుకు వేసి.. బిడ్డను అమ్మేసిన తర్వాత తన స్నేహితులను ఇంటికి రప్పించుకుని గంజాయి మత్తులో మునిగి తేలిందని పోలీసులు గుర్తించారు. జయదేవ్-సతీతో పాటు బిడ్డను కొనుగోలు చేసిన ప్రియాంక ఘోష్ అనే మహిళను సైతం పోలీసులు అరెస్ట్ చేశారు. చంటి బిడ్డను శిశుసంక్షేమ గృహానికి తరలించారు అధికారులు. ఈ దంపతులకు మరో కూతురు కూడా ఉండడంతో.. ఆమెను మాత్రం బంధువులను అప్పగించారు. ఇదీ చదవండి: రాధను హత్య టైంలో సీసీ కెమెరాలు ఆఫ్? -
రూ.4.50 లక్షలకు పసికందు అమ్మకం
బంజారాహిల్స్ (హైదరాబాద్) : పుట్టిన నాలుగు రోజులకే పసికందును విక్రయించిన మహిళతో పాటు కొనుగోలు చేసిన వ్యక్తిపై హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. కాగజ్‌నగర్‌కు చెందిన అనూషకు ఒక కొడుకు, కూతురు ఉన్నారు. గత శనివారం రహ్మత్‌నగర్ సమీపంలోని ఓ ఆస్పత్రిలో మూడో బిడ్డకు జన్మనిచ్చింది. కొడుకును విక్రయించేందుకు అంతకుముందే రూ.4.50 లక్షలకు బేరం కుదుర్చుకున్నారు. మంగళవారం రాత్రి ప్రాంతంలో డబ్బు తీసుకుని పసి కందును అప్పగించారు. ఈ వ్యవహారం పోలీసులదాకా వెళ్లడంతో మధ్యవర్తిగా వ్యవహరించిన సంతోషిని అదుపులోకి తీసుకొని వారు ప్రశ్నించారు. దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన వ్యక్తి రూ.4.50 లక్షలు ఇచ్చి చిన్నారిని కొనుగోలు చేశాడని, మధ్యవర్తిగా తనకు రూ. 50 వేలు ఇచ్చినట్లుగా తెలిపింది. బిడ్డను కొనుగోలు చేసిన వ్యక్తిని బుధవారం అరెస్ట్ చేశారు. -
హనీమూన్ కోసం రూ.18 లక్షలకు కొడుకును అమ్మిన తండ్రి
బీజింగ్: పిల్లల కోసం ఆస్తులు, అవసరమైతే శరీర భాగాలు అమ్ముకున్న తల్లిదండ్రులును చూశాం. కానీ ఓ కసాయి తండ్రి మాత్రం భార్యతో హనీమూన్‌కు వెళ్లి ఎంజాయ్ చేయడం కోసం రెండేళ్ల కుమారుడిని అమ్ముకున్నాడు. వచ్చిన డబ్బుతో టూర్‌కు వెళ్లి ఎంజాయ్ చేశాడు. విషయం కాస్త పోలీసులకు తెలియడంతో ప్రస్తుతం జైల్లో ఊచలు లెక్కపెడుతున్నాడు. ఆ వివరాలు.. చైనా జెజియాంగ్‌కు చెందిన ఓ వ్యక్తికి కొన్నేళ్ల క్రితం వివాహం అయ్యింది. వారికి ఇద్దరు పిల్లలు. ఓ పాప, రెండు సంవత్సరాల వయసు ఉన్న బాబు. అయితే దంపతుల మధ్య విబేధాలు రావడంతో వారు విడిపోయారు. ఈ క్రమంలో కోర్టు తల్లికి కూతురు బాధ్యతను.. తండ్రికి కొడుకు బాధ్యతలను అప్పగించింది. ఉద్యోగం చేస్తున్న తండ్రికి చిన్నారి బాధ్యతలు చూడటం ఇబ్బందిగా మారింది. దాంతో బాబును తన తల్లిదండ్రుల దగ్గర వదిలి వచ్చాడు. కొద్ది రోజుల తర్వాత అతడు మరో యువతిని రెండో వివాహం చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు బిడ్డను తీసుకెళ్లాల్సిందిగా సదరు వ్యక్తిని కోరారు. కానీ రెండో భార్య అందుకు అంగీకరించలేదు. బిడ్డ ఎప్పటికైనా తనకు అడ్డంకే అని భావించిన ఆ వ్యక్తి ఓ భయంకరమైన ప్లాన్ వేశాడు. బిడ్డను అమ్ముదామని నిర్ణయించుకున్నాడు. అందులో భాగంగా తన తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లి.. కొడుకును తీసుకువచ్చాడు. కన్నతల్లి బాబుని చూడాలని కోరింది.. అందుకే తీసుకెళ్తున్నాను అని కుటుంబ సభ్యులకు తెలిపాడు. అది నమ్మిన కుటుంబ సభ్యులు బాబును తండ్రికి అప్పగించారు. కానీ ఆ ప్రబుద్ధుడు ఏ మాత్రం జాలీ, దయ లేకుండా రెండు సంవత్సరాల చిన్నారిని 1,58,000 యువాన్లు(సుమారు 18 లక్షల రూపాయలు)కు అమ్మేశాడు. వచ్చిన మొత్తం తీసుకుని కొత్త భార్యతో హనీమూన్‌కు వెళ్లాడు. జాలీగా ఎంజాయ్ చేయసాగాడు. ఇక బాబును తల్లి దగ్గరికి తీసుకెళ్లి వారం రోజుల పైనే అవుతుంది. ఇంకా తిరిగి తీసుకురాకపోవడంతో.. బాబు తండ్రికి కాల్ చేశారు అతడి కుటుంబ సభ్యులు. కానీ ఫోన్ స్విచ్ఛాఫ్ వచ్చింది. దాంతో కన్నతల్లికి కాల్ చేసి బిడ్డ గురించి అడగ్గా ఆమె తన దగ్గరకు తీసుకురాలేదని తెలిపింది. దాంతో సదరు వ్యక్తి కుటుంబ సభ్యులు అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దీని గురించి దర్యాప్తు చేయగా.. సదరు వ్యక్తి బాబును అమ్మకానికి పెట్టి.. వచ్చిన డబ్బుతో కొత్త భార్యను తీసుకుని హనీమూన్‌కు వెళ్లినట్లు తెలిసింది. దంపతులు వచ్చే వరకు ఎదురు చూసిన పోలీసులు ఆ తర్వాత వారిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు. చైనాలో ఇలాంటి సంఘటలను తరచుగా చోటు చేసుకుంటాయి. గతేడాది ఓ వలస కూలీ అప్పుడే పుట్టిన బిడ్డను 17.74 లక్షల రూపాయలకు అమ్ముకున్నాడు. మరో 19 ఏళ్ల కుర్రాడు ఐఫోన్ కోసం నవజాత శిశువును అమ్ముకున్నాడు. చదవండి: నవ దంపతులకు హనీమూన్ కష్టాలు! -
చైనాలో బిడ్డను అమ్మేసిన వైద్యుడు.. రక్షించిన పోలీసులు
వాయవ్య చైనాలోని షాంక్సి రాష్ట్రంలో ఓ వైద్యుడు అప్పుడే పుట్టిన శిశువును అమ్మేయగా, పోలీసులు ఆ శిశువును రక్షించారు. ఈ కేసులో ఆరుగురిని అరెస్టు చేశారు. సెంట్రల్ హెనన్ రాష్ట్రంలోని ఆంయాంగ్ నగరంలో శిశువును స్వాధీనం చేసుకున్నారు. అయితే, గుర్తింపును నిర్ధారించుకోడానికి ఇంకా డీఎన్ఏ పరీక్షలు చేయాల్సి ఉంది. ఈ మగ శిశువును ఫుపింగ్ కౌంటీ మెటర్నల్ అండ్ చైల్డ్ హెల్త్ కేర్ ఆస్పత్రిలోని ఓ వైద్యుడు జూలై 17వ తేదీన దాదాపు రెండు లక్షల రూపాయలకు అమ్మేసినట్లు అధికారులు తెలిపారు. ఝాంగ్ అనే ఈ వైద్యుడిని అదుపులోకి తీసుకున్నారు. బిడ్డకు పుట్టుకతోనే ఏదో వ్యాధి వచ్చిందని, అందువల్ల చికిత్స చేయడానికి తమవద్దే ఉంచుకుంటామంటూ వైద్యుడు చెప్పి, బిడ్డను ఎత్తుకుపోయాడు. ఆ విషయం తల్లికి తర్వాత తెలిసి, పోలీసులకు ఫిర్యాదుచేసింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి, బిడ్డను కాపాడారు. ఈ సంఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ఆస్పత్రి అధినేతతో పాటు మరో ఇద్దరిని కూడా విధుల నుంచి తొలగించారు. ఇదే ఆస్పత్రిలో మరో ఐదు సంఘటనలు కూడా ఇలాంటివి జరిగాయని, వాటిపై తాము దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.