Megastar Chiranjeevi to shoot 'Bhola Shankar' movie in Kolkata - Sakshi
Sakshi News home page

Bhola Shankar Movie: కోల్‌కతాకు మెగాస్టార్.. ఆ మూవీ సీన్ రిపీట్!

Published Thu, May 4 2023 12:09 PM | Last Updated on Thu, May 4 2023 12:35 PM

Megastar Chiranjeevi Fly To Kolkata For Bhola Shankar Movie Shoot  - Sakshi

మెగాస్టార్ చిరంజీవి తాజాగా నటిస్తోన్న చిత్రం 'భోళాశంకర్'. ఈ చిత్రానికి మెహర్ రమేశ్ దర్శకత్వం వహిస్తున్నారు. వాల్తేరు వీరయ్య సూపర్ హిట్ తర్వాత మెగాస్టార్ నటిస్తున్న చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే హైదరాబాద్ షెడ్యూల్ కూడా పూర్తి చేసుకుంది. తాజాగా ఈ సినిమా షూటింగ్‌ కోసం మెగాస్టార్ కోల్‌కతాకు బయలుదేరారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో పంచుకుంది చిత్రబృందం. 

కోల్‌కతాకు ఓ ప్రత్యేకత
కోల్‌కతాలో రేపటి నుంచే భోళాశంకర్ మూవీ షెడ్యూల్ ప్రారంభం కానుంది. మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో ప్రత్యేకమైన సినిమాగా నిలిచిన ‘చూడాలని ఉంది’ కోల్‌కతా బ్యాక్‌డ్రాప్‌లోనే వచ్చిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఆ మూవీ సూపర్ హిట్‌గా నిలిచింది. ఆ సినిమాలో మెగాస్టార్ టాక్సీ డ్రైవర్‌గా అలకించారు. మళ్లీ ఇప్పుడు ‘భోళా శంకర్’  టీమ్ కోల్‌కతాకు బయలుదేరడంతో అదే సీన్ రిపీట్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ అంటోంది.

(ఇది చదవండి: మెగా ఫ్యాన్స్‌కు ఉగాది సర్‌ప్రైజ్.. భోళాశంకర్ రిలీజ్‌ అప్పుడే!)

కాగా.. ఈ చిత్రంలో చిరంజీవికి జోడీగా తమన్నా నటిస్తున్నారు. చిరంజీవి చెల్లెలి పాత్రలో కీర్తీ సురేష్‌ కనిపించనుండగా.. నటుడు సుశాంత్‌ లవర్‌ బాయ్‌ పాత్ర చేస్తున్నారు. క్రియేటివ్‌ కమర్షియల్స్‌తో కలిసి అనిల్‌ సుంకర ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవలే ఇంటర్వెల్‌ ఫైట్‌ చిత్రీకరణను హైదరాబాద్‌లో చిత్రీకరించారు. 

భోళా శంకర్‌ ఫుల్ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ మూవీగా తెరకెక్కిస్తున్నారు. చిరంజీవిని స్టైలిష్‌ మాస్‌ అవతార్‌లో చూపిస్తున్నారు మెహర్‌ రమేశ్‌. ఎమోషన్, ఎంటర్‌టైన్‌మెంట్, యాక్షన్‌తో పాటు ఐఫీస్ట్‌ అనిపించే పాటలు ఉంటాయి. ఈ చిత్రాన్ని ఆగస్టు 11న సినిమాని రిలీజ్‌  చేస్తామని చిత్రయూనిట్‌ తెలిపింది. 

(ఇది చదవండి: అప్పుడు భూమిక.. ఇప్పుడు శ్రీముఖి.. భోళాశంకర్‌లో ఆ సీన్‌ రిపీట్..!)

కాగా.. తమిళ చిత్రం ‘వేదాళం’కు రీమేక్‌గా టాలీవుడ్‌లో తెరకెక్కిస్తున్నారు. తమిళంలో అజిత్ కుమార్ హీరోగా నటించిన ఈ సినిమా 2015లో విడుదలై సూపర్ హిట్‌గా నిలిచింది. దాదాపు ఎనిమిదేళ్ల తరవాత తెలుగులో రీమేక్ చేస్తున్నారు. 


          

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement