కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ వ్యాఖ్యలపై తృణమూళ్ కాంగ్రెస్ పార్టీ మండిపడింది. టీఎంసీ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై చేసిన వ్యాఖ్యలకు టీఎంసీ గట్టి కౌంటర్ ఇచ్చింది. కేంద్రమంత్రి వ్యాఖ్యలపై స్పందించిన టీఎంసీ.. ‘తమ అధికారానికి సవాలు విసురుతున్న మహిళను బీజేపీ ఓర్చుకోలేకపోతుందని తెలిపడానికి ఇలాంటి వ్యాఖ్యలే నిదర్శం. లింగ పక్షవాతంతో కూడిన పాతకాలపు మనస్తత్వాన్ని బీజేపీ బహిరంగంగా వ్యక్త పరుస్తోంది’ అని ‘ఎక్స్’లో విరుచుకుపడింది.
After PM @narendramodi's "didi o didi" catcall, Union Minister @girirajsinghbjp now joins the list of @BJP4India leaders who made degrading comments about Smt. @MamataOfficial.
It's evident that the BJP leaders find it incredibly hard to fathom a woman in power challenging their… pic.twitter.com/ZCM8GehdIC
— All India Trinamool Congress (@AITCofficial) December 6, 2023
కాగా, 29వ విడత కోల్‌కత్ ఇంటర్ నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్గొన్న సీఎం మమతా.. బాలీవుడ్ నటులు సల్మాన్ ఖాన్, అనిల్ కపూర్, మహేష్ భట్‌ల కోరిక మేరకు వేదికపై కాలు కదిపారు. దీనిపై బీజేపీ కేంద్రమంత్రి గిరిరాజ్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ‘మమతా డాన్స్ చేస్తూ.. వేడుక చేసుకుంటోంది. ఫిల్మ్ ఫెస్టివల్‌లో డాన్స్ చేయాల్సిన అవసరం ఏముంది’ అని విమర్శించారు. దీంతో ఆయన మాటాలు.. దిగజారుడు తనానికి ప్రతీక అని టీఎంసీ మండిపడింది.
ఇదికూడా చదవండి: వారి తర్వాత.. కాంగ్రెస్‌లో బీసీ సీఎం లేరు: నిశికాంత్ దుబే
Comments
Please login to add a commentAdd a comment