దుష్టసంహారం ద్వారా ధర్మాన్ని నిలపడమే శరన్నవరాత్రి ఉత్సవాల పరమార్థం. చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నమే విజయ దశమి. తమలోని దుర్గుణాలను తొలగించి సన్మార్గాన్ని ప్రసాదించ మని అమ్మవారిని కొలుచుకునే వేడుకే దసరా. ఈ శరన్నవరాత్రుల్లో తొమ్మిదిరోజులపాటు జగన్మాతను భక్తి శ్రద్దలతో పూజించి, 10వ రోజు పండగ జరుపుకోవడం ఆనవాయితీ. భారతదేశం సాంస్కృతిక వైవిధ్యం కారణంగా, దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో, వివిధ రూపాల్లో దసరా ఉత్సవాలు జరుగుతాయి.
ఇకనైనా కరోనా మహమ్మారినుంచి విముక్తి ప్రసాదించమని శరణు వేడుకుంటున్న ప్రత్యేక సందర్భంలో ఈ ఏడాది పండుగను నిర్వహించుకుంటున్నాం. ఆయురారోగ్యాలు, సకల శుభాలు వరించేలా ఆ దుర్గామాత దీవించాలని కోరుకుంటూ సాక్షి.కామ్ పాఠకులందరికీ విజయదశమి శుభాకాంక్షలు.
Comments
Please login to add a commentAdd a comment