గెలుస్తామనుకోలేదు: క్రిస్ వోక్స్
కోల్ కతా: బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో అసలు గెలుస్తామని ఊహించలేదని కోల్ కతా నైట్ రైడర్స్ బౌలర్ క్రిస్ వోక్స్ అభిప్రాయపడ్డాడు. "స్వల్ప లక్ష్యాన్ని ముందుంచిన మేము బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న బెంగళూరుతో గెలవడం కష్టంగా భావించామన్నాడు'. అయితే కెప్టెన్ గంభీర్ ఇచ్చిన స్పూర్తి మాలోని పోరాట పటిమను పెంచిందన్నాడు. ముందుగా వేసిన బౌలర్లు త్వరగా వికెట్లు తీయడంతో తర్వాతి బౌలర్లకు సులభమైందని తెలిపాడు.
గేల్, కోహ్లీ, డివిలియర్స్ అవుట్ అవ్వడంతో మ్యాచ్ పై ఆశలు కలిగాయని వోక్స్ వ్యాఖ్యానించాడు.ఈ మ్యాచ్ లో వోక్స్ 2-0-6-3 తో అద్భుత ప్రదర్శన కనబర్చాడు. మిగతా బౌలర్లు ఉమేశ్, కౌల్టర్ నైల్ బంతిని స్వింగ్ చేశారని, నేను మాత్రం సరైన ప్రాంతాల్లో బంతులు విసిరానని పేర్కొన్నాడు. వోక్స్ గేల్, బిన్నీ, శ్యాముల్ బద్రీలను పెవిలియన్ కు చేర్చాడు. కౌల్టర్ నైల్, గ్రాండ్ హోమ్ లకు మూడేసి వికెట్లు దక్కగా ఉమేశ్ కు ఒక వికెట్ దక్కింది.
ఆదివారం కోల్ కతా తో బెంగళూరు 82 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిన విషయం తెలిసిందే. కోల్ కతాను 131 పరుగులకు కుప్పకూల్చిన బెంగళూరు ఐపీఎల్ లోనే అత్యంత చెత్త ప్రదర్శన కనిబర్చింది. కోహ్లీ, గేల్, డివిలియర్స్, జాదవ్ లతో బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న బెంగళూరు 49 పరుగులకు ఆల్ అవుట్ అయి ఐపీఎల్ చరిత్రలో చెత్త రికార్డును నమోదు చేసుకుంది.