బెంగళూరుకు దారుణ పరాభవం | Kolkata Knight Riders beats rcb by 82 runs | Sakshi
Sakshi News home page

బెంగళూరుకు దారుణ పరాభవం

Published Sun, Apr 23 2017 11:41 PM | Last Updated on Tue, Sep 5 2017 9:31 AM

బెంగళూరుకు దారుణ పరాభవం

బెంగళూరుకు దారుణ పరాభవం

కోల్ కతా: ఐపీఎల్ చరిత్రలోనే అత్యల్ప స్కోరు నమోదైంది. ఐపీఎల్ లో భాగంగా కోల్ కతా నైట్ రైడర్స్ తో ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు దారుణ పరాభవం ఎదురైంది. 9.4 ఓవర్లలో 49 పరుగులు చేసి ఐపీఎల్ చరిత్రలోనే తక్కువ స్కోరు రికార్డును ఆర్సీబీ మూటకట్టుకుంది. గతేడాది అప్రతిహత విజయాలతో ఫైనల్స్‌కు దూసుకుపోయిన ఆర్సీబీ ఇక్కడ కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్‌లో 82 పరుగుల తేడాతో ఘోర పరాభవాన్ని చవిచూసింది. 132 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బ్యాటింగ్‌కు దిగిన కోహ్లీ సేన కేవలం 9.4 ఓవర్లలోనే 49 పరుగులు చేసి ఆలౌటైంది. అంతకుముందు టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన కోల్ కతా 19.3 ఓవర్లలో 131 పరుగులకు ఆలౌటైంది.

సంచలన ఓపెనర్ సునీల్ నరైన్ మరోసారి విధ్వంసం సృష్టించాడు. 17 బంతుల్లో 6 ఫోర్లు ఒక సిక్సర్ తో 34 పరుగులు చేశాడు. నరైన్ దూకుడుతో కేకేఆర్ 5.4 ఓవర్లలోనే 65 పరగులు చేసింది. ఆ తర్వాత ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. గంభీర్(14), ఉతప్ప(11), మనీశ్ పాండే(15), యూసఫ్ పఠాన్(8) స్వల్పస్కోర్లకే పరిమితమయ్యారు. చివర్లో వోక్స్ (18) చేయడంతో  131 పరుగులకే ఆలౌటై ఆర్సీబీ ముందు 132 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

132 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ కోహ్లీ తొలి బంతికే డకౌట్ అయ్యాడు. ఆర్సీబీ ఇన్నింగ్స్‌లో ఏ ఒక్క బ్యాట్స్‌మన్ కూడా రెండంకెల మార్కు స్కోరు చేయలేకపోవడంతో ఐపీఎల్ చరిత్రలోనే అతి తక్కువ స్కోరుకు పరిమితమైంది. 17 బంతులాడిన క్రిస్ గేల్ 7 పరుగులు చేశాడు. మన్ దీప్ సింగ్(1), డివిలియర్స్ (8), స్టూవర్ట్ బిన్ని(8) విఫలమయ్యారు. ఆర్సీబీలో కేదార్ జాదవ్(9) దే అత్యధిక స్కోరు. కోల్టర్ నైల్, వోక్స్, గ్రాండ్ హోమ్ తలో 3 వికెట్లు తీసి ఆర్సీబీ పతనాన్ని శాసించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement