కింగ్స్‌ జోరుకు బెంగుళూరు డీలా | Punjab kings XI wins against Bangalore royal challengers | Sakshi
Sakshi News home page

కింగ్స్‌ జోరుకు బెంగుళూరు డీలా

Published Mon, Apr 10 2017 11:02 PM | Last Updated on Tue, Sep 5 2017 8:26 AM

కింగ్స్‌ జోరుకు బెంగుళూరు డీలా

కింగ్స్‌ జోరుకు బెంగుళూరు డీలా

ఐపీఎల్‌-10వ సీజన్‌లో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ జోరును కొనసాగిస్తోంది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో బెంగుళూరు రాయల్‌ చాలెంజర్స్‌ను పంజాబ్ మట్టికరిపించింది. అన్ని విభాగాల్లో ఉత్తమ ప్రదర్శనతో బెంగుళూరు ఆట కట్టించింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న బెంగుళూరు జట్టును 20 ఓవర్లలో 148/4 పరుగులకు కట్టడి చేసింది పంజాబ్‌.

బెంగుళూరు ఆ మాత్రం గౌరవప్రదమైన స్కోరు చేసిందంటే అందుకు కారణం ఏబీ డివిలియర్స్‌ (89; 46 బంతుల్లో; 9 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడటమే. 149 పరుగుల లక్ష్యంతో చేధనకు దిగిన పంజాబ్‌ జట్టుకు ఓపెనర్లు వోహ్రా(34; 21 బంతుల్లో), హషీమ్‌ ఆమ్లా(58; 38 బంతుల్లో) నాటౌట్‌ శుభారంభాన్నిచ్చారు.

ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన అక్షర్‌ పటేల్‌ వెంటనే వెనుదిరిగినా.. కెప్టెన్‌ మ్యాక్స్‌వెల్‌ (43; 22 బంతుల్లో) నాటౌట్‌ తనదైన శైలిలో దూకుడుగా ఆడాడు. దీంతో మరో 33 బంతులు మిగిలి ఉండగానే 150/2 పరుగులు చేసింది. పంజాబ్‌ బౌలర్లలో ఆరోన్‌కు రెండు వికెట్లు దక్కగా.. అక్షర్‌పటేల్‌, సందీప్‌ శర్మలు చెరో వికెట్‌ పడగొట్టారు. బెంగుళూరు బౌలర్లలో తైమల్‌ మిల్స్‌, ఇమ్రాన్‌ తహీర్‌లకు చెరో వికెట్‌ దక్కింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement