కోల్‌కతా: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు, మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఆదివారం అపోలో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. నాలుగు రోజుల క్రితం రెండోసారి గుండె నొప్పితో దాదా ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని అపోలో వైద్యులు తెలిపారు. వైద్యులు గురువారం ఆయనకు యాంజియోప్లాస్టీ చికిత్సను విజయవంతంగా నిర్వహించారు. 48 ఏళ్ల గంగూలీ ఈ నెలలో రెండు సార్లు ఆసుపత్రి పాలయ్యారు. జనవరి 2న స్వల్ప గుండెపోటు రావడంతో ఆయనకు యాంజియోప్లాస్టీ ద్వారా ఒక స్టెంట్‌ను అమర్చారు. బుధవారం మరోసారి ఛాతీలో అసౌకర్యంగా ఉండటంతో ఆస్పత్రిలో చేరిన ఆయనకు వైద్యులు మరో రెండు స్టెంట్‌లు వేశారు.
Comments
Please login to add a commentAdd a comment