ప్రముఖ నటుడు ఆశిష్ విద్యార్థి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తెలుగుతో పాటు తమిళం, హిందీ, బెంగాలీ సహా సుమారు 11 భాషల్లో 200కి పైగా సినిమాల్లో నటించాడు. టాలీవుడ్‌లో విలన్ పాత్రలతో గుర్తింపు పొందిన ఆయన తాజాగా 60ఏళ్ల వయసులో రెండోసారి పెళ్లిబంధంలోకి అడుగుపెట్టాడు. అస్సాంకు చెందిన 33 ఏళ్ల ఫ్యాషన్ ఎంటర్‌ప్రెన్యూర్ రూపాలి బారువాను ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. కోల్‌కతాలో వీరి వివాహం నిరాడంబరంగా జరిగింది.
అతికొద్ది మంది బంధువులు, కుటుంబసభ్యుల సమక్షంలో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. వీరి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో ఈ జంటకు పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సుమారు 20ఏళ్ల క్రితమే ఆశిష్ విద్యార్థి నటి శాకుంతల బారువా కుమార్తె రాజోషి బారువాను ప్రేమించి మనువాడారు. వీరికి ఆర్త్ విద్యార్థి అనే కుమారుడు ఉన్నాడు.
నటిగా, సింగర్‌గా రాజోషి బారువా పాపులర్. అయితే భార్యభర్తల మధ్య కొంతకాలంగా విబేధాలు రావడంతో వీరు విడిపోయారు. ఆ తర్వాత ఫ్యాషన్ ఎంటర్‌ప్రెన్యూర్ రుపాలీతో ఆశీష్ విద్యార్థికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారి చివరకు పెళ్లిపీటలు ఎక్కేదాకా వచ్చింది. ఈమెకు కోల్‌కతాలో పలు స్టోర్స్ ఉన్నట్లు తెలుస్తుంది.
కొంతకాలంగా వీరు రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు రూమర్స్ వచ్చినా వాటినే నిజం చేస్తూ పెళ్లి చేసుకున్నారు. రూపాలీని పెళ్లి చేసుకోవడం చాలా ఆనందంగా ఉందని, తమ బంధం వెనుక పెద్ద కథే ఉందని, తర్వాత ఎప్పుడైనా చెబుతానంటూ స్వయంగా ఆశిష్ విద్యార్థి పేర్కొన్నారు. కాగా 60 ఏళ్ల వయసులో ఆశిష్‌విద్యార్థి రెండో పెళ్లి చేసుకోవడం, అది కూడా ప్రేమ పెళ్లి చేసుకోవడం విశేషం.
దీనిపై నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. కొందరు కొత్తజంటకు కంగ్రాట్స్ అంటూ కామెంట్స్ చేస్తుంటే, మరికొందరు మాత్రం ఈ వయసులో మీకిది అవసరమా? అయినా ప్రేమ గుడ్డిది అంటారు. నిజమేనేమో అంటూ సెటైర్లు వేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment