
ఐదో ఏడాది ఇక్కడికి వచ్చా: నరసింహన్
హైదరాబాద్: గవర్నర్‌గా ఐదో సంవత్సరం ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని ఈఎస్ఎల్ నరసింహన్ అన్నారు. వినాయక చవితి పర్వదినం సందర్భంగా శుక్రవారం ఉదయం సతీసమేతంగా ఖైరతాబాద్ మహాగణనాథుడిని దర్శించుకున్నారు. 60 అడుగుల శ్రీ కైలాస విశ్వరూపమహాగణపతికి ప్రథమపూజ చేశారు.
వినాయక చవితి రోజు ఖైరతాబాద్ గణేషుడిని దర్శించుకుంటే సర్వవిజ్ఞాలు తొలగిపోతాయని ఈ సందర్భంగా గవర్నర్ అన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలకు ఆయన వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు భారీ గణనాథుడిని దర్శించుకునేందు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.