
సాక్షి, అమరావతి : నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పడి నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో గడపాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. అన్ని వర్గాల ప్రజలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ పధకాలు రూపొందించాలని ప్రభుత్వాన్ని కోరారు.
ప్రతి సంక్షేమ, అభివృద్ధి పథకాలు నిరుపేదలకు అందేలా చూడాలని, ప్రజల సంతోషమే ప్రభుత్వానికి విజయ సంకేతాలంటూ వ్యాఖ్యానించారు. రాబోయే రోజుల్లో సంక్షేమ ఫలాలు మరింత పారదర్శకంగా ప్రజలందికీ అందాలని ఆకాంక్షించారు. నవ్యాంధ్రప్రదేశ్ సాధన దిశగా ప్రభుత్వం విజయాలు సాధించాలని కొరుకుంటున్నట్లు వెల్లడించారు.