పన్నీర్ సభకు వస్తారా? రారా?
చెన్నై : తమిళనాడు అసెంబ్లీలో నెలకొన్న తీవ్ర గందరగోళ పరిస్థితుల్లో సభ రెండోసారి మధ్యాహ్నం మూడు గంటల వరకు వాయిదాపడింది. సభ వాయిదా పడిన అనంతరం అన్నాడీఎంకే చీఫ్ విప్ రాజేంద్రన్ పన్నీర్ వర్గంపై అనర్హత వేటు ప్రటించారు. మధ్యాహ్నం 3 గంటలకు పన్నీర్ వర్గం మాత్రం సభకు హాజరైతే, వారిపై అనర్హత వేటు వేయాలని విప్ జారీచేశారు. ఈ నేపథ్యంలో పన్నీర్ సెల్వం వర్గం ఇక 3 గంటలకు సభకు హాజరుకావడంపై అనుమానాలు నెలకొన్నాయి.
ఒకవేళ విప్ ధిక్కరిస్తే, అనర్హత వేటుకు గురికావాల్సి వస్తుందని పన్నీర్ వర్గం సమాలోచనలో పడింది. మరోవైపు నేడు బలనిరూపణ సందర్భంగా డీఎంకే సభ్యులు సృష్టించిన పరిస్థితులు, సీఎం పళనిస్వామికి అనుకూలంగా మారినట్టు తెలుస్తోంది. తన మెజార్టీ నిరూపించుకోవడానికి ఈ పరిణామాలు మరింత తేలికవుతున్నాయని విశ్లేషకులంటున్నారు.