paneerselvam
-
బహిష్కరణ వేటుపై కోర్టుకు ఓపీఎస్!.. ఈపీఎస్ సంచలన ఆరోపణలు
చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీర్‌సెల్వం అన్నాడీఎంకే బహిష్కరణ నిర్ణయంపై తీవ్రంగా స్పందించారు. కోటిన్నర క్యాడర్ ఎన్నుకున్న తనను ఎలా తప్పిస్తారని? ఆ అధికారం ఒక్క పళనిస్వామికో, ఇతర నేతలకో అస్సలు లేదని వ్యాఖ్యానించారు. తన బహిష్కరణకు అసంబద్ధంగా పేర్కొన్న ఓపీఎస్.. తనను తొలగించే అధికారం ఎవరికీ లేదని, బహిష్కరణ నిర్ణయంపై చట్ట ప్రకారం కోర్టుకు వెళ్తానని ప్రకటించారు. ఇదిలా ఉంటే.. ఓపీఎస్‌కు షాకిస్తూ పార్టీ జనరల్ కౌన్సిల్ భేటీ నిర్వహించుకునేందుకు అనుమతి ఇచ్చింది మద్రాస్ హైకోర్టు. దీంతో ప్రెసిడియమ్ చైర్మన్ తమిళ్మహాన్ హ్సుస్సేన్ అధ్యక్షతన వనగారమ్లో సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలోనే ఇంటీరియమ్ జనరల్ సెక్రెటరీగా పళనిస్వామిని ఎన్నుకుంటూ.. అలాగే పన్నీర్‌సెల్వంను పార్టీ నుంచి బహిష్కరిస్తూ ప్రకటించింది అన్నాడీఎంకే. డీఎంకేతో కుమ్మక్కయ్యాడు అన్నాడీంకే జనరల్ సెక్రెటరీ(ఇంటీరియమ్) హోదాలో ఈ పళనిస్వామి.. పన్నీర్‌సెల్వంపై విమర్శలు ఎక్కుపెట్టాడు. అధికార పక్షం డీఎంకేలో పన్నీర్‌సెల్వం కుమ్మక్కు అయ్యాడంటూ సంచలన ఆరోపణలే చేశారు ఓపీఎస్. ఓపీఎస్ హింసాకాండకు పాల్పడ్డాడు. అన్నాడీఎంకే కార్యాలయం నుంచి పార్టీకి సంబంధించిన వస్తువులను ఎత్తుకెళ్లారు. ఎన్నిసార్లు అభ్యర్థించినా.. పోలీస్ భద్రత కల్పించలేదు. శాంతి భద్రతలు క్షీణించాయనడానికి ఇంత కన్నా నిదర్శనం ఇంకేంటి?. .. పార్టీకి ఒక్కరే నేత ఉండాలని సీనియర్లు చెప్పిన సూచనను సైతం ఓపీఎస్ పెడచెవినపెట్టాడు. నేను మీలో ఒక్కడినే(పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి..). ఈ పార్టీనే నా జీవితం. పార్టీ కార్యకర్తగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా, ముఖ్యమంత్రిగా.. పని చేశా. ఇద్దరి నాయకత్వంలో పని తీరు ఎలా ఉంటుందో చూస్తూనే ఉన్నా అంటూ వ్యాఖ్యలు చేశారు. డీఎంకేను అన్నాడీఎంకే వ్యవస్థాపకులు ఎంజీఆర్ ఒక దుష్టశక్తితో పోల్చారు. డీఎంకే ప్రభుత్వం అంటే.. కమీషన్లు, అవినీతికి కేరాఫ్. అలాంటి పార్టీ ప్రభుత్వంపై ఓపీఎస్ కొడుకు ఓపీ రవీంద్రన్ లోక్ సభ సభ్యుడిగా ఉండి మరీ.. ప్రశంసలు గుప్పిస్తున్నాడు. అలాగే ఓపీఎస్ ఒక్కడే పార్టీ జనరల్ కౌన్సిల్ భేటీ నిర్వహించొద్దంటూ వాదించాడు.. కోర్టుకెక్కాడు అంటూ పళని స్వామి విమర్శలు గుప్పించారు. -
ఇది మూసిన తలుపులకు తాళం వేయడమే!
సాక్షి, న్యూఢిల్లీ : తూత్తుకుడిలోని స్టెరిలైట్ కాపర్ కంపెనీ (వేదాంత గ్రూప్)ని శాశ్వతంగా మూసివేస్తు తమిళనాడు ప్రభుత్వం సోమవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేయడం చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం లాంటిదే. నీరు, గాలిని కలుషితం చేస్తున్న ఈ కంపెనీని మూసివేయాలంటూ మే 22వ తేదీన తూత్తుకుడి పరిసర గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన చేయడం, తమిళనాడు పోలీసులు నిర్దాక్షిణ్యంగా కాల్పులు జరపడం, 13 మంది అమాయకులు మరణించడం తదితర పరిణాలు తెల్సినవే. ఈ సందర్భంగా పెల్లుబికిన ప్రజల ఆగ్రహంపై చన్నీళ్లు చల్లేందుకుగాను రాష్ట్ర ప్రభుత్వానికి ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదు. భోపాల్‌లో యూనియన్ కార్బైడ్, కొడైకెనాల్లో యూని లివర్ కంపెనీలను మూసివేసినంత సులభంగా తూత్తుకుడి స్టెరిలైట్ కాపర్ కంపెనీకి తమిళనాడు ప్రభుత్వం తాళం వేసింది. రేపు ఇంతే సులభంగా కాపర్ కంపెనీ కోర్టు తలుపులు తట్టవచ్చు. స్టే ఉత్తర్వులను తెచ్చుకోనూ వచ్చు. ఆ ఉత్తర్వులను అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందా? ఏదేమైనా కంపెనీ తలుపులు మళ్లీ తెరచుకోకుండా అడ్డుకోగలదా? అందుకు అవసరమైన సమస్త సమాచారాన్ని సేకరించిందా? ఇప్పుడు సిద్ధంగా లేకపోయినా అప్పీళ్ల క్రమంలోనైనా ప్రభుత్వం కళ్లు తెరచి పటిష్ట వాదనతో కేసు గెలవచ్చు. భయంకరంగా కలుషితమైన కంపెనీ ఆవరణ, పరిసరాలను ఎవరు శుద్ధి చేస్తారు ? కంపెనీ కాలుష్యం కారణంగా తరతరాలు జబ్బు పడిన ప్రజలకు నష్ట పరిహారం ఎవరు చెల్లిస్తారు ? తమ పాపం ఏమీ లేకున్నా ఉన్నఫలంగా ఉద్యోగం ఊడిపోయిన దాదాపు 32 వేల మంది కార్మికులకు జీవనోపాధి ఎవరు కల్పిస్తారు? ఈ ప్రశ్నలన్నింటికి సరైన సమాధానం ప్రభుత్వం చూపినప్పుడే కంపెనీని శాశ్వతంగా మూసివేయడాన్ని ఎవరైనా సమర్థిస్తారు. అందుకు సార్థకత ఉంటుంది. కాపర్ కంపెనీ కోర్టుకెళితే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర కాలుష్య నియంత్రణా బోర్డు సలహాలను, సూచనలను మాత్రం తీసుకోవద్దు సుమా! ఇటు రాష్ట్ర కాలుష్య నియంత్రణా బోర్డు, అటు కేంద్ర పర్యావరణ శాఖలు స్టెరిలైట్ కాపర్ కంపెనీకి ఇంతకాలం ఊడిగం చేశాయి. ప్రభుత్వ పారిశ్రామిక నిబంధనల ప్రకారం స్టెరిలైట్ కంపెనీలను ‘రెడ్ క్యాటగిరీ’ జోన్లో మాత్రమే ఏర్పాటు చేయాలి. ‘స్పెషల్ ఇండస్ట్రీస్ అండ్ హజార్డస్ యూజ్ జోన్’ను రెడ్ క్యాటగిరీ జోన్‌గా వ్యవహరిస్తారు. అయితే తమిళనాడులోని తూత్తుకుడిలో మాత్రం ‘జనరల్ ఆర్ లైట్ ఇండస్ట్రీస్’ జోన్లో పాక్షికంగా ‘అగ్రికల్చర్ జోన్’లో పాక్షికంగా స్టెరిలైట్ కంపెనీని ఏర్పాటు చేశారు. పైగా అవసరమైన గ్రీన్కారిడర్ను కంపెనీ మెయింటెన్ చేయలేదు. 2007లో కంపెనీ తన స్మెల్టర్ (ముడిసరకును మండించి ద్రావకంగా మార్చేది)ను విస్తరించింది. తమ కంపెనీకి 172 హెక్టార్ల భూమి ఉందని, స్మెల్టర్ విస్తరణ వల్ల వచ్చే అధిక కాలుష్యాన్ని నివారించే చర్యలకు ఈ భూమి సరిపోతుందన్న వాదనతో స్మెల్టర్‌ను విస్తరించింది. స్మెల్టర్ విస్తరణలో కూడా ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాలను కంపెనీ పాటించలేదు. 172 హెక్టార్ల భూమి ఉన్నట్లు 2007లో కంపెనీ ప్రకటించినప్పటికీ నేటికి కూడా 102.5 హెక్టార్లకు మించి భూమి లేదు. నిబంధనల ప్రకారం 123 మీటర్ల చిమ్నీని ఏర్పాటు చేయాలి. కంపెనీలో 60 మీటర్ల చిమ్నీ మాత్రమే ఉంది. అంటే స్థాపించిన దగ్గరి నుంచి విస్తరణ వరకు కంపెనీలో అన్నీ ఉల్లంఘనలే. కాలుష్యానికి కారణమవుతున్న ఈ కంపెనీ అందుకు నష్టపరిహార చర్యల కోసం రాష్ట్ర ప్రభుత్వానికి 100 కోట్ల రూపాయలను జరిమానాగా చెల్లించాలని 2013లో సుప్రీం కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఆ వంద కోట్లను ప్రభుత్వం వసూలు చేసిందా? చేస్తే వాటిని ప్రభుత్వం ఎలా ఖర్చు పెట్టింది? అన్న ప్రశ్నలకు ప్రభుత్వం నుంచి నేటికి సమాధానం లేదు. కంపెనీకి వ్యతిరేకంగా ప్రజల ఆందోళన తీవ్రమైన నేపథ్యంలో తనను తాను కాపాడు కోవడంలో భాగంగా తమిళనాడు కాలుష్య నిరోధక బోర్డు ఇటీవల కంపెనీకి విద్యుత్, నీటి సరఫరాలను నిలిపివేసింది. దీంతో కంపెనీ ఉత్పత్తి నిలిచిపోయింది. ఈ నేపథ్యంలోనే కేబినెట్ నిర్ణయమంటూ రాష్ట్ర ప్రభుత్వం అప్పటికే మూతపడిన తలుపులకు తాళం వేసింది. -
ప్రజల నిరసనలతో దిగొచ్చిన ప్రభుత్వం
చెన్నై : స్టెరిలైట్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా తూత్తుకుడిలో సాగుతున్న నిరసనలు హింసాత్మకంగా మారిన అనంతరం ఆ రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చింది. వేదంత లిమిటెడ్‌కు చెందిన స్టెరిలైట్ కాపర్ ఫ్యాక్టరీని శాశ్వతంగా మూసివేసేందుకు తగిన చర్యలు తీసుకుంటామని తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఓ పన్నీర్‌సెల్వం చెప్పారు. స్టెరిలైట్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా చేపట్టిన నిరసనల్లో, పోలీసుల కాల్పులకు గాయపడ్డ వారిని పన్నీర్‌సెల్వం పరామర్శించారు. ఈ నిరసనల్లో ఇప్పటికీ 13 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో గాయపడ్డ వారికి నష్టపరిహారం చెల్లిస్తామని ఉప ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఇప్పుడిప్పుడే ఆ ప్రాంతంలో పరిస్థితులు సద్దుమణుగుతున్నాయి. కస్టమర్ల కోసం దుకాణాలు తెరుచుకుంటున్నాయి. మే 23 నుంచి రద్దు చేసిన ఇంటర్నెట్ సేవలు కూడా, అక్కడ ఆదివారం అర్థరాత్రి నుంచి పునరుద్ధరించారు. ‘దుకాణాలు తెరుచుకున్నాయి. పరిస్థితి సద్దుమణిగింది. కానీ ఫ్యాక్టరీని మూసివేసే వరకు నగరంలో పూర్తి ప్రశాంతత ఏర్పడదు’ అని తూత్తుకుడి ట్రేడర్స్ అసోసియేషన్ ఎస్ రాజ చెప్పారు. అదేవిధంగా నిరసనకారులపై కాల్పులు జరిపిన పోలీసు అధికారులపై నేర కేసు నమోదు చేయాలని రాజ అన్నారు. 13 మృతదేహాల్లో ఏడుగురికి పోస్టుమార్టం పూర్తి అయిందని రాజ చెప్పారు. మరోవైపు స్టెరిలైట్ కాపర్ యూనిట్ విస్తరణ పనులను నిలిపేయాలని మద్రాస్ హైకోర్టు సైతం ఆదేశించింది. ఆందోళనల్లో 13 మంది మృతిచెందడంపై తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపికి జాతీయ మానవ హక్కుల కమిషన్ నోటీసులు పంపింది. రెండు వారాల్లో నివేదికలు సమర్పించాలని కోరింది. ఈ ఘటనలపై వేదంత రిసోర్సస్ చైర్మన్ అనిల్ అగర్వాల్ తొలిసారి స్పందించారు. ప్రపంచంలో కేవలం 2 శాతం కాపర్‌ను మాత్రమే భారత్ ఉత్పత్తి చేస్తుందని, మిగతా అంతా కెనడా, మధ్యప్రాచ్య, యూరప్ నుంచి దిగుమతి చేసుకుంటున్నట్టు తెలిపారు. ఇలాంటివన్నీ భారత్‌లోనే జరుగుతాయని, ప్రతీసారి, ప్రజాస్వామ్యాన్ని ప్రజలు చేతుల్లోకి తీసుకుంటున్నారని వ్యాఖ్యానించారు. మనం జీవితాంతం దిగుమతి చేసుకునే బతుకుదామా? అని ఆయన ప్రశ్నించారు. -
పన్నీరుపై వేటుకు చాన్సే లేదు
సాక్షి, చెన్నై: పన్నీరు సెల్వంతో పాటు 11 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడానికి అవకాశం లేదని, ఈ విషయంలో అసలు స్పీకర్‌కు ఆదేశాలు ఇచ్చే అధికారం కోర్టుకు లేదని సీఎం పళనిస్వామి తరఫున హైకోర్టులో బుధవారం వాదనలు వినిపించారు. దినకరన్ మద్దతు ఎమ్మెల్యే అనర్హత వేటును గుర్తు చేస్తూ, పన్నీరు బృందం మీద వేటు ఎందుకు వేయరంటూ వాదనలు వాడి వేడిగా సాగాయి. గత ఏడాది ఫిబ్రవరిలో జరిగి సీఎం పళనిస్వామి బల పరీక్ష సమయంలో పన్నీరు సెల్వంతో పాటు 11 మంది ఎమ్మెల్యేలు అన్నాడీఎంకే విప్‌నకు వ్యతిరేకంగా ఓటు వేసిన విషయం తెలిసిందే. అయితే, వారి మీద ఎలాంటి చర్యలు తీసుకోని స్పీకర్ ధనపాల్, అన్నాడీఎంకే అమ్మ శిబిరం నేత దినకరన్ మద్దతు ఎమ్మెల్యేల మీద మాత్రం ఇటీవల చర్యలు తీసుకోవడం చర్చకు దారి తీసింది. దినకరన్ మద్దతు ఎమ్మెల్యే అనర్హత వేటును పరిగణలోకి తీసుకుని , ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్న పన్నీరుసెల్వంతో పాటు 11 మంది మీద సైతం వేటు పడాల్సిందేనన్న నినాదాన్ని డీఎంకే అందుకుంది. డీఎంకే విప్ చక్రపాణి దాఖలు చేసిన పిటిషన్ విచారణ బుధవారం వాడివేడిగా సాగింది. స్పీకర్‌కే అధికారం పన్నీరుతో పాటు 11 మంది ఎమ్మెల్యేలపై వేటుకు అవకాశం లేనే లేదని సీఎం పళనిస్వామి తరఫున కోర్టుకు వాదనలు చేరాయి. ప్రధాన న్యాయమూర్తి ఇందిరాబెనర్జీ, న్యాయమూర్తి అబ్దుల్ కుదుష్ నేతృత్వంలోని బెంచ్ ముందు ఉదయం వాదనలు సాగాయి. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాదులు కపిల్‌సిబాల్, అమరేంద్ర సింగ్ హాజరయ్యారు. సీఎం పళనిస్వామి, అసెంబ్లీ స్పీకర్ తరఫున న్యాయవాది వైద్యనాథన్ హాజరై వాదనలు వినిపించారు. అసెంబ్లీలో సాగే వ్యవహారాలపై తుది నిర్ణయం తీసుకునే అధికారం ఒక్క స్పీకర్‌కు మాత్రమే ఉందన్నారు. ఆయన నిర్ణయానికి కట్టుబడాల్సిన అవసరం ఉందని, అయితే, స్పీకర్‌కు ఆదేశాలు ఇచ్చే అధికారం ఎవ్వరికీ లేదని కోర్టు దృష్టికి తెచ్చారు. అసెంబ్లీ నియమ నిబంధనల మేరకు స్పీకర్ చర్యలు ఉంటాయని, ఆయన తీసుకునే నిర్ణయం సుప్రీం అని వ్యాఖ్యానించారు. అనర్హత వేటు విషయంగా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌కు ఆదేశాలు ఇచ్చే అధికారం కోర్టుకు లేదన్నారు. దీంతో పిటిషనర్ చక్రపాణి తరఫున కపిల్‌సిబాల్ వాదన వినిపించారు. స్పీకర్ చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తున్నారని, ప్రజా స్వామ్య విరుద్ధంగా రాష్ట్రంలోపాలన సాగుతున్నదని, ఈ ప్రభుత్వ కొనసాగేందుకు వీలు లేదని కోర్టు దృష్టికి తెచ్చారు. న్యాయవాది వైద్యనాథన్ జోక్యం చేసుకుని సుప్రీంకోర్టులో ఇలాం టి కేసు పెండింగ్‌లో ఉందని, ఈ దృష్ట్యా, ఎలాంటి ఆదేశాలు ఇవ్వ వద్దు అని, అలాగే, పన్నీరు, అండ్ ఎమ్మెల్యే తరఫున అదనపు పిటిషన్ దాఖలుకు అవకాశం ఇవ్వాలని కోరారు. చివరకు స్పీకర్ ధనపాల్‌ను వివరణ కోరుతూ, అదనపు పిటిషన్ల దాఖలకు అవకాశం కల్పిస్తూ తదుపరి విచారణను ఫిబ్రవరి 13కు వాయిదా వేశారు. అదనపు పిటిషన్లు ఫిబ్రవరి ఐదో తేదీలోపు వేయాలని ఆదేశించారు. ఢిల్లీకి పన్నీరు ఓ వైపు తమ మీద దాఖలైన పిటిషన్ల విచారణ వాడివేడిగా సాగుతుంటే, మరో వైపు డిప్యూటీ సీఎం పన్నీరుసెల్వం ఢిల్లీ చెక్కేశారు. ప్రధాని నరేంద్రమోదీతో భేటీకి ఈ పయనం అని పాలకుల్లో చర్చ. ఎంజీయార్ శతజయంతి ఉత్సవాలకు స్వయంగా ఆహ్వానించేందుకు నిర్ణయించిన దృష్ట్యా, ఇందుకు తగ్గ ఆహ్వానాలు ఢిల్లీలో గురువారం సాగే అవకాశాలు ఉన్నాయి. అలాగే, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో పాటు పలువురు మంత్రులతో భేటీలకు పన్నీరు అపాయింట్ మెంట్లు సిద్ధం చేసుకుని వెళ్లడం గమనార్హం. ఢిల్లీలో జరిగే ఆర్థిక శాక సమావేశానికి సైతం హాజరు కాబోతున్నారు. -
రెండాకులు మావే!
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే రెండాకుల చిహ్నం మాదేనని, మరికొద్ది రోజుల్లో ఆ చిహ్నం మళ్లీ చేతికి రానున్నట్టు సీఎం ఈపీఎస్, డిప్యూటీ సీఎం ఓపీఎస్ మద్దతు నేతలు ధీమా వ్యక్తం చేశారు. అన్నాడీఎంకే సర్వ సభ్య సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, చేసిన తీర్మానాలను శుక్రవారం ఢిల్లీలో సీఈసీకి నివేదిక రూపంలో అందజేశారు. త్వరగా చిహ్నాన్ని కేటాయించాలని విన్నవించారు. ఆర్కేనగర్ ఉప ఎన్నిక సమయంలో రెండాకుల చిహ్నం కోసం అన్నాడీఎంకేలో గ్రూపులుగా ఉన్న ఈపీఎస్, ఓపీఎస్‌ల శిబిరాల మధ్య తీవ్ర సమరం సాగిన విషయం తెలిసిందే. ఆ ఎన్నికల్లో రెండాకుల చిహ్నం సీజ్ చేశారు. రెండాకులు పోయి, ఆ ఎన్నికలు ఆగడంతో తదుపరి పార్టీని, చిహ్నాన్ని చేజిక్కించుకునేందుకు ఓపీఎస్, ఈపీఎస్ తీవ్ర కుస్తీలు పట్టారు. వేర్వేరుగా ఎన్నిక యంత్రాంగానికి ప్రమాణ పత్రాల రూపంలో సమర్పించారు. ఈ వ్యవహారం విచారణలో ఉన్న సమయంలో ఈపీఎస్, ఓపీఎస్ ఏకమయ్యారు. దీంతో ఇద్దరు కలిసి చిహ్నం, పార్టీని చిన్నమ్మ శశికళ అండ్ బృందం నుంచి రక్షించుకునే పనిలో పడ్డారు. అన్నాడీఎంకే సర్వ సభ్య సమావేశానికి పిలుపు నిచ్చి, అందులో చిన్నమ్మను సాగనంపుతూ తీర్మానాలు చేశారు. అన్నాడీఎంకే తమదేనని, చిహ్నం తమకే దక్కాలన్న కాంక్షతో తీర్మానాలు ఇటీవల చేశారు. వీటిని కేంద్ర ఎన్నికల కమిషన్‌కు సమర్పించే పనిలో ఈపీఎస్, ఓపీఎస్ మద్దతు నేతలు నిమగ్నమయ్యారు. ఇది వరకు ఓ మారు ఢిల్లీ వెళ్లినా, వీరికన్నా ముందుగా తమతో సంప్రదింపులు జరపకుండా ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదంటూ చిన్నమ్మ ప్రతినిధి దినకరన్ సీఈసీకి లేఖ సమర్పించడంతో వెనక్కు తగ్గక తప్పలేదు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఈపీఎస్ తరఫున మంత్రులు జయకుమార్, సీవీ షణ్ముగం, ఆర్బీ ఉదయకుమార్, ఓపీఎస్ తరఫున మాజీ మంత్రి మునుస్వామి, ఎంపీ మైత్రేయన్, మాజీ స్పీకర్ పీహెచ్ పాండియన్ ఢిల్లీ వెళ్లారు. రెండాకులు మావే : అన్నాడీఎంకే సర్వ సభ్య సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, హాజరైన సభ్యుల వివరాలు, తీర్మానాలు తదితర అంశాలను నివేదిక రూపంలో కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఢిల్లీలో ఈ నేతలు సమర్పించారు. ముక్తకంఠంతో, ఏకాభిప్రాయంతో సర్వ సభ్య సమావేశంలో చేసిన తీర్మానాల మేరకు అన్నాడీఎంకే తమదేనని, రెండాకుల చిహ్నం తమకే దక్కే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం మీడియాతో కేపీ మునుస్వామి మాట్లాడుతూ, అన్ని వివరాలను సీఈసీ ముందు ఉంచామని వివరించారు. సర్వ సభ్య సమావేశాలకు హాజరైన వారందరి వివరాలు, రాని వారు తమకు సమర్పించిన లేఖలు తదితర అంశాలను సైతం సీఈసీ ముందు ఉంచామని పేర్కొన్నారు. మంత్రి జయకుమార్ మాట్లాడుతూ, అన్నాడీఎంకే చిహ్నం రెండాకులు 100 శాతం తమదేనని, త్వరలో ఆ చిహ్నం తమకు మళ్లీ దక్కనుందని ధీమా వ్యక్తం చేశారు. ఎవరెన్ని కుట్రలు చేసినా, కుతంత్రాలు పన్నినా తమను ఏమీ చేయలేరని పేర్కొన్నారు. చిహ్నం తమ చేతికి రాగానే, అన్నాడీఎంకే బలం ఏమిటో , సత్తా ఏమిటో మరోమారు చాటుతామన్నారు. పార్టీలో కనీసం సభ్యుడు కూడా కాని దినకరన్ ఎలా అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశానికి పిలుపునిస్తున్నాడో చూస్తామని, ఆయన దూకుడుకు కల్లెం వేస్తామని హెచ్చరించారు. -
పన్నీర్ సెల్వం దీక్ష
చెన్నై : అన్నాడీఎంకే అధినేత్రి జయలలితను తోసేశారని మాజీ స్పీకర్ పీహెచ్ పాండియన్ సంచలన వ్యాఖ్యలను మరవకముందే తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం కూడా అమ్మ మృతిపై అనుమానాలు వ్యక్తం చేశారు. జయలలిత మృతిపై న్యాయ విచారణ జరిపించాలంటూ ఆయన త్వరలో దీక్షకు దిగనున్నారు. జయలలిత మృతిపై అనుమానాలు ఉన్నాయని, వాటిపై విచారణ జరిపించాలని పన్నీర్ సెల్వం డిమాండ్ చేశారు. కాగా గతనెల 5న పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దాంతో ఆయన స్థానంలో ఎంకే శశికళను అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు తమ నాయకురాలిగా ఎన్నుకున్నారు. అయితే రెండు రోజుల తర్వాత (ఫిబ్రవరి 7న) రోజు శశికళపై పన్నీర్ సెల్వం తిరుగుబాటు చేశారు. గవర్నర్ శశికళతో ప్రమాణ స్వీకారం చేయించకపోవడంతో దాదాపు రోజుల పాటు సంక్షోభం కొనసాగింది. సీఎం కుర్చీ చివరకు శశికళ, పన్నీర్ సెల్వం దక్కలేదు. అనూహ్యంగా పళనిస్వామి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు. Paneerselvam, jayalalithaa death, sasikala, paneer deeksha, పన్నీర్ సెల్వం, జయలలిత మృతి, శశికళ, పన్నీర్ దీక్ష -
పన్నీర్ సభకు వస్తారా? రారా?
చెన్నై : తమిళనాడు అసెంబ్లీలో నెలకొన్న తీవ్ర గందరగోళ పరిస్థితుల్లో సభ రెండోసారి మధ్యాహ్నం మూడు గంటల వరకు వాయిదాపడింది. సభ వాయిదా పడిన అనంతరం అన్నాడీఎంకే చీఫ్ విప్ రాజేంద్రన్ పన్నీర్ వర్గంపై అనర్హత వేటు ప్రటించారు. మధ్యాహ్నం 3 గంటలకు పన్నీర్ వర్గం మాత్రం సభకు హాజరైతే, వారిపై అనర్హత వేటు వేయాలని విప్ జారీచేశారు. ఈ నేపథ్యంలో పన్నీర్ సెల్వం వర్గం ఇక 3 గంటలకు సభకు హాజరుకావడంపై అనుమానాలు నెలకొన్నాయి. ఒకవేళ విప్ ధిక్కరిస్తే, అనర్హత వేటుకు గురికావాల్సి వస్తుందని పన్నీర్ వర్గం సమాలోచనలో పడింది. మరోవైపు నేడు బలనిరూపణ సందర్భంగా డీఎంకే సభ్యులు సృష్టించిన పరిస్థితులు, సీఎం పళనిస్వామికి అనుకూలంగా మారినట్టు తెలుస్తోంది. తన మెజార్టీ నిరూపించుకోవడానికి ఈ పరిణామాలు మరింత తేలికవుతున్నాయని విశ్లేషకులంటున్నారు. -
సెల్వం గూటికి మరో ఎమ్మెల్యే, ఎంపీ
చెన్నై: అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ వర్గంలో మరింత ఆందోళన నెలకొంది. మంగళవారం సుప్రీం కోర్టు తీర్పు వెలువరించనున్న నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠగా మారిన సమయంలో మరో ఎంపీ, ఎమ్మెల్యే చిన్నమ్మ వర్గానికి షాకిచ్చారు. దక్షిణ మదురై ఎమ్మెల్యే శరవణన్, మదురై ఎంపీ గోపాలకృష్ణన్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వంకు మద్దతు పలికారు. అనూహ్యంగా సోమవారం రాత్రి సెల్వం వర్గంలో వారిద్దరు చేరారు. తమిళనాడు ముఖ్యమంత్రిగా పన్నీరు సెల్వం ఉండాలని, ఆయనకు తాము మద్దతు ఇస్తామని ప్రకటించారు. పన్నీర్ సెల్వం వారిద్దరికి శాలువా కప్పి ఆహ్వానించారు. దీంతో సెల్వం వర్గంలో ఆనందం రెట్టింపు అయ్యింది. ఇప్పటి వరకు 12 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు పన్నీర్ సెల్వానికి మద్దతు పలికారు. గత మూడు రోజులుగా శశికళ ఎమ్మెల్యేలతో వరుస భేటీలు నిర్వహిస్తున్న ఎమ్మెల్యేలు జారుకోవడంతో ఆమె కొంత నిరుత్సాహానికి గురయ్యారు. ఈ రోజు రాత్రికి ఆమె గోల్డెన్ బే రిసార్ట్‌లోనే ఎమ్మెల్యేలతోనే బస చేయనున్నారు. శశికళ రాజకీయ భవితవ్యంపై రేపు సుప్రీం కోర్టు వెలువరించే తీర్పుపై రాజకీయవర్గాల్లో ఆసక్తిగా నెలకొంది తమిళనాడు కథనాలు చదవండి... రేపు తేలనున్న శశికళ రాజకీయ భవితవ్యం! ఈ రాత్రికి గోల్డెన్ బే రిసార్ట్‌లో చిన్నమ్మ బస శశికళకు 119 మంది 'రిసార్ట్ ఎమ్మెల్యేల' మద్దతు! కమల్.. మళ్లీ వేసేశాడు! చిన్నమ్మతో ప్రభుత్వం ఏర్పాటు చేయించండి: సుప్రీంలో పిల్ పన్నీర్ - స్టాలిన్.. సచివాలయంలో భేటీ! పన్నీర్ అమ్ముడుపోయారు.. చిన్నమ్మే కావాలి శశికళా.. మొసలి కన్నీరు ఆపండి: సెల్వం 'తమిళనాడులో సీఎం పదవి ఖాళీలేదు' జయలలిత చివరి మాటలు ఏంటో తెలుసా? సచివాలయానికి సీఎం పన్నీర్ సెల్వం! ఢిల్లీని ఢీ కొడతా ఎమ్మెల్యేలు ఇంకా రారేంటి? ‘అమ్మ’ కోసం అవమానాలు భరించా తమిళనా(ఆ)ట.. బీజేపీ మా(ఆ)ట -
శశికళా?....పన్నీరా?
-
రాజ్‌భవన్ గుప్పిట్లో రహస్యం తలైవీ?...తలైవా?
-
రాజ్‌భవన్ గుప్పిట్లో రహస్యం తలైవీ?... తలైవా?
. తమిళనాడు గవర్నర్ నిర్ణయంపై తీవ్ర ఉత్కంఠ . విద్యాసాగర్‌రావును కలసిన పన్నీర్, శశికళ - శాసనసభలో బల నిరూపణకు అవకాశమివ్వాలని పన్నీర్ విన్నపం - ఎమ్మెల్యేల పరేడ్‌కు శశికళకు అవకాశం ఇవ్వని గవర్నర్ - ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన పత్రాలను సమర్పించిన చిన్నమ్మ - తాజా పరిణామాలతో కేంద్రానికి నివేదిక పంపిన గవర్నర్ - పన్నీర్‌కు బలపరీక్ష అవకాశం ఇస్తారా?.. శశికళతో ప్రమాణం చేయిస్తారా? - కేంద్రం ఏం సూచిస్తుంది? గవర్నర్ ఏం చేస్తారు? - తమిళనాడుకు కాబోయే ముఖ్యమంత్రి ఎవరు? - రెండు మూడు రోజుల్లో గవర్నర్ నిర్ణయం అంటున్న విశ్లేషకులు చెన్నై నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తిస్తున్న తమిళ రాజకీయాలు రాజ్‌భవన్‌కు చేరాయి. మూడురోజులుగా ఎత్తులు పైఎత్తులతో ముఖ్యమంత్రి పదవికోసం పోటీ పడుతున్న అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం గురువారం సాయంత్రం ఇన్చార్జ్ గవర్నర్ సీహెచ్. విద్యాసాగర్‌రావుతో విడివిడిగా భేటీ అయ్యారు. తనకు మద్దతిస్తున్న ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన పత్రాలను సమర్పించిన శశికళ సీఎంగా ప్రమాణ స్వీకారానికి అవకాశం ఇవ్వాల్సిందిగా కోరారు. అంతకుముందే గవర్నర్‌ను కలిసిన పన్నీర్ సెల్వం తాను రాజీనామాను ఉపసంహరించుకుంటానని, మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు తనకే ఉందని, శాసనసభలో బలపరీక్షకు తనకు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. వారిద్దరి వాదనలనూ సావధానంగా విన్న విద్యాసాగర్‌రావు నిర్ణయం ప్రకటించకుండా మరింత ఉత్కంఠకు తెరలేపారు. తాజా పరిణామాలు, తన అభిప్రాయాలతో ఆయన గురువారం రాత్రి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపారు. గవర్నర్ ఏం నివేదిక పంపారు? కేంద్రం ఏ మార్గదర్శనం చేస్తుంది? గవర్నర్ నిర్ణయం ఏమిటి? తమిళనాడు కాబోయే ముఖ్యమంత్రి తలైవీ (నాయకురాలు)నా? తలైవా (నాయకుడు)నా?... అనే ప్రశ్నలకు సమాధానంకోసం ప్రజలు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు శిబిరంలోని ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు శశికళ వర్గం, ఆకర్షించేందుకు పన్నీర్‌వర్గం ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. పన్నీర్ తన దూకుడును పెంచి శశికళను ఆత్మరక్షణలో పడేసేందుకు యత్నిస్తున్నారు. తమకు అవకాశం ఇవ్వకపోతే నేరుగా రాష్ట్రపతి ఎదుట ఎమ్మెల్యేలతో పరేడ్ నిర్వహించేందుకు శశికళ వర్గం ఏర్పాట్లు చేసుకుంటోంది. కేంద్రం ఆదేశాలతో గవర్నర్ జాప్యం చేయడం వల్లనే ఈ సంక్షోభం ఏర్పడిందని ఇప్పటికే విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఆయన కూడా ఈ వివాదాన్ని ఇంకెంతోకాలం పొడిగించలేరని, 2, 3 రోజుల్లో నిర్ణయాన్ని ప్రకటించక తప్పదని... సంక్షోభానికి సమాధానం దొరుకుతుందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. తమ వాదనలు వినిపించిన పన్నీర్, శశికళ తనకు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేలతో పరేడ్ నిర్వహించడానికి సమయం ఇవ్వాలని శశికళ బుధవారమే గవర్నర్‌ను ఫోన్లో కోరారు. ఆపద్ధర్మ సీఎం పన్నీర్ సెల్వం కూడా తన వాదన వినిపించేందుకు సమయం అడిగారు. అయితే గురువారం మధ్యాహ్నం వరకు గవర్నర్ ఇద్దరికీ సమయం కేటాయించలేదు. ఈలోపే ఆయన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గిరిజా వైద్యనాథన్, డీపీజీ రాజేంద్రన్‌తో తాజా పరిణామాల గురించి వివరాలు తెలుసుకున్నారు. గవర్నర్‌ను కలిసేందుకు సాయంత్రం ఐదు గంటలకు పన్నీర్ సెల్వంకు, రాత్రి ఏడు గంటలకు శశికళకు సమయం కేటాయిస్తున్నట్లు గురువారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో రాజ్ భవన్ వర్గాలు వారికి సమాచారం అందించాయి. అయితే ఆ తర్వాత శశికళ అపాయింట్మెంట్ను రాత్రి 7:30కి మార్చారు. ఎమ్మెల్యేలతో కాకుండా ఐదారుమందితోనే రావాలని రాజ్‌భవన్ నుంచి వచ్చిన వర్తమానం శశికళను నిరుత్సాహానికి గురి చేసింది. గవర్నర్ గురువారం సాయంత్రం 4 గంటలకు రాజ్‌భవన్‌కు చేరుకున్న వెంటనే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీతో తాజా పరిస్థితులపై చర్చించారు. అనంతరం పన్నీర్‌తో 20 నిమిషాలు, శశికళతో 30 నిమిషాలు గవర్నర్ భేటీ అయ్యారు. శశికళ మద్దతుదారులు తనతో బలవంతంగా రాజీనామా లేఖపై సంతకం చేయించారని పన్నీర్ గవర్నర్‌కు తెలిపారు. . నిర్బంధం నుంచి ఎమ్మెల్యేలు బయటపడితే తనకే మద్దతిస్తారని, అసెంబ్లీలో బల నిరూపణకు అవకాశమివ్వాలని కోరారు. మరోవైపు మెజారిటీ ఎమ్మెల్యేల నిర్ణయం ప్రకారం ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి తనకు అవకాశం ఇవ్వాలంటూ శశికళ ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన పత్రాలను సమర్పించారు. వారిద్దరి వాదనలూ ఆలకించిన గవర్నర్ తాను అన్ని కోణాల్లో పరిశీలించి నిర్ణయం తీసుకుంటానని చెప్పి పంపారు. అయితే రాజ్‌భవన్ లోపల నుంచి బయటకు రాగానే అంతా మంచే జరుగుతుందని పన్నీర్ సెల్వం ధీమా వ్యక్తం చేయడం... శశికళ చిరునవ్వు లేకుండా బయటకు రావడం, మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించడం êంటి దృశ్యాలు అనేక రకాల చర్చలకు దారి తీశాయి. కేంద్రంతో పోరాటానికి శశికళ సిద్ధం రాజ్యాంగాన్ని కాపాడాల్సిన గవర్నర్ కేంద్ర ప్రభుత్వం మాట విని పన్నీర్ సెల్వంకు బలపరీక్షకు అవకాశం ఇచ్చినా, తనతో పదవీ ప్రమాణ స్వీకారం చేయించకుండా వాయిదా వేసినా కేంద్ర ప్రభుత్వం మీద దండ యాత్ర చేయాలని శశికళ శిబిరం నిర్ణయించింది. శుక్రవారం సాయంత్రం వరకు వేచి చూసి గవర్నర్ నిర్ణయం తమకు అనుకూలంగా లేకపోతే ఎమ్మెల్యేలతో ఢిల్లీకి వెళ్లి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఎదుట పరేడ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. బుధవారం రాత్రే 20 మంది ఎంపీలు ఢిల్లీకి చేరుకున్నారు. గవర్నర్ ఏం చేస్తారో! తమిళనాడులో అన్నా డీఎంకేను తన గుప్పిట్లో పెట్టుకోవడానికి ప్రధాని మోదీ పన్నీర్‌తో నాటకం ఆడిస్తున్నారని శశికళ మద్దతుదారులు ఇప్పటికే బహిరంగంగా ఆరోపణలు చేశారు. అయితే ఈ వివాదంతో తమకు ఎలాంటి సంబంధం లేదని తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలు తమిళిసై సౌందర్ రాజన్, కేంద్రమంత్రి వెంకయ్య వివరణా ఇచ్చారు. ఈ నేపథ్యంలో గవర్నర్ విద్యాసాగర్ రావు రాష్ట్ర రాజకీయ పరిణామాలపై కేంద్రానికి నివేదిక పంపడం మరో వివాదానికి దారి తీసే పరిస్థితి కనిపిస్తోంది. రాజ్యాంగం ప్రకారం అయితే గవర్నర్ శశికళతో పదవీ ప్రమాణ స్వీకారం చేయించాలి. అక్రమాస్తుల కేసులో ఆమెకు ఇంకా శిక్ష పడనందువల్ల ఆమెను సీఎం చేయడానికి అడ్డంకి కాదని న్యాయ నిపుణులు చెబుతున్నారు. కానీ అదే కేసును బూచిగా చూపి కేంద్రం ఆమెను వేచి చూడాలని చెప్తే.. పన్నీర్‌కు పరోక్షంగా కొండంత మేలు చేసినట్లు అవుతుంది. ఈ సమయంలోపు శశికళ శిబిరంలోఉన్న ఎమ్మెల్యేలను తన వైపునకు తిప్పుకోవడానికి పన్నీర్‌కు అవకాశం లభిస్తుంది. లేదా పన్నీర్ సెల్వంకు బలపరీక్షకు అవకాశం ఇచ్చినా శశికళ తన శిబిరాన్ని కాపాడుకోవడం కష్టమే. ఏ విధంగానైనా పన్నీర్‌కు తగినంత మద్దతు వచ్చేంతవరకూ ఈ సందిగ్ధతను గవర్నర్ సాగదీయవచ్చన్న వాదనలు వినిపిస్తున్నాయి. అందుకు తగ్గట్టు గానే పన్నీర్ దూకుడు పెంచారు. ప్రభుత్వంతో పాటు పార్టీని హస్తగతం చేసుకునే దిశగా వ్యూహాలు రచిస్తున్నారు. శశికళ విధేయులుగా ముద్రపడిన వారిమీద వేటు వేస్తూ, ఆమె వ్యతిరేకులైన ఇద్దరు ఐఏఎస్‌లపై ఉన్న సస్పెన్షన్‌ను ఎత్తివేస్తూ స్పష్టమైన సంకేతాలు పంపిస్తున్నారు. దీంతోపాటు చిన్నమ్మ నివాస ముంటున్న పోయెస్ గార్డెన్‌ను జయలలిత స్మారకభవనంగా ప్రకటించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయాలన్నీ శశికళను ఆత్మరక్షణలో పడేశాయి. వీడని ఉత్కంఠ పోయెస్ గార్డెన్లో ఆదివారం మధ్యాహ్నం పన్నీర్ సెల్వంతో సీఎం పదవికి రాజీనామా చేయించడం, వెనువెంటనే చిన్నమ్మ శశికళను శాసనసభా పక్ష నాయకురాలిగా ఎన్నుకోవడం చక చకా జరిగిన విషయం తెలిసిందే. ప్రమాణ స్వీకారం కోసం శశికళ గవర్నర్‌ను సంప్రదించడం, ఊటీలో విహార యాత్రలో ఉన్న ఆయన చెన్నైకి రాకుండా నేరుగా ఢిల్లీ వెళ్లడంతో రాజకీయం వేడెక్కింది. ఈలోపే మంగళవారం రాత్రి పన్నీర్ సెల్వం తిరుగుబాటు జెండా ఎగుర వేయడంతో తమిళనాడు రాజకీయాలు వేగంగా మలుపులు తిరిగాయి. రాష్ట్రంలో పాలనాపరమైన సంక్షోభం ఏర్పడినా గవర్నర్ చెన్నైకి రాకుండా ముంబైలో ఉండిపోవడం రాజకీయ దుమారం రేపింది. ప్రధాని మోదీ మీద, గవర్నర్ విద్యాసాగర్‌రావు మీద ప్రత్యక్ష యుద్ధానికి దిగేందుకు శశికళ తనకు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేలతో రాష్ట్రపతి వద్దకు వెళ్లే ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ విషయం గుర్తించిన గవర్నర్ గురువారం తన చెన్నై పర్యటనను అధికారికంగా వెల్లడించారు. ఆయన చెన్నైకి చేరుకుని పన్నీర్, శశికళతో చర్చించాక వెంటనే ఈ వివాదానికి తెర దించుతారని రాజకీయ వర్గాలు, ప్రజలు భావించారు. అయితే గవర్నర్ ఈ వివాదానికి కేంద్ర ప్రభుత్వం నుంచి పరిష్కారం కోరడంతో అన్నా డీఎంకే రాజకీయ సంక్షోభానికి తెర దిగలేదు. గవర్నర్ రాజ్యాంగ బద్ధంగా వ్యవహరిస్తారా? లేక కేంద్ర ప్రభుత్వం ఏం చెబితే అది చేసి తానూ రాజకీయ నాయకుడేనని చాటుకుంటారా? అని ప్రజలు ఎదురు చూస్తున్నారు. శాసనసభా పక్ష నాయకునిగా ఒకరిని ఎన్నుకున్నాక ప్రమాణస్వీకారాన్ని కేంద్రం తమ రాజకీయ ప్రయోజనాలకోసం వ్యూహాత్మకంగా జాప్యం చేయడమే సంక్షోభానికి కారణమని న్యాయవాది, బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుబ్రమణ్యస్వామి వ్యాఖ్యానించారు. వీళ్ల రాజకీయ లక్ష్యాన్ని నెరవేర్చుకునే సాధనలో భాగంగానే అక్రమాస్తుల కేసులో సుప్రీంకోర్టు తీర్పు, ప్రజల మనోభావాలను సాకుగా చూపుతున్నారని విశ్లేషకులు విమర్శిస్తున్నారు. ఇది భవిష్యత్తులోవిపరిణామాలకు దారితీయవచ్చని, తమకు నచ్చని వారిని అడ్డుకోవడానికి గవర్నర్‌ను ఓ సాధనంలా వాడుకునే దుస్సంప్రదాయానికి దారితీయవచ్చని వారు హెచ్చరిస్తున్నారు. -
రొంబ రాజకీయం
-
తమిళ ప్రజల మాటేంటి?
తమిళనాడులో సంక్షోభానికి ఎవరు కారణమని భావించాలి?. జయలలిత మృతి తర్వాత అధికారం కోసం పాకులాడుతోందని అన్నాడీఎంకేలోని ఓ వర్గం వ్యాఖ్యానిస్తున్న శశికళనా? లేదా ప్రతిపక్షాలైన డీఎంకే, బీజేపీల అండదండలతో ఒక్కసారిగా ప్రజలు కోరితే ముఖ్యమంత్రి కావడానికి సిద్ధమంటూ శశికళను పన్నీరు సెల్వం వ్యతిరేకించారని చాలామంది నమ్ముతున్న మాటలనా?. తమిళనాట సంక్షోభానికి శశి, పన్నీరులు కారణం కాదు. అందుకు వేరే కారణం ఉంది. ఈ సంక్షోభానికి సగటు తమిళ ఓటరు మాత్రమే తెరదించగలడు. ముఖ్యమంత్రి పదవి కోసం ఓ వైపు పన్నీరు సెల్వం, శశికళలు ఇద్దరూ పావులు కదుపుతుండటంతో ప్రజల మాటను వినే వారు కరువయ్యారు. ఓ జాతీయ దినపత్రికలో ప్రచురించిన వివరాల ప్రకారం కొంతమంది అన్నాడీఎంకే మద్దతుదారులు మెరీనా బీచ్‌లోని అమ్మ సమాధి వద్దకు వచ్చారు. జయలలిత తమ నాయకురాలిగా ఉండాలనే ఆమెను ఎన్నుకున్నామని చెప్పారు. పన్నీరు సెల్వం, శశికళలను తాము గెలిపించుకోలేదని అన్నారు. ముఖ్యమంత్రి ఎవరు కావాలో తమను అడగాలని ఎమ్మెల్యేలను కాదని వ్యాఖ్యానించారు. కేవలం మూడు వాక్యాల్లో తమిళనాడును వేధిస్తున్న సమస్యను వారు చెప్పుకొచ్చారు. వారి మాటల్లో అప్రజాస్వామిక రాజకీయాలు సగటు తమిళుడిని వేధిస్తున్న విషయం స్పష్టంగా తెలుస్తుంది. ప్రజలు పన్నీరు సెల్వం, శశికళలలో ఎవరినీ ముఖ్యమంత్రిగా అంగీకరించడం లేదనే చెప్పుకోవాలి. సినీనటిగా మంచిపేరు తెచ్చుకున్న జయ.. రాజీయాల్లో ప్రవేశించి తనదైన శైలిలో రాజకీయ ప్రత్యర్ధులను, మీడియాను ఎదుర్కొని వివాద రహితంగా ఎదిగారు. ఎంజీఆర్ మరణం తర్వాత పార్టీ బాధ్యతలను స్వీకరించారు. ఆ తర్వాత ప్రభుత్వ పాలనలో జయకు అండగా నిలిచి, ఓ వెన్నుముకగా శశికళ రాజ్యాన్ని నడిపిందనే మాటలు కూడా ఉన్నాయి. అయితే, శశికళను తన వారసురాలిగా జయ ఎన్నడూ పేర్కొనలేదు. మరో వైపు అత్యవసర సమయాల్లో అమ్మ నుంచి పదవిని అందుకుని ఆదుకున్న పన్నీరు సెల్వానికి అంతగా ప్రజల్లో ప్రొఫైల్ లేదు. ఏళ్లుగా అత్తయ్య జయలలిత నుంచి దూరంగా ఉంటున్న మేనకోడలు దీపా జయకుమార్ తనను వారసురాలిగా ప్రకటించుకున్నా.. ఆమెను అనుభవ లేమి వెంటాడుతోంది. - ఓ సెక్యూలరిస్టు -
‘సెల్వంను ఎప్పుడూ సమర్థించలేదు’
చెన్నై: పన్నీర్ సెల్వంను తమ పార్టీ ఎప్పుడూ సమర్థించలేదని డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ తెలిపారు. అంశాలపరంగా మద్దతు ఇస్తున్నామని వెల్లడించారు. జయలలిత మరణంపై విచారణ జరపాలని పన్నీర్ సెల్వం నిర్ణయించడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. పన్నీర్ సెల్వం రాజీనామాకు ఒత్తిడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో శత్రుభావం చూపబోమని, ప్రభుత్వం సవ్యంగా నడిచేందుకు సహరిస్తామని చెప్పారు. రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు గవర్నర్ విద్యాసాగరరావు చొరవ చూపాలని కోరారు. ‘గవర్నర్ వెంటనే శాసనసభను సమావేశపరచాలి. లేకుంటే ఏ పార్టీకి మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు ఉందో చూడాల’ని స్టాలిన్ సూచించారు. ప్రస్తుత సంక్షోభం వెనుక డీఎం హస్తం ఉందని, స్టాలిన్ తో పన్నీరు సెల్వం రహస్య మంతనాలు సాగిస్తున్నారని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ నటరాజన్ అంతకుముందు ఆరోపించారు. -
ఔనా! నిజమా! కేరళ సీఎం పన్నీర్ సెల్వం!
'కేరళ ముఖ్యమంత్రి శ్రీ పన్నీర్ సెల్వం, ఆయన అధికార బృందంతో భేటీ అయ్యాను' అంటూ ఏకంగా కేంద్రమంత్రి ట్వీట్ చేయడంతో నెటిజన్లు బిత్తరపోయారు. తమిళనాడు ముఖ్యమంత్రి, జయలలిత వీరవిధేయుడైన పన్నీర్ సెల్వం కేరళకు ఎప్పుడు ముఖ్యమంత్రి అయ్యారంటూ తికమకపడ్డారు. కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ, వినియోగదారు వ్యవహారాల మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ ఇలా పొరపాటున ట్వీట్ చేశారు. కేరళ సీఎం పినరయి విజయన్ ఆయనను కలువగా.. పాశ్వాన్ మాత్రం తనను కలిసింది కేరళ సీఎం పన్నీర్‌సెల్వం అంటూ పోస్టు చేశారు. కేంద్రమంత్రి అయి ఉండి ఆయన ఇలా పొరపాటు చేయడంపై నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు ఎక్కుపెట్టారు. పాశ్వాన్ రాహుల్ గాంధీతో పోటీపడుతున్నారా? అంటూ సెటైర్లు వేశారు. తాను స్వయంగా ఎవర్ని కలిసింది కూడా ఆయనకు తెలియకపోతే ఎవరు మాత్రం ఏం చేస్తారు అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశారు. ఈ క్రమంలో పొరపాటును గుర్తించిన పాశ్వాన్ పాత ట్వీట్‌ను డిలీట్ చేసి.. కేరళ సీఎం పినరయి విజయన్ అంటూ కరెక్ట్ పోస్టుపెట్టారు. -
దీపా కోసం ప్రయత్నాలు ముమ్మరం
– పోటెత్తుతున్న అభిమానం – రాజకీయాల్లోకి రావాలని ఒత్తిడి చెన్నై : జయలలిత మేన కోడలు దీపాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి దించేందుకు తగ్గ ప్రయత్నాలు వేగవంతమయ్యాయి. అన్నాడీఎంకే అసంతప్తి నాయకులు, ద్వితీయ, తృతీయ శ్రేణి కేడర్ టీ నగర్‌లోని దీపా ఇంటి వద్దకు పోటెత్తుతున్నారు. తన కోసం వస్తున్న వాళ్లను ఆప్యాయంగా నమస్కరిస్తూ దీపా పలకరించి ఓపిక పట్టాలని సూచిస్తున్నారు. దివంగత సీఎం జయలలిత మేన కోడలు దీపా తమిళ రాజకీయాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారుతున్నారు. మేనత్త జయలలితను తలపించే రీతిలో ఆమె వ్యాఖ్యలు, హావాభావాలు ఉన్నాయని చెప్పవచ్చు. ఇక, మీడియాతో ఆమె స్పందించే తీరులో జయలలిత పోలికలు కొట్టొచ్చినట్టు కన్పిస్తున్నాయని చెప్పవచ్చు. మేనత్త వారసురాలు తానేనని, రాజకీయాల్లో వస్తానని ఇప్పటికే దీపా స్పందించారు. అన్నాడీఎంకేలో సాగుతున్న రాజకీయ పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్న దీప, ఎప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారోనని ఎదురు చూసే వాళ్లూ ఉన్నారు. చిన్నమ్మ శశికళ ప్రధాన కార్యదర్శి పగ్గాలు చేపట్టడాన్ని అన్నాడీఎంకేలోని ద్వితీయ, తృతీయ శ్రేణి కేడర్ అనేక చోట్ల వ్యతిరేకిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. ఈ కేడర్ దృష్టి ప్రస్తుతం దీపా వైపుగా మళ్లి ఉంది. ఇప్పటికే దీపా పురట్చి మలర్ పేరవై తిరుచ్చి వేదికగా ఏర్పాటు కావడం, అమ్మ డీఎంకే చెన్నై వేదికగా నామకరణం జరగడం వెరసి, ప్రత్యక్ష రాజకీయాల్లోకి దీపాను ఆహ్వానించేందుకు తగ్గ ఒత్తిడి పెరుగుతున్నదని చెప్పవచ్చు. పోటెత్తుతున్న అభిమానం : టీనగర్‌లోని శివజ్ఞానం రోడ్డులో ఉన్న దీపా ఇంటి వద్దకు అభిమాన లోకం పోటెత్తుతున్నారు. రెండు రోజుల నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి కూడా అన్నాడీఎంకే అసంతప్తి వాదులు పెద్ద సంఖ్యలో దీపా ఇంటి వైపుగా కదులుతుండడం గమనించాల్సిన విషయం. వచ్చిన వాళ్లందరూ పురట్చి తలైవీ జిందాబాద్ అంటూ అమ్మ నామస్మరణతో నినాదాలిస్తూ మర్మోగిస్తున్నారు. అభిమానం తాకిడి క్రమంగా పెరుగుతుండడంతో అందర్నీ ఆప్యాయంగా దీపా పలకరిస్తూ వస్తున్నారు. ఇంటి వద్దకు వచ్చే వారిని నమస్కరిస్తూ, ఓపిక పట్టాలని సూచిస్తున్నారు. ఇక, వచ్చిన వాళ్లందరి పేర్లు, చిరునామాలతో కూడిన వివరాల సేకరణకు పుస్తకాల్ని సైతం అక్కడ ఉంచడం గమనార్హం. మంగళవారం మూడు పుస్తకాల నిండా అభిమాన చిరునామాలు నిండడం విశేషం. ఇక, ఆర్కే నగర్ నుంచి ఎన్నికల బరిలో దిగాలని కొందరు నినదిస్తుంటే, మరి కొందరు త్వరితగతిన రాజకీయల్లో రావాలని, అమ్మ ఆశయ సాధనకు నడుం బిగించాలని నినదిస్తున్నారు. -
బాధతోనే బాధ్యతలు
అత్యంత ఉత్సాహంగా, ఉల్లాసంగా, సంతోషంగా సాగాల్సిన సీఎం ప్రమాణ స్వీకారోత్సవం... చెమ్మగిల్లిన కళ్లు, బరువెక్కిన హృదయాల మధ్య కన్నీటితో సాగింది. అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత లేకుండా ఆ పార్టీ తరపున కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో పన్నీర్‌సెల్వం కూడా విలపిస్తూ ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తరువాత ప్రమాణం చేసిన మంత్రులందరూ కూడా కన్నీటిని ఆపులేకపోవడం గమనార్హం. సోమవారం జరిగిన ఈ కార్యక్రమం మొత్తం ఎక్కడా ఎలాంటి సందడి లేకుండా నిరాడంబరంగా ముగిసింది. చెన్నై, సాక్షి ప్రతినిధి: అది చెన్నైలోని సచివాలయం... సోమవారం ఉదయం 10 గంటలు... శాసన సభాపక్ష నేతగా ఎన్నికైన ఓ పన్నీర్ సెల్వం నేతృత్వంలో అధికార పార్టీ ఎమ్మెల్యేల సమావేశం... తరువాత రాజ్‌భవన్‌లో ముఖ్యమంత్రిగా ప్రమాణం... అక్కడా, ఇక్కడా ఎలాంటి సందడి లేదు. ఎమ్మెల్యేల్లో ఉత్సాహం లేదు... చెమ్మగిల్లిన కళ్లు, బరువెక్కిన హృదయాలు... అమ్మ లేకుండా ఆ పార్టీ కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసే ముందు సాక్షాత్కరించిన దృశ్యాలు ఇవి. సోమవారం మధ్యాహ్నం 1.25 గంటలకు ముఖ్యమంత్రిగా పన్నీర్‌సెల్వం, ఆ తరువాత మంత్రులుగా మరో 30 మంది ప్రమాణం చేశారు. గవర్నర్ కే రోశయ్య వారిచేత ప్రమాణ స్వీకారం చేయించారు. 18 ఏళ్లుగా నడుస్తున్న ఆదాయానికి మించి ఆస్తుల కేసులో జయకు నాలుగేళ్ల జైలు శిక్ష ఖరారు కాగానే అన్నాడీఎంకే శ్రేణులు శోకసంద్రంలో మునిగిపోయాయి. కన్నీళ్ల మాటునే జయ స్థానంలో మరో ముఖ్యమంత్రిని కూర్చోబెట్టాల్సిన సంకటస్థితి. అత్యంత కష్టమైనా అమ్మ ఆదేశాలతో తప్పలేదు. అన్నాడీఎంకే శాసనసభా పక్ష నేతగా ఎన్నికైన ఓ పన్నీర్‌సెల్వం ఆదివారం రాత్రి గవర్నర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానం అందుకున్నారు. ఎప్పుడు ప్రమాణం చేస్తారన్న విషయం సోమవారం మధ్యాహ్నం వరకు ప్రకటించలేదు. రాష్ట్రంలో అధికార, ప్రతిపక్షాలు, మీడియా ప్రతినిధులు సైతం పడిగాపులు కాస్తున్నారు. ఆలస్యం అయ్యే కొద్దీ రకరకాల పుకార్లు బయలుదేరాయి. రాజ్‌భవన్‌లో మరో 15 నిమిషాల్లో ప్రమాణ స్వీకారం అంటూ మధ్యాహ్నం 12.45 గంటలకు ప్రకటించారు. అంతే ఒక వైపు అన్నాడీఎంకే శ్రేణులు, మరోవైపు మీడియా గవర్నర్ బంగ్లా వైపు పరుగులు తీయూల్సి వచ్చింది. అయితే అక్కడ నో ఎంట్రీ బోర్డు పెట్టారు. జయ జైలులో ఉన్న ఈ ఉద్విగ్న పరిస్థితుల్లో అట్టహాసంగా ప్రమాణ స్వీకారం చేయడం లేదని రాజ్‌భవన్ వర్గాలు ప్రకటించాయి. మధ్యాహ్నం 1 గంటకు కాబోయే సీఎం కాన్వాయ్ రాజ్‌భవన్‌కు చేరుకుంది. బరువెక్కిన హృదయంతో గవర్నర్ బంగ్లాకు చేరుకున్న పన్నీర్‌సెల్వం ముఖ్యమంత్రిగా, మరో 30 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం అయిందనిపించారు. రాజ్‌భవన్‌లో ఏర్పాట్లు సైతం నిరాడంబరంగా సాగాయి. క న్నీటితోనే ప్రమాణస్వీకారం అత్యంత ఉత్సాహంగా, సంతోషంగా సాగాల్సిన ప్రమాణస్వీకారం కన్నీటి మాటున ముగిసింది. ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం మొదలుకుని మిగిలిన వారందరూ కన్నీటితోనే తమ ప్రమాణ పత్రాన్ని చదివారు. పన్నీర్‌సెల్వం, మంత్రులు గోకుల ఇందిర, వలర్మతి తదితరులు వెక్కివెక్కి ఏడుస్తూనే ముగించారు. కార్యక్రమానికి కొద్ది సంఖ్యలో ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు హాజరయ్యూరు. ప్రమాణ స్వీకారం ముగిసిన కొద్దిసేపటికే జయ ఆశీర్వాదం పొందేందుకు సీఎం పన్నీర్‌సెల్వం, కొద్దిమంది తన మంత్రివర్గ సహచరులతో విమానంలో బెంగళూరుకు వెళ్లారు. కొత్త క్యాబినెట్లో మంత్రులు వీరే పన్నీర్ సెల్వం క్యాబినెట్లో మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన 30 మంది జయ పాలనలోని శాఖల్లోనే కొనసాగుతున్నారు. నత్తం విశ్వనాథన్ , వైద్యలింగం, ఎడప్పాడి కె.పళణిస్వామి, పి.మోహన్, బి.వలర్మతి, పి.పళణియప్పన్, కె.రాజు, ఆర్.కామరాజ్, పి.తంగమణి, వి.సెంథిల్ బాలాజీ, ఎం.సి.సంపత్, ఎస్.ఎస్.కృష్ణమూర్తి, ఎస్.పి.వేలుమణి, టి.కె.ఎన్.చిన్నయ్య, ఎస్.గోకుల ఇందిరా, ఎస్.సుందర్రాజ్, పి.సెందూర్ పాండియన్, ఎస్.పి.షణ్ముగనాధన్, ఎన్.సుబ్రహ్మణియన్, కె.ఎ.జయపాల్, ఎన్.సుబ్రహ్మణియన్, ఆర్.బి.ఉదయకుమార్, కె.టి.రాజేంద్ర బాలాజీ, బి.వి.రమణ, కె.సి.వీరమణి, ఎం.ఎస్.ఎం ఆనందన్, తోప్పు, టి.పి.పొన్నాచ్చి, ఎస్.అబ్దుల్ రహీం, సి.విజయభాస్కర్ తదితరులు ప్రమాణ స్వీకారం చేశారు. ఆత్మహత్యలు, ఆందోళనలు అమ్మ జైలుకెళ్లినా కొద్దిరోజుల్లోనే తిరిగొస్తారు, ప్రజలందరినీ ఆశీర్వదిస్తారు, గతంలో చూశాం కదా. అమ్మ తనపై సాగిన కుట్రలన్నింటినీ ఛేదించుకుని మళ్లీ సీఎం పీఠంపై కూర్చుంటారురూ.రూ.. ఇదీ తమిళనాడులో అమ్మను ఆరాధించే ప్రజల నమ్మకం. అన్నాడీఎంకే శ్రేణుల విశ్వాసం. మనసుకు సమాధానం చెప్పుకుని గుండెను దిటవు చేసుకోలేక ఈ మూడురోజుల్లో సుమారు 20 మంది ప్రాణాలు వదిలారు. కొందరు ఒంటికి నిప్పు అంటించుకోగా, మరికొందరు ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నారు. ఇళ్లలో కూర్చుని టీవీలు చూస్తూ మరి కొందరు గుండెపోటుకు గురై మృతి చెందినట్లు సమాచారం. కన్యాకుమారి జిల్లాలో గణపతి (44) అనే అన్నాడీఎంకే కార్యకర్త తన ఇంటికి సమీపంలో రోడ్డుపై ఇనుపకమ్ములతో జైలు వంటి గదిని నిర్మించుకుని ఆమరణ నిరాహారదీక్షను ప్రారంభించాడు. జయ జైలు నుంచి విడుదలయ్యే వరకు తాగునీరు మినహా ఆహారం ముట్టనని ప్రకటించాడు.