చెన్నై : అన్నాడీఎంకే అధినేత్రి జయలలితను తోసేశారని మాజీ స్పీకర్ పీహెచ్ పాండియన్ సంచలన వ్యాఖ్యలను మరవకముందే తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం కూడా అమ్మ మృతిపై అనుమానాలు వ్యక్తం చేశారు. జయలలిత మృతిపై న్యాయ విచారణ జరిపించాలంటూ ఆయన త్వరలో దీక్షకు దిగనున్నారు. జయలలిత మృతిపై అనుమానాలు ఉన్నాయని, వాటిపై విచారణ జరిపించాలని పన్నీర్ సెల్వం డిమాండ్ చేశారు.
కాగా గతనెల 5న పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దాంతో ఆయన స్థానంలో ఎంకే శశికళను అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు తమ నాయకురాలిగా ఎన్నుకున్నారు. అయితే రెండు రోజుల తర్వాత (ఫిబ్రవరి 7న) రోజు శశికళపై పన్నీర్ సెల్వం తిరుగుబాటు చేశారు. గవర్నర్ శశికళతో ప్రమాణ స్వీకారం చేయించకపోవడంతో దాదాపు రోజుల పాటు సంక్షోభం కొనసాగింది. సీఎం కుర్చీ చివరకు శశికళ, పన్నీర్ సెల్వం దక్కలేదు. అనూహ్యంగా పళనిస్వామి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు.
Paneerselvam, jayalalithaa death, sasikala, paneer deeksha, పన్నీర్ సెల్వం, జయలలిత మృతి, శశికళ, పన్నీర్ దీక్ష
పన్నీర్ సెల్వం దీక్ష
Published Fri, Mar 3 2017 12:51 PM | Last Updated on Tue, Sep 5 2017 5:06 AM
Advertisement