Jayalalithaa Death
-
తాటాకు చప్పళ్లకు భయపడే ప్రసక్తే లేదు: చిన్నమ్మ
సాక్షి, చెన్నై: తాను ఎంజీఆర్, జయలలితలను ఆదర్శంగా తీసుకుని రాజకీయాల్లోకి వచ్చానని, రాజకీయంగా తనను అడ్డుకోలేరని చిన్నమ్మ శశికళ అన్నారు. తాటాకు చప్పళ్లకు తాను భయపడే ప్రసక్తే లేదన్నారు. దివంగత సీఎం జయలలిత మృతి మిస్టరీపై జస్టిస్ ఆర్ముగస్వామి కమిషన్ సమరి్పంచిన నివేదిక రెండు రోజుల క్రితం అసెంబ్లీకి చేరిన విషయం తెలిసిందే. ఇందులోని అంశాలన్నీ జయలలిత నెచ్చెలి, చిన్నమ్మ శశికళ చుట్టూ తిరుగుతుండడం గమనార్హం. ఆమెతో పాటు మాజీ సీఎస్ రామ్మోహన్రావు, మాజీ మంత్రి విజయభాస్కర్ సహా ఏడుగురి వద్ద సమగ్ర విచారణకు కమిషన్ సిఫార్సు చేసింది. ప్రధానంగా అమ్మ మృతి మిస్టరీని కమిషన్ విచారణలో తేలనప్పటికీ, శశికళను టార్గెట్ చేస్తూ పేర్కొన్న అంశాలు చర్చకు దారి తీశాయి. ఆమెను విచారణలోకి తెచ్చేందుకు ప్రత్యేక సిట్‌పై ప్రభుత్వం దృష్టి పెట్టనుంది. ఈ విషయంపై న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో తనకు వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రలు, వ్యూహాలపై శశికళ స్పందించారు. శుక్రవారం మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. డీఎంకేది కక్షసాధింపు ధోరణి డీఎంకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినానంతరం అన్ని వర్గాల ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారని ఆరోపించారు. రైతులు కన్నీటి మడుగులో మునిగి ఉన్నారని, విద్యుత్ చార్జీల పెంపు, ఆస్తి పన్ను, వాట ర్ట్యాక్స్ పెంపుతో పేద, మధ్య తరగతి వర్గాలు తీవ్ర ఆర్థిక భారాన్ని మోయాల్సిన పరిస్థితి నెలకొందని అన్నారు. వర్షాల రూపంలో గ్రామాలు నీట మునిగాయని, వాటి గురించి పట్టించుకోవడం లేద ని ధ్వజమెత్తారు. ప్రభుత్వంపై వస్తున్న విమర్శలు, ఆరోపణలు పక్కదారి పట్టించేందుకు తనను ఈ పాలకులు టార్గెట్ చేశారని మండిపడ్డారు. ప్రజా సమస్యలు ఎలా పరిష్కరించాలో తెలియక ఈ పాలకులు తికమక పడుతున్నారని విమర్శించారు. తాను ఈ పాలకులను ప్రశి్నస్తూనే ఉంటానని, ప్రజల సమస్యలు ఎత్తి చూపిస్తూనే ఉంటానని స్పష్టం చేశారు. తాను దివంగత నేతలు ఎంజీఆర్, జయలలిత మార్గంలో రాజకీయాల్లోకి వచ్చానని, కాకమ్మ బెదిరింపులు, తాటాకు చప్పుళ్లకు భయపడే ప్రసక్తేలేదన్నారు. డీఎంకే ప్రభుత్వం పతనం లక్ష్యంగా, తమిళ ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తానని స్పష్టం చేశారు. నిందితులను శిక్షించాలి ఆర్ముగస్వామి కమిషన్ నివేదికలో పేర్కొన్న అంశాలపై జయలలిత మేనకోడలు దీపా స్పందించారు. రాజకీయ స్వలాభం కోసం మేనత్త జయలలితకు శశికళ సరైన వైద్యం అందించలేదని ఆరోపించారు. ఈ వ్యవహారంపై తమిళనాడు ప్రభుత్వం విచారణను వేగవంతం చేయాలని కోరారు. జయలలిత మరణం వెనుక ఎవరెవరు ఉన్నారో, ఎందరికి సంబంధాలు ఉన్నాయో వెలుగులోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని దీపా కోరారు. -
జయలలిత మరణంపై న్యాయ విచారణ
►అమ్మ మరణంపై జ్యుడీషియల్ విచారణ.. ►శశికళ, దినకరన్‌కు పళనిస్వామి చెక్.. ►త్వరలో ఒకటికానున్న ఓపీఎస్, ఈపీఎస్ వర్గాలు సాక్షి, చెన్నై: తమిళనాడు రాజకీయాలలో సంచలన పరిణామం చోటుచేసుకుంది. అన్నాడీఎంకే అధినేత్రి, దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణంపై తమిళనాడు ప్రభుత్వం న్యాయ విచారణకు ఆదేశించింది. అలాగే పొయెస్ గార్డెన్స్‌లోని జయ నివాసమైన వేద నిలయాన్ని జయలలిత స్మారక చిహ్నంగా మారుస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు ముఖ్యమంత్రి పళనిస్వామి గురువారం కీలక నిర్ణయం తీసుకున్నారు. జయలలిత మరణంపై నెలకొన్న సందేహాలపై విచారణ జరపడానికి రిటైర్డ్ న్యాయమూర్తి నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేస్తున్నామని పళనిస్వామి తెలిపారు. ఆ కమిటీ విచారణ జరిపి త్వరలో నివేదిక సమర్పిస్తుందని ఆయన పేర్కొన్నారు. కాగా జయలలిత మరణం అనుమానాస్పదమేనని, అపోలో ఆసుపత్రిలో అడ్మిట్కాక ముందే కుట్ర జరిగిందని అన్నాడీఎంకే నేతలు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అలాగే ‘అమ్మ’ మృతిపై అనుమానం ఉందని, దీని గురించి న్యాయ విచారణ జరపాలంటూ మాజీ సీఎం పన్నీర్ సెల్వం కూడా డిమాండ్ చేశారు. కాగా అన్నాడీఎంకేలో అమ్మ, పురట్చి తలైవి శిబిరాలు విలీనం అవుతున్నట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో పళినిస్వామి తాజా నిర్ణయంతో శశికళ, దినకరన్‌కు చెక్ పెట్టినట్లు అయింది. మరోవైపు అన్నాడీఎంకేలో రెండు వర్గాల విలీనానికి పన్నీర్ సెల్వం పెట్టిన డిమాండ్లను పళినిస్వామి ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తున్నారు. ఇటీవలే దినకరన్‌ను పార్టీ పదవుల నుంచి తొలగించారు కూడా. తాజా సంకేతాలతో ఓపీఎస్, ఈపీఎస్ వర్గాలు త్వరలో ఒకటి కానున్నాయి. ఇక జయ మరణంపై న్యాయ విచారణకు ఆదేశించడాన్ని పన్నీర్ సెల్వం స్వాగతించారు. కాగా జయలలితకు సరైన చికిత్స అందినట్లు సీఎం పళనిస్వామి ఇప్పటివరకూ చెప్పారని, అకస్మాత్తుగా విచారణకు ఎందుకు ఆదేశించారని డీఎంకే ప్రశ్నించింది. కాగా జయలలిత గత ఏడాది సెప్టెంబరులో హఠాత్తుగా అస్వస్థత గురి అయ్యారు. సుమారు 70 రోజులకు అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ డిసెంబర్ 5న హఠాత్తుగా మృతి చెందారు. -
జయలలిత మరణంపై జ్యుడీషియల్ విచారణ
-
రజనీకాంత్ లేట్‌గానైనా లేటెస్ట్గా వస్తారా?
‘నేను ఎప్పుడు, ఎలా వస్తానో ఎవరికి తెలియదు. కానీ సరైన సమయంలోనే వస్తాను’. ఇది 1995లో వచ్చిన ‘ముత్తు’ సినిమాలో సూపర్ స్టార్ రజనీకాంత్ చెప్పిన పంచ్ డైలాగ్. రాజకీయాల్లోకి ఎప్పుడు.. ఎలా రావాలో అన్న ఆయన సందిగ్ధావస్థకు కూడా ఈ డైలాగే సమాధానం. ఆయన గత 21 ఏళ్లలో అనేకసార్లు తాను రాజకీయాల్లోకి రానున్నట్లు సంకేతాలు వదిలారు. కానీ రాలేకపోయారు. ఆయన సంకేతాలు ఇచ్చినప్పుడల్లా మీడియా వాటికి విస్తృత ప్రచారాన్ని కల్పించడం, తమిళనాడు రాజకీయాలు కూడా కాస్త వేడెక్కడం, ఆ తర్వాత చప్పున చల్లారడం షరా మామూలుగా జరుగుతూ వచ్చింది. చెన్నైలో గురువారం జరిగిన తన అభిమానుల సమావేశంలో రజనీకాంత్ మాట్లాడుతూ తాను రాజకీయల్లోకి వస్తానన్న సంకేతాలిచ్చారు. రాష్ట్ర రాజకీయాలు కుళ్లిపోతున్నాయని, వాటిని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని, ఆ దేవుడు శాసిస్తే తాను రాజకీయల్లోకి వస్తానని చెప్పారు. ‘యుద్ధం కోసం నిరీక్షిస్తూ మీ విధులు మీరు నిర్వర్తిస్తూ వెళ్లండి’ అని కూడా అభిమానులకు పిలుపునిచ్చారు. అందులో యుద్ధమంటే ఎన్నికలని భావించవచ్చు. 67వ ఏట ఈసారి ఇచ్చిన ఈ సంకేతం నిజమయ్యే అవకాశాలు ఎక్కువే ఉన్నాయి. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మరణం తర్వాత ఏర్పడిన పరిస్థితులే అందుకు కారణం. జయలలిత ప్రాతినిధ్యం వహించిన అన్నాడీఎంకే పార్టీలుగా, వర్గాలుగా చీలిపోవడమే అందుకు కారణం. డీఎంకే కురువృద్ధ నాయకుడు ఎం.కరుణానిధి కూడా క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకోవడం కూడా రజనీ సొంత పార్టీ ఏర్పాటుకు కలిసొచ్చే అవకాశం. 1995లోనే ఆ ఆలోచన వచ్చిందా? నాటి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఉంటున్న ‘పోయెస్ గార్డెన్’ నివాసానికి సమీపంలోనే రజనీకాంత్ ఇల్లు ఉంది. ఓ రోజు జయలలిత వస్తున్నారని ఆ రోడ్డులో ట్రాఫిక్‌ను నిలిపివేశారు. దాదాపు గంటసేపు కారులోనే కూర్చుండిపోయిన రజనీకాంత్ చివరకు అసహనంతో కారు దిగి నడక ప్రారంభించారు. ఆయనకు మద్దతుగా అన్నట్లు ఎంతోమంది ప్రజలు కూడా ఆయన వెన్నంటి నడిచారు. అప్పుడే ఆయన కు రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన మొదటిసారి వచ్చిందేమో! ఆ తర్వాత కొన్ని నెలలకు ప్రముఖ దక్షిణాది దర్శకుడు మణిరత్నం ఇంటిపై దాడి జరిగింది (ఆయన బాంబే సినిమా విడులైన కొత్తలో). ఈ విషయమై రజనీకాంత్ మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతిభద్రతలు దారుణంగా ఉన్నాయని విమర్శించారు. దీనిపై మండిపడ్డ అన్నాడీఎంకే ఆయన్ని విమర్శస్తూ పోస్టర్లు వేసింది. ఈ నేపథ్యంలో 1996 ఎన్నికల్లో జయలలితను గెలిపిస్తే తమిళనాడును ఇక ఎవరూ రక్షించలేరని విమర్శించారు. ప్రతిపక్షాన్ని ఏకం చేసిందీ ఆయనే జయలలితను ఎలాగైనా ఓడించాలన్న ఉద్దేశంతో కరణానిధి నాయకత్వంలోని డీఎంకే, జీకే మూపనార్ నాయకత్వంలోని తమిళ్ మానిల కాంగ్రెస్ మధ్య ఎన్నికల పొత్తు కుదర్చడంలో రజనీకాంత్ కీలకపాత్ర పోషించారు. అప్పుడు డీఎంకే కూటమి ఘన విజయం సాధించింది. తాను పోటీచేసిన బర్గూర్ నియోజకవర్గంలో కూడా జయలలిత ఓడిపోయారు. అప్పటి డీఎంకే విజయానికి రజనీకాంత్ కారణమనే పేరు కూడా వచ్చింది. ఈ విషయాన్ని ఓసారి స్వయంగా రజనీకాంత్ కూడా చెప్పుకున్నారు. 1996లోనే సీఎం అయ్యే అవకాశం వచ్చింది 1996 ఎన్నికల్లో రాజకీయాల్లోకి వచ్చి జయలలితపై పోటీ చేయాలని రజనీకాంత్‌ను టీఎంసీ నాయకుడు మూపనార్ కోరారట. ముఖ్యమంత్రి పదవి కూడా ఇస్తామని చెప్పారట. ఈ విషయాన్ని రజనీకాంత్ గానీ, మూపనార్ గానీ బయటకు చెప్పలేదు. 1996లోనే ముఖ్యమంత్రి అయ్యే గొప్ప అవకాశాన్ని రజనీకాంత్ వదులుకున్నారని కేంద్ర మాజీ ఆర్థికమంత్రి పి. చిదంబరం ఓ మీడియా ఈవెంట్లో వ్యాఖ్యానించారు. అప్పట్లో మూపనార్‌కు చిదంబరం అత్యంత సన్నిహితుడు కనుక ఆయనకు మూపనార్ ఆఫర్ గురించి తెలిసే ఉంటుంది. రాజకీయ నేతలపై తరచూ విమర్శలు 1996 ఎన్నికల తర్వాత నుంచి రజనీకాంత్ తరచు రాజకీయాల గురించి మాట్లాడేవారు. రాజకీయ నేతలను విమర్శించేవారు. సినిమాల్లో రజనీకాంత్ ఎక్కువగా సిగరెట్లను తాగడాన్ని విమర్శించినందుకు పట్టల్ మక్కల్ కచ్చి నాయకుడు ఎస్ రామదాస్‌పై 2004లో రజనీ మండిపడ్డారు. పీఎంకేకు వ్యతిరేకంగా తన అభిమానులతోని ప్రచారం చేయిస్తానని కూడా ఆయన హెచ్చరించారు. రాజకీయాల్లోకి రానంటూ ఆయన ఎప్పుడూ చెప్పలేదు. 2014 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా నరేంద్ర మోదీ కూడా ఆయన్ని కలుసుకున్నప్పుడు కూడా రజనీ త్వరలోనే రాజకీయాల్లోకి రావచ్చనే ఊహాగానాలు వచ్చాయి. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి రజనీ మద్దతిచ్చారంటూ ఆ పార్టీ వర్గాలు ప్రచారం చేసుకున్నాయి. ఆ తర్వాత అలాంటిదేమీ లేదని రజనీ ఖండించారు. సినిమా ప్రమోషన్ల కోసమేనా? రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తానంటూ సంకేతాలివ్వడం, రాకపోవడం ఆయన సినిమాల ప్రమోషన్ల కోసమేనన్న విమర్శలు రజనీ కాంత్పైనా ఎక్కువగా ఉన్నాయి. దానికి కారణం ఆయన సినిమా విడుదలవడానికి ముందు సంకేతాలివ్వడం, సినిమా విడుదలయ్యాక రాజకీయాల ఊసెత్తకపోవడమే. రజనీకాంత్‌కు రాజకీయ, సామాజిక అంశాలపై కూడా నిశ్చితాభిప్రాయాలు లేవు. 1996లో ప్రతిపక్షాలను గెలిపించినదీ తానేనన్న ఆయన ఆ తర్వాత అదొక రాజకీయ యాక్సిడెంట్ అని వ్యాఖ్యానించారు. 2009లో శ్రీలంకలోని ‘ముళ్లైవైకల్’ ఊచకోత సంఘటనపై కూడా ఆయన నోరు విప్పకపోవడాన్ని తమిళ ప్రజలు తీవ్రంగా విమర్శించారు. కమల్ హాసన్ లాంటి వారు ఆ ఊచకోతను తీవ్రంగా ఖండించారు. కావేరీ జలాలపై కూడా ఆయనకు నిశ్చితాభిప్రాయం లేదు. కానీ తమిళ అభిమానులను దృష్టిలో పెట్టుకొని ఒక రోజు దీక్ష చేశారు. ఎంతైనా మహారాష్ట్రలో పుట్టి కర్ణాటకలో పెరిగినవాడు కదా! లేటెస్ట్గా వస్తారా.... ప్రస్తుతం తమిళనాడు రాజకీయాలకు రజనీకాంత్ లాంటి ఫ్యాన్‌ఫేర్ కలిగిన నాయకుడు కావాలి. జయలలిత మహాభినిష్క్రమణ, కరుణానిధి తప్పుకోవడంతో ఏర్పడిన ఖాళీని భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. అసలు వారిద్దరితోనే రాజకీయాల్లో సినిమా తారల తరానికి తెరపడుతుందని రాజకీయ విశ్లేషకులు భావించారు. రజనీ రాకతో ఆ సంప్రదాయం అలాగే కొనసాగే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక భావాలు కలిగినందున రజనీ బీజేపీలో చేరుతారనే ప్రచారమూ ఉంది. తమిళ రాజకీయాల్లో రాణించాలంటే సొంత పార్టీని పెట్టుకోవడమే ఉత్తమమైన మార్గం. ఆ తాను ముక్కలాగా బీజేపీకి అంటకాగుతూ తోకపార్టీలాగా ఇంట గెలవచ్చు. ‘లేట్‌గా వచ్చినా లేటెస్ట్గా వస్తారు’ అన్నది రజనీ అభిమానుల నమ్మకం. -
అమ్మ మృతిలో మిస్టరీ లేదు
♦ త్వరలో జయ చికిత్స ఫొటోలు విడుదల చేస్తాం ♦ అన్నాడీఎంకే (అమ్మ) కర్ణాటక శాఖ కార్యదర్శి పుహళేంది వెల్లడి ♦ అమ్మ మరణంపై అనుమానాలున్నాయి: పన్నీర్ సాక్షి ప్రతినిధి, చెన్నై: జయ మరణంపై నెలకొన్న అనుమానాలను కొంత వరకు నివృత్తి చేసేందుకు రంగం సిద్ధమైంది. అపోలో ఆస్పత్రిలో జయ చికిత్స పొందుతున్న ఫొటోలను విడుదల చేస్తానని టీటీవీ దినకరన్ అనుచరుడు, అన్నాడీఎంకే (అమ్మ) కర్ణాటక శాఖ కార్యదర్శి పుహళేంది బుధవారం మదురైలో ప్రకటించారు. మరణం వెనుక ఎటువంటి మిస్టరీ లేదని ఆయన అన్నారు. అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణం తరువాత రెండుగా చీలిపోయిన పార్టీ మళ్లీ ఏకం అయ్యేందుకు ఇటీవల ప్రయత్నాలు జరిగాయి. అయితే జయలలిత మరణంపై సీబీఐ లేదా న్యాయవిచారణకు ఆదేశించాలని, శశికళ కుటుంబ సభ్యులను పార్టీ నుంచి శాశ్వతంగా బహిష్కరించాలని మాజీ సీఎం పన్నీర్ సెల్వం వర్గం ప్రధానంగా రెండు షరతులు విధించింది. అయితే ఈ షరతులను శశికళ వర్గం తోసిపుచ్చడంతో ఇరువర్గాల విలీనానికి విఘాతం ఏర్పడింది. అన్నాడీఎంకేలో నెలకొన్న పరిణామాలు, అమ్మ మరణం తదితర అంశాలను ప్రస్తావిస్తూ నేటి నుంచి పన్నీర్‌సెల్వం రాష్ట్రవ్యాప్త పర్యటనను ప్రారంభిస్తున్నారు. పన్నీర్ పర్యటనను నీరుగార్చేందుకు శశికళ వర్గం కూడా సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా దినకరన్ అనుచరుడు, అన్నాడీఎంకే (అమ్మ) కర్ణాటక శాఖ కార్యదర్శి పుహళేంది బుధవారం మదురైలో బహిరంగ సభ నిర్వహించారు. దినకరన్‌పై కేంద్ర ప్రభుత్వం బూటకపు కేసులను బనాయించిందని ఆరోపిస్తూ నినాదాలు చేశారు. దినకరన్‌పై పెట్టిన కేసులను కొట్టివేసి విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అనుమతి రాగానే ఫొటోలు బహిర్గతం: పుహళేంది ఈ సందర్భంగా పుహళేంది మీడియాతో మాట్లాడుతూ అపోలో ఆస్పత్రిలో జయలలితకు అంతర్జాతీయ ప్రమాణాలతో జరిగిన చికిత్సను అనుమానిస్తూ అమ్మ మరణం వెనుక మిస్టరీ ఉందని కొందరు నిందలు వేస్తున్నారని అన్నారు. అందుకే జయలలిత చికిత్స పొందతున్నప్పటి ఫొటోలను త్వరలో విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఫొటోల విడుదలపై తగిన అనుమతి రాగానే బహిరంగ పరుస్తామని చెప్పారు. ఈ ఫొటోలు విడుదలైతే కొందరి ముఖాలు వాడిపోతాయని పరోక్షంగా పన్నీర్‌సెల్వంను ఎద్దేవా చేశారు. జయకు చికిత్స సమయంలో పక్కనే ఉన్న పన్నీర్‌సెల్వం ఇప్పుడు సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తున్నారని విమర్శించారు. స్నేహితురాలిగా, తల్లిగా 33 ఏళ్లపాటు జయలలిత వెన్నటి ఉండి శశికళ ఎంతో త్యాగం చేశారని ఆయన అన్నారు. శశికళ త్యాగాలను మరిస్తే పార్టీలో ఉండలేమని చెప్పారు. జయ మరణంతో తల్లిలేని బిడ్డల్లా మారిన అన్నాడీఎంకేను శశికళ తన చేతుల్లోకి తీసుకుని పార్టీని, ప్రభుత్వాన్ని కాపాడారని అన్నారు. శశికళ లేకుంటే ఎడపాడి ప్రభుత్వం విశ్వాసపరీక్షలో నెగ్గేదా అని ఆయన ప్రశ్నించారు. మనిషి జన్మనెత్తిన వారికి కృతజ్ఞత ఉండాలి, అది లేనివారితో దిగులు లేదని పన్నీర్‌సెల్వంపై పరుషపదజాలం ప్రయోగించారు. జయ మరణం మర్మమే: పన్నీర్ సెల్వం ఇదిలా ఉండగా, మాజీ సీఎం పన్నీర్‌సెల్వం తూత్తుకూడిలో బుధవారం మీడియాతో మాట్లాడుతూ, జయకు జరుగుతున్న చికిత్సను ముఖ్యమంత్రిగా తాను తరచూ సమీక్షించేవాడినని, ఈ 74 రోజుల్లో ఒక్కసారి కూడా జయను చూసేందుకు అవకాశం లేని పరిస్థితులను సృష్టించారని అయన ఆరోపించారు. వైద్యుల బృందం విడుదల చేసే బులిటెన్లలోని సారాంశాన్ని పార్టీ అధికార ప్రతినిధులు అలాగే వెల్లడి చే సేవారని, తాము సైతం నమ్మామని తెలిపారు. అయితే జయ మరణంలో ఇంకా అనేక సందేహాలు ఉన్నాయని, వీటిని ప్రజల్లో నివృత్తి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. జయ ఫొటోల విడుదల వల్ల మరణంపై సీబీఐ విచారణ జరపాలన్న తమ డిమాండ్‌లో మార్పు ఉండదు, ఎలాంటి బెంగలేదని ఆయన స్పష్టం చేశారు. -
మిస్టరీ ప్రమాదాలు.. ముగ్గురి మృతి
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణించిన తర్వాతి నుంచి ఆమె ఆస్తులకు సంబంధించి ఏదో ఒక మిస్టరీ వెలుగు చూస్తూనే ఉంది. తాజాగా.. జయలలిత వద్ద గతంలో డ్రైవర్‌గా పనిచేసిన వ్యక్తి ఒక 'రోడ్డు ప్రమాదం'లో మరణించాడు. అయితే ఇది నిజంగా ప్రమాదమేనా, లేక ఎవరైనా అలా చిత్రించారా అనే విషయం అనుమానంగానే ఉంది. తమిళనాడులోని సేలం జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది. చెన్నై పోయెస్ గార్డెన్స్‌లోని జయలలిత నివాసంలో కనకరాజ్ (36) డ్రైవర్‌గా పనిచేసేవాడు. మూడేళ్ల క్రితం అతడిని తీసేశారు. ఆ తర్వాతి నుంచి అతడు టాక్సీ నడుపుకొంటున్నాడు. ఇటీవల కొడనాడులోని జయలలిత ఎస్టేట్‌లో జరిగిన వాచ్‌మన్ ఓం బహదూర్ హత్యకేసులో ఇతడు ప్రధాన నిందితుడు. నీలగిరి పోలీసులు ఇప్పటికే అతడిని ఒకసారి ప్రశ్నించారు. కనకరాజ్ మోటార్ సైకిల్ మీద వెళ్తుండగా ఓ వాహనం అతడిని ఢీకొంది. ఇదే హత్య కేసులో మరో నిందితుడు, కనకరాజ్ స్నేహితుడైన సాయన్ కూడా ఇదే రోజు కేరళలో జరిగిన మరో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. అతడి భార్య, కుమార్తె ఆ ప్రమాదంలో మరణించారు. ఒకే రోజు రెండు ప్రమాదాలు జరగడం, గార్డు హత్యకేసులో నిందితులే ఈ ప్రమాదాల్లో ఉండటం చూస్తుంటే ఇవి మామూలుగా సంభవించినవి కావని, ఏదో కావాలనే చేసి ఉంటారని అంటున్నారు. కొడనాడులోని జయలలిత ఎస్టేట్‌లో ఈనెల 24న సెక్యూరిటీ గార్డు ఓం బహదూర్ హత్య జరిగింది. అతడి నోట్లో గుడ్డలు కుక్కి, చేతులు కట్టేసి మరీ అతడిని హతమార్చారు. అప్పుడు జయలలిత ఆస్తులకు సంబంధించిన ముఖ్యమైన పత్రాలు కొన్ని చోరీకి గురైనట్లు కూడా భావించారు. ఇప్పుడు ఆ కేసులో ప్రధాన నిందితులు ఇద్దరినీ హతమార్చేందుకు 'రోడ్డు ప్రమాదాలు' సృష్టించడం, అవి కూడా ఒకేరోజు ఒకటి సేలంలో, మరొకటి కేరళలో జరగడం చూస్తుంటే.. జయలలిత ఆస్తుల మీద కన్నేసిన వాళ్లే ఇవన్నీ చేయించి ఉంటారని భావిస్తున్నారు. -
అమ్మ మృతిపై సీబీఐ విచారణ చేయించండి
న్యూఢిల్లీ: జయలలిత మృతిపై సీబీఐతో విచారణ జరిపించాలని అన్నాడీఎంకే ఎంపీ పీఆర్ సుందరం లోక్‌సభలో డిమాండ్ చేశారు. మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం గూటికి చేరిన సుందరం.. శుక్రవారం లోక్‌సభలో ఈ విషయాన్ని లేవనెత్తారు. జయలలిత మృతిపై తమిళనాడు ప్రభుత్వం విచారణ జరిపించినా, రహస్యాలు బయటకు రాకుండా తొక్కిపెడతారని, సీబీఐతో దర్యాప్తు చేసేలా కేంద్రం ఆదేశాలు జారీ చేయాలని సుందరం డిమాండ్ చేశారు. ఇటీవల పన్నీరు సెల్వం కూడా ఇదే డిమాండ్ చేశారు. జయలలిత మృతిపై ఆయన పలు అనుమానాలు వ్యక్తం చేశారు. అన్నాడీఎంకే బహిష్కృత ఎంపీ శశికళ పుష్ప, సినీ నటి గౌతమి సహా పలువురు ప్రముఖులు కూడా జయలలిత మృతిపై సీబీఐతో విచారణ చేయించాలని గతంలో డిమాండ్ చేశారు. జయలలిత బంధువులు కూడా కొందరు సందేహాలు వ్యక్తం చేశారు. పన్నీరు వర్గానికి చెందిన నాయకులు.. అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ రోజు లోక్‌సభలో జీరో అవర్‌లో అన్నాడీఎంకే ఎంపీలు శ్రీలంకలోని తమిళుల సమస్యలను ప్రస్తావించారు. శ్రీలంకలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని, తమిళులపై దాడులు జరుగుతున్నాయని, ఆ దేశాన్ని మిత్రదేశంగా పరిగణించరాదని డిమాండ్ చేశారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంత్ కుమార్ ఈ విషయంపై స్పందిస్తూ.. శ్రీలంకలోని తమిళుల సమస్యను తీవ్రంగా పరిగణిస్తున్నామని తెలిపారు. -
మరింత వేడెక్కిన ఆర్కేనగర్ బరి
జయలలిత మరణంతో ఖాళీ అయిన చెన్నై ఆర్కేనగర్ నియోజకవర్గం ఉప ఎన్నికల బరి మరింత వేడెక్కింది. తాజాగా జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ సైతం అక్కడి నుంచి నామినేషన్ దాఖలు చేశారు. ఏప్రిల్ 12వ తేదీన జరగనున్న ఈ ఉప ఎన్నికలలో తాను ఎంజీఆర్ అమ్మ దీపా పెరవై పార్టీ తరఫున బరిలోకి దిగుతున్నట్లు ఆమె తెలిపారు. పోలింగ్ అధికారి ప్రవీణ్ నాయర్‌కు ఆమె తన నామినేషన్ పత్రాలు సమర్పించారు. దానికి ముందుగా చెన్నై మెరీనా బీచ్‌లోని అమ్మ స్మారకం వద్ద నివాళులు అర్పించారు. జయలలిత మరణం తర్వాత ముందుగా వచ్చింది ఆర్కేనగర్ వాసులేనని, ఇప్పుడు అమ్మకు అసలైన వారసులు ఎవరన్న విషయాన్ని వాళ్లే ఈ ప్రపంచానికి చాటి చెబుతారని ఉద్వేగంగా చెప్పారు. ఈ ఎన్నికల్లో విజయం తన రాజకీయ జీవితంలో ఎప్పటికీ నిలిచిపోతుందన్నారు. అన్నాడీఎంకేకు మంచి నాయకత్వం అవసరమని, కేవలం తాను మాత్రమే జయలలిత చూపించిన మార్గంలో పార్టీని నడిపించగలనని కార్యకర్తలు భావిస్తున్నారని దీప అన్నారు. ఎన్నికల కమిషన్ తమకు ఏ గుర్తు కేటాయిస్తే దానిమీదే పోటీ చేస్తానని తెలిపారు. తాను ప్రచారం ప్రారంభించగానే తమ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేస్తామని వివరించారు. -
పన్నీర్ సెల్వం దీక్ష
చెన్నై : అన్నాడీఎంకే అధినేత్రి జయలలితను తోసేశారని మాజీ స్పీకర్ పీహెచ్ పాండియన్ సంచలన వ్యాఖ్యలను మరవకముందే తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం కూడా అమ్మ మృతిపై అనుమానాలు వ్యక్తం చేశారు. జయలలిత మృతిపై న్యాయ విచారణ జరిపించాలంటూ ఆయన త్వరలో దీక్షకు దిగనున్నారు. జయలలిత మృతిపై అనుమానాలు ఉన్నాయని, వాటిపై విచారణ జరిపించాలని పన్నీర్ సెల్వం డిమాండ్ చేశారు. కాగా గతనెల 5న పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దాంతో ఆయన స్థానంలో ఎంకే శశికళను అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు తమ నాయకురాలిగా ఎన్నుకున్నారు. అయితే రెండు రోజుల తర్వాత (ఫిబ్రవరి 7న) రోజు శశికళపై పన్నీర్ సెల్వం తిరుగుబాటు చేశారు. గవర్నర్ శశికళతో ప్రమాణ స్వీకారం చేయించకపోవడంతో దాదాపు రోజుల పాటు సంక్షోభం కొనసాగింది. సీఎం కుర్చీ చివరకు శశికళ, పన్నీర్ సెల్వం దక్కలేదు. అనూహ్యంగా పళనిస్వామి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు. Paneerselvam, jayalalithaa death, sasikala, paneer deeksha, పన్నీర్ సెల్వం, జయలలిత మృతి, శశికళ, పన్నీర్ దీక్ష -
'శశికళకు జీవితఖైదు పడొచ్చు'
దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతి చెందిన తీరుపై సరైన రీతిలో విచారణ జరిపితే.. ఇప్పుడు నాలుగేళ్ల జైలుశిక్ష మాత్రమే అనుభవిస్తున్న శశికళకు జీవిత ఖైదు పడొచ్చని డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే స్టాలిన్ వ్యాఖ్యానించారు. తమిళనాడు అసెంబ్లీలో విశ్వాస పరీక్ష సందర్భంగా జరిగిన పరిణామాల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఒక రోజు నిరాహార దీక్షల అనంతరం ఆయన మాట్లాడారు. గురువారం నాడు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన నిరాహార దీక్షలు తమకోసం చేసినవి కావని, అవి రాష్ట్రంలో ఏర్పాటుచేసిన బినామీ పాలనకు వ్యతిరేకంగా చేసినవని అన్నారు. తమిళనాడు అసెంబ్లీలో విశ్వాస పరీక్ష సందర్భంగా డీఎంకే సభ్యులందరినీ బలవంతంగా బయటకు పంపించి, ఆ తర్వాత బలపరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. దీన్ని నిరసిస్తూ పార్టీ ఆధ్వర్యంలో ఒక రోజు నిరాహార దీక్ష చేశారు. తన చొక్కా కూడా చింపేసి పంపారని స్టాలిన్ ఆరోపించారు. దీనిపై ఆయన రాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావుకు కూడా ఫిర్యాదు చేశారు. -
'జయలలిత మృతిపై ఇప్పటికీ అనుమానమే'
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణంపై ప్రతిపక్ష నాయకుడు, డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే స్టాలిన్ మరోసారి పెదవి విప్పారు. జయలలతి మృతి గురించి అధికారిక ప్రకటన ఎందుకు చేయలేదని ఆయన ప్రశ్నించారు. ఇంతకుముందు అన్నాదురై, ఎంజీ రామచంద్రన్ మరణించినప్పుడు ప్రకటనలు చేశారని, కానీ ఈమె విషయంలో మాత్రం ఎందుకు అలా ప్రకటన చేయలేదని అడిగారు. ఇదంతా ఏదో అనుమానాస్పదంగా ఉందని అన్నారు. మరోవైపు పళనిస్వామి విశ్వాస పరీక్ష సందర్భంగా శనివారం నాడు తమిళనాడు అసెంబ్లీలో చోటుచేసుకున్న పరిణామాలపై కూడా ఆయన స్పందించారు. అసలు ఆ రోజున రహస్య బ్యాలెట్ నిర్వహించి ఉంటే ఎడప్పాడి పళనిస్వామి అసలు ముఖ్యమంత్రి అయి ఉండేవారు కారని ఆయన అన్నారు. -
శశికళపై తమిళ ప్రజలకు కోపం?
శశికళ మీద సగటు తమిళ ప్రజలు నిజంగానే కోపంతో ఉన్నారా? జయలలిత మరణం తర్వాత నుంచి జరుగుతున్న పరిణామాలు, ముఖ్యమంత్రి పదవి నుంచి పన్నీర్ సెల్వాన్ని దించేయడం, ఆ తర్వాత ఆయన మళ్లీ తిరుగుబాటు చేయడం లాంటి పరిస్థితుల తర్వాత చూస్తే జనాగ్రహం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రధానంగా సోషల్ మీడియాలో ఇప్పటివరకు ఎవరికీ అనుకూలంగా గానీ, వ్యతిరేకంగా గానీ కామెంట్లు చేయని వర్గాల నుంచి కూడా శశికళ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోస్టింగులు, ట్వీట్లు రావడం చూశాం. ఇప్పుడు అన్నాడీఎంకేలో వ్యవస్థాపక సభ్యులు, నాయకులుగా ఉన్నవాళ్ల దగ్గర నుంచి సామాన్యుల వరకు చాలామంది అదే చెబుతున్నారు. జయలలిత అనారోగ్యం పాలు కావడానికి ప్రధాన కారణం కూడా శశికళేనని, పైగా దాదాపు 75 రోజుల పాటు అమ్మ ఆస్పత్రిలో ఉన్నా.. ఏ ఒక్కరికీ ఆమెను చూసే అవకాశం కల్పించకుండా రహస్యంగా ఉంచింది కూడా శశికళేనని అంటున్నారు. జాతీయ స్థాయి నాయకుల నుంచి రాష్ట్రంలో మంత్రుల వరకు ప్రతి ఒక్కరూ ఆస్పత్రికి అయితే వెళ్లారు గానీ, కేవలం అక్కడి వైద్యులతో మాట్లాడి వచ్చేయాల్సి వచ్చింది తప్ప అమ్మను మాత్రం చూడలేకపోయారు. దీనికి కారణం శశికళ విధించిన ఆంక్షలేనని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిజంగా అమ్మకు ఇన్ఫెక్షన్ వస్తుందని వైద్యులకు అనుమానం ఉంటే.. శశికళను మాత్రం అప్పట్లో ఆమె మంచం పక్కనే ఎందుకు ఉండనిచ్చారని ప్రశ్నిస్తున్నారు. ఫిజియోథెరపీ చేయడానికి నర్సులు లేదా వైద్యులు జయలలితను ముట్టుకుంటే ఎక్కడ వాళ్ల నుంచి ఇన్ఫెక్షన్ వ్యాపిస్తుందోనని రోబోలను కూడా నియమించినప్పుడు, శశికళను మాత్రం అసలు ఎలా అనుమతించారని అడుగుతున్నారు. ఇప్పుడు కూడా శశికళ... మెరీనా బీచ్‌లోని జయలలిత సమాధి మీద మూడుసార్లు చేత్తో కొట్టి ఏదో శపథం చేస్తున్నట్లుగా చేశారని, అమ్మ సమాధి వద్ద కావాలంటే నమస్కారం చేసుకోవచ్చు గానీ అలా కొట్టడం ఏంటని అడుగుతున్నారు. తమిళనాడు మరిన్ని అప్డేట్స్ చూడండి.. శశికళకు మరో షాక్ శశికళ మేనల్లుడికి పెద్ద పోస్టు కనీసం ఇప్పుడైనా...! తొలి తేజం! శశికలే చిన్నమ్మకు చెరసాల నన్ను ఏ శక్తీ అడ్డుకోలేదు: శశికళ పళనిస్వామే ఎందుకు! ఇక శశికళ రూటు అదే: గౌతమి తమిళనాడు అసెంబ్లీలో ఎవరి బలమెంత..? -
జయ మృతిలో నిజాలు వెల్లడవుతాయి
మేనకోడలు దీప వెల్లడి చెన్నై: జయలలిత మరణంలో దాగివున్న మరికొన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తాయని జయ మేనకోడలు దీప సంచలన ప్రకటన చేశారు. దీప ప్రతి శని, ఆదివారాలలో సాయంత్రం ఆరు గంటల సమయంలో తన మద్దతుదారులతో సమావేశమవుతున్నారు. ఆమె ప్రసంగాన్ని వినేందుకు రాష్ట్రంలోని నలుమూలల నుంచి అన్నాడీఎంకే కార్యకర్తలు తరలివస్తున్నారు. దీంతో ఆమె తన బలాన్ని నిరూపించుకునేందుకు నిర్ణయించారు. తనను కలిసే నిర్వాహకుల వద్ద మద్దతు లేఖలను స్వీకరిస్తున్నారు. ఒకవేళ అన్నాడీఎంకేను కైవసం చేసుకోలేకుంటే కొత్త పార్టీని స్థాపించేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 24వ తేదీన జయలలిత పుట్టినరోజున ముఖ్య ప్రకటన చేయనున్నట్లు ప్రకటించారు. -
శశికళా.. మొసలి కన్నీరు ఆపండి: సెల్వం
నిన్న మొన్నటి వరకు మెత్తటి మనిషిలా కనిపించిన పన్నీర్ సెల్వం గర్జించారు. శశికళ మొసలికన్నీరు ఆపాలని, ఆమెవద్ద ఉన్న ఎమ్మెల్యేలందరినీ బయటకు వదలాలని డిమాండ్ చేశారు. కొంతమంది ఎమ్మెల్యేలు తనకు ఫోన్లు చేస్తున్నారని, గూండాలు ఉండటం వల్ల తాము బయటకు రాలేకపోతున్నట్లు చెప్పారని ఆయన అన్నారు. వాళ్లను రిసార్టులో బంధించలేదని శశికళ చెబుతున్నారని.. అలా అయితే వాళ్లను ఇంటికి ఎందుకు పంపడం లేదని ప్రశ్నించారు. రాష్ట్ర హోం మంత్రి పదవి కూడా చేతిలోనే ఉన్నప్పుడు.. ఆ హోదాతో రిసార్టుకు వెళ్లి ఎమ్మెల్యేలను బయటకు తేవచ్చుగా అని మీడియా ఆయనను ప్రశ్నించగా, ఇప్పటికే రాష్ట్రంలో అసాధారాణ పరిస్థితులు ఉన్నాయని, ఇలాంటి సమయంలో తాను ఏం చేసినా దానివల్ల అనవసరంగా సమస్యలు వస్తాయని అన్నారు. అందుకే తాను సహనంతో ఊరుకుంటున్నట్లు చెప్పారు. తమిళ సినిమాల్లో కమెడియన్ వడివేలు తనకు తానే పోలీసు జీపు ఎక్కి.. తనను జైలుకు తీసుకెళ్తున్నారని చెప్పినట్లు శశికళ తనను తాను సింహం అని చెప్పుకోవడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. 75 రోజుల పాటు జయలలిత ఆస్పత్రిలో ఉన్నప్పుడు బయట తామంతా అక్కడే ఉత్కంఠతో వేచి చూశామని, అప్పుడు అమ్మ పక్కనే ఉన్న శశికళ ఒక్కరోజైనా బయటకు వచ్చి జయలలిత ఆరోగ్యం గురించి ఒక్క మాటైనా చెప్పారా అని ప్రశ్నించారు. 16 ఏళ్ల క్రితం మొట్టమొదటిసారి తనను ముఖ్యమంత్రిగా చేసినప్పటి నుంచి తాను శశికళ చేతుల్లో చిత్రహింసకు గురయ్యానని అన్నారు. జయలలిత ఆస్పత్రిలో ఉన్నప్పుడు ఆమె మేనల్లుడు దీపక్, మేనకోడలు దీపా జయకుమార్‌లను కనీసం లోపలకు రానివ్వలేదని, జయలలిత మరణించినప్పుడు కూడా దీప అర్ధరాత్రి నుంచి తెల్లవారు జామున 6.30 వరకు వేదనిలయం వద్దే వేచి చూసినా.. కనీసం అమ్మ మృతదేహాన్ని కూడా చూడనివ్వలేదని పన్నీర్ సెల్వం మండిపడ్డారు. -
ఏ విచారణకైనా సిద్ధం: శశికళ
చెన్నై: జయలలిత మృతిపై వస్తున్న ఆరోపణలపై ఏ విచారణకైనా సిద్ధమని అన్నా డీఎంకే చీఫ్ శశికళ ప్రకటించారు. అమ్మ మరణాన్ని రాజకీయం చేయడం తనను బాధిస్తోందని అన్నారు. తాను ఎలాంటి వ్యక్తినన్న విషయం అమ్మకు తెలుసని, ఆమెను ఎలా చూసుకున్నానో తెలుసని, అమ్మను కంటికి రెప్పలా ఎలా చూసుకున్నానో డాక్టర్లకు కూడా తెలుసని చెప్పారు. జయలలిత మృతిపై విచారణకు ఏ కమిషన్ వేసినా తనకు సమస్య లేదని శశికళ చెప్పారు. జయలలిత చికిత్స పొందుతున్న సమయంలో ఆమెను కలిసేందుకు తనను అనుమతించలేదని, ఆమె మృతిపై విచారణ జరిపించాలని తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం చేసిన ఆరోపణలపై శశికళ ఓ ఇంటర్వ్యూలో పైవిధంగా స్పందించారు. తమిళనాడు గవర్నర్ విద్యాసాగర్ రావు రాజ్యంగాన్ని కాపాడుతారని భావిస్తున్నానని, ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయడానికి తనను ఆహ్వానిస్తారని ఆశిస్తున్నట్టు శశికళ చెప్పారు. గవర్నర్‌ను కలిసేందుకు ప్రయత్నించామని, ఆయన ఊటిలో ఉండటంతో సాధ్యం కాలేదని చెప్పారు. పన్నీరు సెల్వం చేసిన ఆరోపణలకు తాను సమాధానం చెప్పాల్సిన పనిలేదని, తాను ఎలాంటి వ్యక్తి అన్న విషయం అమ్మకు తెలుసునని శశికళ చెప్పారు. పన్నీరు సెల్వం చర్యలు అమ్మ ఆశయాలకు విఘాతమని, డీఎంకే ఆయనను సొంత మనిషిని చేసుకునేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. -
జయలలిత బుగ్గపై ఆ చుక్కలు ఎందుకొచ్చాయి??
దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మృతిపై అనేక అనుమానాలు ముసురుకున్న సంగతి తెలిసిందే. ఆమె మృతిపై నెలకొన్న అనుమానాలను నివృత్తి చేసేందుకు లండన్‌కు చెందిన వైద్య నిపుణుడు డాక్టర్ రిచర్డ్ బీలే, అపోలో ఆస్పత్రి వైద్యులతో కలిసి ప్రెస్‌మీట్ నిర్వహించారు. తమిళనాడు సర్కారు ఏర్పాటు చేసిన ఈ ప్రెస్మీట్లో వైద్యులకు ఎదురైన ప్రధాన ప్రశ్న.. ఎందుకు జయలలిత బుగ్గులపై నాలుగు చుక్కలు ఉన్నాయి? అని.. ప్రజల సందర్శనార్థం జయలలిత భౌతికకాయాన్ని రాజాజీ హాల్లో ఉంచిన సందర్భంలో తీసిన ఫొటోలు సోషల్ మీడియాలో పెనుదుమారం రేపాయి. ముఖ్యంగా జయలలిత భౌతికకాయం మారిపోయిన తీరు.. ఆమె బుగ్గపై నాలుగు చుక్కలు (డాట్లు) ఉండటం.. అనేక అనుమానాలకు తావిచ్చింది. దీనికితోడు జయలలిత రెండు కాళ్లు తొలగించారని, ఆమె ముందు చనిపోయారని, ఆ విషయాన్ని దాచిపెట్టి.. ఆమె భౌతికకాయం కుళ్లిపోకుండా ఉండేందుకే తీసుకున్న చర్యల వల్లే బుగ్గపై ఉన్న ఈ నాలుగు చుక్కలు వచ్చాయని సోషల్ మీడియాలో వదంతులు గుప్పుమన్నాయి. దీనిపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు డాక్టర్ బీలే స్పందిస్తూ.. ’జయలలిత కాళ్లు తొలగించలేదు. ఎలాంటి ట్రాన్స్‌ప్లాంట్ ఆపరేషన్ చేయలేదు. బుగ్గల మీద ఉన్న చుక్కలు అంటారా.. తీవ్రంగా జబ్బుపడ్డ రోగులకు బుగ్గలపై అలాంటి చుక్కలు వస్తాయి’ అని వివరణ ఇచ్చారు. ఇక మద్రాస్ మెడికల్ కాలేజీ అనాటమీ డైరెక్టర్ డాక్టర్ సుధా శేషియన్ మాట్లాడుతూ.. జయలలిత మృతదేహాన్ని భద్రపరిచే చర్యలు తీసుకున్నామని, ఈ సందర్భంగా సాధారణ పద్ధతినే పాటించామని ఆమె తెలిపారు. జయలలిత భౌతికకాయంలోకి ఎంబాల్మింగ్ ఫ్లూయిడ్స్ ఎక్కించామని, అయితే ఈ సందర్భంగా ఎలాంటి లీకులు చోటుచేసుకోలేదని వివరణ ఇచ్చారు. వెంటీలేటర్‌పై ఉంచడం వల్ల జయలలిత పెదవులు ఉబ్బి ఉంటాయని, ట్రేకియాటమీ (శ్వాసలో అడ్డంకులు తొలగించే క్రమంలో) చేసే క్రమంలో ఆమె బుగ్గపై చుక్కలు వచ్చి ఉంటాయని వివరణ ఇచ్చారు. వీఐపీలు చనిపోయినప్పుడు.. ప్రజల సందర్శనార్థం ఉంచే సమయంలో వారి భౌతికకాయాలను కుళ్లిపోకుండా భద్రపరిచే చర్యలు తీసుకోవడం సహజమేనని ఆమె చెప్పుకొచ్చారు. అయితే, జయలలిత బుగ్గపై చుక్కల గురించి వైద్యులు ఇచ్చిన వివరణ నమ్మశక్యంగా లేదని సోషల్ మీడియాలో వినిపిస్తోంది. జయలలిత మృతిపై అనేక అనుమానాలు వస్తున్న సమయంలో వాటిని నివృత్తి చేసేందుకు వైద్యబృందం ఎంచుకున్న సమయం కూడా వివాదాస్పదంగా మారింది. తమిళనాడు కొత్త సీఎంగా శశికళను ఎంచుకున్న మర్నాడే.. ఈ ప్రెస్‌మీట్ పెట్టడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుత్నునాయి. -
'సీఎం అయ్యే అర్హత చిన్నమ్మకు లేదు'
-
'చిన్నమ్మ వద్దని అమ్మ, ఎంజీఆర్ కోరుకున్నారు'
తమిళనాడు రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. నిన్నటివరకు శశికళను ఏకగ్రీవంగా శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారని చెబుతుంటే.. తాజాగా ఆమెపై నిరసన స్వరాలు బయటకు వినిపిస్తున్నాయి. అన్నాడీఎంకే నేతలు పీహెచ్ పాండియన్, మనోజ్ పాండియన్ ఇద్దరూ శశికళకు వ్యతిరేకంగా మీడియాకు ఎక్కారు. దాంతోపాటు అసలు జయలలితది సహజ మరణం కాదని సంచలన వ్యాఖ్యలు చేశారు. పోయస్గార్డెన్స్లో ఒకసారి జరిగిన గొడవలో జయలలితను కిందకు తోసేశారని, అందువల్లే ఆమె ఆస్పత్రి పాలయ్యారని అన్నారు. ఈ వ్యవహారాన్ని బయటపడకుండా జాగ్రత్త పడ్డారని, జయలలిత మరణంలో శశికళ పాత్రపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అమ్మ మరణించిన తర్వాత పార్టీలో, ప్రభుత్వంలో చిన్నమ్మ పెత్తనం పెరిగిపోయిందని, ఆమె ఆధిపత్యాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని పాండియన్లు ఇద్దరూ చెప్పారు. అసలు శశికళను తమిళనాడు ముఖ్యమంత్రిగా చేయడానికి వీల్లేదని జయలలిత ఒకసారి తనతో చెప్పారని మనోజ్ పాండియన్ అన్నారు. శశికళకు అసలు అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, ముఖ్యమంత్రి పదవులు చేపట్టడానికి అర్హత లేదని, తాము ఇంకా అమ్మ మరణం తాలూకు బాధ నుంచి బయటకు రాలేదని పీహెచ్ పాండియన్ చెప్పారు. శశికళ సీఎం కాకూడదని తమిళనాడు మాజీ ముఖ్యమంత్రులు జయలలిత, ఎంజీఆర్ కోరుకోవడం వల్లే శశికళ ప్రమాణస్వీకారం చేయలేకపోయారని ఆయన అన్నారు. అయితే, పాండియన్ ఆరోపణలను అన్నాడీఎంకే కొట్టిపారేసింది. పొలిటికల్ మైలేజి కోసమే పాండియన్ ఆరోపణలు చేస్తున్నారని, జయలలితకు అందించిన చికిత్సల వివరాలను వైద్యులు ఇప్పటికే వెల్లడించారని పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది. -
జయ మృతి: ఇప్పుడెందుకీ వివరణ??
దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతిపై వస్తున్న అనుమానాలను నివృత్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం నిర్వహించిన డాక్టర్ల ప్రెస్‌మీట్‌పై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తమిళనాడు కొత్త ముఖ్యమంత్రిగా శశికళ నియామకం అయిన మరునాడే వైద్యులు విలేకరులకు ముందుకొచ్చి.. పలు అనుమానాల నివృత్తికి ప్రయత్నించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జయలలితకు చికిత్స అందించిన, ఆమె ఆరోగ్యాన్ని పర్యవేక్షించిన వైద్యబృందం సోమవారం ప్రెస్‌మీట్ నిర్వహించిన సంగతి తెలిసిందే. దాదాపు గంటపాటు సాగిన ఈ ప్రెస్మీట్లో లండన్‌కు చెందిన వైద్యనిపుణుడు రిచర్డ్ బాలే కూడా పాల్గొన్నారు. జయలలిత చికిత్సను ఆయన దగ్గరుండి పర్యవేక్షించిన సంగతి తెలిసిందే. జయలలితకు అత్యుత్తమ వైద్యం అందించామని, ఆమె మృతిపై అనుమానాలు సరికాదని బాలే స్పష్టం చేశారు. ఆమె మృతదేహాన్ని వెలికితీసి.. మళ్లీ పరీక్షలను నిర్వహించాలన్న డిమాండ్‌ను ఆయన 'మూర్ఖమైనది'గా పేర్కొంటూ తోసిపుచ్చారు. అనుమానాలను నివృత్తి చేసేందుకే తాము ప్రెస్‌మీట్ పెట్టామని వైద్యులు చెప్తుండగా.. ఈ సమయంలోనే ఎందుకు పెట్టారని మిగతావారు ప్రశ్నిస్తున్నారు. 'శశికళ వెనువెంటనే సీఎం పదవిని చేజిక్కించుకోవడంపై తీవ్ర ప్రతిఘటన వస్తున్నదనే విషయం వారికి అర్థమైంది. ఈ ప్రెస్‌మీట్ ద్వారా ప్రజల సముదాయించాలని వారు భావించారు' అని డీఎంకే అధికార ప్రతినిధి శరవణన్ పేర్కొన్నారు. ఈ సమయంలో ప్రెస్‌మీట్ పెట్టడం కనీస ఇంగితజ్ఞానమున్న ప్రతి ఒక్కరికీ సందేహం కలిగిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. అయితే, ఈ ఆరోపణలను అధికార అన్నాడీఎంకే నేతలు తోసిపుచ్చుతున్నారు. జయలలిత మృతిపై అనుమానాలు తొలగించేందుకు ఈ ప్రెస్‌మీట్‌ను వైద్యులు నిర్వహించారని, దీనివెనుక ఎలాంటి రాజకీయ కారణాలు లేవని వారు అంటున్నారు. -
జయ మృతిపై నేడు విచారణ
-
జయ మృతిపై నేడు విచారణ
టీనగర్ (చెన్నై): జయలలిత మృతిపై గురువారం మద్రాసు హైకోర్టులో విచారణ జరగనుంది. అనుమానాస్పద రీతిలో తమిళనాడు సీఎం జయలలిత మృతి చెందినందున సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తులు ముగ్గురితో కమిటీని ఏర్పాటు చేయాలని చెన్నై అరుంబాక్కంకు చెందిన జోసెఫ్ హైకోర్టులో ఇటీవల పిటిషన్ దాఖలు చేశారు. అందులో తాను అన్నాడీఎంకేలో సభ్యునిగా ఉన్నట్లు పేర్కొన్నారు. సెప్టెంబర్ 22న జయ అపోలో ఆస్పత్రిలో చేరాక ఏమి జరిగిందనే వాస్తవ విషయం ప్రజలకు తెలియలేదన్నారు. తొలుత జ్వరం కారణంగా జయను ఆస్పత్రిలో చేర్చారని, రెండు రోజుల్లో డిశ్చార్జి చేస్తారని వార్తలు వెలువడ్డాయని తెలిపారు. అయితే అది జరగలేదని, ఆమె ఆరోగ్యం క్షీణించిందని చెబుతూ అపోలో ఆస్పత్రి వారు బులిటెన్లు విడుదల చేశారన్నారు. జయ దేహాన్ని చూసిన వారు ఆమె రెండు కాళ్లు తొలగించినట్లు గమనించారని, ఆమె దేహం ఎక్కువ రోజులు చెడకుండా ఉండేందుకు ఆస్పత్రి వర్గాలు ఈ రీతిలో చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోందన్నారు. -
జయ మృతిపై సీబీఐ దర్యాప్తు చేయాలి: కేతిరెడ్డి
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతిపై సుప్రీంకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. తమిళనాడులోని తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి ఈ పిటిషన్ దాఖలుచేశారు. జయలలిత మృతిపై తమకు అనుమానాలున్నాయని, ఈ విషయంపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని ఆయన తన పిటిషన్లో కోరారు. అనంతరం సీబీఐ దర్యాప్తునకు మద్దతు కోరుతూ అన్ని రాజకీయ పార్టీల నేతలను కలుస్తానని చెప్పిన ఆయన నేడు(బుధవారం) సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డిని కలిశారు. సీబీఐ దర్యాప్తునకు మద్దతివ్వాలని కోరుతూ ఓ వినతిపత్రం ఇచ్చారు. గురువారం న్యూఢిల్లీలో ఇతర రాజకీయ పక్షాలను కలిసి వారికీ వినతిపత్రం సమర్పించనున్నట్లు ఆయన తెలిపారు. అంతకుముందు జయలలిత మరణంపై ఎన్నో అనుమానాలున్నాయని సీబీఐ దర్యాప్తు చేయాలని కేతిరెడ్డి కోరిన విషయం తెలిసిందే. గత సెప్టెంబర్ 22న జ్వరం, డీ హైడ్రెషన్ కారణంగా ఆస్పత్రిలో చేరిన జయలలిత ఆ తర్వాత జబ్బు బారిన పడటం.. ఆపై ఆమె కోలుకున్నారని ప్రకటించారు. డిసెంబర్ 4న హఠాత్తుగా ఆమెకు గుండెపోటు వచ్చిందని చెప్పడం చూస్తుంటే ఆశ్చర్యంతోపాటు పలు అనుమానాలు కలుగుతున్నాయని ఆయన ఆ సమయంలో మీడియాకు ప్రత్యేక లేఖ కూడా విడుదల చేసిన విషయం విదితమే. -
’జయలలిత మృతిపై సీబీఐ విచారణ జరిపించాలి’
చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణంపై పలు అనుమానాలు వస్తున్న నేపథ్యంలో ఈ విషయంలో ప్రజల అనుమానాల్ని నివృత్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వం సీబీఐ దర్యాప్తు చేయాలని తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీకి ఒక లేఖ రాశారు. గత సెప్టెంబర్ 21న జ్వరం, డీ హైడ్రెషన్ కారణంగా ఆస్పత్రిలో చేరిన జయలలిత ఆ తర్వాత జబ్బు బారిన పడటం.. ఆమె కోలుకుంటున్నదని ప్రకటించడం, డిసెంబర్ 4న హఠాత్తుగా ఆమెకు గుండెపోటు వచ్చిందని చెప్పడం చూస్తుంటే ఆశ్చర్యంతోపాటు పలు అనుమానాలు కలుగుతున్నాయని ఆయన మీడియాకు విడుదల చేసిన తన లేఖలో పేర్కొన్నారు. కోలుకొని ఆరోగ్యంగా ఉన్న జయలలితకు హఠాత్తుగా గుండెపోటు ఎందుకు వచ్చిందన్నది ప్రశ్నార్థకంగా మారిందన్నారు. ఆస్పత్రిలో ఉండగా చూసేందుకు వచ్చిన కేంద్రమంత్రులు, గవర్నర్లు, ముఖ్యమంత్రులు, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ, ప్రతిపక్ష నాయకుడు స్టాలిన్‌ను జయలలిత ఉన్న గదిలోకి అనుమతించకుండా శశికళను మాత్రమే అనుమతించడం పలు అనుమానాలకు తావిస్తున్నదని, గతంలో జయలలిత తనపై విషప్రయోగం జరిపారనే ఆరోపణలతో శశికళతోపాటు 13మందిని పార్టీ నుంచి బహిష్కరించారని, ఈ నేపథ్యంలో జయలలిత మరణం అనుమానాస్పదంగా కనిపిస్తున్నదని ఆయన పేర్కొన్నారు. -
చెన్నైలో ఐదో టెస్టు జరిగేనా!
-
చెన్నైలో టెస్టు జరిగేనా!
ముంబై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మృతి నేపథ్యంలో ఒక్కసారిగా అక్కడ పరిస్థితులు మారిపోయాయి. ఇలాంటి స్థితిలో భారత్, ఇంగ్లండ్ మధ్య ఈ నెల 16 నుంచి చెన్నైలో జరగాల్సిన ఐదో టెస్టు నిర్వహణపై సందేహాలు తలెత్తుతున్నాయి. అయితే మున్ముందు పరిస్థితులను బట్టి దీనిపై తుది నిర్ణయం తీసుకుంటామని బీసీసీఐ ప్రకటించింది. ‘బోర్డు ఇంకా దీని గురించి ఆలోచించలేదు. పరిస్థితిని బట్టి, మ్యాచ్ జరిగే సమయంలో నగర అభిమానుల భావోద్వేగాలను దృష్టిలో ఉంచుకొని తదుపరి చర్యల గురించి అసోసియేషన్‌తో చర్చిస్తాం. దీనికి ఎలాంటి తుది గడువూ లేదు. మనకు అవసరమైతే టెస్టు నిర్వహణ కోసం చాలా వేదికలు సిద్ధంగా ఉన్నాయి. దీనర్థం వేదిక మారిందని కాదు. రాష్ట్రంలో పరిణామాలను చూశాక ప్రకటిస్తాం’ అని బీసీసీఐ కార్యదర్శి అజయ్ షిర్కే వెల్లడించారు. -
పాలు లీటరు రూ.200కు విక్రయం
కేకే.నగర్ : ముఖ్యమంత్రి జయలలిత మృతి చెందడంతో రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ కార్యకర్తలు, ఆమె అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. జిల్లాల్లో సామాన్యుల కష్టాలు వర్ణణాతీతంగా మారాయి. కొన్ని చోట్ల దుకాణాలు మూసివేసి సంతాపం ప్రకటించగా ఇదే అదునుగా పలువురు వ్యాపారులు అందిన కాడికి దోచేసుకుంటున్నారు. రెండు రోజుల పాటు పాల సరఫరా నిలిపివేశారంటూ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. దీంతో పలు ప్రాంతాల్లో వ్యాపారులు పాల ధరను అమాంతం పెంచారు. లీటరు పాల ధర రూ.200లకు విక్రయించడం పలువురిని ఆశ్చర్యానికి గురి చేసింది. దీనిపై తమిళనాడు పాల ఏజెంట్ల సంఘం అధ్యక్షుడు పొన్నుస్వామి ఓ ప్రకటన విడుదల చేశారు. కొంతమంది వ్యాపారస్తులు పాల ఏజెంట్ల నుంచి తమ ఇంట్లో శుభకార్యాల కోసం అని చెప్పి పాల ప్యాకెట్లను అధికంగా కొనుగోలు చేశారని పేర్కొన్నారు. పాల సరఫరా నిలిపి వేశారని తప్పుడు సమాచారాన్ని ప్రజలకు చేరవేసి లీటరు పాలను రూ.200లకు విక్రయిస్తున్నట్లు రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి ఫోన్ కాల్స్ ద్వారా తమకు ఫిర్యాదులు అందాయన్నారు. నార్త్ చెన్నై ప్రాంతంలో ఆంధ్రా నుంచి వచ్చే ప్రైవేటు పాల సంస్థ కంటైనర్ లారీని కొందరు ఆగంతకులు అడ్డుకుని పాల ప్యాకెట్లను కొల్లగొట్టినట్లు తెలుస్తోంది. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పాల సంఘాలు ప్రకటించాయి. తప్పుడు వదంతులను నమ్మి ప్రజలు పాల ప్యాకెట్లను అధిక ధరలకు కొనుగోలు చేయకూడదని, అధిక ధరలకు విక్రయిస్తున్న వారిని పోలీసులకు అప్పగించాలని కోరారు. పాల ఏజెంట్ల దుకాణాలకు, వాహనాలకు రాష్ట్ర పోలీసుశాఖ భద్రత కల్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.