'జయలలిత మృతిపై ఇప్పటికీ అనుమానమే'
'జయలలిత మృతిపై ఇప్పటికీ అనుమానమే'
Published Mon, Feb 20 2017 7:51 PM | Last Updated on Fri, Sep 28 2018 7:30 PM
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణంపై ప్రతిపక్ష నాయకుడు, డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే స్టాలిన్ మరోసారి పెదవి విప్పారు. జయలలతి మృతి గురించి అధికారిక ప్రకటన ఎందుకు చేయలేదని ఆయన ప్రశ్నించారు. ఇంతకుముందు అన్నాదురై, ఎంజీ రామచంద్రన్ మరణించినప్పుడు ప్రకటనలు చేశారని, కానీ ఈమె విషయంలో మాత్రం ఎందుకు అలా ప్రకటన చేయలేదని అడిగారు. ఇదంతా ఏదో అనుమానాస్పదంగా ఉందని అన్నారు.
మరోవైపు పళనిస్వామి విశ్వాస పరీక్ష సందర్భంగా శనివారం నాడు తమిళనాడు అసెంబ్లీలో చోటుచేసుకున్న పరిణామాలపై కూడా ఆయన స్పందించారు. అసలు ఆ రోజున రహస్య బ్యాలెట్ నిర్వహించి ఉంటే ఎడప్పాడి పళనిస్వామి అసలు ముఖ్యమంత్రి అయి ఉండేవారు కారని ఆయన అన్నారు.
Advertisement
Advertisement