చెన్నైలో ఐదో టెస్టు జరిగేనా! | Jayalalithaa’s death casts shadow over India vs England Test in Chennai | Sakshi
Sakshi News home page

Published Wed, Dec 7 2016 8:21 AM | Last Updated on Thu, Mar 21 2024 6:42 PM

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మృతి నేపథ్యంలో ఒక్కసారిగా అక్కడ పరిస్థితులు మారిపోయాయి. ఇలాంటి స్థితిలో భారత్, ఇంగ్లండ్ మధ్య ఈ నెల 16 నుంచి చెన్నైలో జరగాల్సిన ఐదో టెస్టు నిర్వహణపై సందేహాలు తలెత్తుతున్నాయి. అయితే మున్ముందు పరిస్థితులను బట్టి దీనిపై తుది నిర్ణయం తీసుకుంటామని బీసీసీఐ ప్రకటించింది. ‘బోర్డు ఇంకా దీని గురించి ఆలోచించలేదు. పరిస్థితిని బట్టి, మ్యాచ్ జరిగే సమయంలో నగర అభిమానుల భావోద్వేగాలను దృష్టిలో ఉంచుకొని తదుపరి చర్యల గురించి అసోసియేషన్‌తో చర్చిస్తాం. దీనికి ఎలాంటి తుది గడువూ లేదు. మనకు అవసరమైతే టెస్టు నిర్వహణ కోసం చాలా వేదికలు సిద్ధంగా ఉన్నాయి. దీనర్థం వేదిక మారిందని కాదు. రాష్ట్రంలో పరిణామాలను చూశాక ప్రకటిస్తాం’ అని బీసీసీఐ కార్యదర్శి అజయ్ షిర్కే వెల్లడించారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement