India vs England Test
-
పదిహేడేళ్ల వయసులో తొలి శతకం.. సచిన్‌కు సాటెవ్వరు!
పదిహేడేళ్ల వయసులో.. సరిగ్గా ఇదే రోజు ఓ కుర్రాడు అంతర్జాతీయ క్రికెట్లో తన తొలి శతకం నమోదు చేశాడు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా.. తన అసాధారణ ప్రతిభతో వాటన్నింటిని దాటుకుని.. శతక శతకాల ధీరుడిగా ప్రపంచంలో ఏ క్రికెటర్‌కూ సాధ్యం కాని ఘనత సాధించాడు. అతడే.. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్.టీమిండియా తరఫున 1989లో పాకిస్తాన్‌తో టెస్టు సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన సచిన్.. అదే ఏడాది వన్డేల్లోనూ ఎంట్రీ ఇచ్చాడు. అయితే, మొదటి 15 మ్యాచ్‌లలో ఒక్క శతకం కూడా సాధించలేకపోయిన ఈ ముంబై బ్యాటర్.. 1990లో ఇంగ్లండ్ గడ్డ మీద తన సెంచరీల ప్రయాణానికి నాంది పలికాడు.మాంచెస్టర్‌లో సెంచరీల ప్రయాణానికి నాందిమాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టులో సచిన్ శతకంతో మెరిశాడు. మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో 189 బంతులు ఎదుర్కొని 119 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి.. భారత్ మ్యాచ్‌ను డ్రా చేసుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. ఫలితం ఎలా ఉన్నా సచిన్ కెరీర్లో ఈ మ్యాచ్ మాత్రం చిరస్మరణీయంగా నిలిచిపోతుందనడంలో సందేహం లేదు.వందో సెంచరీ అక్కడేనాడు ఇంగ్లండ్ మీద తొలి సెంచరీ చేసిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. ఆసియా 2012 వన్డే కప్ సందర్భంగా బంగ్లాదేశ్ మీద మీర్పూర్ వేదికగా వందో శతకం బాదాడు. మొత్తంగా టీమిండియా తరఫున 200 టెస్టులు ఆడిన సచిన్ టెండుల్కర్.. 51 శతకాలు, 68 అర్ధ శతకాల సాయంతో 15921 పరుగులు సాధించాడు.ఎవరికీ అందనంత ఎత్తులోఅదే విధంగా.. 463 వన్డేల్లో 49 సెంచరీలు, 96 హాఫ్ సెంచరీలు చేసి 18426 పరుగులు స్కోరు చేశాడు. ఒకే ఒక్క అంతర్జాతీయ టీ20 ఆడిన సచిన్ ఖాతాలో 10 పరుగులు ఉన్నాయి. ఓవరాల్‌గా అంతర్జాతీయ క్రికెట్లో 664 మ్యాచ్‌లు ఆడి 34,357 పరుగులు స్కోరు చేసి.. అత్యధిక పరుగుల వీరుడిగా కొనసాగుతున్నాడు. వంద శతకాలు ఖాతాలో ఉన్నా మొదటి సెంచరీ మాత్రం ఎల్లప్పుడూ ప్రత్యేకమే కదా!! -
IND vs ENG : ఐదో టెస్టు కోసం ప్రాక్టీస్ సెషన్లో టీమిండియా (ఫొటోలు)
-
Ind vs Eng: టీమిండియా బ్యాటింగ్.. ఇద్దరు ప్లేయర్ల అరంగ్రేటం
India vs England, 3rd Test: రాజ్‌కోట్ వేదికగా టీమిండియా- ఇంగ్లండ్ మధ్య మూడో టెస్ట్ మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇక, ఈ టెస్టులో టీమిండియా తరఫున సర్ఫరాజ్ ఖాన్, వికెట్ కీపర్ ధృవ్ జూరెల్‌కు అవకాశం కల్పించడంతో వీరిద్దరూ భారత్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అరగ్రేటం చేశారు. ఇక ఇంగ్లండ్ ఒక మార్పుతో బరిలోకి దిగుతోంది. యువ స్పిన్నర్ షోయబ్ బషీర్ స్థానంలో వెటరన్ పేసర్ మార్క్ వుడ్ తుదిజట్టులోకి వచ్చాడు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఇద్దరు పేసర్లు జేమ్స్ ఆండర్సన్, మార్క్ వుడ్‌లను ఆడించనుంది. కాగా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇంగ్లండ్ హైదరాబాద్ టెస్టులో.. టీమిండియా విశాఖపట్నం టెస్టులో గెలిచాయి. ఇరు జట్లు 1-1తో సమంగా ఉన్నాయి. తుది జట్ల వివరాలు.. టీమిండియా: యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ(కెప్టెన్), శుభమన్ గిల్, రజత్ పాటీదార్, సర్ఫరాజ్ ఖాన్, రవీంద్ర జడేజా, ధృవ్ జురెల్(వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ ఇంగ్లండ్: జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఆలీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్(కెప్టెన్), బెన్ ఫోక్స్(వికెట్ కీపర్), రెహాన్ అహ్మద్, టామ్ హార్ట్లీ, మార్క్ వుడ్, జేమ్స్ ఆండర్సన్ -
టెస్ట్ మ్యాచ్ లో కోహ్లీ ఎంట్రీ..?
-
అక్కడ ఉన్నది జడ్డూ.. అలా వదిలేస్తే ఎలా? పాపం జానీ! వీడియో
హైదరాబాద్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా అదరగొడుతున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబరిచిన జడ్డూ.. రెండో ఇన్నింగ్స్‌లో సైతం తన స్పిన్ మయాజాలాన్ని ప్రదర్శించాడు. ఇంగ్లండ్ బ్యాటర్ జానీ బెయిర్ స్టోను సంచలన బంతితో జడేజా బోల్తా కొట్టించాడు. ఇంగ్లండ్ సెకెండ్ ఇన్నింగ్స్ 28 ఓవర్లో జడేజా.. బెయిర్ స్టోకు అద్బుతమైన డెలివరీని సంధించాడు. జడ్డూ వేసిన బంతిని బెయిర్ స్టో వెనుక్కి వదిలేయాలని నిర్ణయించుకున్నాడు. అయితే మిడిల్లో పడిన బంతి మాత్రం అనూహ్యంగా టర్న్ అయ్యి ఆఫ్ స్టంప్‌ను గిరాటేసింది. దీంతో బెయిర్ స్టో షాక్‌కు గురయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ మారింది. కాగా ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో జడ్డూ 87 పరుగులతో పాటు మూడు కీలక వికెట్లు పడగొట్టాడు. ఇక ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై టీమిండియా అధిపత్యం చెలాయిస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో భారత జట్టు 436 పరుగులకు ఆలౌటైంది. భారత్‌కు మొదటి ఇన్నింగ్స్‌లో 190 పరుగుల ఆధిక్యం లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఇంగ్లండ్ 61 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి 245 పరుగులు చేసింది. pic.twitter.com/PbWQuJr9Jc — Sitaraman (@Sitaraman112971) January 27, 2024 -
అచ్చొచ్చిన ఉప్పల్.. ఇక్కడ టీమిండియాకు తిరుగేలేదు..!
భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా హైదరాబాద్ వేదికగా గురువారం నుంచి తొలి టెస్ట్ ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్ కోసం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇరు జట్ల ఆటగాళ్లు ప్రాక్టీస్‌లో నిమగ్నమై ఉన్నారు. ఐదేళ్ల తర్వాత జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ కావడంతో హైదరాబాద్ నగర వాసులు ఈ మ్యాచ్ చూసేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఉప్పల్ మైదానంలో టీమిండియాకు ఘనమైన ట్రాక్ రికార్డు ఉంది. పరుగుల వరద...వికెట్ల జాతర.. ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఐదు టెస్టులు అభిమానులకు పసందైన క్రికెట్ అందించాయి. ఒకవైపు పరుగుల వరద పారడంతో పాటు వికెట్ల జాతర కూడా కనిపించింది. ఈ వేదికపై తొలిసారిగా 2010 నవంబర్ 12 నుంచి 16 వరకు భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి టెస్టు జరిగింది. అయితే ఈ టెస్టు ‘డ్రా’గా ముగిసింది. ఆ మ్యాచ్‌లో న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 117.3 ఓవర్లలో 350 పరుగులకు ఆలౌటైంది. టిమ్ మెకింటోష్ (102; 10 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీ చేశాడు. భారత బౌలర్లలో జహీర్ ఖాన్, హర్భజన్ సింగ్ నాలుగేసి వికెట్లు తీశారు. ధోని కెపె్టన్సీలో భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 143.4 ఓవర్లలో 472 పరుగులకు ఆలౌటైంది. హర్భజన్ సింగ్ (111 నాటౌట్; 7 ఫోర్లు, 7 సిక్స్‌లు) అజేయ సెంచరీతో అదరగొట్టి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. 122 పరుగులతో వెనుకబడి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్ జట్టును ఓపెనర్ బ్రెండన్ మెకల్లమ్ (225; 22 ఫోర్లు, 4 సిక్స్‌లు) డబుల్ సెంచరీతో ఆదుకున్నాడు. న్యూజిలాండ్ 135 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 448 పరుగులు చేసి భారత జట్టుకు 327 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. భారత జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 17 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 68 పరుగులు చేసింది. అశ్విన్ మాయాజాలం.. 2012 ఆగస్టు 23 నుంచి 26 వరకు ఉప్పల్ స్టేడియంలో న్యూజిలాండ్ జట్టుతో భారత జట్టు రెండో టెస్టు ఆడింది. స్పిన్నర్ రవిచంద్రన్ అశి్వన్ (6/31, 6/54) మ్యాచ్ మొత్తంలో 12 వికెట్లు తీసి భారతజట్టు ఇన్నింగ్స్ 115 పరుగుల తేడాతో గెలుపొందడంలో కీలకపాత్ర పోషించాడు. ముందుగా భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 134.3 ఓవర్లలో 438 పరుగులకు ఆలౌటైంది. చతేశ్వర్ పుజారా (159; 19 ఫోర్లు, 1 సిక్స్) భారీ సెంచరీ చేశాడు. అనంతరం న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 61.3 ఓవర్లలో 159 పరుగులకు ఆలౌటైంది. ఫాలోఆన్ ఆడిన న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 79.5 ఓవర్లలో 164 పరుగులకే ఆలౌటై ఓడిపోయింది. పుజారా ధమాకా.. 2013 మార్చి 2 నుంచి 5 వరకు భారత్, ఆ్రస్టేలియా జట్ల మధ్య ఈ వేదికపై మూడో టెస్టు జరిగింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఇన్నింగ్స్ 135 పరుగుల తేడాతో గెలిచింది. ముందుగా ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌ను 9 వికెట్లకు 237 పరుగులవద్ద డిక్లేర్ చేసింది. భువనేశ్వర్, రవీంద్ర జడేజా మూడేసి వికెట్లు తీశారు. అనంతరం భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 154.1 ఓవర్లలో 503 పరుగులకు ఆలౌటైంది. చతేశ్వర్ పుజారా (204; 30 ఫోర్లు, 1 సిక్స్) డబుల్ సెంచరీ... మురళీ విజయ్ (167; 23 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీ సాధించారు. 266 పరుగులతో వెనుకబడిన రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆ్రస్టేలియా అశి్వన్ (5/63), రవీంద్ర జడేజా (3/33) దెబ్బకు 67 ఓవర్లలో 131 పరుగులకే ఆలౌటై ఓడిపోయింది. కోహ్లి కేక.. 2017 ఫిబ్రవరి 9 నుంచి 13 వరకు భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య ఈ వేదికపై నాలుగో టెస్టు జరిగింది. ఈ మ్యాచ్‌లో భారత్ 208 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. విరాట్ కోహ్లి (204; 24 ఫోర్లు) డబుల్ సెంచరీ... మురళీ విజయ్ (108; 12 ఫోర్లు, 1 సిక్స్), వృద్ధిమాన్ సాహా (106 నాటౌట్; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీలు సాధించారు. దాంతో భారత్ తొలి ఇన్నింగ్స్‌ను 166 ఓవర్లలో 6 వికెట్లకు 687 పరుగులవద్ద డిక్లేర్ చేసింది. అనంతరం బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 127.5 ఓవర్లలో 388 పరుగులకు ఆలౌటైంది. 299 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం పొందిన భారత్ రెండో ఇన్నింగ్స్‌ను 4 వికెట్లకు 159 పరుగుల వద్ద డిక్లేర్ చేసి బంగ్లాదేశ్‌కు 459 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్‌లో 100.3 ఓవర్లలో 250 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. అశ్విన్ (4/73), జడేజా (4/78) బంగ్లాదేశ్‌ను దెబ్బ కొట్టారు. పది వికెట్లతో విజయం.. 2018 అక్టోబర్ 12 నుంచి 14 వరకు భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య ఈ వేదికపై ఐదో టెస్టు జరిగింది. ఈ మ్యాచ్‌లో భారత్ 10 వికెట్లతో ఘనవిజయం నమోదు చేసింది. ముందుగా విండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 311 పరుగులకు ఆలౌటైంది. ఉమేశ్ యాదవ్ 6 వికెట్లు పడగొట్టాడు. అనంతరం భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 367 పరుగులకు ఆలౌటైంది. రిషభ్ పంత్ (92), అజింక్య రహానే (80), పృథ్వీ షా (70) అర్ధ సెంచరీలు చేశారు. 56 పరుగులతో వెనుకబడి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన వెస్టిండీస్ 127 పరుగులకే కుప్పకూలింది. ఉమేశ్ యాదవ్ (4/45), అశి్వన్ (2/24), జడేజా (3/12) విండీస్‌ను కట్టడి చేశారు. అనంతరం విండీస్ నిర్దేశించిన 72 పరుగుల లక్ష్యాన్ని భారత్ వికెట్ కోల్పోకుండా ఛేదించి గెలిచింది. -
ఈనెల 25న భారత్ Vs ఇంగ్లాండ్ తొలి టెస్ట్ మ్యాచ్‌కు సర్వం సిద్ధం
-
భారత్‌పై ఇంగ్లండ్ సూపర్ విక్టరీ.. సిరీస్ సమం (ఫొటోలు)
-
ఎంత పని చేశావు విహారి.. ఆ ఒక్క క్యాచ్ పట్టి ఉంటే..!
ఇంగ్లండ్‌తో జరిగిన ఐదో టెస్టులో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. దాంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్ 2-2లో సమమైంది. కాగా 378 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. ఇంగ్లండ్ విజయంలో బెయిర్ స్టో(114), రూట్(142) పరుగులతో కీలక పాత్ర పోషించారు. అయితే రెండో ఇన్నింగ్స్‌లో బౌలింగ్, బ్యాటింగ్‌లోనే కాకుండా ఫీల్డింగ్‌లోనూ భారత్ తీవ్రంగా నిరాశ పరిచింది. ఇంగ్లండ్ విజయంలో హీరోగా నిలిచిన జానీ బెయిర్ స్టో ఇచ్చిన ఈజీ క్యాచ్‌ను.. సెకెండ్ స్లిప్‌లో హనుమా విహారి జారవిడిచాడు. ఈ తప్పిదానికి భారత్ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. 14 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద బతికిపోయిన బెయిర్ స్టో.. ఏకంగా సెంచరీతో చెలరేగాడు. ఇక సులభమైన క్యాచ్ విడిచి పెట్టిన విహారిపై భారత అభిమానులు మండిపడుతున్నారు. ట్విటర్ వేదికగా విమర్శల వర్షం కురిపిస్తున్నారు. "ఎంత పనిచేశావు విహారి.. క్యాచ్ పట్టి ఉంటే మ్యాచ్ ఫలితం మరో విధంగా ఉండేది" అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ ఐదో టెస్టు స్కోర్ వివరాలు.. టీమిండియా తొలి ఇన్నింగ్స్: 416 ఆలౌట్ ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 284 ఆలౌట్ టీమిండియా రెండో ఇన్నింగ్స్: 245 ఆలౌట్ ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: 378/3 ఫలితం: భారత్‌పై ఇంగ్లండ్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం చదవండి: IND Vs ENG 5th Test: భారత్‌పై ఇంగ్లండ్ సూపర్ విక్టరీ.. సిరీస్ సమం Hanuma vihari dropped catch of Jonny bairstow. #hanumavihari #Vihari dropped catch of #JonnyBairstow #INDvsENG #INDvENG pic.twitter.com/YVp40t0zNs — Shribabu Gupta (@ShribabuG) July 5, 2022 -
టీమిండియాపై ఇంగ్లండ్ అరుదైన ఘనత.. 45 ఏళ్ల రికార్డు బద్దలు..!
టెస్టు క్రికెట్లో టీమిండియాపై ఇంగ్లండ్ సరికొత్త రికార్డు సృష్టించింది. టెస్టుల్లో భారత్‌పై అత్యధిక పరుగుల లక్ష్యాన్ని చేధించిన జట్టుగా ఇంగ్లండ్ రికార్డులక్కెంది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా టీమిండియాతో జరిగిన ఐదో టెస్టులో 378 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ ఛేదించింది. తద్వారా ఈ అరుదైన ఘనతను ఇంగ్లండ్ తన ఖాతాలో వేసుకుంది. అంతకుముందు 1977లో పెర్త్ వేదికగా భారత్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో 339 పరుగుల టార్గెట్‌ను ఆస్ట్రేలియా చేధించింది. ఇప్పటి వరకు అత్యధికం కాగా.. తాజా మ్యాచ్‌తో ఆసీస్ రికార్డును ఇంగ్లండ్ బ్రేక్ చేసింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. భారత్‌పై ఇంగ్లండ్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 378 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో బెయిర్ స్టో(114), రూట్(142) పరుగులతో రాణించారు. కాగా ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-2తో ఇంగ్లండ్ సమం చేసింది. ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ ఐదో టెస్టు స్కోర్ వివరాలు.. టీమిండియా తొలి ఇన్నింగ్స్: 416 ఆలౌట్ ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 284 ఆలౌట్ టీమిండియా రెండో ఇన్నింగ్స్: 245 ఆలౌట్ ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: 378/3 ఫలితం: భారత్‌పై ఇంగ్లండ్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం చదవండి: IND Vs ENG 5th Test: భారత్‌పై ఇంగ్లండ్ సూపర్ విక్టరీ.. సిరీస్ సమం -
భారత్‌పై ఇంగ్లండ్ సూపర్ విక్టరీ.. సిరీస్ సమం
ఎడ్డ్‌బాస్టన్ వేదికగా భారత్‌తో జరిగిన ఐదో టెస్టులో ఇంగ్లండ్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దాంతో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను ఇంగ్లండ్ 2-2తో సమం చేసింది. గతేడాది జరిగిన నాలుగు టెస్టుల్లో భారత్ రెండు, ఇంగ్లండ్ ఒక్క మ్యాచ్‌లో విజయం సాధించగా.. మరో మ్యాచ్ డ్రా ముగిసింది. ఇక 378 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. ఇంగ్లండ్ బ్యాటరల్లో జానీ బెయిర్‌స్టో(114), జో రూట్ (142) సెంచరీలతో చెలరేగారు. ఈ మ్యాచ్ రెండు ఇన్నింగ్స్‌లోనూ బెయిర్‌స్టో సెంచరీలు సాధించాడు. ఇక తొలి ఇన్నింగ్స్‌లో అదరగొట్టిన భారత బౌలర్లు రెండో ఇన్నింగ్స్‌లో పూర్తిగా తెలిపోయారు. కెప్టెన్ బుమ్రా తప్ప మిగితా బౌలర్లు ఒక్క వికెట్ కూడా సాధించలేకపోయారు. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 416 పరుగులకు ఆలౌటైంది. భారత బ్యాటర్లలో పంత్(146), జడేజా అద్భుతమైన సెంచరీలు సాధించారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 284 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో బెయిర్ స్టో(106) తప్ప మిగితా బ్యాటర్లు ఎవరూ రాణించలేదు. భారత బౌలర్లలో సిరాజ్ నాలుగు, బుమ్రా మూడు, షమీ రెండు వికెట్లు సాధించారు. ఇక తొలి ఇన్నింగ్స్‌లో లభించిన 132 పరుగల అధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన భారత్ 245 పరుగులకే ఆలౌటైంది. భారత్ రెండో ఇన్నింగ్స్‌లో పుజారా(66),పంత్(57) పరుగులతో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో కెప్టెన్ స్టోక్స్ నాలుగు వికెట్లతో అదరగొట్టగా.. బ్రాడ్, పాట్స్ తలా రెండు, అండర్సన్,జాక్ లీచ్ చెరో వికెట్ సాధించారు. ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ ఐదో టెస్టు స్కోర్ వివరాలు.. టీమిండియా తొలి ఇన్నింగ్స్: 416 ఆలౌట్ ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 284 ఆలౌట్ టీమిండియా రెండో ఇన్నింగ్స్: 245 ఆలౌట్ ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: 378/3 ఫలితం: భారత్‌పై ఇంగ్లండ్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం This team. This way of playing. Simply irresistible ❤️ Scorecard/Clips: https://t.co/jKoipF4U01 🏴 #ENGvIND 🇮🇳 pic.twitter.com/Phl1BNkGol — England Cricket (@englandcricket) July 5, 2022 -
'టీమిండియా ఓటమి చెందితే పూర్తి బాధ్యత బ్యాటర్లదే'
Update: ఐదో టెస్టులో భారత్‌పై ఇంగ్లండ్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 378 పరుగులు లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఇంగ్లండ్ బ్యాటరల్లో జానీ బెయిర్‌స్టో(114), జో రూట్ (142) సెంచరీలతో చెలరేగారు. సిరీస్2-2తో సమమైంది. ఎడ్డ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతోన్న ఐదో టెస్టులో టీమిండియా ఓటమి దిశగా అడుగులు వేస్తోంది. 378 పరుగులు లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ నాలుగో రోజు ఆట మగిసే సమయానికి మూడు వికెట్లు కోల్పోయి 259 పరుగులు చేసింది. ఇంగ్లండ్ విజయానికి మరో 119 పరుగుల దూరంలో నిలిచింది. అయితే 378 పరుగుల లక్ష్యాన్ని ఢిపెండ్ చేయడంలో భారత్ విఫలమైతే.. ఓటమికి టీమిండియా బ్యాటర్లే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. "ఈ మ్యాచ్‌లో భారత బ్యాటర్లు పూర్తిగా విఫలమయ్యారు. తొలి ఇన్నింగ్స్‌లో పంత్, జడేజా, రెండో ఇన్నింగ్స్‌లో పుజారా,పంత్ తప్ప మిగితా బ్యాటర్లు ఎవరూ రాణించలేదు. టెస్టుల్లో ఎక్కువ మంది బ్యాటర్లు రాణించకపోతే.. ప్రత్యర్ధి జట్టుపై అధిపత్యం చెలాయించాలేం. ఒక వేళ ఈ మ్యాచ్‌లో భారత్ ఓటమి చెందితే.. పూర్తి బాధ్యతే బ్యాటర్లదే. ఇక ఈ టెస్టులో పంత్ తన పని తాను చేసుకుపోయాడు. అతడు రెండో ఇన్నింగ్స్‌లో అనఅవసరమైన షాట్‌కు ప్రయత్నించి తన వికెట్‌ను కోల్పోయాడని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. కానీ పరిస్థితులను బట్టి పంత్ రివర్స్ స్వీప్ షాట్ ఆడాడాని భావిస్తున్నాను" అని యూట్యూబ్ ఛానల్లో ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు. చదవండి: IND VS ENG 5th Test Day 5: భారత అభిమానులను కలవరపెడుతున్న పంత్ ట్రాక్ రికార్డు -
IND vs ENG 5th Test: ఐదో టెస్టులో ఇంగ్లండ్ ఘన విజయం
ఐదో టెస్టులో ఇంగ్లండ్ ఘన విజయం ఎడ్డ్‌బాస్టన్ వేదికగా భారత్‌తో జరిగిన రీషెడ్యూల్డ్ ఐదో టెస్టులో ఇంగ్లండ్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. . దాంతో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ 2-2తో సమమైంది. గతేడాది జరిగిన నాలుగు టెస్టుల్లో భారత్ రెండు, ఇంగ్లండ్ ఒక్క మ్యాచ్‌లో విజయం సాధించగా.. మరో మ్యాచ్ డ్రా ముగిసింది. 378 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ కేవలం మూడు వికెట్లు కోల్పోయి చేధించింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో జానీ బెయిర్‌స్టో(114), జో రూట్ (142) సెంచరీలతో చెలరేగారు. జానీ బెయిర్ స్టో సెంచరీ.. తొలి ఇన్నింగ్స్‌లో శతకంతో జట్టును అదుకున్న జానీ బెయిర్ స్టో.. రెండో ఇన్నింగ్‌లోనూ సెంచరీతో మెరిశాడు. 126 బంతుల్లో బెయిర్ స్టో సెంచరీను పూర్తి చేశాడు. ఇక ఇంగ్లండ్ విజయానికి 21 పరుగులు కావాలి. క్రీజులో బెయిర్ స్టో(100), రూట్(135) పరుగులతో ఉన్నారు. 69 ఓవర్లకు ఇంగ్లండ్ స్కోర్: 325/3 69 ఓవర్లకు ముగిసే సరికి ఇంగ్లండ్ మూడు వికెట్లు కోల్పోయి 325 పరుగులు చేసింది. క్రీజులో రూట్(113), బెయిర్ స్టో(92) పరుగులతో ఉన్నారు. ఇంగ్లండ్ విజయానికి 53 పరుగులు కావాలి. జో రూట్ సెంచరీ.. ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జోరూట్ సెంచరీతో చెలరేగాడు. 137 బంతుల్లో రూట్ సెంచరీ సాధించాడు (14 ఫోర్లు). ఇక విజయానికి ఇంగ్లండ్ మరింత చేరువైంది. గెలుపుకు కేవలం 59 పరుగుల దూరంలో ఇంగ్లండ్ నిలిచింది. 63 ఓవర్లకు స్కోర్: 298/3 63 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్ 298 పరుగులు చేసింది. ఇంకా ఇంగ్లండ్ విజయానికి 80 పరుగులు కావాలి. జులో జానీ బెయిర్ స్టో(92), జోరూట్(87) పరుగులతో ఉన్నారు. గెలుపు దిశగా ఇంగ్లండ్.. 59 ఓవర్లకు స్కోర్: 271/3 ఐదో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్ 59 ఓవర్లు ముగిసే సరికి మూడు వికెట్లు నష్టానికి 271 పరుగులు చేసింది. ఇంకా ఇంగ్లండ్ విజయానికి 107 పరుగులు కావాలి. జులో జానీ బెయిర్ స్టో(83), జోరూట్(78) పరుగులతో ఉన్నారు. ఐదో రోజు ఆట ప్రారంభం ఎడ్జ్‌బాస్టన్ వేదికగా భారత్‌తో జరుగుతోన్న ఐదో టెస్టు అఖరి రోజు ఆటను ఇంగ్లండ్ ప్రారంభించింది. 378 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి మూడు వికెట్లు కోల్పోయి 259 పరుగులు చేసింది. ఇంగ్లండ్ విజయానికి మరో 119 పరుగుల దూరంలో నిలిచింది. క్రీజులో జానీ బెయిర్ స్టో(72), జోరూట్(76 ) పరుగులతో ఉన్నారు. ఇక భారత్ విజయం సాధించాలంటే బౌలర్లు ఏదైనా అద్భుతం చేయాల్సిందే. -
కపిల్ దేవ్ రికార్డును బద్దలు కొట్టిన బుమ్రా.. 40 ఏళ్ల తర్వాత..!
టెస్టుల్లో ఇంగ్లండ్‌పై టీమిండియా స్టాండింగ్ కెప్టెన్, పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా సరికొత్త చరిత్ర సృష్టించాడు. కరోనా కారణంగా గతేడాది ఇంగ్లండ్‌తో వాయిదా పడిన ఐదో టెస్టు ఎడ్డ్‌బాస్టన్ వేదికగా జరుగుతోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ టెస్టు సిరీస్‌లో ఇప్పటి వరకు 23 వికెట్లు పడగొట్టిన బుమ్రా.. ఇంగ్లండ్‌తో ఒకే సిరీస్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన భారత పేసర్‌గా రికార్డులకెక్కాడు. అంతకుముందు 1981-82 ఇంగ్లండ్ సిరీస్‌లో భారత దిగ్గజం కపిల్ దేవ్ ఇంగ్లండ్‌పై 22 వికెట్లు పడగొట్టాడు. ఇప్పటి వరకు ఇదే అత్యధికం కాగా.. తాజా సిరీస్‌లో కపిల్ దేవ్ రికార్డును బుమ్రా బద్దలు కొట్టాడు. ఇక 14 వికెట్లు పడగొట్టి భువనేశ్వర్ కుమార్ మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. చదవండి: ICC Player Of Month Nominations: ప్లేయర్ ఆఫ్ మంత్ అవార్డు రేసులో ఉన్న క్రికెటర్లు వీరే -
టెస్టుల్లో పంత్ అరుదైన రికార్డు.. 49 ఏళ్ల తర్వాత..!
టెస్టు క్రికెట్లో రిషబ్ పంత్ అరుదైన రికార్డు సాధించాడు. ఇంగ్లండ్‌తో జరుగుతోన్న ఐదో టెస్టులో సెంచరీతో చెలరేగిన పంత్.. రెండో ఇన్నింగ్స్‌లో అర్ధసెంచరీతో మెరిశాడు. తద్వారా ఒకే టెస్టులో సెంచరీ, అర్ద సెంచరీ సాధించిన రెండో భారత వికెట్ కీపర్‌గా పంత్ రికార్డులకెక్కాడు. ఈ మ్యాచ్‌లో పంత్ తొలి ఇన్నింగ్స్‌లో 146 పరుగులు చేయగా, రెండో ఇన్నింగ్స్‌లో 57 పరుగులు సాధించాడు. That's another half-century for @RishabhPant17 👏👏#TeamIndia now leads by 316 runs. Live - https://t.co/LL20D1K7si #ENGvIND pic.twitter.com/xXA2WLJcHF — BCCI (@BCCI) July 4, 2022 ఇక అంతకుముందు 1973లో భారత మాజీ వికెట్ కీపర్ ఫరోఖ్ ఇంజనీర్ ఇంగ్లండ్‌పై రెండు ఇన్నింగ్స్‌లలో వరుసగా సెంచరీ, హాప్ సెంచరీ సాధించాడు. అతడు తొలి ఇన్నింగ్స్‌లో 121 పరుగులు చేయగా, రెండో ఇన్నింగ్స్‌లో 66 పరుగులు చేశాడు. అదే విధంగా ఒకే టెస్టులో అత్యధిక పరుగులు చేసిన మూడో భారత వికెట్ కీపర్‌గా పంత్(203) నిలిచాడు. 230 పరుగులతో బుద్ధి కుందరన్ తొలి స్ధానంలో ఉండగా, ఎంస్ ధోని 224 పరగులతో రెండో స్థానంలో ఉన్నాడు. చదవండి: Virat Kohli Vs Jonny Bairstow: కావాలని రెచ్చగొడితే ఇదిగో ఇలాగే ఉంటది మరి? -
'టెస్టు క్రికెట్లో నేను చూసిన అత్యుత్తమ భాగస్వామ్యం ఇదే'
ఇంగ్లండ్‌తో జరుగుతోన్న ఐదో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో అదరగొట్టిన టీమిండియా ఆటగాళ్లు రిషబ్ పంత్, రవీంద్ర జడేజాపై దక్షిణాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 98 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన భారత జట్టును పంత్, జడేజా అద్భుతమైన ఇన్నింగ్స్‌తో అదుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ ఆరో వికెట్‌కు 222 పరుగుల రికార్డు బాగస్వామ్యం నెలకొల్పారు. పంత్ 146 పరుగులు సాధించగా, జడేజా 104 పరుగులు చేశాడు. "నేను ఇంటి వద్ద లేకపోవడంతో అద్భుతమైన మ్యాచ్‌ను వీక్షించలేకపోయాను. కానీ హైలెట్స్‌ను మాత్రం మిస్ కాకుండా చూశాను. ఈ మ్యాచ్‌లో బౌలర్లపై ఎదురుదాడికి దిగి పంత్, జడేజా రికార్డు భాగస్వామ్యం నమోదు చేశారు. నేను టెస్టు క్రికెట్లో చూసిన అత్యత్తుమ భాగస్వామ్యం" ఇదే అని ట్విటర్లో డివిలియర్స్ పేర్కొన్నాడు. ఇక టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 416 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 284 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో జానీ బెయిర్ స్టో(106 పరుగులు) తప్ప మిగితా బ్యాటర్ల అంతా విఫలమయ్యారు. చదవండి: Ind Vs Eng: 257 పరుగుల ఆధిక్యం.. ఇంగ్లండ్‌కు కష్టమే.. టీమిండియాదే విజయం: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ Haven’t been home and missed most of the Cricket action. Finished watching the highlights now. That counterattack partnership from @RishabhPant17 and @imjadeja is right up there with the best I’ve ever seen in Test Cricket! — AB de Villiers (@ABdeVilliers17) July 4, 2022 -
IND vs ENG 5th Test: 57 ఓవర్లకు ఇంగ్లండ్ స్కోర్ 259/3
కష్టాల్లో టీమిండియా రూట్, బెయిర్‌స్టో భారీ భాగస్వామ్యం నెలకొల్పడం విజయంపై ఆశలు పెట్టుకున్న టీమిండియాకు షాక్ తగలిలేలా ఉంది. నాలుగోరోజు ఆటముగిసే సమయానికి 57 ఓవర్లు ఆడిన ఇంగ్లండ్ 259/3 తో నిలిచింది. రూట్ 76 (112), బెయిర్‌స్టో 72 (87) పరుగులతో క్రీజులో ఉన్నారు. 42 ఓవర్లకు ఇంగ్లండ్ స్కోర్: 181/3 42 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్ మూడు వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. క్రీజులో జో రూట్(47),బెయిర్ స్టో(25) పరుగులతో ఉన్నారు. 38 ఓవర్లకు ఇంగ్లండ్ స్కోర్: 157/3 38 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్ మూడు వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. క్రీజులో జో రూట్(30),బెయిర్ స్టో(18) పరుగులతో ఉన్నారు. 26 ఓవర్లకు ఇంగ్లండ్ స్కోర్: 114/3 ఇంగ్లండ్ వరుస క్రమంలో రెండు వికెట్లు కోల్పోయింది. బుమ్రా బౌలింగ్‌లో పోప్ డకౌట్ కాగా, లీస్(56) రనౌట్ అయ్యాడు. 26 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్ మూడు వికెట్ల నష్టానికి 114 పరుగులు చేసింది. క్రీజులో రూట్, బెయిర్ స్టో ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్ 107 పరుగుల వద్ద ఇంగ్లండ్ తొలి వికెట్ కోల్పోయింది. 46 పరుగులు చేసిన క్రాలే.. బుమ్రా బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. దూకుడుగా ఆడుతోన్న ఇంగ్లండ్.. 18 ఓవర్లకు 90 పరుగులు 378 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ దూకుడుగా ఆడుతోంది. 18 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్ వికెట్ నష్టపోకుండా 90 పరుగులు చేసింది. క్రీజులో లీస్(53),క్రాలీ(36) పరుగులతో ఉన్నారు 9 ఓవర్లకు ఇంగ్లండ్ స్కోర్: 53/0 9 ఓవర్లు మగిసే సరికి ఇంగ్లండ్ వికెట్ నష్టపోకుండా 53 పరుగులు చేసింది. క్రీజులో లీస్(27),క్రాలీ(21) పరుగులతో ఉన్నారు 3 ఓవర్లకు ఇంగ్లండ్ స్కోర్: 18/0 378 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ మూడు ఓవర్లు ముగిసే సరికి 18 పరుగులు చేసింది. క్రీజులో లీస్(17),క్రాలీ(1) పరుగులతో ఉన్నారు 245 పరుగులకు భారత్ ఆలౌట్.. ఇంగ్లండ్ టార్గెట్ 378 ఇంగ్లండ్‌తో జరుగుతోన్న ఐదో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా 245 పరుగులకు ఆలౌటైంది. భారత ఘినఇన్నింగ్స్లో పుజారా(66), పంత్(57) తప్ప మిగితా బ్యాటర్లు విఫలమయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో స్టోక్స్ నాలుగు వికెట్లు, పాట్స్, బ్రాడ్ చెరో రెండు వికెట్లు, అండర్సన్, లీచ్ తలా వికెట్ సాధించారు. ఇక తొలి ఇన్నింగ్స్‌లో లభించిన 132 పరుగులతో కలిపి టీమిండియా ఓవరాల్‌గా 377 పరుగల అధిక్యం సాధించింది. ఇంగ్లండ్ విజయ లక్ష్యం 378 పరుగులు. తొమ్మిదో వికెట్ కోల్పోయిన భారత్ 236 పరుగుల వద్ద భారత్ తొమ్మిదో వికెట్ కోల్పోయింది. 23 పరుగులు చేసిన జడేజా.. స్టోక్స్ బౌలింగ్‌లొ క్లీన్ బౌల్డయ్యాడు. ఎనిమిదో వికెట్ కోల్పోయిన భారత్ 230 పరుగుల వద్ద టీమిండియా ఎనిమిదో వికెట్ కోల్పోయింది. షమీ(13) స్టోక్స్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. క్రీజులో జడేజా, బుమ్రా ఉన్నారు. లంచ్ బ్రేక్.. టీమిండియా స్కోర్: 229/7 లంచ్ విరామానికి టీమిండియా ఏడు వికెట్లు కోల్పోయి 229 పరుగులు చేసింది. క్రీజులో జడేజా(17),షమీ(13) పరుగులతో ఉన్నారు ఏడో వికెట్ కోల్పోయిన భారత్ టీమిండియా వరుస క్రమంలో వికెట్లు కోల్పోతోంది. 4 పరుగులు చేసిన శార్థూల్ ఠాకూర్.. పాట్స్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులో షమీ, జడేజా ఉన్నారు. 67 ఓవర్లకు భారత్ స్కోర్: 203/6 67 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా ఆరు వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. క్రీజులో జడేజా(8),శార్థూల్ ఠాకూర్(1) ఉన్నారు. ఆరో వికెట్ కోల్పోయిన భారత్.. పంత్ ఔట్ 198 పరుగుల వద్ద టీమిండియా ఆరో వికెట్ కోల్పోయింది. 57 పరుగులు చేసిన పంత్.. జాక్ లీచ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి శార్థూల్ ఠాకూర్ వచ్చాడు. ఐదో వికెట్ కోల్పోయిన భారత్.. అయ్యర్ ఔట్ తొలి ఇన్నింగ్స్‌లో విఫలమైన శ్రేయస్ అయ్యర్.. రెండో ఇన్నింగ్స్‌లో కూడా నామమాత్రపు స్కోర్‌కే పరిమితమయ్యాడు. 26 బంతుల్లో 19 పరుగులు చేసిన అయ్యర్, పాట్స్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. 59.2 ఓవర్లకు భారత్ స్కోర్: 186/4 58 ఓవర్లు భారత్ స్కోర్: 178/4 58 ఓవర్లు ముగిసేసరికి భారత్ నాలుగు వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. క్రీజులో పంత్(46),శ్రేయస్ అయ్యర్(18) పరుగులతో ఉన్నారు. నాలుగో వికెట్ కోల్పోయిన టీమిండియా 153 పరుగుల వద్ద టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. 66 పరుగులు చేసిన ఛతేశ్వర్ పుజారా.. బ్రాడ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి శ్రేయస్ అయ్యర్ వచ్చాడు. 52 ఓవర్లకు టీమిండియా స్కోర్: 152/3 నాలుగో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా నిలకడగా ఆడుతోంది. 52 ఓవర్లు ముగిసే సరికి భారత్ మూడు వికెట్లు నష్టానికి 152 పరుగులు చేసింది. క్రీజులో పుజారా(66),పంత్(38) పరుగులతో ఉన్నారు. 47 ఓవర్లకు టీమిండియా స్కోర్: 131/3 47 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా మూడు వికెట్ట నష్టానికి 131 పరుగులు చేసింది. క్రీజులో పుజారా(53),పంత్(31) పరుగులతో ఉన్నారు, సమయం 15:00 Pm: 125/3 ఓవర్‌నైట్ స్కోర్‌తో నాలుగో రోజు ఆటను టీమిండియా ప్రారంభించింది. క్రీజులో పుజారా(50),పంత్(30) పరుగులతో ఉన్నారు,3 -
'బుమ్రాకు టెస్టు క్రికెట్ ఆడటం ఈజీగా ఉన్నట్టు ఉంది'
ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతోన్న ఐదో టెస్టులో టీమిండియా స్టాండ్ ఇన్ కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా అదరగొడుతున్నాడు. బ్యాటింగ్‌లో కేవలం 16 బంతుల్లోనే 31 పరుగులు చేసిన బుమ్రా... బౌలింగ్‌లో మూడు కీలక వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్‌ను దెబ్బతీశాడు. ఈ క్రమంలో బుమ్రాపై మాజీ ఆటగాళ్లు, అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా ఈ జాబితాలో టీమిండియా మాజీ పేసర్ అజిత్ అగార్కర్ కూడా చేరాడు. కెప్టెన్‌గా బమ్రా బ్యాటింగ్, బౌలింగ్‌లో అద్భుతంగా రాణించడాని అగార్కర్ కొనియాడాడు. "ఇదే సిరీస్‌లో లార్డ్స్ టెస్టులో బుమ్రా, షమీ భాగస్వామ్యమే భారత్‌ను గెలిపించింది. ఈ మ్యాచ్‌లో స్టువర్ట్ బ్రాడ్ మెరుగ్గా బౌలింగ్ చేయడంలో విఫలమయ్యాడు. దానిని జస్ప్రీత్ చక్కగా అందిపుచ్చుకున్నాడు. ప్రస్తుతం బుమ్రాకు వైట్ బాల్ క్రికెట్ కంటే టెస్టు క్రికెట్ ఆడడం సులభంగా"ఉన్నట్టు ఉంది అని అగార్కర్ పేర్కొన్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో 416 పరుగులకు ఆలౌటైంది. ఇక రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 84 పరుగులు చేసింది. చదవండి: ENG vs IND: 19 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టిన బుమ్రా.. అభినందించిన బ్రియాన్ లారా -
19 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టిన బుమ్రా.. అభినందించిన బ్రియాన్ లారా
టెస్టుల్లో తన రికార్డు బద్దలు కొట్టిన టీమిండియా స్టాండింగ్ కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రాను వెస్టిండీస్ దిగ్గజం బ్రియాన్ లారా అభినందించాడు. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతోన్న ఐదో టెస్టులో 84 ఓవర్ వేసిన స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో బుమ్రా ఏకంగా 29 పరుగులు రాబట్టాడు. తద్వారా టెస్టు క్రికెట్లో ఒకే ఓవర్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా బుమ్రా ప్రపంచ రికార్డు సాధించాడు. కాగా అంతకుమందు 2003లో జొహన్నెస్‌బర్గ్‌లో దక్షిణాఫ్రికా బౌలర్ ఆర్.పీటర్సన్ బౌలింగ్‌లో బ్రియన్ లారా 28 పరుగులు రాబట్టాడు. ఇప్పుడు బుమ్రా దాదాపు 19 ఏళ్ల లారా రికార్డు బద్దలు కొట్టాడు. “టెస్ట్‌లలో ఒకే ఓవర్లో అత్యధిక పరుగుల రికార్డును బద్దలు కొట్టినందుకు అభినందనలు. అద్భుతంగా ఆడావు బుమ్రా" అంటూ లారా ట్వీట్ చేశాడు. ఇక మ్యాచ్ విషయానకి వస్తే.. టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 416 పరుగులకు ఆలౌటైంది. పంత్(146),రవీంద్ర జడేజా(104) పరుగులతో రాణించారు. ఇక రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 84 పరుగులు చేసింది. జో రూట్ (31) టాప్ స్కోరర్‌గా నిలవగా...ప్రస్తుతం బెయిర్‌స్టో (12 బ్యాటింగ్), స్టోక్స్ (0 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నారు. Join me in congratulating the young @Jaspritbumrah93 on breaking the record of Most Runs in a Single Over in Tests. Well done!🏆#icctestchampionship #testcricket #recordbreaker pic.twitter.com/bVMrpd6p1V — Brian Lara (@BrianLara) July 2, 2022 -
ఒకే ఓవర్లో 29 పరుగులు.. బుమ్రా ప్రపంచ రికార్డు..!
టెస్టు క్రికెట్లో టీమిండియా ఆటగాడు, స్టాండింగ్ కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. టెస్టుల్లో ఒకే ఓవర్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా బుమ్రా రికార్డులకెక్కాడు. ఇంగ్లండ్‌తో జరుగుతోన్న ఐదో టెస్టులో 84 ఓవర్ వేసిన స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో ఏకంగా బుమ్రా 29 పరుగులు రాబట్టాడు. తద్వారా ఈ అరుదైన ఘనతను బుమ్రా తన పేరిట లిఖించుకున్నాడు. ఇక ఓవరాల్‌గా ఈ ఓవర్లో బ్రాడ్ ఆరు ఎక్స్‌ట్రాలతో కలిపి 35 పరుగులు సమర్పించుకున్నాడు. అంతకుమందు 2003లో జొహన్నెస్‌బర్గ్‌లో దక్షిణాఫ్రికా బౌలర్ ఆర్.పీటర్సన్ బౌలింగ్‌లో వెస్టిండీస్ దిగ్గజం బ్రియన్ లారా 28 పరుగులు రాబట్టాడు. ఇప్పుడు వరకు అదే ప్రపంచ రికార్డు కాగా.. ఇప్పుడు బుమ్రా 29 పరుగులు సాధించి లారా రికార్డును బద్దలు కొట్టాడు. ఇక తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 416 పరుగులకు ఆలౌటైంది. భారత ఇన్నింగ్స్‌లో రిషబ్ పంత్(146), జడేజా(104) పరుగులతో రాణించారు. ఇక ఇంగ్లండ్ బౌలర్లలో జేమ్స్ అండర్సన్ 5 వికెట్లు, పొట్స్ 2 వికెట్లు,బ్రాడ్,రూట్,స్టోక్స్ తలా వికెట్ సాధించారు. చదవండి: ENG vs IND: టెస్టుల్లో జడేజా అరుదైన ఫీట్.. నాలుగో భారత ఆటగాడిగా..! BOOM BOOM BUMRAH IS ON FIRE WITH THE BAT 🔥🔥 3️⃣5️⃣ runs came from that Broad over 👉🏼 The most expensive over in the history of Test cricket 🤯 Tune in to Sony Six (ENG), Sony Ten 3 (HIN) & Sony Ten 4 (TAM/TEL) - https://t.co/tsfQJW6cGi#ENGvINDLIVEonSonySportsNetwork #ENGvIND pic.twitter.com/Hm1M2O8wM1 — Sony Sports Network (@SonySportsNetwk) July 2, 2022 -
టెస్టు క్రికెట్ చరిత్రలోనే బ్రాడ్ అత్యంత చెత్త రికార్డు.. తొలి బౌలర్‌గా..!
టెస్టు క్రికెట్ చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డును ఇంగ్లండ్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ నమోదు చేశాడు. టెస్టుల్లో ఒకే ఓవర్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్‌గా బ్రాడ్ నిలిచాడు. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా టీమిండియాతో జరుగుతోన్న ఐదో టెస్టులో 84 ఓవర్ వేసిన బ్రాడ్.. ఏకంగా 35 పరుగులు సమర్పించుకుని ఈ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఓవర్లో టీమిండియా కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా 29 పరుగుల రాబట్టగా, 6 పరుగులు ఎక్స్‌ట్రాల రూపంలో వచ్చాయి. అంతకు ముందు 2003లో దక్షిణాఫ్రికా బౌలర్ ఆర్ పీటర్సన్ ఒకే ఓవర్లో 28 పరుగులు ఇచ్చాడు. ఇప్పడు బ్రాడ్ 35 పరుగులు ఇచ్చిఈ చెత్త రికార్డును తన పేరిట లిఖించికున్నాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 416 పరుగులకు ఆలౌటైంది. భారత ఇన్నింగ్స్‌లో రిషబ్ పంత్(146), జడేజా(104) పరుగులతో రాణించారు. ఇక ఇంగ్లండ్ బౌలర్లలో జేమ్స్ అండర్సన్ 5 వికెట్లు, పొట్స్ 2 వికెట్లు,బ్రాడ్,రూట్,స్టోక్స్ తలా వికెట్ సాధించారు. చదవండి: ENG vs IND: టెస్టుల్లో జడేజా అరుదైన ఫీట్.. నాలుగో భారత ఆటగాడిగా..! #Bumrah The most expensive over in Test cricket history - Jasprit Bumrah remember the name…#JaspritBumrah #Bumrah#StuartBroad #ENGvsIND#INDvsENG #ENGvIND#ViratKohli #RishabhPant pic.twitter.com/LvbPTqf0ZV — ARPITA ARYA (@ARPITAARYA) July 2, 2022 -
రెండో రోజు ముగిసిన ఆట.. ఇంగ్లండ్ 84/5
టీమిండియా, ఇంగ్లండ్‌ల మధ్య జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో రెండోరోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 27 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 84 పరుగులు చేసింది. బెయిర్ స్టో 12, బెన్ స్టోక్స్(0) క్రీజులో ఉన్నారు. టీమిండియా బౌలర్లలో బుమ్రా 3, షమీ ఒక వికెట్ తీశాడు. కాగా తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 416 పరుగులకు ఆలౌట్ కాగా.. ఇంగ్లండ్ ఇంకా 332 పరుగులు వెనుకబడి ఉంది. ►24 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్ 4 వికెట్ల నష్టానికి 79 పరుగులు చేసింది. బెయిర్ స్టో 11, జాక్ లీచ్ సున్నా పరుగులతో క్రీజులో ఉన్నారు. ►15 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్ మూడు వికెట్లు కోల్పోయి 60 పరుగులు చేసింది. క్రీజులో రూట్, బెయిర్‌స్టో ఉన్నారు. ►8 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్ రెండు వికెట్లు కోల్పోయి 39 పరుగులు చేసింది. క్రీజులో రూట్, పోప్ ఉన్నారు 6 ఓవర్లకు ఇంగ్లండ్ స్కోర్: 30/2 6 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్ రెండు వికెట్లు కోల్పోయి 30 పరుగులు చేసింది. క్రీజులో రూట్, పోప్ ఉన్నారు రెండో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్ 27 పరుగుల వద్ద ఇంగ్లండ్ రెండో వికెట్ కోల్పోయింది. 9 పరుగులు చేసిన జాక్ క్రాలీ.. జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో శుబ్మాన్ గిల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. రెండో రోజు ఆటకు వరుణుడు ఆటంకం ఇంగ్లండ్-భారత్ రెండో రోజు ఆటకు వర్షం కలిగించింది. ఆట నిలిచిపోయే సమయానికి ఇంగ్లండ్ వికెట్ కోల్పోయి 16 పరుగులు చేసింది. క్రీజులో జాక్ క్రాలీ, పోప్ ఉన్నారు. తొలి వికెట్‌ను కోల్పోయిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌ను ఆరంభించిన ఇంగ్లండ్ 16 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. 6 పరుగులు చేసిన లీస్ బుమ్రా బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. భారత్ 416 పరుగులకు ఆలౌట్ ఇంగ్లండ్‌తో జరుగుతోన్న ఐదో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 416 పరుగులకు ఆలౌటైంది. టీమిండియా బ్యాటర్లలో రిషబ్ పంత్(146), జడేజా(104) పరుగులతో రాణించారు. అఖరిలో కెప్టెన్ బుమ్రా మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 16 బంతుల్లో 31పరుగులు సాధించాడు. ఇక ఇంగ్లండ్ బౌలర్లలో జేమ్స్ అండర్సన్ 5 వికెట్లు, పొట్స్ 2 వికెట్లు,బ్రాడ్,రూట్,స్టోక్స్ తలా వికెట్ సాధించారు. తొమ్మిదో వికెట్ కోల్పోయిన భారత్.. జడేజా ఔట్ 375 పరుగుల వద్ద టీమిండియా తొమ్మిదో వికెట్ కోల్పోయింది. 104 పరుగులు చేసిన రవీంద్ర జడేజా.. అండర్సన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. ఎనిమిదో వికెట్ కోల్పోయిన భారత్ 371 పరుగులు వద్ద భారత్ ఎనిమిదో వికెట్ కోల్పోయింది. 16 పరుగులు చేసిన షమీ.. బ్రాడ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి కెప్టెన్ బుమ్రా వచ్చాడు. సెంచరీతో చెలరేగిన జడేజా.. టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా సెంచరీతో చెలరేగాడు. 183 బంతుల్లో జడేజా సెంచరీ సాధించాడు. 79 ఓవర్ల ముగిసేసరికి టీమిండియా 7 వికెట్ల నష్టానికి 371 పరుగులు చేసింది. క్రీజులో జడేజా, షమీ ఉన్నారు. 77 ఓవర్లకు టీమిండియా స్కోర్: 357/7 77 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 7 వికెట్ల నష్టానికి 351 పరుగులు చేసింది. క్రీజులో జడేజా(87),షమీ(9) పరుగులతో ఉన్నారు. రెండో రోజు ఆటను ప్రారంభించిన భారత్ 338/7 ఓవర్‌నైట్ స్కోర్‌తో టీమిండియా రెండో రోజు ఆటను ప్రారంభించింది. క్రీజులో రవీంద్ర జడేజా(83),షమీ ఉన్నారు. -
పంత్ ఒక వరల్డ్ క్లాస్ ప్లేయర్.. అతడి ఇన్నింగ్స్‌కు హ్యాట్సాఫ్: ఇంగ్లండ్ కోచ్
ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతోన్న తొలి టెస్టులో టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో జట్టును అదుకున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో 111 బంతుల్లో 146 పరుగులు సాధించి పంత్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఇక వరల్డ్ క్లాస్ ఇన్నింగ్స్ ఆడిన పంత్‌పై ఇంగ్లండ్ అసిస్టెంట్ కోచ్ పాల్ కాలింగ్‌వుడ్ ప్రశంసల వర్షం కురిపించాడు. "టెస్టు క్రికెట్ చరిత్రలో ఇది ఒక గొప్ప రోజు. ఈ మ్యాచ్‌లో పంత్ ఆడిన విధానానికి హ్యాట్స్ ఆఫ్. పంత్ ప్రపంచ స్థాయి ఆటగాడు. అటువంటి ఆటగాళ్లకు వ్యతిరేకంగా ఆడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మేము న్యూజిలాండ్‌పై మూడు మ్యాచ్‌ల్లోనూ పై చేయి సాధించాము. కానీ ఇక్కడ తొలి రోజే టీమిండియా మాపై అదిపత్యం చెలాయించింది. టీమిండియా నుంచి గట్టి పోటీ ఉంటుంది అని మెకల్లమ్ ముందే చెప్పాడు. తొలి రోజు మా బౌలర్లు కూడా అద్బుతంగా రాణించారు. తొలుత 30-40 ఓవర్లలో భారత్‌ను బాగానే కట్టడం చేశాం. కానీ తర్వాత పిచ్ బ్యాటర్లకు అనుకూలించడంతో భారత్ మాపై చేయి సాధించింది" అని కాలింగ్‌వుడ్ పేర్కొన్నాడు. చదవండి: India Vs England-Rishabh Pant: అద్భుతమైన షాట్లు.. నువ్వో సూపర్‌స్టార్: పంత్‌పై ప్రశంసల జల్లు -
టెస్టుల్లో చరిత్ర సృష్టించిన పంత్.. తొలి వికెట్ కీపర్‌గా..!
ఇంగ్లండ్‌తో ఎడ్జ్బస్టన్ వేదికగా జరుగుతోన్న ఐదో టెస్టులో టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ రికార్డుల మోత మోగించాడు. ఈ మ్యాచ్‌లో కేవలం 89 బంతుల్లోనే సెంచరీ చేసిన పంత్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. టెస్టుల్లో ఫాస్టస్ట్ సెంచరీ సాధించిన భారత వికెట్ కీపర్‌గా పంత్ రికార్డుల కెక్కాడు. అంతకు ముందు ఈ రికార్డు భారత మాజీ కెప్టెన్ ఎంస్ ధోని పేరిట ఉండేది. 2006లో పాకిస్తాన్‌తో జరిగిన టెస్టులో ధోని 93 బంతుల్లో సెంచరీ సాధించాడు. ఇక టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన టీమిండియా 98 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ సమయంలో పంత్ తన విరోచిత ఇన్నింగ్స్‌తో జట్టును అదుకున్నాడు. ప్రత్యర్ధి జట్టు బౌలర్లపై పంత్ ఎదురుదాడికి దిగాడు. ముఖ్యంగా ఇంగ్లండ్ స్పిన్నర్ జాక్ లీచ్‌ను పంత్ టార్గెట్ చేశాడు. ఈ క్రమంలో పంత్ టెస్టుల్లో ఐదో శతకం నమోదు చేశాడు. ఇక రవీంద్ర జడేజాతో కలిసి పంత్ ఆరో వికెట్‌కు 222 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అయితే ఇన్నింగ్స్ 67 ఓవర్ వేసిన రూట్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి తన వికెట్‌ను కొల్పోయాడు. ఈ మ్యాచ్‌లో పంత్ 111 బంతుల్లో 146 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లో 19 ఫోర్లు,4 సిక్స్‌లు ఉన్నాయి. ఇక తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 7 వికెట్లు కోల్పోయి 338 పరుగులు చేసింది. క్రీజులో జడేజా(83),షమీ ఉన్నారు. కాగా ఈ మ్యాచ్‌లో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన పంత్ మరి కొన్ని రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. అవి ఏంటో పరిశీలిద్దాం. ►89 బంతుల్లో సెంచరీ సాధించిన పంత్.. టెస్టుల్లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన భారత వికెట్ కీపర్‌గా నిలిచాడు. ►విదేశాల్లో ఒకే ఏడాదిలో రెండు సెంచరీలో సాధించిన తొలి వికెట్ కీపర్ కూడా పంత్ కావడం విశేషం. ►టెస్టు క్రికెట్ చరిత్రలో 2000 పరుగులు పూర్తి చేసిన అతి పిన్న వయస్కుడైన వికెట్ కీపర్‌గా పంత్ నిలిచాడు. ►ఎడ్జ్‌బాస్టన్‌లో అత్యంత వేగవంతమైన టెస్టు సెంచరీని సాధించిన ఆటగాడిగా పంత్ రికార్డులకెక్కాడు. ►ఇంగ్లండ్ గడ్డపై రెండవ వేగవంతమైన టెస్ట్ సెంచరీ చేసిన భారత ఆటగాడిగా ఘనత సాధించాడు. ►2018లో టెస్టు అరంగేట్రం చేసినప్పటి నుంచి పంత్ ఇప్పుడు ఐదు సెంచరీలు సాధించాడు. ఈ వ్యవధిలో మరే ఇతర వికెట్ కీపర్ కూడా మూడు కంటే ఎక్కువ సెంచరీలు సాధించ లేదు. చదవండి: India Vs England-Rishabh Pant: అద్భుతమైన షాట్లు.. నువ్వో సూపర్‌స్టార్: పంత్‌పై ప్రశంసల జల్లు Rishabh Pant, you beauty! 🤩💯 Is there a more exciting Test cricketer in the modern game?! 🔥 Tune in to Sony Six (ENG), Sony Ten 3 (HIN) & Sony Ten 4 (TAM/TEL) - (https://t.co/tsfQJW6cGi)#ENGvINDLIVEonSonySportsNetwork #ENGvIND pic.twitter.com/Qvn3eDYw9Z — Sony Sports Network (@SonySportsNetwk) July 1, 2022 -
'భారత్ అత్యుత్తమ బౌలింగ్ ఎటాక్‌తో బరిలోకి దిగాలి.. లేదంటే'
కరోనా కారణంగా గతేడాది వాయిదా పడిన భారత్-ఇంగ్లండ్ మధ్య నిర్ణయాత్మక ఐదో టెస్టు ఎడ్జ్బస్టన్ వేదికగా శుక్రవారం(జూలై1) ప్రారంభం కానుంది. ఈ టెస్టుకు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ దూరం కావడంతో.. భారత సారథ్య పగ్గాలు పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా చేపట్టాడు. ఇక ఈ మ్యాచ్‌లో స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాకు విశ్రాంతి ఇచ్చి, శార్థూల్ ఠాకూర్, రవిచంద్ర అశ్విన్‌ను తుది జట్టులోకి తీసుకోవాలని భారత మాజీ ఓపెనర్ ఆకాష్ చోప్రా సూచించాడు. జట్టులోకి శార్దూల్ ఠాకూర్, అశ్విన్‌లను ఎందుకు తీసుకోవాలో తన యూట్యూబ్ ఛానల్లో చోప్రా వివరించాడు. "ఈ మ్యాచ్‌లో శార్దూల్ ఠాకూర్, అశ్విన్‌కు భారత తుది జట్టులో చోటు దక్కాలి అని నేను భావిస్తున్నాను. ఇంగ్లండ్ పిచ్‌లు ఎక్కువగా పేసర్లకు అనుకూలిస్తాయి. కాబట్టి జడేజాకు ఈ మ్యాచ్‌లో విశ్రాంతి ఇస్తే బాగుంటుంది. ఒక వేళ భారత్ తొలుత బ్యాటింగ్ చేస్తే షమీ, బుమ్రా, సిరాజ్‌ల పేస్ త్రయంతో బరిలోకి దిగాలి. అక్కడ పరిస్థితుల బట్టి ఉమశ్ యాదవ్‌ను కూడా పరిగణలోకి తీసుకోవాలి. గతేడాది ఇంగ్లండ్ బ్యాటింగ్ లైనప్ బలహీనంగా ఉంది. ఒక్క జో రూట్ తప్ప మిగితా ఆటగాళ్లు ఎవరూ అంతగా రాణించలేదు. అయితే ఈ ఏడాది మాత్రం ఇంగ్లండ్ ఆటగాళ్లు అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. కాబట్టి అత్యుత్తమ బౌలింగ్ ఎటాక్‌తో బరిలోకి దిగాలి, లేదంటే భారత్‌కు గెలవడం కష్టమే అని చోప్రా యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు. చదవండి: SL vs AUS: ఆస్ట్రేలియాతో తొలి టెస్టు.. శ్రీలంక స్టార్ ఆల్ రౌండర్‌కు కొవిడ్ పాజిటివ్..! -
'ఇంగ్లండ్ పిచ్‌లపై అతడి కంటే ఎవరూ మెరుగ్గా రాణించలేరు'
టీమిండియా వెటరన్ ఆటగాడు చతేశ్వర్ పుజారాపై భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ ప్రశంసల వర్షం కురిపించాడు. అతడు చాలా సార్లు భారత జట్టును గెలిపించాడని, అయినప్పటికీ అతడి ఇన్నింగ్స్‌లకు తగిన గుర్తింపు రాలేదని హర్భజన్ అభిప్రాయపడ్డాడు. అదే విధంగా అందరూ ఐపీఎల్లో ఆడుతున్నప్పడు.. పుజారా మాత్రం ఇంగ్లండ్ కౌంటీల్లో అడి తన ఫామ్‌ను తిరిగి పొందాడని అతడు కొనియాడాడు. ఇక శుక్రవారం ఇంగ్లండ్‌తో జరగనున్న ఐదో టెస్టుకు కెప్టెన్ రోహిత్ శర్మ దూరం కావడంతో టీమిండియా ఇన్నింగ్స్‌ను పుజారా ఆరంభించే అవకాశం ఉంది. "పుజారాకు ఇంగ్లండ్ పరిస్థితుల్లో ఎక్కువగా ఆడిన అనుభవం ఉంది. కౌంటీ క్రికెట్లో బౌలర్ల కంటే అంతర్జాతీయ క్రికెట్లో బౌలర్లు మెరుగ్గా ఉండవచ్చని మీరు భావించవచ్చు. కానీ కౌంటీ క్రికెట్లో కూడా ఒకరిద్దరు అంతర్జాతీయ బౌలర్లు ఉంటారు. కౌంటీ క్రికెట్లో ఆడి పుజారా తన ఫామ్‌ను తిరిగి పొందాడు. అతడు ఎప్పడూ భారత జట్టుకు తనవంతు సహకారం అందిస్తాడు. ఇక మేము ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లినప్పుడు పుజారా అంతగా రాణిస్తాడని ఎవరూ ఊహించలేదు. విదేశాల్లో పర్యటించేటప్పుడు భారత తరపున పుజారా అద్భుతంగా ఆడుతాడు. ఇంగ్లండ్ వంటి బౌన్సీ పిచ్‌లపై పుజారాకు పరుగులు సాధించే సత్తా ఉంది. ఇంగ్లండ్‌లో పుజారా కంటే ఎవరూ మెరుగ్గా రాణించలేరు" అని హర్భజన్ సింగ్ పేర్కొన్నాడు. ఇక ఈ ఏడాది కౌంటీల్లో ఐదు టెస్టు మ్యాచ్‌లు ఆడిన పుజారా 700 పరుగులు సాధించాడు. చదవండి: SL vs Aus1st Test: శ్రీలంకతో తొలి టెస్టు.. ఆస్ట్రేలియా స్కోర్: 313/8 -
'ఆ ఇద్దరిలో ఒకరిని టీమిండియా ఓపెనర్‌గా పంపండి'
జూలై1న ప్రారంభం కానున్న ఇంగ్లండ్‌తో నిర్ణయాత్మక ఐదో టెస్టుకు టీమిండియా ఓపెనర్‌గా ఛతేశ్వర్ పుజారా లేదా హనుమ విహారీని పంపాలని భారత మాజీ పేసర్ అజిత్ అగార్కర్ అభిప్రాయపడ్డాడు.ఈ కీలక మ్యాచ్‌కు ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. అతడు ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నాడు. అయితే తాజాగా నిర్వహించిన టెస్ట్టులో కూడా రోహిత్‌కు పాజిటివ్ గానే తేలింది. దీంతో ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగే ఈ మ్యచ్‌కు రోహిత్ దూరమయ్యే అవకాశాలు సృష్టంగా కన్పిస్తున్నాయి. ఈ క్రమంలో శుభ్‌మాన్ గిల్ జోడిగా భారత ఇన్నింగ్స్‌ను ఎవరు ప్రారంభిస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది. అయితే పుజరా, హునుమా విహారి, మయాంక్ అగర్వాల్, కెఎస్ భరత్ వంటి వారు ఓపెనింగ్ రేసులో ఉన్నారు. "వార్మప్ మ్యాచ్‌లో కేఎస్ భరత్ అధ్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు అని మనకు తెలుసు. కానీ అతనికి ఉన్న అనుభవం తక్కువ. ఇక రోహిత్‌కు బ్యాకప్‌గా జట్టులో చేరిన మయాంక్‌కు తగినంత ప్రాక్టీస్ చేసే అవకాశం లభించలేదు. కాబట్టి రోహిత్ లాంటి సీనియర్ ఆటగాడు అందుబాటులో లేకపోతే.. పుజారా లేదా విహారి లాంటి అనుభం ఉన్న ఆటగాళ్లు ఇన్నింగ్స్‌ను ఆరంభిస్తే బాగుటుంది. విహారి ఇప్పటికే రెండు సార్లు భారత్ తరపున ఇన్నింగ్స్‌ను ఆరంభించాడు. ముఖ్యంగా ఇది కీలక మ్యాచ్ కాబట్టి అనుభవం ఉన్న ఆటగాళ్లకి అవకాశం ఇస్తే మంచింది"అని అజిత్ అగార్కర్ పేర్కొన్నాడు. చదవండి: ENG vs IND: "అతడు అద్భుతమైన ఆటగాడు.. అటువంటి వ్యక్తిని ఇంతవరకూ చూడలేదు" -
అతన్ని ఓపెనర్‌గా పంపండి.. సెహ్వాగ్‌లా సక్సెస్ అవుతాడు..!
ఐపీఎల్ 2022 సీజన్లో పరుగుల వరద (863 పరుగులు) పారించి, ఆతర్వాత నెదర్లాండ్తో జరిగిన వన్డే సిరీస్‌లో అంతకుమించిన బీభత్సం (162, 86 నాటౌట్) సృష్టించిన ఇంగ్లండ్ వికెట్‌కీపర్ కమ్ బ్యాటర్ జోస్ బట్లర్ గురించి శ్రీలంక లెజెండరీ ఆటగాడు, రాజస్థాన్ రాయల్స్ కోచ్ కుమార సంగక్కర ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బట్లర్‌ను టెస్ట్‌ల్లో 6, 7 స్థానాల్లో కాకుండా ఓపెనర్‌గా పంపిస్తే సెహ్వాగ్‌లా సూపర్ సక్సెస్ అవుతాడని సంగక్కర అభిప్రాయపడ్డాడు. బట్లర్ పరిమిత ఓవర్ల క్రికెట్లో ఓపెనర్‌గా వచ్చి వేగంగా పరుగులు రాబట్టడంతో పాటు సుదీర్ఘ ఇన్నింగ్స్‌లు ఆడిన వైనాన్ని ఇందుకు ఉదహరించాడు. సెహ్వాగ్ టీమిండియలోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలో అతన్ని కూడా లోయర్ ఆర్డర్లో పంపారని, ఆతర్వాత ఓపెనర్‌గా ప్రమోషన్ వచ్చాక సెహ్వాగ్ ఏం చేశాడో ప్రపంచమంతా చూసిందని అన్నాడు. ఈతరంలో బట్లర్ అంత విధ్వంసకర ఆటగాడిని చేడలేదని, అతన్ని టెస్ట్‌ల్లో కూడా ఓపెనర్‌గా ప్రమోట్ చేస్తే రెడ్ బాల్ క్రికెట్లోనూ రికార్డులు తిరగరాస్తాడని జోస్యం చెప్పాడు. పరిమిత ఓవర్ల ఫార్మాట్లో రెచ్చిపోయి ఆడే బట్లర్ టెస్ట్‌ల్లో తేలిపోతున్న నేపథ్యంలో సంగక్కర్ ఈ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటివరకు 57 టెస్ట్‌లు ఆడిన బట్లర్.. 2 సెంచరీలు, 18 హాఫ్ సెంచరీల సాయంతో 31.92 సగటున 2907 పరుగులు మాత్రమే చేశాడు. ఇంగ్లండ్ గతేడాది యాషెస్‌లో దారుణ పరాభవం ఎదుర్కొన్న అనంతరం బట్లర్ టెస్ట్ జట్టులో చోటు కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే లిమిటెడ్ ఓవర్స్‌లో అతని భీకర ఫామ్ తిరిగి టెస్ట్ జట్టులో చోటు సంపాదించిపెడుతుందని అంతా అనుకున్నారు. అయితే టీమిండియాతో జరిగే ఐదో టెస్ట్‌కు బట్లర్‌కు పిలుపు రాకపోవడంతో అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే, కొత్త కెప్టెన్ (స్టోక్స్), కొత్త కోచ్ (మెక్కల్లమ్) ఆధ్వర్యంలో ఇంగ్లండ్ జట్టు న్యూజిలాండ్‌పై హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసి టీమిండియాకు ఛాలెంజ్ విసురుతుంది. భారత్‌తో జరిగే 5వ టెస్టుకు ఇంగ్లండ్ జట్టు: బెన్ స్టోక్స్ (కెప్టెన్), జేమ్స్ ఆండర్సన్, జానీ బెయిర్‌స్టో, సామ్ బిల్లింగ్స్, స్టువర్ట్ బ్రాడ్, హ్యారీ బ్రూక్, జాక్ క్రాలే, బెన్ ఫోక్స్, జాక్ లీచ్, అలెక్స్ లీస్, క్రెయిగ్ ఓవర్టన్, జామీ ఓవర్టన్, మాథ్యూ పాట్స్, ఓలీ పోప్, జో రూట్ చదవండి: టీమిండియాతో ఐదో టెస్టు.. జట్టును ప్రకటించిన ఇంగ్లండ్..! -
టీమిండియాతో ఐదో టెస్టు.. జట్టును ప్రకటించిన ఇంగ్లండ్..!
టీమిండియాతో నిర్ణయాత్మక ఐదో టెస్టుకు 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును ఇంగ్లండ్ ప్రకటించింది. స్వదేశంలో న్యూజిలాండ్‌తో సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన జట్టునే ఈ ఏకైక టెస్టుకు ఇంగ్లండ్ సెలక్టర్లు ఎంపిక చేశారు. మూడు మ్యాచ్ ఇక న్యూజిలాండ్‌తో జరిగిన అఖరి టెస్టులో బెన్ ఫోక్స్ స్థానంలో కొవిడ్ సబ్‌స్ట్యూట్‌గా వచ్చిన సామ్ బిల్లింగ్స్‌కు కూడా భారత్‌తో టెస్టుకు చోటు దక్కింది. అయితే టీమిండియాతో జరిగే ఈ కీలక మ్యాచ్‌కు బెన్ ఫోక్స్ దూరమయ్యే అవకాశం ఉంది. కరోనా బారిన పడిన ఫోక్స్.. ఐదు రోజుల ఐషోలేషన్‌లో ఉన్నాడు. ఇక ఇరు జట్లు మధ్య ఈ నిర్ణయాత్మక టెస్టు బర్మింగ్‌హామ్ వేదికగా జూలై1న ప్రారంభం కానుంది. ఇక ఈ మ్యాచ్‌కు భారత కెప్టెన్ రోహిత్ శర్మకూడా దూరమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. కరోనా బారిన పడిన రోహిత్ ప్రస్తుతం ఐషోలేషన్‌లో ఉన్నాడు. భారత్‌తో జరిగే 5వ టెస్టుకు ఇంగ్లండ్ జట్టు: బెన్ స్టోక్స్ (కెప్టెన్), జేమ్స్ ఆండర్సన్, జానీ బెయిర్‌స్టో, సామ్ బిల్లింగ్స్, స్టువర్ట్ బ్రాడ్, హ్యారీ బ్రూక్, జాక్ క్రాలే, బెన్ ఫోక్స్, జాక్ లీచ్, అలెక్స్ లీస్, క్రెయిగ్ ఓవర్టన్, జామీ ఓవర్టన్, మాథ్యూ పాట్స్, ఆలీ పోప్, జో రూట్ చదవండి: Ind Vs Eng 5th Test: రోహిత్‌కు కరోనా! భారత టెస్టు జట్టులోకి మయాంక్ అగర్వాల్! -
పంత్‌కు అంత సీన్ లేదు, బుమ్రాను చెడగొట్టొద్దు.. పాక్ మాజీ స్పిన్నర్ సంచలన వ్యాఖ్యలు
IND VS ENG: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కోవిడ్ బారిన పడటంతో ఇంగ్లండ్‌తో జరుగబోయే రీ షెడ్యూల్డ్ టెస్ట్‌కు అందుబాటులో ఉండటం అనుమానంగా మారింది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌తో మ్యాచ్‌కు టీమిండియా పగ్గాలు ఎవరికి దక్కుతాయన్న అంశంపై సర్వత్రా చర్చ సాగుతుంది. కొందరు పంత్ అయితే బాగుంటుందని అంటే మరికొందరు బుమ్రా పేరును ప్రతిపాదిస్తున్నారు. ఇదే అంశంపై పాక్ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా సైతం తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. టీమిండియా కెప్టెన్‌గా పంత్, బుమ్రా ఇద్దరూ వద్దని అతను అభిప్రాయపడ్డాడు. పంత్ టీమిండియా కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టే పరిణితిని సాధించాల్సి ఉందని, ఇటీవలి దక్షిణాఫ్రికా సిరీస్‌లో కెప్టెన్‌గా అతని వైఫల్యాలు కొట్టొచ్చినట్లు కనిపించాయని అన్నాడు. అసలు పంత్‌కు టీమిండియా పగ్గాలు చేపట్టే సామర్థ్యం లేదని సంచలన కామెంట్స్ చేశాడు. కెప్టెన్సీ ప్రభావం అతడి బ్యాటింగ్‌పై కూడా పడిందని అభిప్రాయపడ్డాడు. మరోవైపు బుమ్రాకు సైతం కెప్టెన్సీ అప్పజెప్పకుంటేనే మంచిదని సలహా ఇచ్చాడు. కెప్టెన్సీ భారం వల్ల బుమ్రా తన లయను కోల్పోతాడని, ఈ భారాన్ని అతని తలపై మోపి చెడగొట్టొదని సూచించాడు. బుమ్రాకు స్వేచ్ఛగా బౌలింగ్ చేసే అవకాశం కల్పించాలని కోరాడు. ఇదిలా ఉంటే, ఇంగ్లండ్‌తో ఐదో టెస్ట్ ప్రారంభమయ్యే సమయానికి రోహిత్ శర్మ కోవిడ్ నుంచి కోలుకోకపోతే బుమ్రా, పంత్, అశ్విన్‌లలో ఎవరో ఒకరికి టీమిండియా కెప్టెన్సీ బాధ్యతలు అప్పజెప్పాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది. చదవండి: పాకిస్థాన్ క్రికెట్‌ను 'అతను' భ్రష్టు పట్టిస్తాడు..! -
రోహిత్ శర్మకు ఏమైంది..? అక్కడ కూడా తీరు మారలేదు..!
ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరగనున్న ఏకైక టెస్టుకు ముందు టీమిండియా లీసెస్టర్‌షైర్ కౌంటీ జట్టుతో నాలుగు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో తలపడుతోంది. ఇక ఐపీఎల్లో పేలవ ప్రదర్శన కనబరిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. ప్రాక్టీస్ మ్యాచ్‌లో కూడా అదే ఫామ్‌ను కొనసాగించాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కొవడానికి రోహిత్ చాలా ఇబ్బంది పడ్డాడు. ముఖ్యంగా ప్రాక్టీస్ గేమ్‌లో లీసెస్టర్‌షైర్ తరపున ఆడుతున్న జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్‌లో రోహిత్ తడబడ్డాడు. ఈ మ్యాచ్‌లో సీమర్లు బ్యాక్ ఆఫ్ ది లెంగ్త్ బౌలింగ్‌తో రోహిత్‌ను ముప్పుతిప్పులు పెట్టారు. అఖరికి రోమన్ వాకర్ బౌలింగ్‌లో నిర్లక్షమైన షాట్ ఆడి తన వికెట్‌ను చేజార్చుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో 47 బంతులు ఎదర్కున్న రోహిత్.. కేవలం 25 పరుగుల మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరాడు.ఇక తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 60.2 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 246 పరుగులు చేసింది. కోన శ్రీకర్ భరత్ (111 బంతుల్లో 70 బ్యాటింగ్; 8 ఫోర్లు, 1 సిక్స్)తో రాణించాడు. క్రీజులో భరత్(70),మహ్మద్ షమీ(18) పరుగులతో క్రీజులో ఉన్నారు. చదవండి: IND vs LEI: రాణించిన శ్రీకర్ భరత్.. టీమిండియా స్కోర్: 246/8 ☝️ | Rohit (25) c Sakande, b Walker. Rohit pulls a short ball from @RomanWalker17 up into the sky, @AbiSakande is under the catch. 👐@imVkohli walks to the middle. Watch him bat. 👇 🇮🇳 IND 50/2 𝐋𝐈𝐕𝐄 𝐒𝐓𝐑𝐄𝐀𝐌: https://t.co/adbXpw0FcA 👈 🦊 #IndiaTourMatch | #LEIvIND pic.twitter.com/5mxQJ5cLKK — Leicestershire Foxes 🏏 (@leicsccc) June 23, 2022 -
షాకింగ్ న్యూస్: విరాట్ కోహ్లికి కరోనా పాజిటివ్..?
టీమిండియా అభిమానులకు చేదు వార్త. రీ షెడ్యూల్డ్ టెస్ట్ మ్యాచ్ కోసం ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్న టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు సమాచారం. కోహ్లి లండన్‌లో ల్యాండయ్యాక షాపింగ్ అంటూ వివిధ ప్రదేశాల్లో సంచరిస్తూ, ఫ్యాన్స్‌తో సెల్ఫీలకు పోజులిచ్చాడు. అక్కడే అతను కోవిడ్ బారిన పడి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కోహ్లి ఇంగ్లండ్ పర్యటనకు బయల్దేరక ముందు మాల్దీవ్స్‌లో హాలీడేస్ ఎంజాయ్ చేశాడు. A lucky day for this fan as he got to meet both Virat Kohli and Rohit Sharma. pic.twitter.com/DN5B2ZSYuJ — Mufaddal Vohra (@mufaddal_vohra) June 19, 2022 కోహ్లి కొద్ది రోజులగా జట్టు సహచరులతో క్లోజ్‌గా ఉండటంతో భారత శిబిరంలోనూ కరోనా కలవరం మొదలైంది. ప్రాక్టీస్ సందర్భంగా కోహ్లి టీమ్ మేట్స్‌తో అత్యంత సన్నిహితంగా ఉండి ఫోటోలు దిగాడు. కోహ్లి కోవిడ్ బారిన పడ్డాడన్న వార్త నేపథ్యంలో ఇంగ్లండ్‌తో జరగాల్సిన టెస్ట్ మ్యాచ్‌పై సందేహాలు నెలకొన్నాయి. కాగా, టీమిండియా ఇంగ్లండ్‌కు బయల్దేరడానికి ముందు స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే, కోవిడ్ కారణంగా గతేడాది అర్ధంతరంగా నిలిచిపోయిన ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లోని ఆఖరి టెస్ట్ మ్యాచ్ ఆడేందుకు టీమిండియా ఇంగ్లండ్‌లో పర్యటిస్తుంది. జులై 1 నుంచి ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఈ టెస్ట్ మ్యాచ్ ప్రారంభంకానుంది. ఈ సిరీస్‌లో టీమిండియా 2-1 ఆధిక్యంలో కొనసాగుతుంది. చదవండి: Ind Vs Eng: ఇంగ్లండ్‌తో టీమిండియా పోరు.. పూర్తి షెడ్యూల్, ‘జట్టు’ వివరాలు! -
ఇంగ్లండ్ పర్యటనకు మయాంక్ అగర్వాల్.. వైస్ కెప్టెన్‌గా పంత్..!
ఇంగ్లండ్‌తో ఏకైక టెస్టుకు టీమిండియా స్టార్ ఆటగాడు కేఎల్ రాహుల్ గాయం కారణంగా దూరమైన సంగతి తెలిసిందే. దీంతో అతడి స్థానంలో మయాంక్ అగర్వాల్‌కు చోటు దక్కనున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా వికెట్ కీపర్ రిషబ్ పంత్‌ను జట్టు వైస్ కెప్టెన్‌గా నియమించే యోచనలో బీసీసీఐ ఉన్నట్లు సమాచారం. భారత్- ఇంగ్లండ్ మధ్య నిర్ణయాత్మక టెస్టు మ్యాచ్ జులై 1 నుంచి ఎడ్జ్ బాస్టన్ లో జరగనుంది. కరోనా వ్యాప్తి వల్ల గతేడాది 5 టెస్టుల సిరీస్‌లో చివరి మ్యాచ్ తాత్కాలికంగా రద్దయిన సంగతి తెలిసిందే. "ఇంగ్లండ్ పర్యటనకు మయాంక్‌ని సిద్ధంగా ఉంచాము. రాహుల్‌కు ప్రత్యామ్నాయం కోసం జట్టు మేనేజ్మెంట్ను అడిగాము. ఈ నెల 19వ తేదీలోగా మాకు తెలియజేస్తామని చెప్పారు. ఒక వేళ అవసరమైతే మయాంక్ రెండవ బ్యాచ్‌తో కలిసి ఇంగ్లండ్‌కు వెళ్లనున్నాడు" అని బీసీసీఐ అధికారి ఒకరు ఇన్సైడ్ స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. చదవండి: Wasim Jaffer Trolls Eoin Morgan: 'అంతా ఓకే.. మీ పరిస్థితి తలుచుకుంటే..' వసీం జాఫర్ ట్వీట్ వైరల్ -
టీమిండియాకు బిగ్ షాక్.. ఇంగ్లండ్ టూర్‌కు కేఎల్ రాహుల్ దూరం..!
ఇంగ్లండ్‌తో గతేడాది అర్థాంతరంగా ముగిసిన టెస్ట్ సిరీస్‌లోని చివరి టెస్ట్ మ్యాచ్ ఆడేందుకు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీలతో కూడిన భారత జట్టు రేపు (జూన్ 16) లండన్ ఫ్లైట్ ఎక్కాల్సి ఉంది. అయితే ఈ బృందంతో పాటు కేఎల్ రాహుల్ ప్రయాణించడం అనుమానమేనని తెలుస్తోంది. స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్‌కు ముందు గాయపడ్డ రాహుల్ ఇంకా కోలుకోలేదని సమాచారం. రాహుల్ గాయం నుంచి కోలుకున్నాడని గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నా అందులో నిజం లేదని తెలుస్తోంది. రాహుల్ సహచర సభ్యులతో రేపు ఇంగ్లండ్‌కు బయల్దేరాల్సి ఉన్నా అతను ఇంకా ఎన్సీఏ (జాతీయ క్రికెట్ అకాడమీ) లోనే ఉండటం ఈ వార్తలకు బలం చేకూరుస్తుంది. ఇదిలా ఉంటే, జులై 1 నుంచి ఇంగ్లండ్‌తో జరుగనున్న ఏకైక టెస్ట్ కోసం పంత్, శ్రేయస్ అయ్యర్ మినహా టీమిండియా మొత్తం రేపు లండన్ ఫ్లైట్ ఎక్కనుంది. ఇంగ్లండ్ పర్యటనలో భారత్ టెస్ట్ మ్యాచ్‌తో పాటు 3 వన్డేలు, 3 టీ20ల సిరీస్‌లు కూడా ఆడాల్సి ఉంది. ఇంగ్లండ్‌తో ఏకైక టెస్ట్ మ్యాచ్ కోసం టీమిండియాను ఇదివరకే ప్రకటించారు.ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ ముగిసిన వెంటనే పంత్, శ్రేయస్ ఇంగ్లండ్‌కు బయల్దేరతారు. మరోవైపు టీమిండియా ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్న సమయంలోనే మరో భారత టీమ్ ఐర్లాండ్‌లో పరిమిత ఓవర్ల సిరీస్ ఆడనుంది. ఈ జట్టుకు హార్ధిక్ పాండ్యా నాయకత్వం వహించే అవకాశాలున్నాయి. ఇంగ్లండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్ కోసం టీమిండియాను ప్రకటించాల్సి ఉంది. జులై 7 నుంచి 17 వరకు పరిమిత ఓవర్ల సిరీస్‌లు జరుగనున్నాయి. ఇంగ్లండ్‌తో టెస్ట్ మ్యాచ్‌కు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, హనుమ విహారి, చతేశ్వర్ పుజారా, రిషభ్ పంత్, కేఎస్ భరత్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్, ప్రసిధ్ కృష్ణ చదవండి: వరుస ఓటములతో సతమతమవుతున్న న్యూజిలాండ్‌కు మరో షాక్ -
దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ ఆడకుండా రోహిత్ శర్మ ఏం చేశాడో చూడండి..!
స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్ ఆడకుండా విశ్రాంతి తీసుకుంటున్న టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ తాజాగా గల్లీ క్రికెట్ ఆడుతూ బిజీబిజీగా కనిపించాడు. ముంబైలోని వర్లీ ప్రాంతంలో హిట్‌మ్యాన్ గల్లీ ప్రాక్టీస్ చేస్తూ కెమెరా కంటికి చిక్కాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతుంది. Rohit Sharma playing gully cricket at woreli, Mumbai. pic.twitter.com/vuHLIVno6D— Johns. (@CricCrazyJ0hns) June 14, 2022 వివరాల్లోకి వెళితే.. ముంబైలోని బాండ్రాలో నివాసముండే రోహిత్ శర్మ వర్లీ ప్రాంతం వైపు వెళ్తుండగా కొందరు కుర్రాళ్లు రోడ్డుపై క్రికెట్ ఆడుతూ కనిపించారు. ఇది చూసిన రోహిత్ వెంటనే కారు దిగి వారితో కలిసి క్రికెట్ ఆడాడు. ఇంగ్లండ్ పర్యటనకు ముందు ప్రాక్టీస్ దొరకదనుకున్నాడో ఏమో కాని అక్కడి కుర్రాళ్లకు కూడా ఆవకాశం ఇవ్వకుండా చాలా సేపు బ్యాట్ పట్టుకుని కనిపించాడు. తన ట్రేడ్ మార్క్ షాట్లతో అక్కడున్నవారందరినీ అలరించాడు. అక్కడ ఉన్నంతసేపు రోహిత్ చాలా ఉత్సాహంగా కనిపించాడు. ఈ వీడియోను చూసిన వారంతా రోహిత్ చాలా కాన్ఫిడెంట్‌గా కనిపిస్తున్నాడు.. ఇక ఇంగ్లండ్ ఆటగాళ్లకు దబిడిదిబిడే అంటు కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ ముగిసిన అనంతరం టీమిండియా ఇంగ్లండ్ పర్యటనకు బయల్దేరనున్న విషయం తెలిసిందే. ఇంగ్లండ్‌తో గతేడాది అర్థాంతరంగా ముగిసిన టెస్టు సిరీస్‌లోని చివరి టెస్ట్ ఆడేందుకు రోహిత్ సేన ఇంగ్లండ్‌కు బయల్దేరనుంది. ఈ టెస్ట్ మ్యాచ్ కోసం టీమిండియాను ఇదివరకే ప్రకటించారు. భారత్- ఇంగ్లండ్ జట్ల మధ్య బర్మింగ్హమ్ వేదికగా జులై 1 నుంచి 5 వరకు టెస్ట్ మ్యాచ్ జరుగనుంది. అనంతరం ఈ పర్యటనలో భారత్ మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. ఇంగ్లండ్‌తో టెస్ట్ మ్యాచ్‌కు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, హనుమ విహారి, చతేశ్వర్ పుజారా, రిషభ్ పంత్, కేఎస్ భరత్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్, ప్రసిధ్ కృష్ణ చదవండి: విజయానందంలో ఉన్న ఇంగ్లండ్‌కు ఐసీసీ షాక్.. -
పుజారా రీ ఎంట్రీ.. ఇంగ్లండ్‌తో ఏకైక టెస్ట్‌కు టీమిండియా ప్రకటన
ముంబై: భారత్, ఇంగ్లండ్ మధ్య టెస్టు సిరీస్‌లో భాగంగా జరగాల్సిన చివరిదైన ఐదో టెస్టు కోసం టీమిండియాను సెలక్టర్లు ప్రకటించారు. గత ఏడాది ఇరు జట్ల మధ్య నాలుగు మ్యాచ్‌లు జరిగిన అనంతరం కరోనా వైరస్ కారణంగా ఐదో టెస్టు అనూహ్యంగా వాయిదా పడింది. ఇప్పుడు అదే టెస్టు మ్యాచ్‌ను జూలై 1 నుంచి 5 వరకు ఎడ్జ్‌బాస్టన్‌లో నిర్వహిస్తారు. సొంతగడ్డపై శ్రీలంకతో జరిగిన సిరీస్‌లో చోటు కోల్పోయిన సీనియర్ బ్యాటర్ చతేశ్వర్ పుజారా ఈ టెస్టు కోసం మళ్లీ జట్టులోకి రాగా, మయాంక్ అగర్వాల్‌ను తప్పించారు. ప్రస్తుతం ఇంగ్లండ్‌లోనే ఉంటూ కౌంటీ క్రికెట్ ఆడుతున్న పుజారా అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. ససెక్స్ తరఫున అతను నాలుగు సెంచరీలు సహా 720 పరుగులు చేశాడు. ఇలాంటి ఫామ్‌తో అతను భారత జట్టుకు కీలకం కాగలడని భావించిన సెలక్టర్లు మరో మాట లేకుండా పుజారాను ఎంపిక చేశారు. లంకతో సిరీస్‌లో పుజారాతో పాటు చోటు కోల్పోయిన రహానే ప్రస్తుతం గాయంతో ఆటకు దూరం కావడంతో అతని పేరును పరిశీలించలేదు. 17 మంది సభ్యుల బృందంలో ఎలాంటి అనూహ్య ఎంపికలు లేవు. సిరీస్‌లో ప్రస్తుతం భారత్ 2–1తో ఆధిక్యంలో ఉండగా... ఇరు జట్లు కొత్త కెప్టెన్లతో (రోహిత్ శర్మ, బెన్ స్టోక్స్) ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగనున్నాయి. భారత టెస్టు జట్టు: రోహిత్ (కెప్టెన్), రాహుల్, గిల్, కోహ్లి, శ్రేయస్, విహారి, పుజారా, పంత్, షమీ, జడేజా, సిరాజ్, శార్దుల్, శ్రీకర్ భరత్, అశ్విన్, బుమ్రా, ఉమేశ్, ప్రసిధ్ కృష్ణ. -
‘రవిశాస్త్రి, టీమిండియా ఆటగాళ్లు.. ఒక్కరంటే ఒక్కరు కూడా..!’
ముంబై: ఇంగ్లండ్ తో జరగాల్సిన ఐదో టెస్టు మ్యాచ్ అర్ధంతరంగా రద్దయిన నేపథ్యంలో.. మ్యాచ్ రద్దుకు దారి తీసిన కారణాలు మరోసారి చర్చకు వస్తున్నాయి. టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రితో పాటు శిక్షణ సిబ్బంది కూడా కరోనా బారిన పడటంతో ఈ మ్యాచ్ రద్దయిన తెలిసిందే. నాలుగో టెస్టు ముందు బయో బబుల్ నిబంధనలు బేఖాతరు చేస్తూ రవిశాస్త్రి తన 'స్టార్ గేజర్' పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించాడు. ఈ కార్యక్రమానికి కెప్టెన్ విరాట్ కోహ్లితో పాటు ఇతర ఆటగాళ్లు కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమం జరిగిన కొద్ది రోజులకే నాలుగో టెస్ట్ ముందు రవిశాస్త్రి వైరస్ బారిన పడ్డాడు. దీంతో మ్యాచ్ రద్దుకు రవిశాస్త్రి కారణమంటూ విమర్శలు కూడా వచ్చాయి. కాగా, ఈ పుస్తకావిష్కరణకు హాజరు కావడానికి భారత జట్టు అనుమతి తీసుకోలేదని బీసీసీఐ కూడా పేర్కొంది. అయితే ఈ కార్యక్రమానికి హాజరైన భారత మాజీ ఆటగాడు దిలీప్ దోషి కొన్ని ముఖ్యమైన వివరాలను తాజాగా వెల్లడించాడు. కోచ్ రవిశాస్త్రితో కలిసి బుక్ లాంచ్ ఈవెంట్‌కి హాజరైన భారత క్రికెటర్లు కనీసం మాస్క్ కూడా ధరించలేదని అతడు తెలిపాడు. "నేను పుస్తకావిష్కరణకు హాజరయ్యాను. నన్ను తాజ్ గ్రూప్ ఆహ్వానించింది. చాలా మంది ప్రముఖులు, టీమిండియా ఆటగాళ్లు కొద్దిసేపు అక్కడ ఉన్నారు.. వారెవరూ మాస్కు ధరించకపోవడం చూసి నేను ఆశ్చర్యపోయాను" అని దిలీప్ దోషి తెలిపాడు. మస్కు ధరించడం తప్పనిసరి చేయాలని.. భారత జట్టు జాగ్రత్తలు తీసుకోవాలని తాను ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు. చదవండి: ICC Mens T20I Rankings: టాప్- 10లో భారత్ నుంచి వాళ్లిద్దరే! -
నాలుగేళ్ల తర్వాత జట్టులో ఎంట్రీ.. అశ్విన్ భావోద్వేగ ట్వీట్
లండన్: వచ్చే నెలలో జరగనున్న టి20 ప్రపంచకప్ కోసం 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ బుధవారం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే నాలుగేళ్ల తర్వాత అశ్విన్‌కి టీ20 జట్టులో చోటు దక్కింది. ఈ సందర్భంగా అశ్విన్ భావోద్వేగ ట్వీట్ చేశాడు. ఇంతకీ ఆ ట్వీట్లో ఏముందంటే.. "ప్రతీ చీకటి వెనుక వెలుగు తప్పక ఉంటుంది. అయితే ఆ వెలుతురు చూడగలనని నమ్మినవాడే ఆ చీకటి ప్రయాణాన్ని తట్టుకుని నిలబడతాడు." అని ఆశ్విన్ రాసుకోచ్చాడు. సంతోషం, కృతజ్ఞత అనే రెండు పదాలు తనేంటో నిర్వచిస్తాయని ఆశ్విన్ అన్నాడు. ఈ కోట్‌ను గోడమీద పెట్టక ముందే నా డైరీలో కొన్ని లక్షలు సార్లు రాసుకున్నాను. మనం చదివే మంచి మాటలను తప్పని సారిగా పాటిస్తే జీవితంలో ఏదో ఒక చోట మనకు ప్రేరణ కలిగిస్తాయని ఆశ్విన్ అంటున్నాడు. ఇక ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న ఆశ్విన్.. మెదటి నాలుగు టెస్టులకు రిజర్వ్ బెంచ్‌కే పరిమితం అయ్యాడు. కాగా ఆశ్విన్ చివరసారిగా 2017లో టి20 మ్యాచ్ ఆడాడు. 46 టీ20ల్లో 52 వికెట్లు ఆశ్విన్ పడగొట్టాడు. భారత టీ20 ప్రపంచకప్ జట్టు: విరాట్ కోహ్లి(కెప్టెన్), రోహిత్ శర్మ(వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్(వికెట్‌కీపర్), ఇషాన్ కిషన్(వికెట్‌కీపర్), హార్ధిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రాహుల్ చాహర్, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, బుమ్రా, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ ఉన్నారు. స్టాండ్ బై ప్లేయర్స్‌గా శ్రేయస్ అయ్యార్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చహార్ ఎంపికైనారు. చదవండి: T20 World Cup 2021: చాహల్‌ను అందుకే తీసుకోలేదు.. ఇక వరుణ్ విషయానికి వస్తే.. 2017: I wrote this quote down a million times in my diary before putting this up on the wall! Quotes that we read and admire have more power when we internalise them and apply in life. Happiness and gratitude are the only 2 words that define me now.🙏 #t20worldcup2021 pic.twitter.com/O0L3y6OBLl — Mask up and take your vaccine🙏🙏🇮🇳 (@ashwinravi99) September 8, 2021 -
థాంక్యూ బుమ్రా.. బెయిర్‌స్టోను డకౌట్ చేశావ్: జార్వో సంబరం
లండన్: జార్వో 69... ఈ పేరు క్రికెట్ అభిమానులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తతం సోషల్ మీడియాలో జార్వో ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. మ్యాచులు జరుగుతున్నప్పుడు గ్రౌండ్లోకి వచ్చి అతడు ఆటకు అంతరాయం కలిగించిన విషయం తెలిసిందే. అయితే జార్వో చేసిన తాజా పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. భారత బౌలర్ బుమ్రాకి కృతజ్ఞతలు చెబుతూ పోస్టు చేయడం ఆసక్తికరంగా మారింది. "నేను జస్ప్రీత్ బుమ్రాకు ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను.. ఎందుకంటే అతడు జానీ బెయిర్‌స్టోను డకౌట్ చేశాడు. ఎందుకంటే ఈ జానీ బెయిర్‌స్టో నన్ను ఆ రోజు తిట్టాడు.. అందుకే ఇలా" అని రాసుకొచ్చాడు. ఇక జార్వో విషయానికి వస్తే.. లార్డ్స్ టెస్టులో టీమిండియా జెర్సీ వేసుకొని ఫీల్డింగ్ చేస్తూ ''టీమిండియా జెర్సీ ధరించి మైదానంలోకి బరిలోకి దిగిన తొలి ఇంగ్లండ్ వ్యక్తిని నేనే '' అంటూ రచ్చ చేశాడు. ఇక మూడో టెస్టులో సెక్యూరిటీ కళ్లుగప్పి కోహ్లి స్థానంలో ప్యాడ్లు కట్టుకొని బ్యాటింగ్‌కు వచ్చాడు. ఇక నాలుగో టెస్టులో ఏకంగా బౌలర్ అవతారమే ఎత్తాడు. అయితే ఆ సమయంలో క్రీజులో ఉన్న బెయిర్‌స్టోని అమాంతం తోసేసినంత పనిచేశాడు. దీంతో బెయిర్ స్టో అతడిని కోపంతో చూశాడు. అంతకుముందు రెండో టెస్టు సమయంలోనూ బెయిర్ స్టో, జార్వోని తిట్టడం కనిపించింది. చదవండి: Ind Vs Eng: ఆ విషయం నాకు ముందే తెలుసు: శార్దూల్ #Jarvo69 New Video: India's First White Bowler! FULL VIDEO HERE = https://t.co/Mv0QJV3334 pic.twitter.com/zOs0IQHZjS — Daniel Jarvis (@BMWjarvo) September 5, 2021 India's 12th man 😂#ENGvINDpic.twitter.com/bS1OYIl6Tv — The Cricketer (@TheCricketerMag) August 14, 2021 -
రోహిత్ శర్మకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్.. ఐదో రోజు హైలైట్స్ ఇవే
లండన్: ఓవల్ టెస్టులో ఇంగ్లండ్‌పై 157 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించిన టీమిండియా 50 ఏళ్ల నిరీక్షణకు తెరదించింది. మ్యాచ్‌లో చివరి రోజైన సోమవారం 368 పరుగుల ఛేదనలో తడబడిన ఇంగ్లండ్ టీమ్ 210 పరుగులకే కూప్ప కూలింది. భారత జట్టు విజయంలో ఓపెనర్ రోహిత్ శర్మ, బౌలర్లు ఉమేశ్ యాదవ్, బుమ్రా, జడేజా, శార్దూల్ ఠాకూర్ కీలక పాత్ర పోషించారు. దీంతో ఐదు టెస్ట్ మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో టీమిండియా 2-1 తో ఆధిక్యం సాధించింది. 127 పరుగుల సాధించి టీమిండియా విజయంలో కీలక భూమిక పోషించిన రోహిత్ శర్మకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. చదవండి: సిరీస్ వేటలో విజయబావుటా -
కరోనా అని తెలియగానే ఆటగాళ్లు ఒక్కసారిగా షాక్!
లండన్: భారత జట్టు ప్రధాన కోచ్ రవిశాస్త్రికు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో టీమిండియా ఆటగాళ్లు అంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారని బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోర్ చెప్పారు. నాలుగోరోజు ఆట ముగిసిన ఆనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ''రవిశాస్త్రికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు ఆదివారం బీసీసీఐ ప్రకటించంది. దీంతో ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా రవిశాస్త్రితో సన్నిహితంగా మెలిగిన భారత బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్, ఫిజియో నితిన్ పటేల్‌లను ఐసోలేషన్‌కు తరలించారు. వాస్తవానికి మేము వీరి సేవలను భారీగా కోల్పోతున్నాముని'' తెలిపారు. గత 5-6 సంవత్సరాలలో భారత జట్టు బాగా రాణించడంలో వారు ముగ్గురు ప్రధాన పాత్ర పోషించారు అని ఆయన వెల్లడించారు. ''కానీ నిజం ఏంటింటే వారు ఈ సమయంలో ఇక్కడ లేరు. అందుకే ఆటగాళ్లు కలత చెందారు. తర్వాత మాలో మేము మాట్లడుకుని నాల్గవ రోజు ఆటపై దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నాము. దానికే తగ్గట్టే కుర్రాళ్లు కూడా బాగా ఆడారు. శనివారం రాత్రి రవిశాస్త్రి కొంత అసౌకర్యానికి గురయ్యారు. దీంతో వైద్య బృందం రవిశాస్త్రికి కోవిడ్ పరీక్ష నిర్వహించగా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది'' అని విక్రమ్ రాథోర్ పేర్కొన్నారు. చదవండి: కోహ్లి విషయంలో మొయిన్ అలీ చరిత్ర; డకౌట్లలో రహానే చెత్త రికార్డు కాగా భారత్ ఖాతాలో మరో విజయం చేకూరాలంటే నాలుగో టెస్టులో చివరి రోజు బౌలర్లు సత్తా చాటుకోవాలి. ఆఖరి రోజు మొత్తం 10 వికెట్లు పడగొడితేనే భారత్‌కు విజయం దక్కుతుంది. మరోవైపు ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు కూడా విజయంపై కన్నేసింది. 368 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ ఆదివారం ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 32 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 77 పరుగులు చేసింది.ఓపెనర్లు బర్న్స్ (31 బ్యాటింగ్; 2 ఫోర్లు), హసీబ్ (43 బ్యాటింగ్; 6 ఫోర్లు) క్రీజులో ఉన్నారు. అంతకుముందు భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 148.2 ఓవర్లలో 466 పరుగులకు ఆలౌటైంది. దాంతో ఇంగ్లండ్‌కు 368 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. శార్దుల్ ఠాకూర్ (72 బంతుల్లో 60; 7 ఫోర్లు, 1 సిక్స్) వన్డే తరహా ఇన్నింగ్స్ ఆడగా... వికెట్ కీపర్ రిషభ్ పంత్ (106 బంతుల్లో 50; 4 ఫోర్లు) రాణించాడు. క్రిస్ వోక్స్ 3 వికెట్లు తీశాడు. చదవండి: Shardul Thakur: ఎనిమిదో నెంబర్ ఆటగాడిగా శార్దూల్ కొత్త చరిత్ర -
విరాట్ కోహ్లిపై.. ఇంగ్లండ్ కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు
ఓవల్: భారత్‌తో జరిగిన మూడో టెస్టులో ఘన విజయం సాధించి సిరీస్ 1-1తో సమం చేసిన ఇంగ్లండ్ నాలుగో టెస్ట్‌కు సిద్దమైంది. ఈ సందర్భంగా ఇంగ్లండ్ సారధి జో రూట్ మీడియాతో మాట్లాడూతూ.. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి పై అసక్తికర వాఖ్యలు చేసాడు. మేము టెస్ట్ సిరీస్ కైవసం చేసుకోవాలంటే విరాట్ కోహ్లిని నిశ్శబ్దంగా ఉంచాల్సిన అవసరం ఉందని రూట్ అన్నాడు. ఇప్పటి వరకు విజయవంతంగా ఆ పని చేశామని, మిగతా మ్యాచ్‌ల్లో కూడా దాన్ని కొనసాగించాలన్నాడు. ప్రస్తుతం జరుగుతున్న సిరీస్‌లో కోహ్లీ కేవలం ఒక్కసారి మాత్రమే 50 పైగా పరుగులు చేశాడని.. జేమ్స్ ఆండర్సన్ అతడిని రెండుసార్లు పెవిలియన్‌కు పంపాడని రూట్ తెలిపాడు. ఇక ప్రపంచ స్థాయి ఆటగాడు అయిన కోహ్లీని త్వరగా ఔట్ చేయడంలో తమ బౌలర్లకే మొత్తం క్రెడిట్ ఇవ్వాలని అతడు పేర్కొన్నాడు. అతన్ని ఔట్ చేయడానికి మేము కొత్తం మార్గాలను కనుగొన్నమాని అతడు వివరించాడు. రాబోయే మ్యాచులో కోహ్లీ సేనపై మరింత ఒత్తిడిని పెంచేందుకు ప్రయత్నిస్తామని రూట్ చెప్పాడు. గత మ్యాచ్‌లో గెలిచామని తమ జట్టు ధీమాగా లేదని జోరూట్ తెలిపాడు. దెబ్బతిన్న భారత్ ప్రతి స్పందన ఎలా ఉంటోందో తనకు తెలుసని, దానికి తగ్గట్లు సిద్దం అవుతున్నామన్నాడు. కాగా సెప్టెంబర్ 2 నుంచి ఓవల్ వేదికగా నాలుగో టెస్ట్ జరగనుంది. చదవండి: IPL 2021: విండీస్ విధ్వంసకర ఆటగాడిని దక్కించుకున్న రాజస్తాన్ రాయల్స్ -
రోహిత్ శర్మ ఎల్బీపై ఫ్యాన్స్ ఫైర్!
లీడ్స్: లీడ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ ఔటైన తీరుపై నెటిజన్లు తీవ్రస్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రెండో ఇన్నింగ్స్ 48వ ఓవర్లో ఫాస్ట్ బౌలర్ ఓలీ రాబిన్సన్ బౌలింగ్‌లో బంతిని లెగ్ సైడ్ ఆడేందుకు రోహిత్ శర్మ ప్రయత్నించాడు. కానీ.. బ్యాట్‌కి తగలకుండా బంతి నేరుగా వెళ్లి ఫ్యాడ్‌ని తాకింది. వెంటనే ఇంగ్లండ్ టీమ్ ఎల్బీడబ్ల్యూ ఔట్ కోసం అప్పీల్ చేయగా ఫీల్డ్ అంపైర్ రిచర్డ్ కెటిల్‌బరో ఔటిచ్చాడు. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ రోహిత్ వెంటనే రివ్యూ తీసుకున్నాడు. రిప్లైలో ఆఫ్ స్టంప్ లైన్‌పై పడిన బంతి లెగ్ స్టంప్‌ని కొద్దిగా తాకుతూ వెళ్లేలా కనిపించింది. దాంతో టీవీ అంపైర్ దానిని అంపైర్స్ కాల్‌గా ప్రకటించాడు. ఫీల్డ్ అంపైర్ తన మునుపటి ఔట్ నిర్ణయానికే కట్టుబడ్డాడు. అంపైర్స్ కాల్ నిర్ణయంపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే, నియమం ప్రకారం కనీసం 50 శాతం బంతి స్టంప్స్‌ని తాకాలి, కానీ అభిమానులు కేవలం 10-20 శాతం మాత్రమే వికెట్‌ను తాకినట్లు భావిస్తున్నారు. అంపైర్ ఔట్ ఇవ్వకపోయి ఉంటే అది అవుట్ అయ్యేది కాదని .. అంపైర్ కాల్ నియమం వింతగా ఉందని అభిమానులు మండిపడుతున్నారు. ఈ నిర్ణయం పట్ల రోహిత్ అసహనం వ్యక్తం చేస్తూనే మైదానం వీడాడు. తొలి ఇన్నింగ్స్ వైఫల్యాల్ని అధిగమించేందుకు భారత బ్యాట్స్‌మెన్ రెండో ఇన్నింగ్స్‌లో పట్టుదలతో ఆడుతున్నారు. ఓపెనర్ రోహిత్ శర్మ (156 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌తో 59) రాణించగా, చతేశ్వర్ పుజారా(180 బంతుల్లో 15 ఫోర్లతో 91) తృటిలో శతకం చేజార్చుకున్నాడు. కెప్టెన్ కోహ్లీ (94 బంతుల్లో 6 ఫోర్లతో 45 బ్యాటింగ్) క్రీజులో పాతుకుపోయాడు. ప్రస్తుతం భారత్ ఇంకా 139 పరుగులు వెనుకబడే ఉంది. చదవండి:IND Vs ENG 3rd Test Day 4: అనుకున్నదే జరిగింది.. ఆదిలోనే పుజారా(91) ఔట్ Absolutely ridiculous. Have always believed that DRS has to be decisive, this umpire’s call proves that. Shambolic. #ENGvIND #RohitSharma pic.twitter.com/cmPzrNXPcH — Atharv Warty (@atharvsays) August 27, 2021 -
India Vs England: 'మాతో పెట్టుకోవద్దు'
2007 సిరీస్... నాటింగ్‌హామ్‌లో భారత్, ఇంగ్లండ్ టెస్టు మ్యాచ్. మన పేసర్ జహీర్ ఖాన్ బ్యాటింగ్‌కు వచ్చిన సమయంలో క్రీజ్ చుట్టూ ఇంగ్లండ్ ఆటగాళ్లు కొన్ని జెల్లీ బీన్స్ విసిరి అతడిని ఆట పట్టించేందుకు ప్రయత్నించారు. అది చూసి జహీర్‌కు బాగా కోపం వచ్చింది. ఇంగ్లండ్‌తో వాదనకు దిగిన అతను బౌలింగ్‌కు వచ్చినప్పుడు తన కసినంతా చూపించాడు. ఐదు వికెట్లతో ప్రత్యర్థిని కుప్పకూల్చడం, భారత్ ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం జరిగిపోయాయి. తాజాగా బుమ్రా ఉదంతాన్ని బట్టి చూస్తే 14 ఏళ్ల తర్వాత కూడా ఇంగ్లండ్ పాఠాలు నేర్చుకోలేదని అనిపిస్తోంది. – సాక్షి క్రీడా విభాగం లార్డ్స్ టెస్టు విజయంలో షమీ, బుమ్రా బ్యాటింగ్ ప్రదర్శన కూడా కీలక పాత్ర పోషించింది. ఏకంగా 20 ఓవర్ల పాటు క్రీజ్‌లో నిలిచిన వీరిద్దరు 89 పరుగుల భాగస్వామ్యంతో టీమిండియా పైచేయి సాధించడానికి కారణమయ్యారు. ఈ క్రమంలో మైదానంలో ఇంగ్లండ్ ఆటగాళ్లనుంచి వీరిద్దరు బంతులే కాదు, మాటల తూటాలు కూడా ఎదుర్కొన్నారు. అయితే ఎక్కడా తగ్గకుండా పట్టుదలగా క్రీజ్‌లో నిలబడ్డారు. షమీ తనదైన శైలిలో దూకుడుగా ఆడి ఇంగ్లండ్ బౌలర్లపై చెలరేగగా... బుమ్రా తన బ్యాటింగ్ సత్తా చూపించడంతో పాటు బౌలింగ్‌లో తన స్థాయి ఏమిటో ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌ను రుచి చూపించాడు. నిజానికి భారత్ 8 వికెట్లు కోల్పోయిన తర్వాత మరో వికెట్ తీసే లక్ష్యంతో బౌలింగ్ చేయకుండా బుమ్రా శరీరంపైకి బంతులు ఎక్కు పెట్టి పదే పదే షార్ట్ బంతులతో ఇబ్బంది పెట్టాలని ఇంగ్లండ్ ప్రయత్నించింది. తొలి ఇన్నింగ్స్‌లో అండర్సన్‌కు ఒక ఓవర్ బుమ్రా ప్రమాదకరంగా వేసినందుకు ప్రతీకారంగా అందరూ కలిసి పాఠం చెప్పాలని భావించినట్లున్నారు. నిజానికి 164 టెస్టుల అనుభవం ఉన్న అండర్సన్‌కు ఇలాంటివి కొత్త కాదు. 2007 నాటింగ్‌హామ్‌లో టెస్టులో కూడా అతను ఆడాడు. అతనికంటే ఎక్కువగా స్పందించిన ఇతర బౌలర్లు ఈ వేడిలో బౌలింగ్‌లో గతి తప్పగా...షమీ, బుమ్రా పండగ చేసుకున్నారు. కోహ్లి దారి చూపగా... ఈ టెస్టులో భారత ఆటగాళ్ల శారీరక భాష చూస్తే ప్రతీ ఒక్కరు ఒక్కో అగ్నిగోళంగా కనిపించారు. ముఖ్యంగా కెప్టెన్ విరాట్ కోహ్లి ప్రతీ క్షణం అమితోత్సాహంతో కనిపిస్తూ, తన సహచరులను ప్రేరేపిస్తున్న తీరు...వికెట్ పడినప్పుడు ప్రదర్శిస్తున్న హావభావాలు ప్రత్యర్థిని ఒత్తిడిలో పడేస్తున్నాయి. ఎక్కడా తగ్గేదే లేదు అన్నట్లుగా క్రికెటర్లు మాటల దాడికి వెనుకాడలేదు. అండర్సన్‌తో కోహ్లి వాదన, వికెట్ తీసినప్పుడు ‘నిశ్శబ్దం’ అన్నట్లుగా నోటిపై వేలుతో సిరాజ్ సంబరాలతో మొదలైన టెస్టు బుమ్రా, బట్లర్ మాటల యుద్ధం వరకు సాగింది. ఒక దశలో ఇది శృతి మించడంతో బుమ్రా చివరకు అంపైర్‌కు కూడా ఫిర్యాదు చేయాల్సి వచ్చింది. ఆ ఆగ్రహాన్నంతా బుమ్రా తర్వాత తన బౌలింగ్‌లో చూపించాడు. ‘మాలో ఒక్కడిని అంటే పది మందిని అన్నట్లే. అందుకే ఎవరిని దూషంగా అందరం మళ్లీ జవాబిచ్చేందుకు సిద్ధంగా ఉంటాం తప్ప వెనక్కి తగ్గం’ అంటూ మ్యాచ్ ముగిసిన తర్వాత రాహుల్ చేసిన వ్యాఖ్య మ్యాచ్ చివరి రోజు ఎలా సాగిందో చెబుతోంది. ఆస్ట్రేలియన్లూ ఇలాగే... అడిలైడ్‌లో 36 ఆలౌట్ తర్వాత మెల్బోర్న్లో బరిలోకి దిగిన టీమిండియాను ఆసీస్ ఆటగాళ్లు మొదటి సెషన్నుంచే మాటలతో వేధించారు. అయితే రహానే నాయకత్వంలో జట్టు మరింత కసిగా ఆటను ప్రదర్శించింది. చివరకు అద్భుత విజయం సాధించి మమ్మల్ని రెచ్చగొడితే ఇలాగే ఉంటుందంటూ చూపించింది. ఇక బ్రిస్బేన్ అద్భుతం గురించి ఎంత చెప్పినా తక్కువే. సిడ్నీ టెస్టులో డ్రాకు ప్రయత్నిస్తున్న సమయంలో గాబా మైదానానికి రా చూసుకుందాం అంటూ కెప్టెన్ పైన్ సవాల్ విసిరాడు. ఇది కూడా టీమిండియా సీరియస్‌గా తీసుకుంది. అత్యద్భుత ఆట తో అనూహ్య లక్ష్యాన్ని ఛేదించి మూడు దశాబ్దాలుగా ఆసీస్ ఓటమి ఎరుగని మైదానంలో వారిని మట్టికరిపించింది. అన్నట్లు ఇటీవల ఓడిన వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లో భారత్, న్యూజిలాం డ్ ఆటగాళ్ల మధ్య చిన్నపాటి వాదన కూడా జరగలేదు. భారత్‌ను ఎలా ఓడించాలో మాకు తెలుసన్నట్లుగా కివీస్ చాలా కూల్‌గా ఆటపై మాత్రమే దృష్టి పెట్టి ఫలితం సాధించింది! -
‘లార్డ్స్’లో భారత ఘనవిజయం
రిషభ్ పంత్, ఇషాంత్ శర్మ.... ఈ ఇద్దరు ఓవర్‌నైట్ బ్యాట్స్‌మెన్‌లో పంత్ ఒక్కడే స్పెషలిస్టు బ్యాట్స్‌మన్. అతడు అవుటైతే ఇంకో ఐదో పదో పరుగులకు కూలిపోవచ్చనే సందేహం... ఇషాంత్‌కు ముందే పంత్ ఔటయ్యాడు. తర్వాత ఇషాంత్ కూడా పెవిలియన్ చేరాడు. కానీ అనుకున్నట్లుగా ఇన్నింగ్స్ కూలలేదు సరికదా అసలు మరో వికెటే పడలేదు! బంతులతో చెలరేగే బౌలర్లు షమీ, బుమ్రా బ్యాటింగ్‌తో అద్భుతమే చేశారు. వికెట్ పతనాన్ని అక్కడితోనే ఆపేసి... పరుగులకు బాట వేశారు. తర్వాత మళ్లీ వాళ్లిద్దరే ఇంగ్లండ్ ఓపెనర్లను డకౌట్ చేసి పతనానికి శ్రీకారం చుట్టారు. హైదరాబాద్ స్పీడ్‌స్టర్ సిరాజ్ ఆఖరి వికెట్ తీసి శుభం కార్డు వేయడంతో లార్డ్స్ మైదానంలో భారత్ అద్భుత విజయాన్ని అందుకుంది. లండన్: ‘ఈ 60 ఓవర్లు వారికి నరకం కనబడాలి’...ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ ప్రారంభానికి ముందు తన సహచరులతో కోహ్లి చెప్పిన మాట ఇది! అతను అన్నట్లుగానే మన బౌలర్లు ప్రత్యర్థిని ఒక్కో ఓవర్లో, ఒక్కో బంతికి గుండెలాగిపోయేలా చేస్తూ చివరకు గెలిచే వరకు ఆగలేదు. భారత్‌కు లార్డ్స్‌లో అద్భుత విజయాన్నిచ్చారు. రెండో టెస్టులో ఆఖరి రోజు మొదట భారత బౌలర్లు బ్యాటింగ్‌లో ‘కింగ్’లయ్యారు. తిరిగి బౌలింగ్‌తో బెంబేలెత్తించారు. ఇంగ్లండ్‌కు ఊహించని షాక్‌లిచ్చారు. డ్రాతో గట్టెక్కాల్సిన చోట గెలుపు సంబరమిచ్చారు. రెండో టెస్టులో భారత్ 151 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. కష్టాల్లో ఉన్న భారత్‌ను షమీ (70 బంతుల్లో 56 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్స్), బుమ్రా (64 బంతుల్లో 34 నాటౌట్; 3 ఫోర్లు) ఆదుకోవడంతో రెండో ఇన్నింగ్స్‌ను 109.3 ఓవర్లలో 8 వికెట్లకు 298 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది తర్వాత ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 51.5 ఓవర్లలో 120 పరుగులకే కుప్పకూలింది. ఆట ముగియడానికి మరో 9.1 ఓవర్లు మాత్రమే ఉండగా, ఇంగ్లండ్ చేతిలో 3 వికెట్లు ఉండటంతో డ్రా అవుతుందేమో అనిపించింది. కానీ రాబిన్సన్ (9)ను అవుట్ చేసి బుమ్రా బాట వేయగా...ఒకే ఓవర్లో బట్లర్ (25), అండర్సన్ (0)లను పెవిలియన్ పంపించి సిరాజ్ ముగిం చాడు. ఈ గెలుపుతో ఐదు టెస్టుల సిరీస్‌లో భారత్ 1–0తో ఆధిక్యంలో నిలిచింది. ఓవర్‌నైట్ స్కోరు 181/6తో సోమవారం ఆట ప్రారంభించిన అనం తరం రిషభ్ పంత్ (22) ఎక్కువసేపు నిలువలేదు. ఇషాంత్ (16) త్వరగానే ఔటయ్యాడు. ఈ దశలో షమీ–బుమ్రా భాగస్వామ్యం అద్భుతాన్నే చేసింది. సిరాజ్‌కు 4 వికెట్లు భారత్ నిర్దేశించిన లక్ష్యం 272. రెండు సెషన్లు, 60 ఓవర్లు. ఓపెనింగ్ సహా టాపార్డర్ నిలబడితే, దీనికి వేగం జతయితే ఓవర్‌కు 4 పరుగులు చేయడం ఏమంత కష్టం కాదు. కానీ బుమ్రా, షమీ వారికి ఆ అవకాశమే ఇవ్వలేదు. ఇద్దరు ప్రారంభ ఓవర్లలోనే బర్న్స్ (0), సిబ్లీ (0)లను ఖాతా తెరువనీయలేదు. వీళ్లిద్దరికి తోడుగా ఇషాంత్ దెబ్బ మీద దెబ్బ తీశాడు. హమీద్ (9), బెయిర్ స్టో (2)ల పనిపట్టాడు. కెప్టెన్ రూట్ (60 బంతుల్లో 33; 5 ఫోర్లు) జట్టును కాపాడాలనుకున్నా బుమ్రా ఆ అవకాశం అతనికి ఇవ్వలేదు. ఈ స్థితిలో డ్రా చేసుకోవడం కూడా ఇంగ్లండ్‌కు కష్టమే! అయినా సరే బట్లర్ (96 బంతుల్లో 25; 3 ఫోర్లు) ప్రయత్నిద్దామనుకున్నాడు. కానీ సీన్లోకి ఈ సారి సిరాజ్ వచ్చాడు. వరుస బంతుల్లో మొయిన్ అలీ (13), స్యామ్ కరన్ (0)లను ఔట్ చేశాడు. తర్వాత బట్లర్‌ను తనే పెవిలియన్ చేర్చాడు. షమీ–బుమ్రా బ్యాటింగ్ సత్తా మనం డ్రా చేసుకుంటే చాలనుకునే పరిస్థితి నుంచి ప్రత్యర్థి డ్రాతో గట్టెక్కితే చాలనే స్థితికి తీసుకొచ్చిన మహ్మద్ షమీ (70 బంతుల్లో 56 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్స్), బుమ్రా (64 బంతుల్లో 34 నాటౌట్; 3 ఫోర్లు) ఇంగ్లండ్ బౌలర్ల భరతం పట్టారు. బంతులేసే బౌలర్లు ప్రధాన బ్యాట్స్‌మెన్ కంటే బాగా ఆడారు. ఇంగ్లండ్ కెప్టెన్ రూట్ అందుబాటులో ఉన్న అస్త్రాల్ని ప్రయోగించాడు. మార్క్‌వుడ్, రాబిన్సన్, స్యామ్ కరన్ ఇలా ఎవరిని దించినా బుమ్రా, షమీ తగ్గలేదు. అలా అని టిక్కుటిక్కు అని డిఫెన్స్‌కే పరిమితం కాలేదు. క్రీజులో పాతుకుపోయే కొద్దీ షాట్లపై కన్నేశారు. బంతిని బౌండరీలైనును దాటించారు. ఇద్దరు టెస్టు ఆడినా... పరుగుల వేగం వన్డేలా అనిపించింది. ముఖ్యంగా 40 పరుగుల వద్ద ఉన్న షమీ వరుస బంతుల్లో 4, 6 కొట్టి అర్ధసెంచరీ పూర్తి చేయడం విశేషం. మొదట లాంగాన్‌లో బౌండరీ బాదిన షమీ మరుసటి బంతిని ముందుకొచ్చి డీప్ మిడ్‌వికెట్ దిశగా భారీ షాట్ ఆడాడు. అది కాస్తా ప్రేక్షకుల గ్యాలరీలో పడింది. ఈ ఇద్దరి సమన్వయం కుదరడంతో ఇంగ్లండ్ బౌలింగ్ దళం చెదిరింది. ఈ జోడీని విడగొట్టే ప్రయత్నం ఫలించక, అటు పరుగులకు అడ్డుకట్ట వేయలేక ఆపసోపాలు పడ్డారు. అబేధ్యమైన భాగస్వామ్యం ఎంతకీ ముగియకపోగా, చివరకు భారత్ డిక్లేర్ చేసింది. అజేయమైన తొమ్మిదో వికెట్‌కు 20 ఓవర్లలోనే షమీ, బుమ్రా 89 పరుగులు జోడించారు. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: 364 ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 391 భారత్ రెండో ఇన్నింగ్స్: రాహుల్ (సి) బట్లర్ (బి) వుడ్ 5; రోహిత్ (సి) మొయిన్ అలీ (బి) వుడ్ 21; పుజార (సి) రూట్ (బి) వుడ్ 45; కోహ్లి (సి) బట్లర్ (బి) కరన్ 20; రహానే (సి) బట్లర్ (బి) అలీ 61; పంత్ (సి) బట్లర్ (బి) రాబిన్సన్ 22; జడేజా (బి) మొయిన్ అలీ 3; ఇషాంత్ (ఎల్బీ) (బి) రాబిన్సన్ 16; షమీ నాటౌట్ 56; బుమ్రా నాటౌట్ 34; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (109.3 ఓవర్లలో) 298/8 డిక్లేర్డ్ వికెట్ల పతనం: 1–18, 2–27, 3–55, 4–155, 5–167, 6–175, 7–194, 8–209. బౌలింగ్: అండర్సన్ 25.3–6–53–0, రాబిన్సన్ 17–6–45–2, వుడ్ 18–4–51–3; కరన్ 18–3–42–1, అలీ 26–1–84–2, రూట్ 5–0–9–0. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: బర్న్స్ (సి) సిరాజ్ (బి) బుమ్రా 0; సిబ్లీ (సి) పంత్ (బి) షమీ 0; హమీద్ (ఎల్బీ) (బి) ఇషాంత్ 9; రూట్ (సి) కోహ్లి (బి) బుమ్రా 33; బెయిర్‌స్టో (ఎల్బీ) (బి) ఇషాంత్ 2; బట్లర్ (సి) పంత్ (బి) సిరాజ్ 25; అలీ (సి) కోహ్లి (బి) సిరాజ్ 13; కరన్ (సి) పంత్ (బి) సిరాజ్ 0; రాబిన్సన్ (ఎల్బీ) (బి) బుమ్రా 9; వుడ్ నాటౌట్ 0; అండర్సన్ (బి) సిరాజ్ 0; ఎక్స్‌ట్రాలు 29; మొత్తం (51.5 ఓవర్లలో ఆలౌట్) 120. వికెట్ల పతనం: 1–1, 2–1, 3–44, 4–67, 5–67, 6–90, 7–90, 8–120, 9–120, 10–120. బౌలింగ్: బుమ్రా 15–3–33–3; షమీ 10–5–13–1, జడేజా 6–3–5–0, సిరాజ్ 10.5–3–32–4, ఇషాంత్ 10–3–13–2. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
Ind vs Eng: ఇక టెస్టు క్రికెట్ సమయం
నాటింగ్‌హామ్: భారత ద్వితీయ శ్రేణి జట్టు ఇటీవల శ్రీలంకతో సిరీస్ ఆడినా స్టార్లు లేని ఆ జట్టు మ్యాచ్‌లు సగటు క్రికెట్ అభిమానులకు పెద్దగా ఆసక్తిని కలిగించలేదు. కొంత విరామం తర్వాత ఇప్పుడు సీనియర్ క్రికెటర్లు కీలక మ్యాచ్ కోసం బరిలోకి దిగుతున్నారు. నేటి నుంచి ట్రెంట్‌బ్రిడ్జ్ మైదానంలో జరిగే తొలి టెస్టులో ఇంగ్లండ్‌తో భారత్ తలపడుతుంది. ఐదు టెస్టుల సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో విజయం సాధిస్తే మానసికంగా పైచేయి సాధించే అవకాశం ఉండటంతో ఇరు జట్లు శుభారంభమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. కేఎల్ రాహుల్‌కు చాన్స్... కివీస్‌తో డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడిన లైనప్‌ను చూస్తే తొలి టెస్టులో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. గాయపడిన శుబ్‌మన్ గిల్ స్థానంలో ఓపెనర్‌గా కేఎల్ రాహుల్ ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కెరీర్లో ఆడిన 36 టెస్టుల్లో 5 సార్లు మినహా అన్ని సందర్భాల్లో రాహుల్ స్పెషలిస్ట్ ఓపెనర్‌గానే బరిలోకి దిగాడు. తాజా ఫామ్‌ను పరిగణనలోకి తీసు కున్నా రాహుల్‌కే తొలి అవకాశం ఉంటుంది. రోహి త్ తనదైన శైలిలో దూకుడుగా ఆడగలడు. అయితే 3, 4, 5 స్థానాల బ్యాట్స్‌మెన్‌లో నిలకడ లోపించడం భారత్‌ను కొంత బలహీనంగా మారుస్తోంది. కోహ్లి కూడా భారీ స్కోరు సాధించడంలో విఫలమవుతుండగా... పుజారా, రహానే చెప్పుకోదగ్గ స్కోరు సాధించి చాలా కాలమైంది. వీరు రాణిస్తేనే భారత బ్యాటింగ్ పటిష్టంగా మారుతుంది. ముగ్గురు పేసర్లు బుమ్రా, ఇషాంత్, షమీలతో పాటు అశ్విన్ ఖాయం కాగా... జడేజాను కాకుండా నాలు గో పేసర్‌గా శార్దుల్‌ను తీసుకుంటారా చూడాలి. స్యామ్ కరన్ కీలకం... ప్రతిష్టాత్మక సిరీస్‌కు బెన్ స్టోక్స్‌లాంటి స్టార్ ఆటగాడు దూరం కావడం ఇంగ్లండ్‌కు పెద్ద దెబ్బ. అయితే యువ ఆల్‌రౌండర్ స్యామ్ కరన్ ఆ స్థానంలో తన వంతు పాత్ర పోషించనున్నాడు. అండర్సన్, బ్రాడ్‌లాంటి సీనియర్లతో పాటు రాబిన్సన్ మూడో పేసర్‌గా ఆడవచ్చు. ఇటీవల భారత పర్యటనకు వెళ్లి ఘోరమైన ప్రదర్శన కనబర్చిన బ్యాట్స్‌మెన్ బర్న్స్, సిబ్లీ, క్రాలీలకు సొంతగడ్డపైనైనా రాణించి ఆకట్టుకునేందుకు ఇది సరైన అవకాశం. ప్రధాన బ్యాట్స్‌మన్‌గా, కెప్టెన్‌గా తీవ్ర ఒత్తిడిలో ఉన్న రూట్‌కు కూడా ఈ సిరీస్ కీలకం కానుంది. పిచ్, వాతావరణం ఆరంభంలో సీమ్ బౌలింగ్‌కు అనుకూలిస్తూ ఆ తర్వాత స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయగలిగే సాధారణ ఇంగ్లండ్ తరహా పిచ్. కొంత పచ్చిక ఉన్నా, టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవచ్చు. జట్ల వివరాలు (అంచనా) భారత్: కోహ్లి (కెప్టెన్), రోహిత్, రాహుల్, పుజారా, రహానే, పంత్, అశ్విన్, జడేజా/శార్దుల్, షమీ, ఇషాంత్, బుమ్రా. ఇంగ్లండ్: రూట్ (కెప్టెన్), బర్న్స్, సిబ్లీ, క్రాలీ, బెయిర్‌స్టో, బట్లర్, స్యామ్ కరన్, రాబిన్సన్, బ్రాడ్, లీచ్, అండర్సన్. -
ఇషాంత్ స్థానంలో సిరాజ్, టీమిండియాలో భారీ మార్పులు..?
లండన్: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ ఉండి ఉంటే ఫలితం మరోలా ఉండేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకునేలా కనిపిస్తుంది. త్వరలో ప్రారంభం కాబోయే ఇంగ్లండ్ సిరీస్‌లో ఇషాంత్ స్థానంలో సిరాజ్‌కు తుది జట్టులో అవకాశం కల్పించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. డబ్ల్యూటీసీ ఫైనల్లో పేసర్లకు అనుకూలించే పిచ్‌పై ఇషాంత్ పూర్తిగా తేలిపోయాడని, మూడు వికెట్లు పడగొట్టినా అది అతని స్థాయికి తగ్గ ప్రదర్శన కాదని జట్టు యాజమాన్యం అభిప్రాయపడుతుంది. 100 టెస్టుల అనుభవం ఉన్న ఇషాంత్ ఇప్పటికీ కొత్త కుర్రాడిలాగే కనిపిస్తున్నాడని, అతడి బౌలింగ్‌ను పరిశీలిస్తే అన్ని టెస్టులు ఆడిన అనుభవం కనిపించడం లేదని విమర్శకులు చురకలంటిస్తున్నారు. దీంతో అతనికి ప్రత్యామ్నాయమైన సిరాజ్‌ను ఖచ్చితంగా తుది జట్టులోకి తీసుకోవాలని మేనేజ్మెంట్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే, గతేడాది ఆస్ట్రేలియా పర్యటనలో టెస్ట్ కెరీర్ ప్రారంభించిన సిరాజ్.. అద్భుతమైన బౌలింగ్‌తో అదరగొట్టాడు. సిరీస్ ప్రారంభానికి ముందు తండ్రి మరణించినా.. ఆ బాధను దిగమింగుకుని మరీ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. మూడు టెస్టుల్లో 13 వికెట్లు తీసి.. సిరీస్‌లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. ముఖ్యంగా బ్రిస్బేన్‌లో జరిగిన చివరి టెస్ట్‌లో 5 వికెట్లు పడగొట్టిన సిరాజ్.. టీమిండియా చారిత్రక విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. కాగా, సిరాజ్ ఇప్పటి వరకూ 5 టెస్ట్ మ్యాచ్‌ల్లో 16 వికెట్లు పడగొట్టాడు. మరోవైపు ఇంగ్లండ్ సిరీస్ నిమిత్తం టీమిండియా తుది జట్టులో భారీ మార్పులు- చేర్పులు జరిగేలా కనిపిస్తున్నాయి. గాయపడిన ఓపెనర్ గిల్ స్థానంలో మయాంక్ లేదా కేఎల్ రాహుల్ జట్టులోకి వచ్చే అవకాశాలున్నాయి. అలాగే, జడేజాను పక్కకు పెట్టి విహారిని ఆడించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. -
కోహ్లీ సేనకు గుడ్ న్యూస్.. ప్రాక్టీస్ మ్యాచ్‌కు ఓకే చెప్పిన ఈసీబీ
లండన్: ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న కోహ్లీ సేనకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) శుభవార్త చెప్పింది. టెస్టు సిరీస్ ప్రారంభానికి ముందు ఓ ప్రాక్టీస్ మ్యాచ్ ఆడేందుకు ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డును (ఈసీబీ) ఒప్పించింది. ఎలాంటి ప్రాక్టీస్ మ్యాచ్ లేకుండా నేరుగా ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ బరిలో దిగిన భారత్.. సౌతాంఫ్టన్ పరిస్థితులను అర్ధం చేసుకోలేక చేతులెత్తేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ తప్పు మరోసారి పునరావృతం కాకుండా బీసీసీఐ జాగ్రత్త పడింది. దీంతో జులై 20-22 మధ్య మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌ను ఈసీబీ షెడ్యూల్ చేసిందని తెలుస్తోంది. అయితే భారత జట్టుతో తలపడే ప్రత్యర్థి ఎవరన్నది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం బయో బబుల్ నుంచి బయటకు వచ్చి.. కుటుంబంతో గడుపుతున్న కోహ్లీసేన తిరిగి రాగానే ఈ మ్యాచ్ జరుగనుంది. ఇదిలా ఉంటే, భారత్, ఇంగ్లండ్‌ల మధ్య ఆగష్టు 4 నుంచి తొలి టెస్ట్ ప్రారంభంకానుంది. -
పంత్ వీరవిహారం గిల్‌క్రిస్ట్ విధ్వంసాలను గుర్తు చేసింది..
అహ్మదాబాద్: తనదైన రోజున ప్రత్యర్ధి బౌలర్ల పాలిట సింహస్వప్నంలా నిలిచే టీమిండియా డాషింగ్ వికెట్‌కీపర్ రిషబ్ పంత్‌పై ట్విటర్ వేదికగా ప్రశంసల వర్షం కురుస్తోంది. అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో ఫైటింగ్ సెంచరీతో అదరగొట్టిన పంత్.. 116 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్సర్లతో టెస్టుల్లో మూడో సెంచరీని నమోదు చేశాడు. రూట్ బౌలింగ్‌లో సిక్స్ కొట్టి మరీ సెంచరీ పూర్తి చేసిన పంత్.. ఆ వెంటనే (101 పరుగుల వద్ద) అండర్సన్ బౌలింగలో ఔటయ్యాడు. క్లిష్ట సమయంలో క్రీజ్‌లోకి వచ్చిన పంత్.. మొదట్లో వికెట్ కాపాడుకునే ఉద్దేశంతో నెమ్మదిగా ఆడి హాఫ్ సెంచరీని పూర్తి చేశాడు. ఆతరువాతే పంత్ విధ్వంసం మొదలైంది. ఇంగ్లండ్ కొత్త బంతిని తీసుకున్న తర్వాత వరుస ఫోర్లతో విరుచుకుపడ్డాడు. దీంతో టీమిండియా కీలకమైన తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సంపాదించింది. పంత్‌కు వాషింగ్టన్ సుందర్ నుంచి పూర్తి సహకారం లభించింది. సుందర్(117 బంతుల్లో 60 నాటౌట్, 8 ఫోర్లు), పంత్‌లు కలిసి ఏడో వికెట్‌కు 113 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పి టీమిండియాకు 89 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని అందించారు. దీంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 7 వికెట్ల నష్టానికి 294 పరుగులు చేసింది. కాగా, పంత్, సుందర్‌ల జోడీ ఇన్నింగ్స్‌ను నిర్మించిన తీరుపై ప్రముఖ క్రికెటర్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. పంత్ దూకుడును, సుందర్ సంయమన్నాని వారు ఆకాశానికెత్తారు. ఒత్తిడిలో నమ్మశక్యంకాని రీతితో బౌలర్లపై విరుచుకుపడి అద్భుతమైన శతకం సాధించిన టీమిండియా డాషింగ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కు అభినందనలు. నీ విధ్వంసం మొదటిది కాదు.. అలాగని ఆఖరిది కూడా కాకూడదు.. భవిష్యత్తులో నీ బ్యాటింగ్ ఊచకోత కొనసాగించాలని ఆశిస్తున్నా.. అన్ని ఫార్మాట్లలో ఆల్ టైమ్ బెస్ట్ నువ్వే.. నువ్వు నిజమైన మ్యాచ్ విన్నర్ అంటూ టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ పంత్‌ను ఆకాశానికెత్తాడు. జట్టుకు అవసరమైనప్పుడు అద్భుతమైన శతకాన్ని సాధించావు.. గతంలో గిల్‌క్రిస్ట్ చేసిన విధ్వంసాలను గుర్తు చేశావంటూ టీమిండియా మాజీ ఓపెనర్ కృష్ణమాచారి శ్రీకాంత్ ప్రశంసించారు. యువ క్రికెటర్లు జట్టు బాధ్యతలను భుజానికెత్తుకోవడం సంతోషాన్ని కలిగిస్తోంది.. పంత్ ఊచకోత, సుందర్ నిలకడ ప్రదర్శనకు అభినందనలు.. సుందర్ అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నావు.. యువ క్రికెటర్లు భవిష్యత్తులో మరింత నిలకడగా ఆడాలని ఆశిస్తున్నా... వీవీఎస్ లక్ష్మణ్ ఆండర్సన్ బౌలింగ్‌లో రివర్స్ స్వీప్ చేసి ఫోర్ కొట్టడం, సిక్సర్‌తో శతకాన్ని చేరుకోవడం అత్యద్భుతం..నువ్వే నా నిజమైన వారసుడివి.. సెహ్వాగ్ అసాధారణ ప్రతిభ కలిగిన పంత్.. అసాధారణ శతకాన్ని పూర్తి చేశాడు.. అభినందనలు.. టామ్ మూడీ -
కెప్టెన్ కోహ్లి 60 నాటౌట్..
అహ్మదాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి మరో అరుదైన ఘనతను సాధించాడు. భారత్ తరపున అత్యధిక టెస్టులకు సారథ్యం వహించిన ధోని(60 టెస్టులు, 2008-2014) రికార్డును సమం చేశాడు. అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో 32 ఏళ్ల కోహ్లి(60 నాటౌట్) ఈ మార్క్‌ను అందుకున్నాడు. కోహ్లి సారధ్యంలో టీమిండియా ఇప్పటివరకు 35 విజయాలు, 10 డ్రాలు, 14 పరాభవాలను ఎదుర్కొంది. విజయాల పరంగా చూసినా(35 నాటౌట్) కోహ్లినే టీమిండియా అత్యుత్తమ కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు. ఈ జాబితాలో ధోని 27 విజయాలతో కోహ్లి తరువాతి స్థానంలో ఉన్నాడు. గతంలో సౌరవ్ గంగూలీ(49 టెస్టుల్లో 21 విజయాలు), మహ్మద్ అజహరుద్దీన్(47 టెస్టుల్లో 14 విజయాలు), సునీల్ గావస్కర్(47 టెస్టుల్లో 9 విజయాలు), మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ(40 టెస్టుల్లో 9 విజయాలు), కపిల్ దేవ్(34 టెస్టుల్లో 4 విజయాలు), రాహుల్ ద్రవిడ్(25 టెస్టుల్లో 8 విజయాలు), సచిన్ టెండూల్కర్(25 టెస్టుల్లో 4 విజయాలు), బిషన్ సింగ్ బేడీ(22 టెస్టుల్లో 6 విజయాలు)లు భారత్ తరపున అత్యధిక టెస్టులకు సారథ్యం వహించిన వారిగా ఉన్నారు. -
'అతనొక రాక్‌స్టార్.. బిగ్గెస్ట్ మ్యాచ్ విన్నర్'
న్యూఢిల్లీ: టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌పై భారత మాజీ క్రికెటర్లు వీవీఎస్ లక్ష్మణ్, ఆకాశ్ చోప్రాలు ప్రశంసల వర్షం కురిపించారు. అశ్విన్ అత్యుత్తమ ఆటగాడని, రాక్ స్టార్ అని, బిగ్గెస్ట్ మ్యాచ్ విన్నరని కొనియాడాడు. టీమిండియా సొగసరి బ్యాట్స్‌మెన్‌గా ప్రఖ్యాతి గాంచిన వీవీఎస్ లక్ష్మణ్.. అశ్విన్ ప్రదర్శనను ఆకాశానికెత్తాడు. అశ్విన్ చాలా తెలివైన ఆటగాడని, నైపుణ్యంతో పాటు సరైన ప్రణాళిక కలిగి ఉంటాడని మెచ్చుకున్నాడు. దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు ఆటగాళ్లు కేవలం నైపుణ్యంపైనే ఆధారపడకుండా సరైన ప్రణాళికలు కలిగి ఉండాలని.. అది అశ్విన్‌కు బాగా తెలుసునని కితాబునిచ్చాడు. అశ్విన్ బ్యాట్స్‌మెన్ బలహీనతలను కనిపెట్టి, వాటిపై సుదీర్ఘ సాధన చేస్తాడన్నాడు. ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలో స్టీవ్‌స్మిత్‌ను ఈ ప్లాన్ ప్రకారమే బోల్తా కొట్టించాడని గర్తు చేశారు. మరో భారత మాజీ ఆటగాడు ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ.. అశ్విన్ రాక్‌స్టార్ అని, అతను టీమిండియా బిగ్గెస్ట్ మ్యాచ్ విన్నరని కొనియాడాడు. టీమిండియా ఆల్‌టైమ్ గ్రేట్ స్పిన్నర్ కుంబ్లేనే అయినప్పటికీ.. అశ్విన్ అతనికి ఏమాత్రం తీసిపోడని, ఇందుకు అతని గణాంకాలే( 77 టెస్టుల్లోనే 400 వికెట్లు) నిదర్శనమన్నాడు. అతనిపై వచ్చిన విమర్శలకు బంతితో బదులిస్తున్న విధానం చూస్తే అతనో రాక్ స్టార్లా కనిపిస్తాడన్నాడు. ఇటీవల కాలంలో అతని ప్రదర్శనలు చూస్తే.. బిగ్గెస్ట్ మ్యాచ్ విన్నర్ అనక తప్పదన్నారు. -
టీమిండియా ఓడిపోవాలని కోరుకుంటున్న ఆసీస్ కోచ్
వెల్లింగ్టన్: భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య అహ్మదాబాద్ వేదికగా జరుగనున్న ఆఖరిదైన నాలుగో టెస్టులో టీమిండియా ఓటమిపాలవ్వాలని ఆసీస్ తాత్కాలిక హెడ్ కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్ కోరుకుంటున్నాడు. ఆసీస్‌కు ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ బెర్తు దక్కాలంటే మొటేరా మైదానంలో జరిగే ఆఖరి టెస్టు మ్యాచ్‌లో టీమిండియాను ఇంగ్లీష్ జట్టు ఓడించాల్సి ఉంటుంది. ఇదే జరిగితే న్యూజిలాండ్ ఫైనల్ ఆశలు గల్లంతై ఆసీస్ ఫైనల్ చేరేందుకు మార్గం సుగమం అవుతుంది. అప్పుడు జూన్‌లో లార్డ్ వేదికగా జరిగే ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియాతో తలపడే అవకాశం ఆసీస్‌కు లభిస్తుంది. ఇందుకే ఆసీస్ తాత్కాలిక కోచ్ టీమిండియా ఓటమిని కోరుకుంటున్నాడు. ప్రస్తుతం న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న ఆసీస్ జట్టుతో పాటు ఉన్న మెక్‌డొనాల్డ్ సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ఆసీస్ ఫైనల్ బెర్తు అవకాశాలపై ఆశాభావం వ్యక్తం చేశాడు. భీకర ఫామ్‌లో ఉన్న టీమిండియాను ఓడించాలంటే ప్రస్తుత పరిస్థితుల్లో ఇంగ్లండ్ జట్టుకు కష్టమే అయినప్పటికీ.. తాము మాత్రం రూట్ సేన అద్భుతాలు చేసైనా మ్యాచ్‌ను గెలవాలని కోరుకుంటున్నామన్నారు. కాగా, ఆసీస్ రెగ్యులర్ హెడ్ కోచ్ జస్టిన్ లాంగర్ విశ్రాంతి తీసుకోవడంతో మెక్‌డొనాల్డ్ ఆసీస్ తాత్కాలిక కోచ్‌గా వ్యవహరిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 2-1 తేడాతో ముందంజలో ఉన్న సంగతి తెలిసిందే. చెన్నైలో జరిగిన తొలి టెస్టులో ఆతిధ్య జట్టును మట్టికరిపించిన పర్యాటక ఇంగ్లండ్ జట్టు, వరుసగా రెండు, మూడు టెస్టు మ్యాచ్‌ల్లో ఓటమిపాలై సిరీస్‌ను కోల్పోయే ప్రమాదంలో పడింది. ఇరు జట్ల మధ్య ఆఖరి టెస్టు మార్చి 4న ఉదయం 9:30కు ప్రారంభంకానుంది. -
టీమిండియా క్రికెటర్లు నెట్స్‌లో బిజిబిజీగా
అహ్మదాబాద్: ఇంగ్లాండ్‌తో జరుగనున్న ఆఖరిదైన నాలుగో టెస్టులో ఘన విజయం సాధించి, 3-1 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకోవాలని టీమిండియా పట్టుదలగా ఉంది. ఇందుకోసం నెట్స్‌లో కఠోర సాధన చేస్తోంది. ప్రాక్టీస్ సెషన్లో భాగంగా సోమవారం మొటేరా మైదానంలో భారత ఆటగాళ్లు కసిగా బ్యాటింగ్ సాధన చేస్తూ కనిపించారు. ఆటగాళ్లు సాధన చేస్తుండగా తీసిన వీడియోను బీసీసీఐ తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రహానె నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా, స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ ప్రధాన కోచ్ రవిశాస్త్రితో కలిసి ముచ్చటిస్తూ కనిపించాడు. కొందరు ఆటగాళ్లు తమ ఫీల్డింగ్ నైపుణ్యానికి మెరుగులు దిద్దుతూ కనిపించారు. కాగా, భారత్ ఇంగ్లండ్ జట్ల మధ్య చివరి టెస్టు మ్యాచ్ ఇదే వేదికగా గురువారం నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. Training ✅@Paytm #INDvENG pic.twitter.com/G7GCV1EA8U — BCCI (@BCCI) March 1, 2021 -
రెండో టెస్టులో టీమిండియా ఘన విజయం
-
మరోసారి అంపైరింగ్ తప్పిదం.. ఈసారి రోహిత్
చెన్నై: భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్ట్‌లో విజయాల సంగతి పక్కన పెడితే.. అంపైరింగ్ అపహాస్యానికి గురవుతున్నట్లు సుస్పష్టమవుతుంది. మ్యాచ్ తొలి రోజు రహానే విషయంలో జరిగిన పొరపాటే రెండో రోజు ఆటలో రోహిత్ శర్మ విషయంలోనూ పునరావృతం కావడం ఇంగ్లీష్ ఆటగాళ్లతో పాటు యావత్ క్రీడాభిమానులకు విస్మయాన్ని కలిగిస్తోంది. ఫీల్డ్ అంపైర్ పొరపాటు చేస్తే సరిదిద్దాల్సిన థర్డ్ అంపైర్ కూడా అదే తప్పును రిపీట్ చేస్తే.. అది జట్టు జయాపజయాలపైనే కాకుండా అంపైరింగ్ వ్యవస్థపైనే నమ్మకం కోల్పోయేలా చేస్తుంది. రెండో రోజు భారత రెండో ఇన్నింగ్స్‌లో రోహిత్ శర్మ ఎల్బీడబ్యూ విషయంలో ఇంగ్లండ్ రివ్యూ కోరింది. స్పిన్నర్ జాక్ లీచ్ వేసిన బంతి మిడిల్ స్టంప్‌ను తాకే దిశగా పయనిస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. రోహిత్ షాట్ అడే ప్రయత్నం చేశాడన్న కారణంగా అంపైర్ నాటౌట్‌గా ప్రకటించాడు. రివ్యూ చూసిన థర్డ్ అంపైర్ బంతి ఆఫ్ స్టంప్ అవతలి నుంచి వెళ్తుందని కన్ఫర్మ్ చేసి నాటౌట్‌గా ప్రకటించాడు. అయితే రీప్లేలో మాత్రం రోహిత్ ఎటువంటి షాట్‌కు ప్రయత్నించిన దాఖలాలు కనబడలేదు. బంతి మిడిల్ స్టంప్‌ను తాకుతుందని సుస్పష్టంగా తెలుస్తోంది. థర్డ్ అంపైర్ నిర్ణయంపై విస్మయానికి గురైన ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ బహిరంగంగానే తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు. ఈ విషయంపై వ్యాఖ్యాత సునీల్ గవాస్కర్ సైతం తన అసహనాన్ని తెలియజేశాడు. కాగా, తొలి రోజు ఆటలో సైతం రహానే అంపై'రాంగ్' నిర్ణయం వల్ల బతికిపోయిన సంగతి తెలిసిందే. జాక్ లీచ్ వేసిన బంతి రహానే గ్లోవ్స్‌ను తాకుతూ వికెట్‌కీపర్ చేతుల్లోకి వెళ్లినట్లు రీప్లేలో స్పష్టంగా తెలుస్తోంది. దీనిపై ఇంగ్లండ్ ఆటగాళ్లు రివ్యూకి వెళ్లగా.. థర్డ్ అంపైర్ కూడా పొరపాటు చేసి రహానేను నాటౌట్‌గా ప్రకటించాడు. థర్డ్ అంపైర్ ఎల్బీడబ్యూ యాంగిల్లోనే పరిశీలించి, క్యాచ్ అవుట్ విషయాన్ని విస్మరించాడు. ఏదిఏమైనప్పటికీ ఇటు వంటి అంపై'రాంగ్' నిర్ణయాలు ఆటగాళ్లలో తప్పుడు అభిప్రాయాన్నినింపేస్తాయి. ఇక రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టానికి 54 పరుగులు చేసింది. ఓపెనర్ రోహిత్ శర్మ 25 పరుగులు, పుజారా 7 పరుగులతో క్రీజులో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్‌లో 329 పరుగులు చేసిన భారత్, 195 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని కలుపుకొని 249 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. అంతకముందు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 134 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. అశ్విన్ 5 వికెట్లతో రాణించాడు. If that’s a shot then I’m a rockstar #INDvEND pic.twitter.com/eTfNvW6V84 — simon hughes (@theanalyst) February 14, 2021 -
కెప్టెన్సీపై ఉహాగానాలకు చెక్ పెట్టండి: రహానే
చెన్నై: కోహ్లీ కెప్టెన్సీపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో తనను ఇరుకున పెట్టే ప్రయత్నం చేసిన ఓ విలేకరికి టీమిండియా టెస్ట్ వైస్ కెప్టెన్ అజింక్యా రహానే చురకలంటించాడు. మీకు కావాల్సిన మసాలా వార్తలు ఇక్కడ దొరకవని స్పష్టం చేశాడు. రేపటి నుంచి ఇంగ్లండ్‌తో రెండో టెస్ట్ ప్రారంభంకానున్న నేపథ్యంలో శుక్రవారం మీడియాతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ ఆయన మాట్లాడుతూ.. జట్టు మొత్తానికి కోహ్లీ కెప్టెన్సీపై పూర్తి నమ్మకం ఉందని, అతనే తమ కెప్టెన్‌గా కొనసాగుతాడని, ఇకనైనా కెప్టెన్సీపై ఉహాగానాలకు చెక్ పెట్టాలని మీడియాకు విజ్ఞప్తి చేశారు. తన బ్యాటింగ్ వైఫల్యంపై జింక్స్ మాట్లాడుతూ.. గత వైఫల్యాలను బేరీజు వేసుకొని, రెండో టెస్ట్‌కు అన్ని విధాల సన్నద్దమయ్యానన్నాడు. రేపటి నుంచి ప్రారంభంకానున్న రెండో టెస్ట్‌లో స్పిన్నర్లు చెలరేగుతారని అతను ఆశాభావం వ్యక్తం చేశాడు. తొలి టెస్ట్‌లో ఎదురైన పరాభావాన్ని మరిచిపోయి, తదుపరి టెస్ట్‌లో సర్వ శక్తులు ఒడ్డి విజయం కోసం కృషి చేస్తామన్నాడు. భారత కాలమానం ప్రకారం మ్యాచ్ రేపు ఉదయం 9:30గంటలకు ప్రారంభం కానుంది. కాగా, ఇటీవల కాలంలో రహానే మెల్బోర్న్ టెస్ట్ సెంచరీ మినహా గత ఆరు ఇన్నింగ్స్‌ల్లో వరుసగా 4, 22, 24, 37, 1, 0 పరుగులతో దారుణంగా విఫలమయ్యాడు. కెప్టెన్‌గా రాణించినా, బ్యాట్స్‌మన్‌గా పూర్తిగా విఫలమవుతున్నాడని మాజీ క్రికెటర్లు అతనిపై విమర్శలు గుప్పించారు. -
బెయిర్‌స్టో ఆడటం అతనికి ఇష్టం లేదు.. అందుకే..!
లండన్: భారత్‌తో రేపటి నుంచి ప్రారంభం కానున్నరెండో టెస్ట్‌లో ఇంగ్లండ్ తుది జట్టులో వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్ జానీ బెయిర్‌స్టో ఆడటం ఇంగ్లండ్ ఛీఫ్ సెలెక్టర్ ఎడ్ స్మిత్‌కు ఇష్టం లేదని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జెఫ్రీ బాయకాట్ ఆరోపించాడు. భారత పర్యటనకు ముందు శ్రీలంకతో జరిగిన రెండు టెస్ట్‌ల్లో బెయిర్‌స్టో తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేసినప్పటికీ.. విశ్రాంతి పేరుతో అతన్ని ఇంటికి పంపించి, ఇప్పుడు తుది జట్టులో ఆడే అవకాశం ఉన్నా అతనికి బదులు మరో వికెట్ కీపర్(బెన్ ఫోక్స్)వైపు మొగ్గు చూపడం ఏమాత్రం సమంజసం కాదని ఆయన మండిపడ్డారు. ప్రతిభ గల ఆటగాడి పట్ల జట్టు యాజమాన్యం ఇలా వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. కాగా, భారత్‌తో రెండో టెస్ట్‌కు జోస్ బట్లర్‌కు విశ్రాంతినిచ్చి అతని స్థానంలో బెన్ ఫోక్స్‌ను జట్టు యాజమాన్యం ఎంపిక చేసింది. ఇంగ్లండ్ జట్టులో ఇటీవల కాలంలో రోటేషన్ పద్దతి పేరుతో ఆటగాళ్లను అకారణంగా పక్కకు పెడుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు ఇంగ్లీష్ జట్టు ఈ మ్యాచ్‌లో నాలుగు మార్పులతో బరిలోకి దిగనుంది. అండర్సన్, ఆర్చర్, బట్లర్, బెస్ల స్థానంలో వోక్స్, బ్రాడ్, ఫోక్స్, మొయిన్ అలీలతో బరిలోకి దిగుతుంది. భారత్ నదీమ్‌కు బదులు అక్షర్ పటేల్‌కు అవకాశం కల్పించింది. మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రేపు ఉదయం 9:30గంటలకు ప్రారంభం కానుంది. -
చెన్నై పిచ్ అత్యంత దారుణమైంది: జోఫ్రా ఆర్చర్
చెన్నై: భారత్, ఇంగ్లండ్ జట్ల జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌కు వేదికగా నిలిచిన చెన్నై పిచ్‌పై ఇంగ్లండ్ పేస్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. తన కెరీర్లో చూసిన అత్యంత దారుణమైన పిచ్‌ల్లో చెన్నైపిచ్ ముందు వరుసలో నిలుస్తుందని వ్యాఖ్యానించాడు. ఆఖరి రోజు పిచ్ మరింత మందకొడిగా మారిపోయి నిర్జీవంగా ఉండిదన్నాడు. చివరి రోజు ఆటలో లంచ్‌కు ముందు డ్రింక్స్ బ్రేక్‌లోపే తమ జట్టు విజయం సాధిస్తుందని ఆశించానని, పిచ్ నిర్జీవంగా మారడంతో మ్యాచ్ ఫలితం మరింత ఆలస్యమైందని పేర్కొన్నాడు. ఐదో రోజు పిచ్ స్వరూపం ఎలా మారినా తమ బౌలర్ జిమ్మి ఆండర్సన్ మాత్రం అద్భుతమైన రివర్స్ స్వింగ్‌ను రాబట్టి మ్యాచ్‌ను త్వరగా ముగించాడంటూ అండర్సన్‌పై ప్రశంశల వర్షం కురిపించాడు. అండర్సన్ తన చివరి స్పెల్‌ను 5–3–6–3తో ముగించాడు. ఈ మ్యాచ్‌లో భారత్ 227 పరుగుల తేడాతో పర్యాటక జట్టు చేతిలో ఓటమిపాలై నాలుగు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో 0-1 తేడాతో వెనకపడింది. కాగా, ఇరు జట్ల మధ్య రెండో టెస్ట్‌కు కూడా చెన్నై మైదానమే వేదిక కానుంది. అయితే ఇంగ్లండ్ జట్టు ఫాలో అవుతన్న రొటేషన్ పద్దతి కారణంగా ఈ మ్యాచ్‌లో ఆండర్సన్ బెంచ్‌కే పరిమితం కానున్నాడు. -
రెండో టెస్ట్‌కు భారత జట్టులో కీలక మార్పు!
చెన్నై: ఇంగ్లండ్‌తో ఈనెల 13 నుంచి ప్రారంభం కాబోయే రెండో టెస్ట్ కోసం భారత తుది జట్టులో కీలక మార్పు చేయాలని జట్టు మేనేజ్మెంట్ యోచిస్తోంది. తొలి టెస్టులో ఘోరంగా విఫలమైన లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ షాబాజ్ నదీమ్ స్థానంలో ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ ఎంపిక దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. తొలి టెస్ట్‌లో నదీమ్ నాలుగు వికెట్లు పడగొట్టినప్పటికీ.. దాదాపు నాలుగు రన్‌రేట్‌తో పరుగులు ధారాళంగా సమర్పించుకున్నాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లో 59 ఓవర్లు వేసి 233 పరగులు ఇచ్చాడు. ఇది చాలదన్నట్లు మ్యాచ్‌లో ఏకంగా 9 నోబాల్స్ కూడా వేశాడు. ఈ పేలవ ప్రదర్శన కారణంగా అతనిపై వేటు దాదాపు ఖరారైంది. కాగా, మోకాలి గాయం కారణంగా తొలి టెస్టుకు దూరమైన అక్షర్ పటేల్.. రెండో టెస్టులో జట్టులోకి వచ్చేది దాదాపుగా ఖరారైనట్టే. అతను నెట్స్‌లో బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్ కూడా సాధన చేస్తున్నాడు. ఫస్ట్ క్లాస్ కెరీర్లో 39 మ్యాచ్‌లు ఆడిన 27 ఏళ్ల అక్షర్ పటేల్.. భారత్ తరపున పరిమిత ఓవర్ల క్రికెట్ మాత్రమే ఆడాడు. అతను టెస్ట్ క్రికెట్ అరంగేట్రం చేయాల్సివుంది. కాగా, ఇంగ్లండ్‌తో చెపాక్ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో టీమిండియా ఘోర పరాభవాన్ని ఎదుర్కొంది. 227 పరుగుల తేడాతో పర్యాటక జట్టు చేతిలో ఓటమి చవి చూసింది. నాలుగు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భారత్ 0-1 తేడాతో వెనకపడివుంది. -
‘అదే జరిగితే కెప్టెన్‌గా కోహ్లి కెరీర్ ముగిసినట్లే’
న్యూఢిల్లీ: పర్యాటక ఇంగ్లండ్ జట్టు చేతిలో టీమిండియాకు జరిగిన ఘోర పరాభవానికి బాధ్యున్ని చేస్తూ.. భారత జట్టు సారధి విరాట్ కోహ్లీపై ముప్పేట దాడి మొదలైంది. చెన్నై వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమిండియా 227 పరుగుల తేడాతో భారీ ఓటమిని మూటగట్టుకున్న నేపథ్యంలో జట్టు సారధి విరాట్ కోహ్లీ కెప్టెన్సీపై మాజీ ఆటగాళ్లు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. కోహ్లీ కెప్టెన్సీలో టీమిండియా వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో(2019/2020లో న్యూజిలాండ్ చేతిలో రెండు టెస్టులు, ఇటీవల ఆసీస్ గడ్డపై తొలి టెస్టు ఓటమి) ఓటమి పాలు కావడంతో అతని కెప్టెన్సీపై నీలినీడలు కమ్ముకున్నాయంటూ ఇంగ్లండ్ మాజీ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ మాంటీ పనేసర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈనెల 13 నుంచి చెన్నై వేదికగా ఇంగ్లండ్‌తో జరగబోయే రెండో టెస్టులో భారత జట్టు ఓటమి పాలైతే, కెప్టెన్‌గా కోహ్లీ కెరీర్ ముగిసినట్లేనని పనేసర్ విమర్శించారు. కోహ్లీ గైర్హాజరీలో(గత ఆసీస్ పర్యటనలో) టీమిండియాను అత్యంత సమర్ధవంతంగా ముందుండి నడిపించిన అజింక్య రహానేను టెస్టు కెప్టెన్‌గా నియమించాలన్న డిమాండ్లు ఊపందుకున్న నేపథ్యంలో ఈ ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. కోహ్లీ నిస్సందేహంగా ఆల్ టైమ్ గ్రేట్ బ్యాట్స్‌మెనే అయినప్పటికీ.. ఇటీవల కాలంలో అతని సారధ్యంలో భారత జట్టు దారుణంగా విఫలం కావడానికి కోహ్లీనే నైతిక బాధ్యత వహించాలని పనేసర్ డిమాండ్ చేశాడు. ఓవైపు సహచరుడు రహానే కెప్టెన్‌గా సక్సెస్ అవుతుండటంతో కోహ్లీ ఒత్తిడిలో కూరుకుపోయాడని అతను వ్యాఖ్యానించాడు. తొలి టెస్టులో కుల్దీప్ యాదవ్‌కు బదులు షాదాబ్ నదీమ్‌ను ఎంపిక చేయడాన్ని పనేసర్ తప్పుపట్టాడు. నాలుగు టెస్టుల ఈ సిరీస్‌లో భారత్ 0-1 తేడాతో వెనుకబడి ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్స్‌కు చేరుకునే అవకాశాలను క్లిష్టం చేసుకోగా, టీమిండియాపై విజయంతో పర్యాటక ఇంగ్లండ్ జట్టు టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్స్‌కు మార్గం సుగమమం చేసుకోవడంతో పాటు సొంత గడ్డపై టీమిండియా 14 వరుస విజయాల జైత్రయాత్రకు అడ్డుకట్ట వేసింది. -
హెల్మెట్‌తో స్లిప్ ఫీల్డింగ్.. సూపర్ అంటున్న నెటిజన్లు
సాక్షి, చెన్నై: భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య చెన్నై వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ మైదానంలో నవ్వులు పూయించాడు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 38వ ఓవర్లో అతను హెల్మెట్ పెట్టుకొని సెకండ్ స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తూ.. నూతన ఒరవడికి శ్రీకారం చుట్టాడు. రోహిత్ ఇలా చేయడాన్ని చూసిన భారత ఆటగాళ్లు తొలుత ఆశ్చర్యానికి గురైనా, ఆ తరువాత రోహిత్ ప్రవర్తనను చూసి ముసి ముసిగా నవ్వుకున్నారు. థర్డ్ స్లిప్‌లో ఉన్న రహానే, వికెట్ కీపర్ రిషబ్ పంత్‌లు అయితే ఆ ఓవర్ మొత్తం నవ్వుతూ కనిపించారు. అయితే రోహిత్ ఇలా హెల్మెట్ పెట్టుకొని స్లిప్‌లో ఫీల్డింగ్ చేయడానికి ఓ కారణం ఉంది. ఇషాంత్ శర్మ బౌలింగ్‌లో జో రూట్ డిఫెన్స్ ఆడుతున్న సందర్భంలో బంతి గాల్లోకి లేచి రోహిత్‌కు ముందు కొద్ది దూరంలో పడింది. దీంతో అతను షార్ట్ లెగ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న శుభ్‌మన్ గిల్ నుంచి హెల్మెట్ తీసుకుని కొద్దిగా ముందుకు వచ్చి నిలబడ్డాడు. ఇది చూసి భారత క్రికెటర్లతో సహా గ్రౌండ్లో ఉన్నవారంతా ఒక్కసారిగా పగలబడి నవ్వుకున్నారు. రోహిత్ ఇలా చేయడంపై భారత అభిమానులు సోషల్ మీడియా వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. కాగా, ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పర్యాటక జట్టు కెప్టెన్ జో రూట్ అద్భుత శతకం(128 నాటౌట్) సాధించడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 263 పరుగులు సాధించింది. ఓపెనర్లు రోరి బర్న్స్(33), డోమినిక్ సిబ్లీ(87),వన్‌డౌన్ ఆటగాడు డేనియల్ లారెన్స్ (0) ఔటయ్యారు. బూమ్రా, అశ్విన్‌లకు చెరో వికెట్ లభించింది. -
27 ఏళ్ల తర్వాత తొలి సారిగా..
సాక్షి, చెన్నై: భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య చెన్నై వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్‌లో ఓ అరుదైన ఘటన చోటు చేసుకుంది. 1994 తర్వాత భారత్‌లో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో తొలి సారిగా ఇద్దరు స్వదేశీ అంపైర్లు ఫీల్డ్ అంపైర్లుగా విధులు నిర్వహిస్తున్నారు. 1994 ఫిబ్రవరిలో శ్రీలంకతో అహ్మదాబాద్‌లో జరిగిన ఓ టెస్టు మ్యాచ్‌లో చివరి సారిగా ఇద్దరు భారత అంపైర్లు బరిలో నిలిచారు. ఆ మ్యాచ్‌లో ఎల్.నరసింహన్, వీకే రామస్వామిలు ఫీల్డ్ అంపైర్లుగా ఉన్నారు. ఆ తర్వాత మళ్లీ 27 ఏళ్లకు చెన్నైలోని చెపాక్ మైదానంలో ఇద్దరు భారత అంపైర్లు నితిన్ మీనన్, అనిల్ చౌదరీలు అంపైరింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భారత్, ఇంగ్లండ్ టెస్టు సిరీస్‌కు కొద్ది రోజుల ముందే నితిన్ మీనన్, అనిల్ చౌదరీతో పాటు వీరేందర్ శర్మ అనే అంపైర్‌ను ఐసీసీ నియమించింది. తొలి టెస్టులో అనిల్, నితిన్ బరిలో నిలువగా రెండో టెస్టులో నితిన్‌కు తోడుగా వీరేందర్ ఫీల్డ్ అంపైర్‌గా వ్యవహరించనున్నారు. కరోనా ప్రయాణ అంక్షల కారణంగా వరల్డ్ టెస్ట్ చాంపియన్సిప్కు స్థానిక అంపైర్లనే నియమించుకోవాలని ఐసీసీ ప్రకటించిన నేపథ్యంలో ఐసీసీ అంపైర్ల ప్యానల్లో సభ్యులైన ఈ ముగ్గురు భారత అంపైర్లకు ఈ అరుదైన అవకాశం దక్కింది. మరోవైపు సిరీస్‌లోని తొలి రెండు టెస్టులకు భారతకు చెందిన వ్యక్తే రిఫరీగా వ్యవహరిస్తున్నాడు. చెన్నైలో జరుగనున్న ఈ మ్యాచ్‌లకు టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్ జవగళ్ శ్రీనాథ్ మ్యాచ్ రిఫరీగా విధులు నిర్వహించనున్నాడు. కాగా, ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పర్యాటక జట్టు కెప్టెన్ జో రూట్ అద్భుత శతకం(128 నాటౌట్) సాధించడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 263 పరుగులు సాధించింది. ఓపెనర్లు రోరి బర్న్స్(33), డోమినిక్ సిబ్లీ(87),వన్‌డౌన్ ఆటగాడు డేనియల్ లారెన్స్ (0) ఔటయ్యారు. బూమ్రా, అశ్విన్‌లకు చెరో వికెట్ లభించింది. -
తొలి టెస్టు: తుది జట్టులో ఎవరెవరు ఉంటే బెస్ట్?
ఆస్ట్రేలియాను సొంతగడ్డపై మట్టి కరిపించి టెస్టు సిరీస్‌ను సొంతం చేసుకున్న టీమిండియా.. అదే ఉత్సాహంలో ఇంగ్లండ్‌తో తలపడేందుకు సన్నద్ధమవుతోంది. రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లి సారథ్యంలో పర్యాటక జట్టును దీటుగా ఎదుర్కొనేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. ఇక ఇప్పటికే నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు సంబంధించి తొలి రెండు మ్యాచ్‌లకు బీసీసీఐ... జట్టును ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆసీస్ పర్యటనలో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న రిషభ్ పంత్, శుభ్‌మన్ గిల్, మహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్ వంటి యువ ఆటగాళ్లు జట్టులో చోటు దక్కించుకున్నారు. ఈ క్రమంలో మరికాసేపట్లో చెన్నైలో ప్రారంభం కానున్న టీమిండియా వర్సెస్ ఇంగ్లండ్ తొలి టెస్టు మ్యాచ్‌లో మీ ఫేవరెట్ XI భారత ఆటగాళ్లెవరో మాతో పంచుకోండి. తుది జట్టులో ఎవరు ఆడితే ప్రయోజనకరంగా ఉంటుందో కామెంట్ల రూపంలో మీ అభిప్రాయం చెప్పండి.(చదవండి: ఇండియా వర్సెస్ ఇంగ్లండ్: పూర్తి షెడ్యూల్ ఇదే!) ఓపెనర్లు: (ఇద్దరిని ఎంచుకోండి) 1.రోహిత్ శర్మ 2.మయాంక్ అగర్వాల్ 3.శుభ్‌మన్ గిల్ మిడిలార్డర్/లోయర్ ఆర్డర్ (నలుగురిని ఎంచుకోండి) 1.అజింక్య రహానే 2.విరాట్ కోహ్లి 3.కేఎల్ రాహుల్ 4.హార్దిక్ పాండ్యా 5.ఛతేశ్వర్ పుజారా వికెట్ కీపర్ (ఒక్కరిని ఎంచుకోండి) 1.రిషభ్ పంత్ 2.వృద్ధిమాన్ సాహా బౌలర్లు (నలుగురిని ఎంచుకోండి) 1.కుల్దీప్ యాదవ్ 2.శార్దూల్ ఠాకూర్ 3.రవిచంద్రన్ అశ్విన్ 4.ఇషాంత్ శర్మ 5.జస్ప్రీత్ బుమ్రా 6.మహ్మద్ సిరాజ్ 7.వాషింగ్టన్ సుందర్ 8.అక్షర్ పటేల్ తొలి రెండు టెస్టులకు బీసీసీఐ ఖరారు చేసిన జట్టు విరాట్ కోహ్లీ(కెప్టెన్), అజింక్య రహానే(వైస్ కెప్టెన్), రోహిత్ శర్మ, రిషబ్ పంత్, మహ్మద్ సిరాజ్, శుభ్‌మన్ గిల్, వృద్ధిమాన్ సాహా, శార్దూల్ ఠాకూర్, మయాంక్ అగర్వాల్, హార్దిక్ పాండ్యా, రవిచంద్రన్ అశ్విన్, చతేశ్వర్ పుజారా, కేఎల్ రాహుల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్. -
ఇంగ్లండ్ ఒక్క టెస్ట్ కూడా గెలువలేదు: గంభీర్
సాక్షి, న్యూఢిల్లీ: భారత్‌తో జరుగబోయే టెస్ట్ సిరీస్‌లో పర్యాటక ఇంగ్లండ్ జట్టు ఒక్క టెస్ట్ కూడా గెలిచే అవకాశం లేదని టీమిండియా మాజీ ఓపెనర్, తూర్పు ఢిల్లీ ఎంపీ గౌతమ్ గంభీర్ అభిప్రాయపడ్డారు. స్పిన్నర్లకు స్వర్గధామమైన భారత పిచ్‌లపై ఇంగ్లీష్ జట్టు పేలవమైన స్పిన్ అటాక్‌తో బరిలోకి దిగుతుందని, ఇది టీమిండియాకు కలిసొచ్చే విషయమని గౌతీ పేర్కొన్నారు. ఇంగ్లండ్ స్పిన్ విభాగానికి సారధ్యం వహిస్తున్న మొయిన్ అలీ మినహా మిగతా స్పిన్నర్లెవరూ భారత్‌పై అంతగా ప్రభావం చూపలేరని ఆయన అభిప్రాయపడ్డారు. 60 టెస్ట్‌ల్లో 181 వికెట్లు సాధించిన మొయిన్ అలీ ఒక్కడే భారత్‌పై కాస్తో కూస్తో ప్రభావం చూపగలడని పేర్కొన్నాడు. ఇంగ్లీష్ స్పిన్నర్లు డామ్ బెస్, జాక్ లీచ్‌లను భారత బ్యాట్స్మెన్లు ఓ పట్టు పడతారని ఆయన భరోసాను వ్యక్తం చేశాడు. చెరి 12 మ్యాచ్‌లు మాత్రమే ఆడిన అనుభవమున్నఈ ఇంగ్లండ్ స్పిన్నర్లపై టీమిండియా బ్యాట్స్మెన్లు ఎదురుదాడికి దిగితే.. నాలుగు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ 3-0 లేదా 3-1 తేడాతో చేజిక్కించుకునే అవకాశం ఉందని గంభీర్ జోస్యం చెప్పాడు. అయితే పింక్ బాల్‌తో జరిగే టెస్ట్‌లో మాత్రం ఇరు జట్లకు సమానమైన అవకాశాలు ఉన్నయని ఆయన పేర్కొన్నాడు. శ్రీలంకపై 2-0 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకున్న ఇంగ్లండ్ సారధి జో రూట్‌కు ఈ సిరీస్ చేదు అనుభవాల్ని మిగిలిస్తుందని గంభీర్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. భారత బౌలర్లు బూమ్రా, అశ్విన్‌లు ఈ సిరీస్‌లో కీలకం కానున్నారని గంభీర్ పేర్కొన్నాడు. కాగా, భారత్ ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగబోయే తొలి రెండు టెస్ట్‌లు చెన్నైలో, మూడు, నాలుగు టెస్ట్‌లు అహ్మదాబాద్‌లో జరుగనున్నాయి. -
ప్రాక్టీస్‌కు లైన్ క్లియర్..
సాక్షి, చైన్నై: భారత పర్యటనలో భాగంగా కరోనా పరీక్షలు చేయించుకున్న ఇంగ్లండ్ క్రికెట్ జట్టుకు లైన్ క్లియర్ అయ్యింది. స్టాఫ్‌తో సహా జట్టు సభ్యులందరికీ కరోనా పరీక్షల్లో నెగిటివ్‌గా తేలింది. ఇటీవల శ్రీలంక పర్యటనను ముగించుకొని నేరుగా భారత్‌కు చేరుకున్న ఇంగ్లండ్ జట్టు ఆరు రోజుల పాటు క్వారంటైన్లో గడిపింది. ఈ ఆరు రోజుల క్వారంటైన్ సెషన్లో ఇంగ్లండ్ జట్టు సభ్యులందరికీ మూడు సార్లు కరోనా పరీక్షలు నిర్వహించగా, సభ్యులందరికీ మూడింటిలో నెగిటివ్‌గా తేలింది. దీంతో ఊపిరి పీల్చుకున్న ఇంగ్లండ్ జట్టుకు, ఈనెల 5న ప్రారంభంకానున్న తొలి టెస్ట్‌కు ముందు మూడు రోజులు ప్రాక్టీస్ చేసే అవకాశం లభించింది. ఇంగ్లీష్ జట్టు మొత్తం రేపు మధ్యాహ్నం 2 నుంచి 5 వరకు సాగే తొలి ప్రాక్టీస్ సెషన్లో పాల్గొంటారు. కాగా, జట్టుతో పాటు శ్రీలంక పర్యటనకు వెళ్లని ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్, జోఫ్రా ఆర్చర్, రాయ్ బన్స్‌లు కొద్ది రోజుల కిందటే భారత్‌కు చేరుకొని(క్వారంటైన్ ముగించుకొని) ప్రాక్టీస్‌ను మొదలు పెట్టారు. ఈ ముగ్గురు ఆటగాళ్లు కూడా రేపటి ప్రాక్టీస్ సెషన్లో జట్టుతో కలుస్తారు. మరోవైపు భారత ఆటగాళ్లు కూడా క్వారంటైన్ సెషన్‌ను ముగించుకొని, రేపటి ప్రాక్టీస్ సెషన్లో పాల్గొనేందుకు సిద్దమయ్యారు. ఇరు జట్ల మధ్య జరిగే తొలి రెండు టెస్టులకు(ఫిబ్రవరి 5, ఫిబ్రవరి 13) చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదిక కానుండగా, మూడు(ఫిబ్రవరి 24), నాలుగు(మార్చి 4) టెస్టులు అహ్మదాబాద్‌లోని సర్దార్ పటేల్ స్టేడియంలో జరుగనున్నాయి. ఆతరువాత ప్రారంభమయ్యే 5 టీ20 మ్యాచ్‌లకు(మార్చి 12,14,16,18,20) కూడా అహ్మదాబాద్‌లోని సర్దార్ పటేల్ స్టేడియమే వేదిక కానుంది. ఆతరువాత ఇరు జట్ల మధ్య జరిగే 3 వన్డే మ్యాచ్‌లకు(మార్చి 23, 26, 28) పూణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదిక కానుంది. -
కుంబ్లేను అనుకరిస్తున్న బూమ్..బూమ్.. బూమ్రా
సాక్షి, చెన్నై: ఇటీవల ముగిసిన ఆసీస్ పర్యటనలో గాయం కారణంగా ఆఖరి టెస్ట్‌కు దూరమైన భారత స్పీడ్ గన్ జస్ప్రీత్ బూమ్రా.. ఇంగ్లండ్‌తో ప్రారంభంకానున్న నాలుగు టెస్ట్‌ల సిరీస్‌కు అందుబాటులోకి వచ్చాడు. చెన్నైలో జరుగనున్న తొలి రెండు టెస్ట్‌లకు జట్టులోకి వచ్చిన ఈ రేసు గుర్రం.. నెట్ ప్రాక్టీస్ సందర్భంగా భారత లెజెండరీ స్పిన్నర్ అనిల్ కుంబ్లేను అనుకరిస్తూ సరదాగా బౌలింగ్ చేశాడు. ఈ సన్నివేశానికి సంబంధించిన వీడియోను భారత క్రికెట్ జట్టు తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసూ.. మనమింత వరకు యార్కర్లు, బౌన్సర్లను వేసే బూమ్రానే చూశాం.. ఇదిగో బూమ్రాలోని సరి కొత్త కోణం అంటూ క్యాప్షన్‌ను జోడించింది. ఈ వీడియోలో బూమ్రా.. అనిల్ కుంబ్లేలా బౌలింగ్ చేసేందుకు ప్రయత్నిస్తుంటాడు. సరదాగా సాగిన ఈ సన్నివేశం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. కాగా, భారత్ తరపున అత్యధిక వన్డే, టెస్ట్ వికెట్లు సాధించిన బౌలర్‌గా కొనసాగుతున్న అనిల్ కుంబ్లే.. భారత జట్టు ప్రధాన కోచ్‌గా కూడా వ్యవహరించాడు. గత కొంత కాలంగా భారత జట్టులో కీలక సభ్యుడిగా కొనసాగుతూ వస్తున్న 27 ఏళ్ల జస్ప్రీత్ బూమ్రా వైవిధ్యభరితమైన బౌలింగ్ శైలిని కలిగి ఉంటాడు. అలాంటిది అతను మరొక బౌలర్‌ను అనుకరించడం సరదాగా ఉందని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. కాగా, ఇంగ్లండ్‌తో ప్రారంభం కానున్న తొలి టెస్టు ఫిబ్రవరి 5న చెన్నైలో ప్రారంభం కానుంది. -
ఆ క్రికెటర్ రెండో టెస్టులో ఆడనున్నాడు
సాక్షి, లండన్: భారత్‌తో జరుగబోయే టెస్ట్ సిరీస్‌లో ఇంగ్లండ్ వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్ జానీ బెయిర్ స్టో రెండో టెస్ట్ నుంచి అందుబాటులో ఉంటాడని ఆ జట్టు బ్యాటింగ్ కోచ్ గ్రాహం థోర్‌్ప ప్రకటించాడు. తొలుత బెయిర్‌స్టోకు తొలి రెండు టెస్ట్‌లకు విశ్రాంతి కల్పించాలని భావించిన ఆ జట్టు మేనేజ్మెంట్.. అనూహ్యంగా అతను రెండో టెస్ట్‌కు జట్టుతో కలుస్తాడని ప్రకటించింది. ఇటీవల శ్రీలంకతో ముగిసిన టెస్ట్ సిరీస్‌లో కెప్టెన్ జో రూట్ తరువాత అత్యధిక పరుగులు చేసిన బెయిర్‌స్టోను తొలి రెండు టెస్ట్‌లకు విశ్రాంతి కల్పించడంపై విమర్శలు రావడంతో మేనేజ్మెంట్ అతన్ని రెండో టెస్ట్‌కు అందుబాటులో ఉండాలని ఆదేశించింది. శ్రీలంకతో జరిగిన టెస్ట్ సిరీస్‌ను ఇంగ్లండ్ 2-0 తేడాతో చేజిక్కించుకోగా, అందులో బెయిర్‌స్టో నాలుగు ఇన్నింగ్స్‌ల్లో 46.33 సగటుతో 139 పరుగులు సాధించాడు. కాగా, భారత్‌తో జరుగబోయే టెస్ట్ సిరీస్‌కు ముందు రోటేషన్ పద్ధతి కారణంగా ఇంగ్లండ్ ఆటగాళ్లు మార్క్ వుడ్, సామ్ కర్రన్, బెయిర్‌స్టోలకు ఆ జట్టు మేనేజ్మెంట్ విశ్రాంతి కల్పించింది. భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగబోయే నాలుగు టెస్ట్‌ల సిరీస్ ఫిబ్రవరి 5న చెన్నై వేదికగా ప్రారంభం కానుండగా, రెండో టెస్ట్ ఇదే వేదికగా ఫిబ్రవరి 13న, ఫిబ్రవరి 24న అహ్మదాబాద్ వేదికగా మూడో టెస్ట్, ఇదే వేదికలో మార్చి 4న నాలుగో టెస్ట్ ప్రారంభంకానున్నాయి. ఇంగ్లండ్ జట్టు సుదీర్ఘ భారత పర్యటనలో 4 టెస్ట్‌లు, 5 టీ20లు, 3 వన్డేలు ఆడనుంది. -
చివరి టెస్ట్: జడేజా ఒంటరి పోరాటం
లండన్ : ఇంగ్లండ్‌తో జరుగుతున్న చివరి టెస్ట్‌లో తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 292 పరుగులుకు ఆలౌట్ అయ్యింది. ఆల్‌రౌండర్ జడేజా 86 పరుగులతో చివరి వరకూ పోరాడి నాటౌట్‌గా నిలిచాడు. 176 పరుగులతో మూడోరోజు ఆట ప్రారంభించిన భారత్‌ను విహారి, జడేజా ఆదుకున్నారు. వీరిద్దరు ఏడో వికెట్‌కు 77 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. అరంగేట్ర మ్యాచ్‌లోనే తెలుగు కుర్రాడు హనుమ విహారి హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. జట్టు స్కోర్ 237 వద్ద హనుమ విహారి (56)ని మెయిన్ అలీ ఔట్ చేశాడు. దీంతో భారత్ మరో ఇరవై పరుగుల లోపు ఆలౌట్ అవుతుందని భావించారు. కానీ జడేజా ఒంటరి పోరాటంతో భారత్ 292 పరుగులు చేయగలిగింది. ఇషాంత్ శర్మ (4) కొద్ది సేపు క్రీజ్‌లో జడేజాకు అండగా నిలిచాడు. ఆ తరువాత వచ్చిన షమి వెంటనే ఔటైనా.. చివరి వికెట్‌గా వచ్చిన బూమ్రా సహాయంతో జడేజా పోరాడాడు. చివరి వికెట్‌గా బూమ్రా రనౌట్ కావడంతో భారత్ ఇన్సింగ్స్ ముగిసింది. చివరి వికెట్‌కు 32 పరుగుల భాగస్వామ్యం నమోదవ్వడం విశేషం. దీంతో ఇంగ్లండ్‌కు మొదటి ఇన్సింగ్స్‌లో 40 పరుగుల ఆధిక్యం లభించింది. ఇంగ్లండ్ బౌలర్లలో అండర్సన్, స్టోక్స్, మోయిన్ అలీలకు రెండేసి వికెట్లు దక్కగా.. బ్రాడ్, కరణ్, రషీద్‌లు తలో వికెట్ దక్కించుకున్నారు. -
ఇంగ్లండ్‌తో టెస్ట్ : కష్టాల్లో భారత్
లండన్ : ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్ట్‌లో భారత్ మొదటి ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. ఆరు పరుగుల వద్ద ఓపెనర్ శిఖర్ ధావన్ (3) తొలి వికెట్‌గా వెనుదిరిగి మరోసారి తీవ్రంగా నిరాశపరిచాడు. మరో వికెట్ పడకుండా కేహుల్ రాహుల్ (36), పుజారా (34) భారత్‌ను ఆదుకునే ప్రయత్నంచేశారు. దూకుడుగా అడుతున్న రాహుల్ (36) పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రెండో వికెట్‌గా వెనుదిరిగాడు. దీంతో భారత్ 70 పరుగుల వద్ద రెండో వికెట్‌ను కోల్పోయింది. ఈ దశలో క్రీజ్‌లోకి వచ్చిన కోహ్లికి జతకలిసిన పుజారా ఇన్సింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. కుదురుకున్న దశలోనే పుజారా 36 పరుగుల వద్ద అండర్సన్ పుజారాను ఔట్ చేసి దెబ్బతీశాడు. ఆ తరువాత వచ్చిన రహానే డకౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో భారత్ కష్టాల్లో పడింది. ప్రసుత్తం భారత్ నాలుగు కీలక వికెట్ల కోల్పోయి 104 పరుగులు పూర్తి చేసుకుంది. క్రీజ్‌లో కోహ్లి (24) విహారి (0) ఉన్నారు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 332 పరుగుల వద్ద ఆలౌటైన విషయం తెలిసింది. ఇంగ్లండ్ ఆటగాళ్లలో జోస్ బట్లర్ 89 పరుగులతో రాణించగా.. బ్రాడ్ 38 పరుగులు చేసి కీలక సమయంలో ఆదుకున్నాడు. భారత బౌలర్లలో జడేజా నాలుగు వికెట్లతో చెలరేగగా.. ఇషాంత్ శర్మ, బూమ్రా చెరో మూడు వికెట్లతో రాణించారు. -
246 పరుగులకే కుప్పకూలిన ఇంగ్లండ్
-
రవిశాస్త్రి కూర్పాట్లు..వైరల్!
-
భారత్ Vs ఇంగ్లండ్ టెస్టు ఆరంభం అదిరింది
-
టెస్టుల్లో ఇంగ్లండ్ రికార్డు!
బర్మింగ్ హోమ్ : ఇంగ్లండ్ టెస్టు క్రికెట్ చరిత్రలో అరుదైన మైలురాయిని అందుకోనుంది. దానికి భారత్‌తో జరిగే తొలి టెస్టే వేదిక కావడం విశేషం. ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఆగస్టు 1న ప్రారంభమయ్యే టెస్టు ఇంగ్లండ్‌కు 1000వ టెస్ట్. ఇప్పటికే అత్యధిక టెస్టులాడిన జట్టుగా గుర్తింపు పొందిన ఇంగ్లండ్ 1000 టెస్టుల ఆడిన తొలి జట్టుగా నిలవనుంది. ఇప్పటి వరకు 999 టెస్టు మ్యాచ్‌లను ఈ ఇంగ్లీష్ జట్టు ఆడింది. ఈ 999 టెస్టుల్లో తన ఫేవరేట్ మ్యాచ్‌లు మాత్రం 2005 యాషేస్ సిరీస్.. ఎడ్జ్బస్టన్ టెస్ట్ అని, రెండోది 2015 ట్రెంట్ బ్రిడ్జ్ టెస్ట్ అని ఆజట్టు బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ ట్విటర్లో పేర్కొన్నాడు. అత్యధిక టెస్టులాడిన జాబితాలో ఇంగ్లండ్ తొలి స్థానంలో ఉండగా..812 మ్యాచ్‌లతో ఆస్ట్రేలియా, 535 మ్యాచ్‌లతో వెస్టిండీస్ తరువాతి స్థానంలో ఉన్నాయి. ఇక భారత్ 522 మ్యాచ్‌లతో నాలుగో స్థానంలో నిలిచింది. ఇంగ్లండ్ తన తొలి టెస్టును 1877లో ఆస్ట్రేలియా, మెల్బోర్న్ వేదికగా జేమ్స్ లిల్లీవైట్ సారథ్యంలో ఆడింది. 999 మ్యాచుల్లో 35.73 శాతంతో 357 మ్యాచ్‌లు గెలిచి 297 మ్యాచ్‌లు ఓడింది. 345 మ్యాచ్‌లు డ్రా అయ్యాయి. చదవండి: 4 కాదు... 3 రోజులే ఈ ‘ప్రాక్టీస్’ -
చెన్నైలో ఐదో టెస్టు జరిగేనా!
-
చెన్నైలో టెస్టు జరిగేనా!
ముంబై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మృతి నేపథ్యంలో ఒక్కసారిగా అక్కడ పరిస్థితులు మారిపోయాయి. ఇలాంటి స్థితిలో భారత్, ఇంగ్లండ్ మధ్య ఈ నెల 16 నుంచి చెన్నైలో జరగాల్సిన ఐదో టెస్టు నిర్వహణపై సందేహాలు తలెత్తుతున్నాయి. అయితే మున్ముందు పరిస్థితులను బట్టి దీనిపై తుది నిర్ణయం తీసుకుంటామని బీసీసీఐ ప్రకటించింది. ‘బోర్డు ఇంకా దీని గురించి ఆలోచించలేదు. పరిస్థితిని బట్టి, మ్యాచ్ జరిగే సమయంలో నగర అభిమానుల భావోద్వేగాలను దృష్టిలో ఉంచుకొని తదుపరి చర్యల గురించి అసోసియేషన్‌తో చర్చిస్తాం. దీనికి ఎలాంటి తుది గడువూ లేదు. మనకు అవసరమైతే టెస్టు నిర్వహణ కోసం చాలా వేదికలు సిద్ధంగా ఉన్నాయి. దీనర్థం వేదిక మారిందని కాదు. రాష్ట్రంలో పరిణామాలను చూశాక ప్రకటిస్తాం’ అని బీసీసీఐ కార్యదర్శి అజయ్ షిర్కే వెల్లడించారు.