కెప్టెన్‌ కోహ్లి 60 నాటౌట్‌.. | Virat Kohli Equals MS Dhoni Record Of Most Tests As Captain | Sakshi
Sakshi News home page

నాలుగో టెస్టులో ధోని రికార్డును సమం చేసిన కోహ్లి

Published Thu, Mar 4 2021 4:25 PM | Last Updated on Thu, Mar 4 2021 4:53 PM

Virat Kohli Equals MS Dhoni Record Of Most Tests As Captain - Sakshi

అహ్మదాబాద్‌: టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి మరో అరుదైన ఘనతను సాధించాడు. భారత్‌ తరపున అత్యధిక టెస్టులకు సారథ్యం వహించిన ధోని(60 టెస్టులు, 2008-2014) రికార్డును సమం చేశాడు. అహ్మదాబాద్‌ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో 32 ఏళ్ల కోహ్లి(60 నాటౌట్‌) ఈ మార్క్‌ను అందుకున్నాడు. కోహ్లి సారధ్యంలో టీమిండియా ఇప్పటివరకు 35 విజయాలు, 10 డ్రాలు, 14 పరాభవాలను ఎదుర్కొంది. విజయాల పరంగా చూసినా(35 నాటౌట్‌) కోహ్లినే టీమిండియా అత్యుత్తమ కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు. ఈ జాబితాలో ధోని 27 విజయాలతో కోహ్లి తరువాతి స్థానంలో ఉన్నాడు.

గతంలో సౌరవ్‌ గంగూలీ(49 టెస్టుల్లో 21 విజయాలు), మహ్మద్‌ అజహరుద్దీన్‌(47 టెస్టుల్లో 14 విజయాలు), సునీల్‌ గావస్కర్‌(47 టెస్టుల్లో 9 విజయాలు),  మన్సూర్‌ అలీ ఖాన్‌ పటౌడీ(40 టెస్టుల్లో 9 విజయాలు), కపిల్‌ దేవ్‌(34 టెస్టుల్లో 4 విజయాలు), రాహుల్‌ ద్రవిడ్‌(25 టెస్టుల్లో 8 విజయాలు), సచిన్‌ టెండూల్కర్‌(25 టెస్టుల్లో 4 విజయాలు), బిషన్‌ సింగ్‌ బేడీ(22 టెస్టుల్లో 6 విజయాలు)లు భారత్‌ తరపున అత్యధిక టెస్టులకు సారథ్యం వహించిన వారిగా ఉన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement