teamindia captain
-
చరిత్ర సృష్టించిన హార్దిక్ పాండ్యా.. తొలి భారత కెప్టెన్‌గా..!
ఐర్లాండ్‌తో జరిగిన తొలి టీ20లో టీమిండియా కెప్టెన్ హార్దిక్ పాండ్యా అరుదైన ఘనత సాధించాడు. టీ20 క్రికెట్లో వికెట్ పడగొట్టిన తొలి భారత కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా రికార్డులకెక్కాడు. ఈ మ్యాచ్‌లో ఐర్లాండ్ ఇన్నింగ్స్ రెండో ఓవర్ వేసిన పాండ్యా.. పాల్ స్టిర్లింగ్‌ను పెవిలియన్‌కు పంపాడు. తద్వారా ఈ ఘనతను పాండ్యా తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఈ సిరీస్‌కు సీనియర్ ఆటగాళ్లు దూరం కావడంతో తొలి సారి భారత కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా ఎంపికయ్యాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఐర్లాండ్‌పై టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. వర్షం కారణంగా ఈ మ్యాచ్‌ను 12 ఓవర్లకు కుదించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ నిర్ణీత 12 ఓవర్లలో త ఐర్లాండ్ 4 వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది. ఐర్లాండ్ బ్యాటర్లలో హ్యారీ టెక్టర్(64) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, పాండ్యా, అవేశ్ ఖాన్, చహల్ తలా ఒక వికెట్ తీశారు. ఇక 109 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 9.2 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి చేధించింది. భారత బ్యాటర్లలో దీపక్ హుడా(47), ఇషాన్ కిషన్(26), హార్ధిక్ పాండ్యా(24) పరుగులతో రాణించారు. ఇక ఇరు జట్లు మధ్య రెండో టీ20 డబ్లిన్ వేదికగా మంగళవారం జరగనుంది. చదవండి: ENG vs IND: ఇంగ్లండ్ కెప్టెన్ సంచలన నిర్ణయం..! 🏏💙🇮🇳 pic.twitter.com/bBizMXBudT — Deepak Hooda (@HoodaOnFire) June 26, 2022 -
కోహ్లి-రోహిత్‌ల మధ్య విభేదాలా..? అలాంటి వార్తలు విని నవ్వుకునేవాడిని..!
ముంబై: టీమండియా టెస్ట్ సారధి విరాట్ కోహ్లి, పరిమిత ఓవర్ల రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మల మధ్య విభేదాలు నెలకొన్నాయని, అందువల్లే కోహ్లి వన్డే కెప్టెన్సీని సైతం రోహిత్‌కు కోల్పోవాల్సి వచ్చిందని.. గత కొద్ది రోజులుగా పుకార్లు షికార్లు చేస్తున్న నేపథ్యంలో భారత జట్టు చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ తాజాగా స్పందించాడు. కోహ్లి-రోహిత్‌ల మధ్య విభేదాలు నెలకొన్నాయన్న ప్రచారం అవాస్తవమని, అవన్నీ పనిలేని వ్యక్తులు పుట్టించే పుకార్లు మాత్రమేనని కొట్టిపారేశాడు. కొన్ని సందర్భాల్లో అలాంటి వార్తలు విని తనలో తాను నవ్వుకునేవాడినని చెప్పుకొచ్చాడు. వాస్తవానికి కోహ్లి-రోహిత్‌లు చాలా సన్నిహితంగా ఉంటారని, జట్టుకు సంబంధించిన అన్ని విషయాలు కలిసి చర్చిస్తారని, ఒకరి సారధ్యంలో మరొకరు ఆడేందుకు ఏమాత్రం సంకోచించరని, ఈ విషయాన్ని కోహ్లినే స్వయంగా వెల్లడించాడని గుర్తు చేశాడు. టీ20 సారధ్య బాధ్యతల నుంచి తప్పుకోకూడదని తామందరమూ కోహ్లిని కోరామని, అయినా అతను మా మాటలను పట్టించుకోలేదని వాపోయాడు. పరిమిత ఓవర్ల ఫార్మాట్లో ఇద్దరు కెప్టెన్లు ఎందుకనే ఉద్దేశంతోనే వన్డే సారధ్య బాధ్యతలను రోహిత్ శర్మకు అప్పగించాల్సి వచ్చిందని వివరించాడు. భవిష్యత్తులో కోహ్లి-రోహిత్‌లు ఒకరి సారధ్యంలో మరొకరు కలిసి ఆడతారని, వారి మధ్య ఎలాంటి విభేదాలు లేవని, వారిద్దరూ ఒకే కుటుంబంలా కలిసుంటారంటూ కోహ్లి-రోహిత్‌ల ఎపిసోడ్‌కు ఫుల్స్టాప్ పెట్టే ప్రయత్నం చేశాడు. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన అనంతరం చేతన్ శర్మ ఈ మేరకు వ్యాఖ్యానించాడు. చదవండి: 'కోహ్లి మాటల్లో నిజం లేదు..' చేతన్ శర్మ కౌంటర్ -
కోహ్లిపై బీసీసీఐకి ఫిర్యాదు చేసింది ఆ ముగ్గురేనా..?
Senior Indian Cricketers Revolted Against Kohli: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి టీ20 సారధ్య బాధ్యతల నుంచి తప్పుకోవడం వెనుక గల కారణాలపై గత కొద్ది రోజులుగా రకరకాల ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి. వర్క్ లోడ్ కారణంగా పొట్టి క్రికెట్ కెప్టెన్సీకి గుడ్‌బై చెబుతున్నానని స్వయంగా కోహ్లినే ప్రకటించినప్పటికీ.. అతని నిర్ణయం వెనుక అసలు కారణాలు వేరే ఉన్నాయన్నది విశ్లేషకులు అభిప్రాయం. ఈ విషయమై ఓ ప్రముఖ వార్తా పత్రిక తాజాగా ఓ కథనం ప్రచురించింది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్(డబ్ల్యూటీసీ) ఫైనల్ పూర్తైన నాటి నుంచి టీమిండియా సీనియర్ ఆటగాళ్లు అశ్విన్, రహానే, పుజారాలు కోహ్లిపై అసంతృప్తిగా ఉన్నారని, ఆ ముగ్గురే కోహ్లిపై బీసీసీఐకి ఫిర్యాదు చేశారని, దీన్ని పరిగణలోకి తీసుకునే కోహ్లి ప్రమేయం లేకుండా టీమిండియా టీ20 ప్రపంచకప్ బృందం ప్రకటించబడిందని, ఇది నచ్చకే కోహ్లి టీ20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాడని ఆ కథనంలో పేర్కొనబడింది. డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా ఓటమికి పుజారా, రహానే, అశ్విన్‌లను బాధ్యులని చేస్తూ.. కోహ్లి నోరుపారేసుకోవడంతో వివాదం మొదలైందని, అది కాస్తా చినికిచినికి గాలివానలా మారి కోహ్లి టీ20 కెప్టెన్సీకే ఎసరు పెట్టిందని ప్రచురించింది. అలాగే, టీ20 ప్రపంచకప్ తర్వాత కోహ్లి వన్డే కెప్టెన్సీపైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని పేర్కొంది. చదవండి: ఐపీఎల్ చరిత్రలో ఇలా తొలిసారి.. -
ఆర్నెళ్ల క్రితమే 'ఆ' సలహా ఇచ్చాడు.. అయినా పట్టించుకోని కోహ్లి..!
Ravi Shastri Advised Kohli To Quit Captaincy From Two Formats: టీ20 ప్రపంచ కప్ తర్వాత టీమిండియా టీ20 కెప్టెన్సీ నుంచి, ఐపీఎల్-2021 తర్వాత ఆర్సీబీ సారధ్య బాధ్యతల నుంచి తప్పుకోనున్నట్లు ఇటీవల సంచలన ప్రకటన చేసిన విరాట్ కోహ్లి క్రికెట్ ప్రపంచం మొత్తాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తిన సంగతి తెలిసిందే. ఈ విషయానికి సంబంధించి టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి ఆరు మాసాల క్రితమే ఓ కీలక సలహా ఇచ్చాడని తెలుస్తోంది. అయితే ఆ సలహాను అప్పట్లో అంతగా పట్టించుకోని కోహ్లి.. ఆలస్యంగా తేరుకుని కోచ్ సలహాలోని ఓ భాగాన్ని మాత్రమే అమలు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇంతకీ కోహ్లికి రవిశాస్త్రి ఇచ్చిన ఆ సలహా ఏంటా అని అనుకుంటున్నారా..? అయితే ఈ స్టోరీపై ఓ లుక్కేయండి. ఈ ఏడాది ఆరంభంలో జరిగిన టెస్ట్ సిరీస్‌లో ఆసీస్‌ను వారి సొంతగడ్డపై మట్టికరింపించిన అనంతరం టీమిండియా కోచ్ రవిశాస్త్రి.. కెప్టెన్ కోహ్లికి ఓ కీలక సూచన చేశాడు. బ్యాటింగ్‌పై పూర్తి దృష్టి కేంద్రీకరించేందుకు వన్డే, టీ20 ఫార్మాట్ల కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పాలని, టెస్ట్ క్రికెట్లో మాత్రం సారధిగా కొనసాగాలని సలహా ఇచ్చాడు. అప్పటికే అడపాదడపా ఫామ్‌తో నెట్టుకొస్తున్న కోహ్లి మంచి కోరే రవిశాస్త్రి ఈ సలహా ఇచ్చాడట. అయితే, రవిశాస్త్రి మాటలను పెడచెవిన పెట్టిన కోహ్లి కేవలం టీ20 కెప్టెన్సీకి మాత్రమే గుడ్‌బై చెబుతానని ప్రకటించాడు. ఈ నేపథ్యంలో రవిశాస్త్రి.. కోహ్లికి ఇచ్చిన సలహాపై నెటిజన్లు స్పందిస్తున్నారు. కోచ్ సలహా మేరకు కోహ్లి ఈ పనిని ఆర్నెళ్ల క్రితమే చేసుంటే.. ఆటతీరు మరింత మెరుగ్గా ఉండేదని కామెంట్లు చేస్తున్నారు. కోహ్లికి కెప్టెన్సీపై ఇంకా యావ తగ్గలేదని, అందుకే కోచ్ చెప్పినా వినకుండా వన్డే సారధ్య బాధ్యతలను అట్టిపెట్టుకున్నాడని మరికొందరు చురకలంటిస్తున్నారు. చదవండి: ‘కివీస్ జట్టుకు బెదిరింపులు భారత్ కుట్రే’... పాక్ మంత్రి సంచలన ఆరోపణ -
కోహ్లి వారసుడిగా రోహిత్‌తో పోలిస్తే అతనైతేనే బెటర్.. ఎందుకంటే..?
Sunil Gavaskar Sees Future Leader In KL Rahul: టీ20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటానంటూ టీమిండియా సారధి విరాట్ కోహ్లి సంచలన ప్రకటన చేసిన నేపథ్యంలో అతని వారసుడి ఎంపికపై చర్చ జోరుగా సాగుతోంది. దీనిపై క్రికెట్ విశ్లేషకులు, మాజీ ఆటగాళ్లు వివిధ మాధ్యమాల ద్వారా తమతమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. చాలా మంది ప్రస్తుత ఉప సారధి రోహిత్ శర్మ వైపు మొగ్గు చూపుతుండగా, కొందరేమో రిషబ్ పంత్, కేఎల్ రాహుల్‌ల పేర్లను ప్రస్తావిస్తున్నారు. తాజాగా రోహిత్‌ను కాకుండా ఇతరుల పేరును ప్రస్తావించిన ప్రముఖుల జాబితాలో లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్ చేరాడు. వయసు కారణంగా చూపి రోహిత్ కంటే కేఎల్ రాహుల్ బెటర్ చాయిస్ అంటున్నాడు. 34 ఏళ్ల రోహిత్‌కు ఆగమేఘాల మీద సారధ్య బాధ్యతలు అప్పగించే బదులు.. భవిష్యత్తును దృష్టిలో ఉంచకుని యువకుడైన కేఎల్ రాహుల్‌కు టీమిండియా పగ్గాలు అప్పజెప్పడం బెటరని అభిప్రాయపడ్డాడు. ఇటీవలి కాలంలో రాహుల్ ప్రదర్శన అద్భుతంగా ఉందని.. స్వదేశం, విదేశం అన్న తేడా లేకుండా అన్ని ఫార్మాట్లలో విశేషంగా రాణిస్తున్నాడని, కోహ్లి వారసుడిగా రాహుల్ అయితే బాగుంటుందని తన మనసులోని మాటను బహిర్గతం చేశాడు. ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్‌కు సారధ్యం వహిస్తున్న 29 ఏళ్ల రాహుల్.. కెప్టెన్సీ భారం లేకుండా స్వేచ్ఛగా జట్టును ముందుండి నడిపిస్తున్నాడని కితాబునిచ్చాడు. రాహుల్‌లో నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయని, భవిష్యత్తు కెప్టెన్‌గా అతన్ని ప్రోత్సహించాలని సూచించాడు. కాగా, 2014లో ఆస్ట్రేలియాపై బాక్సింగ్ డే టెస్ట్‌లో అరంగేట్రం చేసిన రాహుల్.. ఇప్పటి వరకూ టీమిండియా తరఫున 40 టెస్ట్‌లు, 38 వన్డేలు, 49 టీ20లు ఆడాడు. ఇందులో 13 శాతకాలు, 31 అర్ధశతకాల సాయంతో 5400కుపైగా పరుగులు సాధించాడు. ఐపీఎల్లో ప్రస్తుతం పంజాబ్ కింగ్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న రాహుల్.. 88 మ్యాచ్‌ల్లో 2 సెంచరీలు, 25 అర్ధసెంచరీల సాయంతో 2978 పరుగులు సాధించాడు. చదవండి: టీ20ల చరిత్రలో అరుదైన ఘనత.. ఆ జాబితాలో ఇద్దరూ విండీస్ యోధులే -
కెప్టెన్సీ నుంచి తప్పుకునే యోచనలో విరాట్ కోహ్లీ
-
పరిమిత ఓవర్ల కెప్టెన్సీ నుంచి తప్పుకోనున్న కోహ్లి.. రోహిత్‌కు పగ్గాలు..?
న్యూఢిల్లీ: పరిమిత ఓవర్ల కెప్టెన్సీ నుంచి టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి తప్పుకోనున్నాడా అంటే అవుననే అంటున్నాయి పలు నివేదికలు. గత కొద్ది రోజులుగా టీమిండియా కెప్టెన్సీపై రకరకాలు ఊహాగానాలు ప్రచారంలో ఉన్న నేపథ్యంలో తాజాగా వెలువడుతున్న ఓ వార్త భారత క్రికెట్లో దుమారం రేపుతోంది. అక్టోబర్‌లో జరిగే టీ20 ప్రపంచకప్ తర్వాత టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్సీ బాధ్యతల నుంచి విరాట్ కోహ్లి తప్పుకోనున్నట్లు భారీ ఎత్తున ప్రచారం జరగుతుంది. ఈ విషయమై ఏకీభవిస్తూ జాతీయ మీడియా సైతం కథనాలను ప్రచారం చేస్తోంది. కోహ్లినే స్వయంగా ఈ ప్రతిపాదనను బీసీసీఐ పెద్దల ముందుంచినట్లు తెలుస్తోంది. మూడు ఫార్మాట్లలో సారధ్య బాధ్యతలు బ్యాటింగ్‌పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని కోహ్లినే స్వయంగా ఈ మేరకు నిర్ణయించుకున్నట్లు బీసీసీఐ వర్గాల సమాచారం. పరిమిత ఓవర్ల సారధ్య బాధ్యతల నుంచి తప్పుకున్నాక టెస్ట్ కెప్టెన్సీపై పూర్తి ఫోకస్ ఉంచాలని కోహ్లి భావిస్తున్నట్లు అతని సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది. ఐపీఎల్లో కెప్టెన్‌గా మంచి ట్రాక్ రికార్డు కలిగిన రోహిత్ శర్మకు టీమిండియా పరిమిత ఓవర్ల పగ్గాలు అప్పగించాలని బీసీసీఐ యోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. రోహిత్‌కు ఈ బాధ్యతలు అప్పజెప్పేందుకు కోహ్లి సైతం సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే, ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ సారధిగా వ్యవహరిస్తున్న రోహిత్ శర్మ ఇదివరకే 5 సార్లు తన జట్టును ఛాంపియన్‌గా నిలపడంలో సఫలమయ్యాడు. ఇదే ట్రాక్ రికార్డును పరిగణలోకి తీసుకుని బీసీసీఐ రోహిత్‌కు పగ్గాలు అప్పజెప్పాలని భావిస్తున్నట్లు సమాచారం. చదవండి: పాక్‌ను వెనక్కు నెట్టి అగ్రస్థానానికి దూసుకెళ్లిన టీమిండియా.. -
కోహ్లి ఖాతాలో మరో ఘనత.. ఆ జాబితాలో నాలుగో స్థానానికి
లండన్: లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్ట్‌లో టీమిండియా సూపర్ విక్టరీ సాధించడంతో జట్టు సారధి కోహ్లి ఖాతాలో మరో ఘనత చేరింది. టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యధిక విజయాలు అందుకున్న కెప్టెన్ల జాబితాలో కోహ్లి నాలుగో స్థానానికి ఎగబాకాడు. కెప్టెన్‌గా కోహ్లీ 63 టెస్ట్‌ల్లో 37 విజయాలతో వెస్టిండీస్ మాజీ సారథి, దిగ్గజ ఆటగాడు క్లైవ్ లాయిడ్(36 టెస్ట్ విజయాలు)ను అధిగమించాడు. ఈ జాబితాలో దక్షిణాఫ్రికా మాజీ సారథి గ్రేమ్ స్మిత్ అగ్రస్థానంలో ఉన్నాడు. స్మిత్ 109 మ్యాచ్‌ల్లో 53 విజయాలు అందుకుని ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. ఇక స్మిత్ తరువాతి స్థానంలో ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ఉన్నాడు. పాంటింగ్ 77 మ్యాచ్‌ల్లో 48 విజయాలతో రెండో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో స్టీవ్ వా(ఆస్ట్రేలియా) 57 మ్యాచ్‌ల్లో 41 విజయాలతో మూడో స్థానంలో నిలిచాడు. ప్రస్తుతం కోహ్లి.. స్టీవ్ వా(41) మూడో స్థానంపై కన్నేశాడు. మరోవైపు, లార్డ్స్ మైదానంలో టెస్ట్ మ్యాచ్ గెలిచిన మూడో భారత సారథిగా కూడా కోహ్లి రికార్డు నెలకొల్పాడు. ఇంతకుముందు 1986లో కపిల్ దేవ్, 2014లో ధోని మాత్రమే ఈ మైదానంలో టెస్ట్ విజయాలను అందుకున్నారు. చదవండి: 'మీరు ఒకరి వెంటపడితే.. మేం 11 మందిమి మీ వెంటపడతాం': కేఎల్ రాహుల్ లార్డ్స్ విజయంతో కోహ్లి.. సేన (దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాల్లో అత్యధిక విజయాలను అందుకున్న ఆసియా కెప్టెన్‌గా చరిత్ర సృష్టించాడు. అలాగే, టెస్ట్‌ల్లో టాస్ ఓడిపోయిన తర్వాత మ్యాచ్ గెలవడం కోహ్లీకి ఇది ఆరోసారి. ఇంతకుముందు గంగూలీ ఐదు సార్లు, ధోని నాలుగుసార్లు ఈ ఫీట్ సాధించారు. ఇక భారత్ తరఫున అత్యధిక టెస్ట్ విజయాలు నమోదు చేసిన కెప్టెన్ల జాబితాలో కోహ్లి(37) శిఖరాగ్రానికి చేరాడు. కోహ్లి తరువాత ధోని 60 మ్యాచ్‌ల్లో 27 విజయాలతో రెండో స్థానంలో, 49 మ్యాచ్‌ల్లో 21 విజయాలతో గంగూలీ మూడో స్థానంలో ఉన్నారు. ఇదిలా ఉంటే, చివరి రోజు ఆటలో టీమిండియా టెయిలెండర్లు షమీ(70 బంతుల్లో 56 నాటౌట్; 6 ఫోర్లు, సిక్స్), బుమ్రా (64 బంతుల్లో 34 నాటౌట్; 3 ఫోర్లు) అద్భుత పోరాట పటిమ కనబర్చడంతో భారత్ రెండో ఇన్నింగ్స్‌ను 298 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. దాంతో ఇంగ్లండ్ గెలవాలంటే 60 ఓవర్లలో 272 పరుగులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో భారత పేసు గుర్రాలు చెలరేగడంతో ఇంగ్లీష్ జట్టు కేవలం 120 పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా భారత్ 151 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసి, 5 టెస్ట్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. తొలి ఇన్నింగ్స్‌లో శతకొట్టిన కేఎల్ రాహుల్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. చదవండి: ‘ఈ 60 ఓవర్లు వారికి నరకం కనబడాలి’.. కోహ్లి మాటను నిజం చేసిన భారత పేసు గుర్రాలు -
కోహ్లీని తప్పిస్తే టీమిండియా ఐసీసీ టోఫ్రీ గెలుస్తుందా..?
కరాచీ: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో టీమిండియా ఓటమికి జట్టు సారధి విరాట్ కోహ్లీని బాధ్యున్ని చేస్తూ జరుగుతున్న రాద్దాంతంపై పాక్ మాజీ క్రికెటర్ కమ్రాన్ అక్మల్ స్పందించాడు. కెప్టెన్‌గా, ఆటగాడిగా ఘన చరిత్ర కలిగిన కోహ్లీని కేవలం ఒక్క మ్యాచ్ ఓటమి వల్ల ఈ స్థాయిలో నిందించడాన్ని ఆయన తప్పుపట్టాడు. కోహ్లీ సాధించిన విజయాలపై అవగాహన లేని వాళ్లే ఆయనపై ముప్పేట దాడి చేస్తున్నారని దుయ్యబట్టాడు. కెప్టెన్‌గా కోహ్లీని తప్పిస్తే టీమిండియా ఐసీసీ టోఫ్రీ గెలుస్తుందా అని ప్రశ్నించాడు. ఈ విషయంలో ఒక్క కోహ్లీని మాత్రమే తప్పుపట్టడం ఏమాత్రం సరికాదని, కోహ్లీ స్థానంలో మరెవరినైనా కెప్టెన్‌గా నియమిస్తే ఐసీసీ ట్రోఫీ గెలుస్తాడని గ్యారంటీ ఇవ్వగలరా అని నిలదీశాడు. కీలక టోర్నీల్లో ఎందుకు విఫలమవుతున్నారో జట్టుగా విశ్లేషించుకోవాలని, ఫైనల్ ఫోబియా వీడేందుకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించాడు. టీమిండియా కెప్టెన్‌గా కోహ్లీనే సరైన వ్యక్తి అని, భవిష్యత్తులో అతని సారధ్యంలోనే టీమిండియా ప్రపంచ క్రికెట్‌ను శాసిస్తుందని కోహ్లీకి బాసటగా నిలిచాడు. డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా ఓటమికి కోహ్లీ కెప్టెన్సీనే కారణమని, అందుకు జట్టు సారధ్య బాధ్యతల నుంచి అతన్ని తప్పించాలని వస్తున్న డిమాండ్ల నేపథ్యంలో ఈ దాయాది దేశ ఆటగాడు కోహ్లీకి మద్దతుగా నిలవడం చర్చనీయాంశంగా మారింది. 'మై మాస్టర్ క్రికెట్ కోచ్' అనే యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ఆధునిక క్రికెట్లో కోహ్లీ గొప్ప ఆటగాడని, అంత కంటే అద్భుతమైన కెప్టెన్ అని కొనియాడాడు. మైదానంలో కోహ్లీ దూకుడుగా కనిపిస్తాడని, ఎంతో భావోద్వేగంతో ఉంటాడని, ఆ లక్షణాలే అతన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించేలా చేశాయని అభిప్రాయపడ్డాడు. భారత క్రికెట్లో మార్పు సౌరవ్ గంగూలీతో మొదలైందని, ఆతర్వాత ధోనీ, కోహ్లీలు దాన్ని కంటిన్యూ చేశారని పేర్కొన్నాడు. ఇక, ఐసీసీ ట్రోఫీ గెలవలేదన్న కారణంగా కోహ్లీని సారధ్య బాధ్యతల నుంచి తప్పుకోవాలంటున్న వారికి ఈ పాక్ వికెట్ కీపర్ తారాస్థాయిలో చురకలంటించాడు. ఒక్క ఐసీసీ టోఫ్రీ మినహాయించి కోహ్లీ సారధ్యంలో టీమిండియా ఎన్నో చారిత్రక విజయాలు సాధించిందన్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశాడు. ఇదిలా ఉంటే, ఎన్నో అంచనాల నడుమ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో అడుగుపెట్టిన భారత్.. న్యూజిలాండ్ చేతిలో 8 వికెట్ల తేడాతో ఓటమి పాలైన విషయం తెలిసిందే. గత రెండేళ్లుగా జరిగిన ఈ మెగా టోర్నీలో అద్భుత ప్రదర్శన కనబర్చిన టీమిండియా.. కీలక ఫైనల్లో తడబడడంతో భారత మాజీలు, అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. కోహ్లీ.. కనీసం డ్రా కోసం కూడా ప్రయత్నించలేదని మండిపడుతున్నారు. చదవండి: మ్యాచ్ రిఫరికి కరోనా.. ఆందోళనలో క్రికెటర్లు -
WeWantANewCaptain: సమయం ఆసన్నమైంది కోహ్లీ.. దిగిపో!
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో టీమిండియా ఓటమిపాలవడంతో కెప్టెన్సీ మార్పు అంశం మరో సారి తెరపైకి వచ్చింది. బుధవారం ముగిసిన డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత్‌పై న్యూజిలాండ్ 8 వికెట్ల తేడాతో నెగ్గి విశ్వవిజేతగా ఆవిర్భవించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో టీమిండియా చెత్త ప్రదర్శనకు కోహ్లీ కెప్టెన్సీనే కారణమని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోహ్లీపై వేటు వేసి రోహిత్ శర్మకు జట్టు పగ్గాలు అప్పగించాలని సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు. తుది జట్టు ఎంపిక నుంచి మైదానంలో అనుసరించే వ్యూహాలు.. ఫీల్డింగ్ ప్లేస్ మెంట్స్, బౌలింగ్ మార్పులు ఇలా అన్నింటిలో కోహ్లీ దారుణంగా విఫలమయ్యాడని, చెత్త బ్యాటింగ్‌తో జట్టు ఓటమికి కారణమయ్యాడని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. Kohli should step down . #Captaincy #WTC2021Final #Rahane #ICCWorldTestChampionship #WTCFinal pic.twitter.com/vtgrueryy2 — Supreme Leader (@tHeMantal) June 23, 2021 Now the time has come to make a new coach and a new captain.#T20WC #captaincy #INDvNZ #WTC21 #ViratKohli #RohitSharma pic.twitter.com/AIfWn8eDIJ — Dinesh LiLawat (@imDL45) June 23, 2021 అలాగే టీమిండియా ఘోర ప్రదర్శనకు హెడ్ కోచ్ రవిశాస్త్రి కూడా మరో ప్రధాన కారణమని అభిమానులు భావిస్తున్నారు. దీంతో కోహ్లీతో పాటు కోచ్ రవిశాస్త్రిపై కూడా వేటు వేయాల్సిన సమయం ఆసన్నమైందని కామెంట్లు చేస్తున్నారు. కోహ్లీ ఓ అన్ లక్కీ కెప్టెన్ అని, టాస్ నుంచి వాతావరణ పరిస్థితుల వరకు ఏదీ అతనికి కలిసిరావడం లేదంటున్నారు. ముఖ్యంగా ఐసీసీ ఈవెంట్లలో కెప్టెన్‌గా కోహ్లీ దారుణంగా విఫలమయ్యాడని కామెంట్ చేస్తున్నారు. టీమిండియా కెప్టెన్‌గా రోహిత్ శర్మను నియమిస్తే కనీసం టీ20 ప్రపంచకప్ అయినా గెలుస్తామని అభిప్రాయపడుతున్నారు. సోషల్ మీడియాలో WeWantNewCaptain అనే హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. అలాగే కోచ్ రవిశాస్త్రి స్థానంలో రాహుల్ ద్రవిడ్‌ను కొత్త కోచ్‌గా నియమించాలని డిమాండ్ చేస్తున్నారు. చదవండి: చరిత్ర సృష్టించిన రొనాల్డో.. ఆ జాబితాలో నంబర్ వన్ స్థానం -
టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్ గా రోహిత్ శర్మ..?
న్యూఢిల్లీ: టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మను పరిమిత ఓవర్ల ఫార్మాట్‌కు కెప్టెన్‌గా నియమించాలని వస్తున్న వాదనలకు భారత మాజీ వికెట్ కీపర్ కిరణ్ మోరే మద్దతు పలికాడు. టీమిండియా భవిష్యత్తు కెప్టెన్ గా రోహిత్ శర్మ ను ఎంపిక చేస్తే ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదని వ్యాఖ్యానించాడు. ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లీనే ఏదో ఒక రోజు స్వయంగా తన సారథ్య బాధ్యతలను రోహిత్‌తో పంచుకోవడానికి ముందుకు వస్తాడని ఈ మాజీ వికెట్ కీపర్ చెప్పుకొచ్చాడు. స్ప్లిట్ కెప్టెన్సీ పై గతకొంతకాలంగా వస్తున్న వార్తల నేపథ్యంలో కిరణ్ మోరే ఈ మేరకు స్పందించాడు. ఒక్కో ఫార్మాట్‌కు ఒక్కో కెప్టెన్ కు ఉంటే తప్పేంటని ప్రశ్నించిన మోరే.. బీసీసీఐ తన సూచనలను పరిగణలోకి తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. పరిమిత ఓవర్ల క్రికెట్ లో కోహ్లీ కెప్టెన్సీ తో పోలిస్తే.. రోహిత్ సారథ్యం మెరుగ్గా ఉంటుందని, ఇందుకు ఐపీఎల్ లో రోహిత్ సాధించిన విజయాలే నిదర్శనమని పేర్కొన్నాడు. టెస్టుల్లో కోహ్లీ.. వన్డే, టీ20లకు రోహిత్ కెప్టెన్లుగా ఉండాలని క్రీడా పండితులు సైతం అభిప్రాయపడుతున్నారని చెప్పుకొచ్చాడు. కోహ్లీ.. కెప్టెన్సీ బాధ్యతల్ని రోహిత్‌తో పంచుకుంటే భవిష్యత్ తరాలకు బలమైన సందేశాన్ని ఇచ్చినట్లుంటుందని అభిప్రాయపడ్డాడు. టాలెంట్ కు కొదవ లేని భారత్ లాంటి దేశంలో ఒక్కో ఫార్మాట్‌కు ఒక్కో కెప్టెన్ అనే పంథా సెట్ అవుతుందని తెలిపాడు. కాగా, డబ్ల్యూటీసీ ఫైనల్, ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్ కోసం కోహ్లీ సేన యూకే పర్యటనకు వెళ్లనున్న విషయం తెలిసిందే. చదవండి: ఎన్ని అర్హతలున్నా ఏం లాభం.. అతనుండగా జట్టులోకి కష్టమే -
కెప్టెన్ కోహ్లి 60 నాటౌట్..
అహ్మదాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి మరో అరుదైన ఘనతను సాధించాడు. భారత్ తరపున అత్యధిక టెస్టులకు సారథ్యం వహించిన ధోని(60 టెస్టులు, 2008-2014) రికార్డును సమం చేశాడు. అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో 32 ఏళ్ల కోహ్లి(60 నాటౌట్) ఈ మార్క్‌ను అందుకున్నాడు. కోహ్లి సారధ్యంలో టీమిండియా ఇప్పటివరకు 35 విజయాలు, 10 డ్రాలు, 14 పరాభవాలను ఎదుర్కొంది. విజయాల పరంగా చూసినా(35 నాటౌట్) కోహ్లినే టీమిండియా అత్యుత్తమ కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు. ఈ జాబితాలో ధోని 27 విజయాలతో కోహ్లి తరువాతి స్థానంలో ఉన్నాడు. గతంలో సౌరవ్ గంగూలీ(49 టెస్టుల్లో 21 విజయాలు), మహ్మద్ అజహరుద్దీన్(47 టెస్టుల్లో 14 విజయాలు), సునీల్ గావస్కర్(47 టెస్టుల్లో 9 విజయాలు), మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ(40 టెస్టుల్లో 9 విజయాలు), కపిల్ దేవ్(34 టెస్టుల్లో 4 విజయాలు), రాహుల్ ద్రవిడ్(25 టెస్టుల్లో 8 విజయాలు), సచిన్ టెండూల్కర్(25 టెస్టుల్లో 4 విజయాలు), బిషన్ సింగ్ బేడీ(22 టెస్టుల్లో 6 విజయాలు)లు భారత్ తరపున అత్యధిక టెస్టులకు సారథ్యం వహించిన వారిగా ఉన్నారు. -
ఎంపీఎల్లో కోహ్లి పెట్టుబడులు
న్యూఢిల్లీ: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లికి పరస్పర విరుద్ధ ప్రయోజనాల సెగ తగిలింది. ఆన్లైన్ గేమింగ్ ప్లాట్‌ఫామ్ మొబైల్ ప్రీమియర్ లీగ్ (ఎంపీఎల్)లో అతను రెండేళ్ల క్రితం పెట్టిన పెట్టుబడులు.... ఇప్పుడా సంస్థ (ఎంపీఎల్) కాస్త టీమిండియా కిట్ స్పాన్సర్ కావడంతో వివాదం రేగుతోంది. ఎంపీఎల్ సంస్థ కెప్టెన్‌కు గతంలో రూ. 33.32 లక్షల కంపల్సరీ కన్వర్టబుల్ డిబెంచర్స్ (సీసీడీ)ను కేటాయించింది. విరాట్ గత జనవరిలో ఎంపీఎల్ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితుడయ్యాడు. ఈ ఎండార్స్‌మెంట్‌కు సంబంధిం చిన పారితోషికాన్ని షేర్లు, డిబెంచర్ల రూపంలో అతనికి ఇచ్చింది. ఆటగాడ న్నాక కాంట్రాక్టులు, ఎండార్స్మెంట్లు సర్వసాధారణం. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ ఇటీవల ఎంపీఎల్‌కు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తమ కిట్, జెర్సీ స్పాన్సర్షిప్ ఇచ్చింది. కెప్టెన్ పెట్టుబడులున్న సంస్థకు స్పాన్సర్షిప్ దక్కడం పైనే ఇప్పుడు వివాదం రేగింది. ఇది కచ్చితంగా పరస్పర విరుద్ధ ప్రయోజనాల కిందకే వస్తుందని విమర్శలు వచ్చాయి. అయితే దీనిపై కోహ్లిగానీ, క్రికెట్ బోర్డు (బీసీసీఐ) గానీ స్పందించలేదు. -
‘ఎంఎస్ ధోనీ’లో నా పాత్ర ఉండదు: లక్ష్మీరాయ్
టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ జీవితకథ ఆధారంగా తెరకెక్కించిన బాలీవుడ్ సినిమా ఎంఎస్ ధోనీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ సినిమా ప్రమోషన్లో యూనిట్‌తో పాటు ధోనీ కూడా పాల్గొనడంపై మరింత ప్రచారం వచ్చింది. త్వరలో విడుదలవుతున్న ఈ సినిమా కోసం అభిమానులతో పాటు దక్షిణాది హీరోయిన్ లక్ష్మీ రాయ్ కూడా ఎదురు చూస్తోంది. ఎందుకంటే ఎంఎస్ ధోనీ సినిమాలో రాయ్ పాత్ర ఉంటుందా అన్నది చర్చనీయాంశంగా మారింది. 2008లో ధోనీ.. రాయ్‌తో ఎఫైర్ నడిపినట్టు పుకార్లు షికార్లు చేశాయి. ఈ విషయంపై లక్ష్మీ రాయ్ స్పందిస్తూ.. ఎంఎస్ ధోనీ సినిమాలో తన పాత్ర ఉంటుందని భావించడంలేదని చెప్పింది. తన గతం గురించి అనవసరంగా చర్చించుకుంటున్నారని రుసరుసలాడింది. ’2008 ఐపీఎల్ సందర్భంగా ఓ ఏడాది పాటు చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నాను. ఆ సమయంలో ధోనీతో పరిచయం ఏర్పడింది. అయితే మాకు పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన లేదు. ఆ ఐపీఎల్ సీజన్ ముగిశాక చెన్నై జట్టుతో అనుబంధం ముగిసింది. ఆ తర్వాత ధోనీతో టచ్‌లో లేను. అంతటితో ఆ అధ్యాయం ముగిసింది. ధోనీతో తనకు ఎఫైర్ ఉన్నట్టు ఎనిమిదేళ్ల తర్వాత కూడా ఎందుకు మాట్లాడుకుంటున్నారో అర్థం కావడం లేదు. ఈ సినిమా కథ గురించి తెలుసుకునేందుకు నేను ప్రయత్నించాను. అయితే ఎలాంటి సమాచారం తెలియలేదు’ అని లక్ష్మీ రాయ్ చెప్పింది. ధోనీకి గతంలో ప్రియాంక ఝా అనే గాళ్ ఫ్రెండ్ ఉండేది. ఆమె ప్రమాదంలో మరణించింది. ఎంఎస్ ధోనీ సినిమాలో ప్రియాంక ఝాతో పాటు లక్ష్మీ రాయ్ పాత్రలు ఉంటాయని భావిస్తున్నారు. 2010లో ధోనీ సాక్షి రావత్‌ను పెళ్లి చేసుకున్నాడు. ఎంఎస్ ధోనీ సినిమాలో అతని గాళ్ ఫ్రెండ్స్ పాత్రలు ఉంటాయా లేవా అన్నది తెరపై చూడాలి.