Ravi Shastri Advised Kohli To Quit Captaincy From Two Formats: టీ20 ప్రపంచ కప్ తర్వాత టీమిండియా టీ20 కెప్టెన్సీ నుంచి, ఐపీఎల్-2021 తర్వాత ఆర్సీబీ సారధ్య బాధ్యతల నుంచి తప్పుకోనున్నట్లు ఇటీవల సంచలన ప్రకటన చేసిన విరాట్ కోహ్లి క్రికెట్ ప్రపంచం మొత్తాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తిన సంగతి తెలిసిందే. ఈ విషయానికి సంబంధించి టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి ఆరు మాసాల క్రితమే ఓ కీలక సలహా ఇచ్చాడని తెలుస్తోంది. అయితే ఆ సలహాను అప్పట్లో అంతగా పట్టించుకోని కోహ్లి.. ఆలస్యంగా తేరుకుని కోచ్ సలహాలోని ఓ భాగాన్ని మాత్రమే అమలు చేయాలని నిర్ణయించుకున్నాడు.
ఇంతకీ కోహ్లికి రవిశాస్త్రి ఇచ్చిన ఆ సలహా ఏంటా అని అనుకుంటున్నారా..? అయితే ఈ స్టోరీపై ఓ లుక్కేయండి. ఈ ఏడాది ఆరంభంలో జరిగిన టెస్ట్ సిరీస్‌లో ఆసీస్‌ను వారి సొంతగడ్డపై మట్టికరింపించిన అనంతరం టీమిండియా కోచ్ రవిశాస్త్రి.. కెప్టెన్ కోహ్లికి ఓ కీలక సూచన చేశాడు. బ్యాటింగ్‌పై పూర్తి దృష్టి కేంద్రీకరించేందుకు వన్డే, టీ20 ఫార్మాట్ల కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పాలని, టెస్ట్ క్రికెట్‌లో మాత్రం సారధిగా కొనసాగాలని సలహా ఇచ్చాడు. అప్పటికే అడపాదడపా ఫామ్‌తో నెట్టుకొస్తున్న కోహ్లి మంచి కోరే రవిశాస్త్రి ఈ సలహా ఇచ్చాడట. అయితే, రవిశాస్త్రి మాటలను పెడచెవిన పెట్టిన కోహ్లి కేవలం టీ20 కెప్టెన్సీకి మాత్రమే గుడ్‌బై చెబుతానని ప్రకటించాడు.
ఈ నేపథ్యంలో రవిశాస్త్రి.. కోహ్లికి ఇచ్చిన సలహాపై నెటిజన్లు స్పందిస్తున్నారు. కోచ్ సలహా మేరకు కోహ్లి ఈ పనిని ఆర్నెళ్ల క్రితమే చేసుంటే.. ఆటతీరు మరింత మెరుగ్గా ఉండేదని కామెంట్లు చేస్తున్నారు. కోహ్లికి కెప్టెన్సీపై ఇంకా యావ తగ్గలేదని, అందుకే కోచ్ చెప్పినా వినకుండా వన్డే సారధ్య బాధ్యతలను అట్టిపెట్టుకున్నాడని మరికొందరు చురకలంటిస్తున్నారు.
చదవండి: ‘కివీస్ జట్టుకు బెదిరింపులు భారత్ కుట్రే’... పాక్ మంత్రి సంచలన ఆరోపణ
Comments
Please login to add a commentAdd a comment