Ravi Shastri Reveals Virat Kohli Might Give Up Captaincy Other Formats.. టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి విరాట్ కోహ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇప్పటికే టి20 కెప్టెన్సీ నుంచి పక్కకు తప్పుకున్న కోహ్లి.. త్వరలోనే వన్డే, టెస్టుల్లోనూ కెప్టెన్సీ నుంచి తప్పుకోనున్నాడంటూ ఆసక్తికరవ్యాఖ్యలు చేశాడు. బ్యాటింగ్‌పై దృష్టి పెట్టేందుకు కోహ్లి ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలిపాడు.
'' గత ఐదేళ్లలో కోహ్లి కెప్టెన్సీలో టీమిండియా టెస్టుల్లో నెంబర్‌వన్ స్థానంలో ఉంది. కేవలం తన బ్యాటింగ్‌పై ఫోకస్ పెట్టాలనే ఉద్దేశంతో మానసిక ఒత్తిడిని అధిగమించాలని కెప్టెన్సీ నుంచి తప్పుకునే అవకాశం ఉంది. అయితే ఇది ఇప్పట్లో జరగకపోవచ్చు. ఇక పరిమిత ఓవర్ల విషయంలోనూ కోహ్లి ఇదే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇంతకముందు కూడా క్రికెట్ చరిత్రలో బ్యాటింగ్‌పై మరింత ఫోకస్ పెట్టేందుకు కెప్టెన్సీ వదులుకున్న ఆటగాళ్లు చాలా మందే ఉన్నారు.'' అని చెప్పుకొచ్చాడు.
ప్రస్తుతం కోహ్లి న్యూజిలాండ్‌తో జరగనున్న టి20 సిరీస్‌కు దూరంగా ఉన్నాడు. ఆ తర్వాత జరగనున్న తొలి టెస్టులో కూడా ఆడడం లేదు. దీంతో కోహ్లి గైర్హాజరీలో రహానే తొలి టెస్టుకు నాయకత్వం వహించనున్నాడు.
చదవండి: కోచ్‌గా ఉన్న సమయంలో టీమిండియాకు కప్ లేదు.. బాధగా ఉంది
Comments
Please login to add a commentAdd a comment