చెన్నై వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా పట్టు సాధించింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో మూడు వికెట్ల నష్టానికి 81 పరుగులు చేసింది. ప్రస్తుతం భారత్ 308 పరుగుల ఆధిక్యంలో (తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో కలుపుకుని) కొనసాగుతుంది.
యశస్వి జైస్వాల్ (10), రోహిత్ శర్మ (5), విరాట్ కోహ్లి (17) తక్కువ స్కోర్‌కే ఔట్ కాగా.. శుభ్‌మన్ గిల్ (33), రిషబ్ పంత్ (12) క్రీజ్‌లో ఉన్నారు. బంగ్లా బౌలర్లలో తస్కిన్, నహిద్ రాణా, మెహిది హసన్ మీరజ్ తలో వికెట్ పడగొట్టారు. అంతకుముందు బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 149 పరుగులకు ఆలౌట్ కాగా.. భారత్‌కు 227 పరుగుల ఆధిక్యం లభించింది. దీనికి ముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 376 పరుగులకు ఆలౌటైంది.
Ultraedge shows a spike on Virat Kohli's bat.
- Review was not taken by Kohli. pic.twitter.com/w9hU4f9Zt6— Mufaddal Vohra (@mufaddal_vohra) September 20, 2024
తప్పు చేసిన విరాట్
సెకెండ్ ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లి ఓ పెద్ద తప్పు చేసి అనవసరంగా వికెట్ సమర్పించుకున్నాడు. మెహిది హసన్ మీరజ్ బౌలింగ్‌లో విరాట్ ఎల్బీడబ్ల్యూ అయినట్లు ఫీల్డ్ అంపైర్ రిచర్డ్ కెటిల్‌బోరో ప్రకటించాడు. అయితే విరాట్ రివ్యూకి వెళ్లకుండా అంపైర్ నిర్ణయం ప్రకారం మైదానం వీడాడు. తీరా రీప్లేలో చూస్తే బ్యాట్ ఎడ్జ్ తీసుకున్నట్లు స్పష్టంగా కనిపించింది. విరాట్ రివ్యూకి వెళ్లకపోవడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది.
Rohit Sharma and Kettleborough's reaction to Virat Kohli not reviewing even after the edge. 🥲💔 pic.twitter.com/O9tK060MyD
— Mufaddal Vohra (@mufaddal_vohra) September 20, 2024
రెచ్చిపోయిన భారత పేసర్లు..
బంగ్లా తొలి ఇన్నింగ్స్‌లో భారత పేసర్లు బుమ్రా (4 వికెట్లు), సిరాజ్ (2), ఆకాశ్‌దీప్ (2) రెచ్చిపోయారు. ఫలితంగా బంగ్లాదేశ్ 149 పరుగులకే కుప్పకూలింది. స్పిన్నర్ జడేజా రెండు వికెట్లు తీశారు. బంగ్లా ఇన్నింగ్స్‌లో నజ్ముల్ షాంటో (20), షకీబ్ అల్ హసన్ (32), లిట్టన్ దాస్ (22), తస్కిన్ అహ్మద్ (11), నహిద్ రాణా (11), మిరాజ్ (27 నాటౌట్) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. భారత్ 227 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది.
అశ్విన్ సూపర్ సెంచరీ
రవిచంద్రన్ అశ్విన్ సూపర్ సెంచరీతో (113) చెలరేగడంతో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో గౌరవప్రదమైన స్కోర్ చేసింది. రవీంద్ర జడేజా (86), యశస్వి జైస్వాల్ (56) అర్ద సెంచరీలతో రాణించారు. పంత్ (39) పర్వాలేదనిపించాడు. రోహిత్ (6), గిల్ (0), కోహ్లి (6), రాహుల్ (16) విఫలమయ్యారు. బంగ్లా బౌలర్లలో హసన్ మహమూద్ 5, తస్కిన్ అహ్మద్ 3, నహిద్ రాణా, మెహిది హసన్ మీరజ్ తలో వికెట్ తీశారు.
చదవండి: పంత్‌పై సిరాజ్ ఆగ్రహం.. రోహిత్ కూడా ఇలా చేస్తాడనుకోలేదు!
Comments
Please login to add a commentAdd a comment