ఇంగ్లండ్‌తో గతేడాది అర్థాంతరంగా ముగిసిన టెస్ట్ సిరీస్‌లోని చివరి టెస్ట్ మ్యాచ్ ఆడేందుకు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీలతో కూడిన భారత జట్టు రేపు (జూన్ 16) లండన్ ఫ్లైట్ ఎక్కాల్సి ఉంది. అయితే ఈ బృందంతో పాటు కేఎల్ రాహుల్ ప్రయాణించడం అనుమానమేనని తెలుస్తోంది. స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్‌కు ముందు గాయపడ్డ రాహుల్ ఇంకా కోలుకోలేదని సమాచారం. రాహుల్ గాయం నుంచి కోలుకున్నాడని గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నా అందులో నిజం లేదని తెలుస్తోంది. రాహుల్ సహచర సభ్యులతో రేపు ఇంగ్లండ్‌కు బయల్దేరాల్సి ఉన్నా అతను ఇంకా ఎన్సీఏ (జాతీయ క్రికెట్ అకాడమీ) లోనే ఉండటం ఈ వార్తలకు బలం చేకూరుస్తుంది.
ఇదిలా ఉంటే, జులై 1 నుంచి ఇంగ్లండ్‌తో జరుగనున్న ఏకైక టెస్ట్ కోసం పంత్, శ్రేయస్ అయ్యర్ మినహా టీమిండియా మొత్తం రేపు లండన్ ఫ్లైట్ ఎక్కనుంది. ఇంగ్లండ్ పర్యటనలో భారత్ టెస్ట్ మ్యాచ్‌తో పాటు 3 వన్డేలు, 3 టీ20ల సిరీస్‌లు కూడా ఆడాల్సి ఉంది. ఇంగ్లండ్‌తో ఏకైక టెస్ట్ మ్యాచ్ కోసం టీమిండియాను ఇదివరకే ప్రకటించారు.ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ ముగిసిన వెంటనే పంత్, శ్రేయస్ ఇంగ్లండ్‌కు బయల్దేరతారు. మరోవైపు టీమిండియా ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్న సమయంలోనే మరో భారత టీమ్ ఐర్లాండ్‌లో పరిమిత ఓవర్ల సిరీస్ ఆడనుంది. ఈ జట్టుకు హార్ధిక్ పాండ్యా నాయకత్వం వహించే అవకాశాలున్నాయి. ఇంగ్లండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్ కోసం టీమిండియాను ప్రకటించాల్సి ఉంది. జులై 7 నుంచి 17 వరకు పరిమిత ఓవర్ల సిరీస్‌లు జరుగనున్నాయి.
ఇంగ్లండ్‌తో టెస్ట్ మ్యాచ్‌కు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, హనుమ విహారి, చతేశ్వర్ పుజారా, రిషభ్ పంత్, కేఎస్ భరత్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్, ప్రసిధ్ కృష్ణ
చదవండి: వరుస ఓటములతో సతమతమవుతున్న న్యూజిలాండ్‌కు మరో షాక్
Comments
Please login to add a commentAdd a comment