
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్‌కు ముందు టీమిండియా వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ గాయం బారిన పడిన విషయం తెలిసిందే. ఈ కారణంగా అతను సఫారీలతో టీ20 సిరీస్‌కు దూరంగా ఉన్నాడు. గాయం నుంచి ఇంకా కోలుకోని రాహుల్ త్వరలో ప్రారంభంకానున్న ఇంగ్లండ్ సిరీస్‌కు కూడా దూరమయ్యాడు. ప్రస్తుతం ఎన్సీఏ (జాతీయ క్రికెట్ అకాడమీ)లో వైద్యుల పర్యవేక్షనలో ఉన్న అతను మెరుగైన చికిత్స నిమిత్తం జర్మనీకి వెళ్లనున్నట్లు టీమిండియా వర్గాలు వెల్లడించాయి. రాహుల్ జులై 1 నుంచి ఇంగ్లండ్‌తో జరుగనున్న ఏకైక టెస్ట్ మ్యాచ్‌కు దూరమైనప్పటికీ.. ఆతర్వాత జరుగబోయే వన్డే, టీ20 సిరీస్‌లకు అందుబాటులో ఉంటాడని తెలుస్తోంది.
England bound ✈️
— BCCI (@BCCI) June 16, 2022
📸 📸: Snapshots as #TeamIndia takes off for England. 👍 👍 pic.twitter.com/Emgehz2hzm
ఇదిలా ఉంటే, ఇంగ్లండ్‌తో గతేడాది అర్థాంతరంగా ముగిసిన టెస్ట్ సిరీస్‌లోని చివరి టెస్ట్ మ్యాచ్ ఆడేందుకు టీమిండియాలోని మెజార్టీ సభ్యులు ఇవాళ లండన్ విమానం ఎక్కారు. టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లితో పాటు మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా, చతేశ్వర్ పుజారా, నవ్‌దీప్ సైనీ, రవీంద్ర జడేజా, శుభ్‌మన్ గిల్, మహ్మద్ షమీ, శార్దూల్ ఠాకూర్, కేఎస్ భరత్ తదితరులు ఇవాళ ఉదయం ముంబై నుంచి లండన్‌కు బయల్దేరారు. కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ ఆడుతున్న రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్‌లు సిరీస్ ముగిసిన వెంటనే ఇంగ్లండ్‌కు బయల్దేరతారు.
ఇంగ్లండ్ పర్యటనలో భారత్ టెస్ట్ మ్యాచ్‌తో పాటు 3 వన్డేలు, 3 టీ20ల సిరీస్‌లు ఆడాల్సి ఉంది. ఇంగ్లండ్‌తో ఏకైక టెస్ట్ మ్యాచ్ కోసం టీమిండియాను ఇదివరకే ప్రకటించగా.. వన్డే, టీ20 సిరీస్‌ల కోసం జట్టును ప్రకటించాల్సి ఉంది. మరోవైపు టీమిండియా ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్న సమయంలోనే మరో భారత టీమ్ ఐర్లాండ్‌లో రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. ఈ జట్టుకు హార్ధిక్ పాండ్యా నాయకత్వం వహించనున్నాడు.
ఇంగ్లండ్‌తో టెస్ట్ మ్యాచ్‌కు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, హనుమ విహారి, చతేశ్వర్ పుజారా, రిషభ్ పంత్, కేఎస్ భరత్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్, ప్రసిధ్ కృష్ణ
ఇంగ్లండ్ పర్యటనలో టీమిండియా షెడ్యూల్ ఇలా ఉంది..
- జూన్ 24-27 వరకు లీసెస్టర్‌షైర్‌తో నాలుగు రోజుల వార్మప్ మ్యాచ్
- జులై 1-5 వరకు రీషెడ్యూల్డ్ టెస్ట్ మ్యాచ్
- జులై 7న తొలి టీ20
- జులై 9న రెండో టీ20
- జులై 10న మూడో టీ20
- జులై 12న తొలి వన్డే
- జులై 14న రెండో వన్డే
- జులై 17న మూడో వన్డే
చదవండి: 'రోహిత్ అందుబాటులో లేకపోతే కెప్టెన్‌గా అతడే సరైనోడు'
Comments
Please login to add a commentAdd a comment