భారత క్రికెట్ అభిమానులకు గుడ్‌న్యూస్. టీమిండియా యవ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ అనుకున్నదాని కంటే వేగంగా కోలుకుంటున్నాడు. గతేడాది డిసెంబర్‌లో రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ పంత్.. గత కొన్ని నెలలగా బెంగళూరులోని నేషనల్ క్రికెట్‌లో పునరావసం పొందుతున్నాడు. ఈ క్రమంలో ఎప్పటికప్పుడు తన ఫిట్‌నెస్‌కు సంబంధించిన అప్‌డేట్స్‌ను అభిమానులకు పంత్ షేర్ చేస్తున్నాడు. తాజాగా అతడి ఫిట్‌నెస్‌కు సంబంధించి అదిరిపోయే ఓ వార్త బయటకు వచ్చింది.
ప్రస్తుతం ఎన్‌సీఏలో ఉన్న రిషబ్ పంత్ 140 కి.మీ.ల వేగంతో దూసుకువస్తున్న బంతులతో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నట్లు తెలుస్తోంది. రిషబ్ పంత్ కోలుకుంటున్న విధానం ఏన్సీఏ సిబ్బందిని కూడా ఆశ్చర్యపరుస్తోందంట. అతడు ఇదే వేగంతో కోలుకుంటే అనుకున్నదానికంటే ముందే మైదానంలో అడుగుపెట్టే అవకాశం ఉంది.
అదే విధంగా అతడు పూర్తి ఫిట్‌నెస్ సాధించడానికి మరో రెండు నుంచి మూడు నెలల సమయం పట్టనున్నట్లు ఏన్సీఏ వర్గాలు వెల్లడించాయి. పంత్ తిరిగి వచ్చే ఏడాది స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగే టెస్టు సిరీస్‌తో రీఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉంది. మరోవైపు టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ పూర్తి ఫిట్‌నెస్ సాధించినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో అతడు ఆసియాకప్‌తో రీఎంట్రీ ఇవ్వనున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.
ఇక మరో భారత ఆటగాడు శ్రేయస్ అయ్యర్ మాత్రం ఇంకా ఫిట్‌నెస్ సాధించకపోయినట్లు పలు నివేదికలు పేర్కొంటున్నాయి. అతడు కోలుకోవడానికి ఎంత సమయం పడుతుందనే విషయంపై డాక్టర్లు కూడా చెప్పలేకపోతున్నట్లు వినికిడి. ఇక ఇది ఇలా ఉండగా.. గాయం కారణంగా గత కొంత కాలంగా జట్టుకు దూరంగా ఉన్న పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా తిరిగి రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌లో భారత జట్టు సారధిగా బుమ్రా వ్యవహరించనున్నాడు.
చదవండి: #Prithvi Shaw: ఏంటి భయ్యా నీ అదృష్టం.. ఇదేమి ఔట్‌రా బాబు! పాపం పృథ్వీ! వీడియో వైరల్
Triple Century Hero: అరంగేట్రంలో 4 రన్స్! మూడో మ్యాచ్‌లో ఏకంగా ట్రిపుల్ సెంచరీ.. కానీ ఏడాదిలోనే ముగిసిన కెరీర్! అలా ప్రపంచంలో నం.1గా..
Comments
Please login to add a commentAdd a comment