స్వదేశంలో వెస్టిండిస్‌తో టీమిండియా మూడు వన్డేలు, టీ20లు ఆడనుంది. కాగా అహ్మాదాబాద్ వేదికగా జరిగే తొలి వన్డేకు టీమిండియా పరిమిత ఓవర్ల వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ దూరమైన సంగతి తెలిసిందే. అధే విధంగా రెండవ వైస్-కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రాకి కూడా సెలెక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. ఈ క్రమంలో వైస్ కెప్టెన్ ఎవరన్నది ప్రస్తుత చర్చానీయాంశంమైంది. ఈ నేపథ్యంలో తొలి వన్డేకు వికెట్ కీపర్ రిషభ్ పంత్‌కి వైస్ కెప్టెన్సీ భాధ్యతలు అప్పజెప్పాలని బీసీసీఐ భావిస్తున్నట్లు సమాచారం.
కాగా దక్షిణాఫ్రికా పర్యటనకు గాయం కారణంగా దూరమైన రోహిత్ శర్మ.. తిరిగి కెప్టెన్సీ బాధ్యతలు నిర్వర్తించడానికి సిద్దమయ్యాడు. "రెండో వన్డే నుంచి రాహుల్ జట్టులోకి రానున్నాడు. కాబట్టి తొలి వన్డే గురించి మాత్రమే ఆలోచించాలి. ధావన్, పంత్ ఇద్దరూ డిప్యూటీలుగా ఉండగలరు. కానీ రిషబ్‌కి కెప్టెన్‌గా అనుభవం ఉంది. ఫీల్డ్ ప్లేస్‌మెంట్‌ల గురించి కూడా అతడికి బాగా తెలుసు" అని బీసీసీఐ అధికారి ఒకరు పేర్కొన్నారు.
వన్డే జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), రుతురాజ్, శిఖర్ ధావన్, కోహ్లి, సూర్యకుమార్, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్, దీపక్ చహర్, శార్దుల్ ఠాకూర్, యుజువేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, రవి బిష్ణోయ్, అవేశ్ ఖాన్, దీపక్ హుడా.
చదవండి: Ind Vs WI: చార్టెడ్ ఫ్లైట్ లేదు.. ఆ విమానాల్లో వచ్చేయండి..! ఆ తర్వాత..
India Test Captain: రోహిత్ శర్మపై టీమిండియా మాజీ సెలక్టర్ సంచలన వ్యాఖ్యలు... సిరీస్‌కు ముందు గాయపడే కెప్టెన్ అవసరమా?
Comments
Please login to add a commentAdd a comment