India captain
-
రోహిత్ శర్మ చెత్త రికార్డు
స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో క్లీన్ స్వీప్ అయిన అనంతరం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఓ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. 1969 తర్వాత టెస్ట్ క్రికెట్లో ఒకే క్యాలెండర్ ఇయర్లో అత్యధిక పరాజయాలు చవిచూసిన భారత కెప్టెన్‌గా అపఖ్యాతిని మూటగట్టుకున్నాడు.1969లో మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ సారథ్యంలోని భారత జట్టు ఒకే ఏడాది నాలుగు టెస్ట్‌ల్లో ఓటమిపాలైంది. తాజాగా రోహిత్.. మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ చెత్త రికార్డును సమం చేశాడు. రోహిత్ సారథ్యంలోని టీమిండియా.. ఈ ఏడాది ఆరంభంలో ఇంగ్లండ్ చేతిలో ఓటమిపాలైంది. తాజాగా న్యూజిలాండ్ చేతిలో మూడు టెస్ట్‌ల సిరీస్‌లో క్లీన్ స్వీప్‌కు గురైంది.సొంతగడ్డపై అత్యధిక పరాజయాలు ఎదుర్కొన్న భారత కెప్టెన్లు..మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ-9రోహిత్ శర్మ-5విరాట్ కోహ్లి-3కాగా, న్యూజిలాండ్‌తో తాజాగా ముగిసిన టెస్ట్ సిరీస్‌లో భారత్ 0-3 తేడాతో ఓటమిపాలైంది. బెంగళూరు వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో 8 వికెట్ల తేడాతో ఓటమిపాలైన భారత్.. పూణేలో జరిగిన రెండో టెస్ట్‌లో 113 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. ముంబై వేదికగా జరిగిన మూడో టెస్ట్‌లో టీమిండియా 25 పరుగుల తేడాతో పరాజయాన్ని ఎదుర్కొంది. -
హార్దిక్, రాహుల్, బుమ్రా కాదు.. భారత ఫ్యూచర్ కెప్టెన్ అతడే
గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా టీమిండియా స్టార్ ఓపెనర్ శుబ్‌మన్ గిల్‌కు మంచి మార్కులు పడుతున్నాయి. ఐపీఎల్-2024లో హార్దిక్ పాండ్యా నుంచి గుజరాత్ జట్టు పగ్గాలు చేపట్టిన గిల్.. తన వ్యూహాత్మక నిర్ణయాలతో జట్టును ముందుకు నడిపిస్తున్నాడు. ఈ ఏడాది సీజన్లో ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో మూడింట గుజరాత్ ఓటమి పాలైనప్పటికి.. గిల్ మాత్రం తన కెప్టెన్సీతో అందరని అకట్టుకున్నాడు. అతడు బౌలర్లను మార్చే విధానం గానీ ఫీల్డ్ సెట్ కానీ అద్బుతంగా ఉన్నాయి. ఆటు వ్యక్తిగత ప్రదర్శన పరంగా కూడా గిల్ అదరగొడుతున్నాడు. ఇప్పటివరకు 5 మ్యాచ్‌లు ఆడిన గిల్ 45.75 సగటుతో 183 పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలో గిల్‌పై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ ప్రశంసల వర్షం కురిపించాడు. గిల్‌కు అద్బుతమైన కెప్టెన్సీ స్కిల్స్ ఉన్నాయని వాన్ కొనియాడాడు. కాగా ఆదివారం లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో గుజరాత్ ఓటమి పాలైనప్పటికి గిల్ మాత్రం కెప్టెన్‌గా విజయవంతమయ్యాడు. తొలుత బౌలింగ్‌లో తన కెప్టెన్సీ మార్క్‌తో లక్నోను నామమాత్రపు స్కోరుకే పరిమితం చేశాడు. కానీ ఆ తర్వాత బ్యాటర్లు విఫలమవకావడంతో గుజరాత్ ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో గిల్ కెప్టెన్సీకి వాన్ ఫిదా అయిపోయాడు. "శుబ్‌మన్ గిల్ సారథిగా రోజుకు రోజుకు మరింత పరిణితి చెందుతున్నాడు. అతడు భవిష్యత్తులో కచ్చితంగా భారత జట్టు కెప్టెన్ అవుతాడు. అందులో ఎటువంటి సందేహం లేదని" గుజరాత్-లక్నో మ్యాచ్ అనంతరం వాన్ ట్విట్ చేశాడు. హార్దిక్ పాండ్యా,రాహుల్, బుమ్రా వంటి వారు రోహిత్ శర్మ తర్వాత భారత కెప్టెన్సీ రేసులో ఉన్నప్పటికి వాన్ మాత్రం గిల్‌ను ఫ్యూచర్ కెప్టెన్‌గా ఎంచుకోవడం గమనార్హం. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7552012696.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. 112 ఏళ్ల తర్వాత! ప్రపంచంలోనే
ధర్మశాల వేదికగా జరిగిన ఐదో టెస్టులోనూ ఇంగ్లండ్‌ను టీమిండియా చిత్తు చేసింది. ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. తొలి టెస్టులో ఓటమి పాలైన భారత్.. తిరిగి పుంజుకుని వరుసగా నాలుగు టెస్టుల్లోనూ విజయ భేరి మ్రోగించింది. దీంతో ఐదు టెస్టుల సిరీస్‌ను 4-1తో భారత్ కైవసం చేసుకుంది. కాగా ఆఖరి టెస్టులో 473/8తో మూడో రోజు ఆట ప్రారంభించిన భారత్ మరో 4 పరుగులు మాత్రమే చేసి 477 పరుగులకు ఆలౌటైంది. భారత బ్యాటర్లలో రోహిత్ శర్మ(103), గిల్(110) సెంచరీలతో చెలరేగగా.. పడిక్కల్(65), సర్ఫరాజ్ ఖాన్(56) హాఫ్ సెంచరీలతో మెరిశారు. ఇంగ్లండ్ బౌలర్లలో షోయబ్ బషీర్ 5 వికెట్లతో సత్తాచాటాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ 48.1 ఓవర్లలోనే 195 పరుగులకు కుప్పకూలింది. 100వ టెస్టు ఆడుతున్న రవిచంద్రన్ అశ్విన్ 5 వికెట్లతో ఇంగ్లిష్ జట్టు పతనాన్ని శాసించాడు. అతడితో పాటు కుల్దీప్, బుమ్రా తలా రెండు వికెట్లు పడగొట్టారు. అంతకుముందు ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 218 పరుగులకే ఆలౌటైంది. రోహిత్ శర్మ అరుదైన ఘనత.. ఇక ఈ విజయంతో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఓ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. 112 ఏళ్ల తర్వాత ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో ఓడి 4-1తో సిరీస్ కైవసం చేసుకున్న కెప్టెన్‌గా రికార్డులకెక్కాడు. హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి టెస్టులో అనూహ్యంగా ఓటమి పాలైన రోహిత్ సేన.. తర్వాత నాలుగు మ్యాచ్‌ల్లో పర్యాటక జట్టును చిత్తు చేసింది. కాగా సొంతగడ్డపై భారత్‌కు ఇది 400వ విజయం కావడం గమనార్హం. -
అదే అతడి బలం.. టీమిండియా కెప్టెన్ కాగలడు: అంబటి రాయుడు
టీమిండియా యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్‌పై భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు ప్రశంసలు కురిపించాడు. రుతు ప్రతిభావంతుడని.. భవిష్యత్తులో భారత జట్టు కెప్టెన్ కాగల సత్తా ఉన్నవాడని పేర్కొన్నాడు. బీసీసీఐ అతడి సేవలను దీర్ఘకాలం పాటు ఉపయోగించుకుంటే మంచి ఫలితాలు రాబట్టవచ్చని అభిప్రాయపడ్డాడు. కాగా దేశవాళీ క్రికెట్లో మహారాష్ట్ర కెప్టెన్‌గా జట్టును ముందుండి నడిపిస్తున్న రుతురాజ్ గైక్వాడ్.. బ్యాటర్‌గానూ అద్భుతంగా రాణిస్తున్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో ప్రపంచ రికార్డులు సాధిస్తున్న ఈ రైట్‌హ్యాండ్ బ్యాటర్.. టీమిండియా తరఫున వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నాడు. ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌లో మూడో మ్యాచ్ సందర్భంగా సంచలన సెంచరీతో మెరిశాడు. 52 బంతుల్లోనే 100 పరుగుల మార్కును అందుకున్న రుతురాజ్ గైక్వాడ్.. 57 బంతుల్లో 123 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ బ్యాటర్ అంబటి రాయుడు ఓ పాడ్‌కాస్ట్ లో మాట్లాడుతూ ఒకప్పటి తన సహచర ఆటగాడు రుతు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. “ప్రస్తుతం భారత క్రికెట్ ఎక్కువగా ఉపయోగించుకుంటున్న ఆటగాడు ఎవరంటే రుతురాజ్ గైక్వాడ్ పేరు చెప్పొచ్చు. అతడు అత్యంత ప్రతిభావంతుడు. భవిష్యత్తులో జట్టుకు మరింత ఉపయోగపడతాడు. తనకున్న టాలెంటే తన బలం. షాట్ సెలక్షన్, అనుకున్న రీతిలో తన వ్యూహాలను అమలు పరిచే విధానం.. అన్నింటికీ మించి ఫిట్నెస్ విషయంలో శ్రద్ధ రుతును మరింత ప్రత్యేకంగా నిలుపుతున్నాయి. కూల్‌గా తన పని తాను చేసుకుపోతాడు. ఏం చేయాలో.. ఏం చేయకూడదో తనకు తెలుసు. సైలెంట్‌గా ఉంటూనే దూకుడు ప్రదర్శించగలడు. టీమిండియాకు దొరికిన విలువైన ఆటగాడు. ఇలా చెప్పడం తొందరపాటే అయినా.. ధోని భాయ్ రిటైర్ అయిన తర్వాత సీఎస్కే కెప్టెన్‌గా రుతుకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. భవిష్యత్తులో టీమిండియా సారథి అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇప్పటికే ఆసియా క్రీడల్లో జట్టును ముందుండి నడిపించాడు” అని అంబటి రాయుడు పేర్కొన్నాడు. కాగా చైనాలో జరిగిన ఏసియన్ గేమ్స్ లో కెప్టెన్‌గా వ్యవహరించిన రుతు భారత్‌కు స్వర్ణ పతకం అందించాడు. కాగా పరిమిత ఓవర్ల క్రికెట్లో టీమిండియా సారథిగా రోహిత్ శర్మ తర్వాత హార్దిక్ పాండ్యా పగ్గాలు చేపట్టనుండగా.. శ్రేయస్ అయ్యర్‌తో పాటు ఇప్పుడు రుతురాజ్ పేరు కూడా వార్తల్లో నిలుస్తోంది. -
టీమిండియా వైస్ కెప్టెన్‌గా రిషభ్ పంత్!
స్వదేశంలో వెస్టిండిస్‌తో టీమిండియా మూడు వన్డేలు, టీ20లు ఆడనుంది. కాగా అహ్మాదాబాద్ వేదికగా జరిగే తొలి వన్డేకు టీమిండియా పరిమిత ఓవర్ల వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ దూరమైన సంగతి తెలిసిందే. అధే విధంగా రెండవ వైస్-కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రాకి కూడా సెలెక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. ఈ క్రమంలో వైస్ కెప్టెన్ ఎవరన్నది ప్రస్తుత చర్చానీయాంశంమైంది. ఈ నేపథ్యంలో తొలి వన్డేకు వికెట్ కీపర్ రిషభ్ పంత్కి వైస్ కెప్టెన్సీ భాధ్యతలు అప్పజెప్పాలని బీసీసీఐ భావిస్తున్నట్లు సమాచారం. కాగా దక్షిణాఫ్రికా పర్యటనకు గాయం కారణంగా దూరమైన రోహిత్ శర్మ.. తిరిగి కెప్టెన్సీ బాధ్యతలు నిర్వర్తించడానికి సిద్దమయ్యాడు. "రెండో వన్డే నుంచి రాహుల్ జట్టులోకి రానున్నాడు. కాబట్టి తొలి వన్డే గురించి మాత్రమే ఆలోచించాలి. ధావన్, పంత్ ఇద్దరూ డిప్యూటీలుగా ఉండగలరు. కానీ రిషబ్కి కెప్టెన్‌గా అనుభవం ఉంది. ఫీల్డ్ ప్లేస్మెంట్ల గురించి కూడా అతడికి బాగా తెలుసు" అని బీసీసీఐ అధికారి ఒకరు పేర్కొన్నారు. వన్డే జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), రుతురాజ్, శిఖర్ ధావన్, కోహ్లి, సూర్యకుమార్, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్, దీపక్ చహర్, శార్దుల్ ఠాకూర్, యుజువేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, రవి బిష్ణోయ్, అవేశ్ ఖాన్, దీపక్ హుడా. చదవండి: Ind Vs WI: చార్టెడ్ ఫ్లైట్ లేదు.. ఆ విమానాల్లో వచ్చేయండి..! ఆ తర్వాత.. India Test Captain: రోహిత్ శర్మపై టీమిండియా మాజీ సెలక్టర్ సంచలన వ్యాఖ్యలు... సిరీస్‌కు ముందు గాయపడే కెప్టెన్ అవసరమా? -
టీ20 కెప్టెన్సీకి విరాట్ కోహ్లి గుడ్‌బై
-
టీమిండియా కెప్టెన్‌గా అతనే సరైనోడు: పనేసర్
టీమిండియా సారథిని మార్చాలని డిమాండ్లు వినిపిస్తున్న తరుణంలో ట్వీ20లకు హిట్‌మ్యాన్ రోహిత్ శర్మను కెప్టెన్ చేయాలని ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ మాంటీ పనేసర్ అభిప్రాయపడ్డాడు. ప్రారంభ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ (డబ్లూటీసీ) ఫైనల్లో కొహ్లీ నేతృత్వంలోని భారత జట్టు ఓడిపోయిన తరువాత పనేసర్ ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా భారత జట్టులో కెప్టెన్సీ మార్పుపై చాలా కాలంగా చర్చ నడుస్తోంది. రోహిత్ ముందుండి నడిపించగలడు చాలా దేశాలు వివిధ ఫార్మాట్లకు వేరువేరు కెప్టెన్లను ఎంపిక చేసుకుని వాళ్ల జట్లను నడిపిస్తుండగా,భారత్,పాకిస్తాన్,న్యూజిలాండ్ దేశాలు మాత్రం అన్ని ఫార్మాట్లలో ఒకే కెప్టెన్‌తో బరిలోకి దిగుతున్నాయి. ప్రస్తుతం విరాట్ ఒత్తిడిలో ఉన్నాడని రాబోవు 2021 ట్వీ20 ప్రపంచ కప్ దృష్ట్యా హిట్‌మ్యాన్‌కు టీమిండియా సారథ్యం బాధ్యతలు అప్పగించాలని పనేసర్ సూచించాడు. అంతేగాక రోహిత్‌కు ఐపీఎల్ లో ముంబై జట్టుకి సారథ్యం వహించి ఎన్నో విజయాలను అందించడమే గాక ఐపీఎల్లో ముంబైని ఫైనల్లో ఐదు సార్లు విజేతగా నిలిపిన ఘనత కూడా ఉందని గుర్తు చేశాడు. పొట్టి ఫార్మట్‌లో తన టీంను సమర్థవంతంగా నడిపించగల అనుభవం తనకుందని అతను ఎప్పుడో నిరూపించుకున్నాడని పనేసర్ వ్యాఖ్యానించాడు. రోహిత్ శర్మ ఆసియా కప్‌తో పాటు నిదాహాస్ ట్రోఫీలో కూడా భారత జట్టును విజయవంతంగా నడిపించాడు. ఇప్పటివరకు, అతను భారత్‌కు 29 సార్లు (10 వన్డేలు, 19 టీ20 ) నాయకత్వం వహించగా, అందులో 23 (8 వన్డేలు, 15 టీ 20 ) విజయాలు ఉన్నాయి. చదవండి: WTC: కివీస్‌కు క్షమాపణలు చెప్పిన ఆసీస్ కెప్టెన్ -
సమరానికి సమయం...
ఇంగ్లండ్ గడ్డపై భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య శుక్రవారం నుంచి జరిగే ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ మ్యాచ్ ఒకవైపు... దీని గురించి సుదీర్ఘ చర్చోపచర్చలు సాగుతుండగా మరోవైపు సౌతాంప్టన్ నుంచి సుమారు వంద కిలోమీటర్ల దూరంలో భారత మహిళల జట్టు ప్రశాంతంగా తమ సన్నాహాలు కొనసాగిస్తోంది. పురుషుల టీమ్‌తో పాటే ప్రయాణించి ఒకేసారి ఇంగ్లండ్ చేరిన మహిళలు డబ్ల్యూటీసీ ఫైనల్‌కంటే రెండు రోజుల ముందుగానే మైదానంలోకి దిగబోతున్నారు. నేటి నుంచి ఆతిథ్య జట్టుతో మిథాలీ బృందం తలపడే ఏకైక టెస్టు మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. నాలుగు రోజుల ఈ పోరు ఎంత హోరాహోరీగా సాగుతుందనేది ఆసక్తికరం. భారత జట్టు తాము ఆడిన గత వరుస మూడు టెస్టుల్లో కూడా గెలిచింది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే నాలుగో విజయంతో ఈ ఘనత సాధించిన తొలి జట్టుగా నిలుస్తుంది. బ్రిస్టల్: ఏడేళ్ల విరామం తర్వాత భారత మహిళల క్రికెట్ జట్టు టెస్టు మ్యాచ్ ఆడబోతోంది. బుధవారం నుంచి జరిగే ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌తో భారత్ తలపడుతుంది. 2014 తర్వాత భారత్ టెస్టులు ఆడనుండటం ఇదే తొలిసారి కాగా... ఈ మధ్య కాలంలో మూడు టెస్టులు ఆడిన ఇంగ్లండ్‌దే కాస్త పైచేయిగా కనిపిస్తోంది. అయితే గత పర్యటనలో ఇంగ్లండ్‌ను వారి సొంతగడ్డపైనే ఓడించిన భారత జట్టును తక్కువగా అంచనా వేయలేం. సీనియర్లపైనే భారం... భారత్ ఈ ఏకైక టెస్టు కోసం 18 మంది సభ్యులతో జట్టును ప్రకటించింది. ఇందులో 8 మందికి మాత్రమే గతంలో టెస్టు ఆడిన అనుభవం ఉండగా... అందరూ ఆడిన మ్యాచ్‌లు కలిపి 30 మాత్రమే. వన్డే, టి20 ఫార్మాట్ రెగ్యులర్ ప్లేయర్లు ఈ ఫార్మాట్లో అదే స్థాయి ఆటను ప్రదర్శించడం అంత సులువు కాదు. పైగా వీరందరూ కనీసం దేశవాళీ క్రికెట్లో కూడా నాలుగు రోజుల మ్యాచ్‌లు ఆడలేదు. ఈ నేపథ్యంలో ఎంతో కొంత సీనియర్లే మ్యాచ్‌లో కీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది. పదేసి టెస్టుల అనుభవం ఉన్న కెప్టెన్ మిథాలీ రాజ్, పేసర్ జులన్ గోస్వామి జట్టును ముందుండి నడిపించాలి. బ్యాటింగ్‌లో మిథాలీ కీలకం కానుంది. ఆమె బలమైన డిఫెన్స్ కూడా వికెట్ల పతనాన్ని అడ్డుకోగలదు. అయితే జులన్ చాలా కాలంగా బౌలింగ్‌లో సుదీర్ఘ స్పెల్‌లు వేయలేదు కాబట్టి ఎలా ఆడుతుందనేది చూడాలి. ఇంగ్లండ్ జట్టు బ్యాటింగ్‌లో హర్మన్ ప్రీత్, స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్ కీలకం కానున్నారు. క్రీజ్‌లో కాస్త ఓపిక ప్రదర్శించి ఎక్కువ సమయం క్రీజ్‌లో గడపగలిగితే వీరిద్దరు పరుగులు రాబట్టగల సమర్థులు. దీప్తి శర్మ ఆల్‌రౌండ్ నైపుణ్యంతో పాటు ఓపెనర్‌గా పూనమ్ రౌత్ కూడా తన వంతు బాధ్యతను నిర్వర్తించాల్సి ఉంది. స్పిన్నర్‌గా పూనమ్ యాదవ్‌కు కూడా తన సత్తా చాటేందుకు ఇది మంచి అవకాశం. పేసర్లలో శిఖా పాండే, అరుంధతి రెడ్డిలలో ఎవరికి తుది జట్టులో చోటు దక్కుతుందనేది చూడాలి. అన్నింటికి మించి అందరి దృష్టి ఉన్న బ్యాటర్ షఫాలీ వర్మ. టి20లు మినహా కనీసం వన్డేల అనుభవం కూడా లేని షఫాలీని టెస్టులోకి ఎంపిక చేసింది ఆమె దూకుడైన ఆట కారణంగానే. షఫాలీ చెలరేగితే భారత్ పైచేయి సాధించగలదు. ఊహించినట్లుగానే ఈ మ్యాచ్‌కు ముందు భారత్‌కు ఆశించినంత ప్రాక్టీస్ లభించలేదు. అయితే పరిమిత వనరులతోనే మెరుగ్గా ఆడగలమని జట్టు ఆత్మవిశ్వాసంతో ఉంది. అనుభవజ్ఞులతో... 15 మంది సభ్యుల ఇంగ్లండ్ టెస్టు జట్టులో 11 మందికి టెస్టులు ఆడిన అనుభవం ఉంది. అందరూ కలిసి 47 టెస్టు మ్యాచ్‌లు ఆడారు. ఇంగ్లండ్ జట్టు ఆడిన గత మూడు టెస్టుల్లో బరిలోకి దిగిన వారంతా దాదాపుగా ప్రస్తుత జట్టులో ఉన్నారు. కెప్టెన్ హీతర్‌నైట్, నటాలీ స్కివర్, ఓపెనర్ బీమాంట్, ఆల్‌రౌండర్ బ్రంట్‌లకు తమకంటూ అంతర్జాతీయ మహిళా క్రికెట్లో ప్రత్యేక గుర్తింపు ఉంది. పేసర్లు ష్రబ్సోల్, కేట్ క్రాస్‌లతో పాటు లెఫ్టార్మ్ స్పిన్నర్ సోఫీ ఎకెల్‌స్టోన్ అత్యంత ప్రభావవంతమైన బౌలర్‌గా పేరు సంపాదించుకుంది. వీరందరికీ ఒంటి చేత్తో మ్యాచ్‌ను శాసించగల సామర్థ్యం ఉంది. సొంత మైదానంలో మ్యాచ్ జరుగుతుండటంతో పాటు ఫిట్నెస్పరంగా కూడా వీరంతా మన జట్టు సభ్యులతో పోలిస్తే చాలా ముందంజలో ఉన్నారు. ఇన్నేళ్ల కెరీర్లో నేను చాలా తక్కువ టెస్టులే ఆడాననేది వాస్తవం. అయితే ఫార్మాట్ ఏదైనా సన్నాహాలు మాత్రం ఒకే తరహాలో ఉం టాయి. మేం అలాగే సిద్ధమయ్యాం. ఈ క్రమం లో అనేక మంది ఇతర క్రికెటర్ల సలహాలు, సూచనలు కూడా తీసుకున్నాం. జట్టులోని జూనియర్ సహచరులకు కూడా టెస్టులు ఎలా ఆడాలనేదాని గురించి మేం చెప్పాం. చాలా మందికి కొత్త కాబట్టి అనవసరపు ఒత్తిడి పెంచుకోవద్దని, స్వేచ్ఛగా ఆడుతూ క్రికెట్‌ను ఆస్వాదించాలని చెప్పాం. మున్ముందు జరిగే ద్వైపాక్షిక సిరీస్‌లలో తప్పనిసరిగా కనీసం ఒక టెస్టు ఉంటే బాగుంటుందనేది నా సూచన. –మిథాలీ రాజ్, భారత కెప్టెన్ కామన్వెల్త్ గేమ్స్‌లో మహిళల క్రికెట్‌కు 10 రోజులు బర్మింగ్హమ్: 2022 కామన్వెల్త్ క్రీడల్లో మహిళల క్రికెట్ పోటీలు జరిగే తేదీల వివరాలను నిర్వాహకులు ప్రకటించారు. టి20 ఫార్మాట్లో జరిగే ఈ మ్యాచ్‌లను జూలై 29 నుంచి ఆగస్టు 7 వరకు నిర్వహిస్తారు. కామన్వెల్త్ క్రీడల్లో మహిళల క్రికెట్‌కు చోటు కల్పించడం ఇదే మొదటిసారి. ఆగస్టు వరకు లీగ్ మ్యాచ్‌లు, ఆగస్టు 6న సెమీఫైనల్ జరగనుండగా...ఆగస్టు 7న ఫైనల్‌తో పాటు మూడో స్థానం కోసం పోరు నిర్వహిస్తారు. కామన్వెల్త్ క్రీడల్లో ఎనిమిది జట్లు బరిలోకి దిగుతున్నాయి. ప్రపంచ ర్యాంకింగ్ ఆధారంగా భారత్, పాకిస్తాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా అర్హత సాధించగా... ఆతిథ్య జట్టు హోదాలో ఇంగ్లండ్ బరిలోకి దిగనుంది. ఒకే వెస్టిండీస్ జట్టుగా కాకుండా వేర్వేరు కరీబియన్ దేశాలు (ట్రినిడాడ్, జమైకా తదితర) పోటీ పడి వాటిలోంచి ఒక టీమ్, 2022 జనవరిలో జరిగే క్వాలిఫయింగ్ టోర్నీ నుంచి మరో జట్టు అర్హత సాధిస్తాయి. -
కోహ్లి లేకపోతే టీమిండియాకు కష్టమే
మెల్బోర్న్: భారత కెప్టెన్ విరాట్ కోహ్లి గైర్హాజరీ ఆ జట్టుపై పెను ప్రభావం చూపిస్తుందని ఆస్ట్రేలియా హెడ్ కోచ్ జస్టిన్ లాంగర్ అన్నాడు. అయితే తండ్రి కాబోతున్న సమయంలో సెలవు తీసుకోవాలనే అతని నిర్ణయాన్ని అందరూ గౌరవించాలని చెప్పాడు. ప్రస్తుత ఆస్ట్రేలియా పర్యటనలో వచ్చే నెలలో ‘బోర్డర్–గావస్కర్’ ట్రోఫీ టెస్టు సిరీస్ మొదలవుతుంది. నాలుగు టెస్టుల పూర్తి స్థాయి సిరీస్‌లో కోహ్లి కేవలం తొలి టెస్టుకు మాత్రమే అందుబాటులో ఉంటున్నాడు. తన భార్య, బాలీవుడ్ నటి అనుష్క శర్మ డెలివరీ కోసం అతను స్వదేశానికి పయనమవుతాడు. ఈ నేపథ్యంలో ఆసీస్ హెడ్‌కోచ్ లాంగర్ మాట్లాడుతూ ‘నా జీవితంలో నేను చూసిన అత్యుత్తమ ఆటగాడు కోహ్లి. ఒక్క బ్యాటింగ్‌లోనే కాదు... శక్తిసామర్థ్యాలు, క్రికెట్ కోసం కష్టపడే తత్వం, ఫిట్నెస్ స్థాయి ఇవన్నీ చూసి చెబుతున్నా. మ్యాచ్‌లో రాణించేందుకు అతను కనబరిచే పట్టుదల అద్భుతం. ప్రతీసారి అతనికి ఇదెలా సాధ్యమవుతుందో నాకు అంతుబట్టడం లేదు. అందుకే కోహ్లి అంటే నాకెంతో గౌరవం. అలాగే ఇప్పుడు కుటుంబం కోసం తను తీసుకున్న నిర్ణయాన్ని కూడా నేను గౌరవిస్తాను’ అని అన్నారు. ఆటగాళ్లు కెరీర్‌తో పాటు కుటుంబానికి సమయమివ్వాలని చెప్పారు. అతను లేకపోవడం భారత జట్టుకు పూడ్చలేని లోటేనని, ఇది జట్టుపై తప్పకుండా ప్రభావం చూపిస్తుందని లాంగర్ వివరించారు. అయితే గత పర్యటన (2018–19)లో ఆసీస్‌ను ఓడించిన భారత్‌ను విరాట్ ఉన్నా లేకపోయినా తక్కువ అంచనా వేయబోమని, టీమిండియా పటిష్టమైన జట్టని విశ్లేషించారు. సుదీర్ఘ పర్యటన కోసం ఇప్పటికే టీమిండియా ఆసీస్‌కు చేరింది. ప్రస్తుతం కరోనా ప్రొటోకాల్ పాటిస్తున్న భారత జట్టు, క్వారంటైన్ పూర్తవగానే నవంబర్ 27న తొలి వన్డే ఆడుతుంది. -
ఈ బెంగ తీరనిది..!
‘విలియమ్సన్ క్యాచ్‌ను పడిక్కల్ పట్టి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేదేమో’... ఎలిమినేటర్ మ్యాచ్‌లో హైదరాబాద్ చేతిలో ఓడిన తర్వాత రాయల్స్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) కెప్టెన్ విరాట్ కోహ్లి వ్యాఖ్య ఇది! ఇదొక్కటి చాలు ఐపీఎల్లో అతని నాయకత్వ వైఫల్యానికి ఉదాహరణగా చూపించేందుకు. బ్యాటింగ్‌లో 131 పరుగులే చేయగలిగిన తమ వైఫల్యాన్ని చెప్పుకోకుండా 17 బంతుల్లో రైజర్స్ 27 పరుగులు చేయాల్సిన స్థితిలో ఎంతో కష్టసాధ్యమైన క్యాచ్‌ను తీవ్రంగా ప్రయతి్నంచిన తర్వాత కూడా ఒక యువ ఆటగాడు అందుకోలేకపోతే పరాజయాల్లో దానిని ఒక కారణంగా చూపించడం కోహ్లి పరిణతిని ప్రశ్నిస్తోంది. గత మూడు సీజన్లలో వరుసగా ఎనిమిది, ఆరు, ఎనిమిది స్థానాల్లో నిలిచిన బెంగళూరు జట్టు ఈసారి కొంత మెరుగ్గా నాలుగో స్థానంతో ముగించింది. అయితే తొలి సీజన్ నుంచి అభిమానులు ఆశిస్తున్న టైటిల్ కోరిక మాత్రం తీరలేదు. ఆటగాడిగా, భారత కెప్టెన్‌గా ఘనమైన రికార్డు ఉన్న కోహ్లి ఐపీఎల్ నాయకత్వంపై కూడా ఈ ప్రదర్శన సందేహాలు రేకెత్తిస్తోంది. –సాక్షి క్రీడా విభాగం ఈసారి ఐపీఎల్లో తాము ఆడిన చివరి నాలుగు లీగ్ మ్యాచ్‌లు, ఎలిమినేటర్ కలిపి వరుసగా ఐదు మ్యాచ్‌లలో బెంగళూరు ఓటమి పాలైంది. ఈ ఐదుసార్లు ముందుగా బ్యాటింగ్ చేసిన జట్టు ఒక్కసారిగా మాత్రమే 160 పరుగులు దాటగలిగింది. ఇలాంటి ప్రదర్శనతో ఐపీఎల్లో గెలుపును కోరుకోవడం అత్యాశే అవుతుంది. 2019 ఐపీఎల్లో ఆర్సీబీ టోర్నీ తొలి ఆరు మ్యాచ్‌లలో ఓటమి పాలైంది. తర్వాత ఐదు మ్యాచ్‌లు గెలిచినా అప్పటికే పరిస్థితి చేయిదాటిపోయి ఆఖరి స్థానంలో నిలిచింది. అయితే 2008 నుంచి ఎదురు చూస్తున్నట్లుగానే ఈసారి కూడా బెంగళూరు అభిమానులు మళ్లీ ఆశలు పెట్టుకున్నారు. ఇప్పుడైనా కోహ్లి ట్రోఫీని అందిస్తాడని నమ్మారు. అందుకు తగినట్లుగా తొలి 10 మ్యాచ్‌లలో 7 గెలవడంతో ఆర్సీబీ సరైన దిశలోనే వెళుతున్నట్లు అనిపించింది. కానీ కథ మళ్లీ మొదటికి వచి్చంది. ఆ తర్వాత ఒక్క గెలుపూ దక్కక... రన్‌రేట్ అదృష్టం కలిసొచ్చి నాలుగో స్థానంతో ప్లే ఆఫ్స్‌కు చేరినా, ఎలిమినేటర్‌లోనే జట్టు ఆట ముగిసింది. ఏబీ మెరుపు ప్రదర్శన... బెంగళూరు తరఫున ఏబీ డివిలియర్స్ ప్రదర్శనే హైలైట్‌గా నిలిచింది. ఏకంగా 158.74 స్ట్రయిక్‌రేట్‌తో అతను 454 పరుగులు సాధించాడు. ఏబీ అర్ధసెంచరీ చేసిన ఐదు మ్యాచ్‌లలో నాలుగు సార్లు జట్టు గెలిచింది. డివిలియర్స్‌కు ఇతరుల నుంచి సహకారం లభించలేదు. తొలి ఐపీఎల్ ఆడిన యువ ఆటగాడు దేవ్‌దత్ పడిక్కల్ జట్టు తరఫున అత్యధికంగా 473 పరుగులు చేయడం మరో చెప్పుకోదగ్గ అంశం. బౌలింగ్‌లో 21 వికెట్లతో చహల్ సత్తా చాటగా, ఆరుకంటే తక్కువ ఎకానమీ నమోదు చేసిన వాషింగ్టన్ సుందర్ కూడా ఆకట్టుకున్నాడు. ఆ్రస్టేలియా కెపె్టన్ ఫించ్ వైఫల్యం (268 పరుగులు–1 అర్ధ సెంచరీ) జట్టును బాగా దెబ్బ తీసింది. గాయంతో మోరిస్ 9 మ్యాచ్‌లకే పరిమితం కావడం కీలక సమయంలో సమస్యగా మారింది. సీనియర్ పేసర్లు స్టెయిన్ (11.40 ఎకానమీ), ఉమేశ్ యాదవ్ (11.85)లు ఘోరంగా విఫలమవ్వగా... కోల్‌కతాతో (3/8) ప్రదర్శన మినహా సిరాజ్ భారీగా పరుగులిచ్చాడు. లోయర్ ఆర్డర్లో ధాటిగా ఆడే ఒక్క బ్యాట్స్‌మన్ కూడా లేకపోవడం జట్టులో పెద్ద లోటుగా కనిపించింది. కోహ్లి అంతంతే... అన్నింటికి మించి కోహ్లి వ్యక్తిగత వైఫల్యం కూడా జట్టును ఇబ్బంది పెట్టింది. కెపె్టన్ మొత్తంగా 466 పరుగులు చేసినా...స్ట్రయిక్‌రేట్ 121.35కే పరిమితమైంది. 2012 సీజన్లో వెటోరి మధ్యలో తప్పుకోవడంతో కెపె్టన్‌గా కోహ్లి బాధ్యతలు స్వీకరించాడు. అప్పటినుంచి ఇప్పటి వరకు అతనే సారథిగా వ్యవహరిస్తున్నాడు. ఎనిమిది పూర్తి సీజన్లలో కూడా కోహ్లి తన జట్టుకు టైటిల్ అందించలేకపోవడం అభిమానులను తీవ్రంగా బాధిస్తోంది. 2016లో రన్నరప్‌గా నిలవడమే అత్యుత్తమ ప్రదర్శన. 125 మ్యాచ్‌లలో కెప్టెన్‌గా వ్యవహరిస్తే గెలిచిన మ్యాచ్లకంటే (55) ఓడిన మ్యాచ్‌ల సంఖ్య (63) ఎక్కువ. ఈ నేపథ్యంలో కోహ్లి ఇంకా కెప్టెన్‌గా కొనసాగుతాడా, ఫ్రాంచైజీ యాజమాన్యం మార్పు కోరుకుంటుందా అనేది చూడాలి. బ్యాటింగ్‌పరంగా తాను నెలకొలి్పన ప్రమాణాలను కోహ్లి అందుకోలేకపోయాడు. అతనివైఫల్యమే జట్టును ముందుకు తీసుకుపోలేకపోయింది. ఇంత కాలం బౌలింగ్ బలహీనంగా ఉండి ఓడిన బెంగళూరు ఇప్పుడు బ్యాటింగ్ బలహీనతతో ఓడింది. –సునీల్ గావస్కర్ 100 శాతం కోహ్లిని కెప్టెన్సీ నుంచి తప్పించాలనేదే నా అభిప్రాయం. ఈ పరాజయాలకు నేనే కారణమని అతనే చెప్పుకోవాలి. ఎనిమిదేళ్లు అంటే చాలా ఎక్కువ సమయం. ఇన్నేళ్లు ఒక్క ట్రోఫీ గెలవకుండా కూడా కెపె్టన్‌గా ఎవరైనా కొనసాగగలరా. కెప్టెన్సీ విషయంలో ధోని (3 టైటిల్స్), రోహిత్ (4 టైటిల్స్)లతో కోహ్లికి అసలు పోలికే లేదు. సరిగ్గా చెప్పాలంటే బెంగళూరుకు ప్లే ఆఫ్స్‌కు వెళ్లే అర్హతే లేదు. ఒక్క డివిలియర్స్ ప్రదర్శనతోనే వారు ముందుకొచ్చారు. – గంభీర్ -
మా ఆట నచ్చడం లేదా...
ముంబై: గత కొంత కాలంగా వివాదాలకు దూరంగా ఉంటున్న భారత కెప్టెన్ విరాట్ కోహ్లి అనూహ్యంగా తన వ్యాఖ్యతో ఇబ్బందికర పరిస్థితిని సృష్టించుకున్నాడు.తనకొత్త యాప్ ప్రమోషన్లో భాగంగా అభిమాని మాటలకు ఘాటుగా సమాధానం ఇచ్చే ప్రయత్నంలో రచ్చకు ఆహ్వానం పలికాడు. కోహ్లితో సంభాషణలో భాగంగా ఒకఅభిమాని ‘నా దృష్టిలో కోహ్లి అంత గొప్ప బ్యాట్స్‌మన్ ఏమీ కాదు. అతని గురించి అనవసరంగా గొప్పగా చెబుతున్నారు. నేను వీరికంటే ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ఆటగాళ్ల బ్యాటింగ్ చూడటానికే ఎక్కువ ఇష్టపడతాను’ అని ఆ అభిమాని అన్నాడు. దీనిపై కోహ్లి గట్టిగానే స్పందించాడు. ‘అలా అయితే నువ్వు భారత్‌లో ఉండటం అనవసరం.ఇక్కడ ఉంటూ పరాయి దేశం వారిని పొగిడేవారు అక్కడికే వెళ్లిపోవచ్చు కదా. నేను నీకు నచ్చకపోయినా పర్వాలేదు కానీ నువ్వు మాత్రంఇక్కడఉండరాదనేది నా అభిప్రాయం. నీ ప్రాధాన్యతలేమిటో ముందుగా తెలుసుకో’ అని బదులిచ్చాడు. ఈ వీడియోపై అన్ని వైపులనుంచి కోహ్లిపై విమర్శలువచ్చాయి. కోహ్లి అధికారిక ట్విట్టర్ ఖాతాలో వచ్చింది కాబట్టి ఇది అనుకోకుండా చేసిన వ్యాఖ్య కాదని, కావాలనే కోహ్లి తన అసహనాన్ని ప్రదర్శించాడనేఅభిప్రాయం అందరిలో వినిపించింది. తన ఆటకు, దేశాభిమానానికి ఎలా ముడిపెడ తాడని, కోహ్లి విదేశీ ఆటగాళ్లను అభిమానించలేదా, విదేశీకంపెనీలకు ప్రచారకర్తగా పని చేయడం లేదా అని సోషల్ నెట్వర్క్ వేదికగా అందరూ భారత కెప్టెన్‌పై విరుచుకు పడ్డారు. విరాట్ వివరణ... ముందుగా ట్రోలింగ్‌ను పట్టించుకోని కోహ్లి చివరకు గురువారం దీనిపై వివరణ ఇచ్చాడు. తాను ఆ ఒక్క వ్యక్తి గురించే మాట్లాడినట్లు అతను ట్వీట్ చేశాడు. ‘నాపై వస్తున్న విమర్శలను పట్టించుకోను. ఈ భారతీయులు అంటూ ఆ వ్యక్తి చేసిన వ్యాఖ్యపైనే నేను స్పందించాను. ఎవరి ఇష్టం వారిదని నేను నమ్ముతాను. పండుగ పూట ఇలాంటి చిన్న విషయాలు పట్టించుకోకుండా సరదాగా గడపండి’ అంటూ వ్యాఖ్యానించాడు. మరో వైపు వచ్చే వన్డే వరల్డ్ కప్‌కు ముందు గాయాలపాలు కాకుండా, సరైన విశ్రాంతితో పూర్తి ఫిట్‌గా ఉండేందుకు ఐపీఎల్ నుంచి భారత పేస్ బౌలర్లను మినహాయించాలని సీఓఏను కోహ్లి కోరినట్లు సమాచారం. అయితే దీనిపై ఫ్రాంచైజీలు అంగీకరించకపోవచ్చని, ఈ ప్రతిపాదన ఆచరణ సాధ్యం కాదని కోహ్లికి సీఓఏ తమ అభిప్రాయం వెల్లడించినట్లు తెలిసింది. ఐపీఎల్ ఫైనల్, వరల్డ్ కప్ తొలి మ్యాచ్‌కు మధ్య 15 రోజుల వ్యవధి ఉందని, ఇంతకంటే ఇంకేం విశ్రాంతి కావాలని మరో బోర్డు అధికారి అభిప్రాయ పడ్డారు. -
ధోని మళ్లీ కెప్టెన్‌గా...
దుబాయ్: దాదాపు రెండేళ్ల క్రితం విశాఖపట్నంలో న్యూజిలాండ్‌తో జరిగిన వన్డేలో మహేంద్ర సింగ్ ధోని ఆఖరిసారిగా భారత్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఆ మ్యాచ్ కెప్టెన్‌గా అతనికి 199వది. ఆ తర్వాత అతను కెప్టెన్సీ నుంచి తప్పుకొని కోహ్లి నేతృత్వంలో, అనంతరం రోహిత్ శర్మ నాయకత్వంలో కూడా కలిపి మరో 42 మ్యాచ్‌లు ఆడాడు. కానీ మంగళవారం అఫ్గానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను అనూహ్యంగా కెప్టెన్‌గా బరిలోకి దిగాల్సి వచ్చింది. రోహిత్ శర్మ ఈ మ్యాచ్ నుంచి విశ్రాంతి తీసుకోవడంతో మళ్లీ ‘మిస్టర్ కూల్’ బాధ్యతలు చేపట్టాడు. తన ప్రమేయం లేకుండానే అతను 200 వన్డేలకు నాయకత్వం వహించిన కెప్టెన్‌గా అరుదైన మైలురాయిని చేరుకోవడం విశేషం. పాంటింగ్ (ఆస్ట్రేలియా–230), ఫ్లెమింగ్ (న్యూజిలాండ్–218) మాత్రమే ఈ ఘనత సాధించారు. ‘కెప్టెన్‌గా నాడు 199 మ్యాచ్‌ల వద్ద ఆగిపోయాను. ఇప్పుడు దానిని 200 చేసేందుకు ఈ మ్యాచ్ అవకాశం ఇచ్చింది. ఏదైనా మనకు రాసి పెట్టి ఉండాలని నేను నమ్ముతాను. ఒకసారి కెప్టెన్సీ వదిలేశాక నా చేతుల్లో ఏమీ లేకపోయింది. మళ్లీ కెప్టెన్ అవుతానని అనుకోలేదు. 200 మ్యాచ్‌లు పూర్తి చేసుకోవడం సంతోషమే కానీ నా దృష్టిలో ఇలాంటి వాటికి పెద్దగా విలువ లేదు’ అని టాస్ అనంతరం ధోని వ్యాఖ్యానించాడు. దీపక్ చహర్@ 223 ఆసియా కప్‌లో మరో భారత పేసర్ అరంగేట్రం చేశాడు. రాజస్తాన్‌కు చెందిన దీపక్ చహర్‌కు తొలిసారి వన్డే ఆడే అవకాశం లభించింది. ఇటీవలే ఇంగ్లండ్‌పై టి20ల్లో అరంగేట్రం చేసిన అతను వన్డేల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన 223వ ఆటగాడు. గత ఏడాది ముస్తాక్ అలీ ట్రోఫీలో అత్యధిక వికెట్లు (19) పడగొట్టడంతో పాటు 2018 ఐపీఎల్లో చెన్నై తరఫున రాణించి చహర్ సెలక్టర్ల దృష్టిలో పడ్డాడు. 2010లో ఆడిన తొలి రంజీ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన (8/10)తో హైదరాబాద్‌ను 21కే ఆలౌట్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ఐదు మార్పులతో: ప్రాధాన్యత లేని మ్యాచ్ కావడంతో భారత్ ఏకంగా ఐదు మార్పులతో బరిలోకి దిగింది. రోహిత్, ధావన్, భువనేశ్వర్, బుమ్రా, చహల్ స్థానాల్లో రాహుల్, మనీశ్ పాండే, సిద్ధార్థ్ కౌల్, ఖలీల్ , దీపక్ జట్టులోకి వచ్చారు. -
నేనెక్కడున్నానో చెప్పుకోండి: భారత కెప్టెన్
దూకుడే మంత్రంగా చెలరేగిపోయే ఆటగాడు విరాట్ కోహ్లీ. ప్రస్తుతం కోహ్లీ టెస్టు కెప్టెన్సీతో పాటు వన్డే, టి-20 ఫార్మాట్లలోనూ సారథ్యం వహించనున్నాడు. వన్డే, టి-20 కెప్టెన్ ధోనీ గతవారం అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ధోనీ వారసుడిగా కోహ్లీ జట్టు సారథ్య బాధ్యతలు స్వీకరించడంతో ఒక్కసారిగా తన పాత రోజులను నెమరు వేసుకుంటున్నాడు. కోచ్ చెప్పే సూచనలు తీక్షణంగా వింటున్న కోహ్లీ కిందే మిగతా ఆటగాళ్లతో కలిసి కూర్చొన్న ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. అంతేనా తానెక్కడున్నాడో చెప్పగలరా అంటూ..తన అభిమానులకు సవాలు కూడా విసిరాడు. పాత రోజులు చాలా మధురమైనవి అంటూ కామెంట్ పెట్టాడు. ఇంతకీ కోహ్లీ ఎక్కడున్నాడో మీరు గుర్తుపట్టారా? అదేనండి ముందు వరుసలో ఎడమవైపు చివరకు కూర్చొన్న యువకుడే మన భారత జట్టు రథసారధి. Good old days. -
ధోనీ మాదిరే కోహ్లీ కూడా..
కోల్‌కతా: అన్ని ఫార్మాట్లకు టీమిండియా కెప్టెన్‌గా విరాట్ కోహ్లీని నియమించడం మంచి నిర్ణయమని మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అన్నాడు. కోహ్లీ కెప్టెన్సీలో జట్టు విజయపథంలో నడుస్తుందని చెప్పాడు. ధోనీ స్థానంలో కెప్టెన్‌గా విరాటే సరైన వ్యక్తని అభిప్రాయపడ్డాడు. ధోనీ మాదిరే కోహ్లీ కూడా సమాన స్థాయిలో జట్టుకు విజయాలు అందిస్తాడని, ఇందులో సందేహం లేదని అన్నాడు. ఇంగ్లండ్‌తో వన్డే, టి-20 సిరీస్‌లకు ఈ రోజు భారత కెప్టెన్‌గా విరాట్‌ను నియమించారు. ఇటీవల ధోనీ కెప్టెన్సీ నుంచి వైదొలిగిన సంగతి తెలిసిందే. కాగా ఆటగాడిగా కొనసాగనున్నాడు. ఇంగ్లండ్‌తో సిరీస్‌కు ధోనీతో పాటు ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్‌ను జట్టులోకి తీసుకున్నారు. యువరాజ్‌ను మళ్లీ జట్టులోకి తీసుకోవడం శుభపరిణామని, అతను రాణిస్తాడనే నమ్మకముందని గంగూలీ చెప్పాడు. -
వన్డే కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ?
ముంబై: టీమిండియా బ్యాటింగ్ సంచలనం విరాట్ కోహ్లీకి పూర్తి స్థాయిలో నాయకత్వ బాధ్యతలు అప్పగించడానికి రంగం సిద్ధమైంది. ప్రస్తుతం టెస్టు కెప్టెన్‌గా ఉన్న కోహ్లీకి వన్డే, టి-20 ఫార్మాట్లలోనూ జట్టు పగ్గాలు అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంగ్లండ్‌తో మూడు వన్డేలు, మూడు టి-20ల సిరీస్‌లకు భారత జట్టును ప్రకటించాల్సి వుంది. విరాట్ కోహ్లీ సారథ్యంలో జట్టును ఎంపిక చేయవచ్చని భావిస్తున్నారు. శుక్రవారం భారత సెలెక్టర్లు జట్టును ఎంపిక చేయనున్నారు. వన్డే, టి-20 కెప్టెన్ ధోనీ బుధవారం రాత్రి అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ధోనీ వారసుడిని ఎంపిక చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మూడు ఫార్మాట్లలో జట్టును నడిపించడానికి కోహ్లీ సిద్ధంగా ఉన్నాడని చీఫ్ సెలెక్టర్ ఎంఎస్కే ప్రసాద్ చెప్పాడు. ఇంగ్లండ్‌తో సిరీస్‌కు ధోనీకి జట్టు స్థానం దక్కనుంది. ఇంగ్లండ్‌తో ఐదో టెస్టులో ట్రిపుల్ సెంచరీ చేసిన కరుణ్ నాయర్‌కు పిలుపు రావచ్చు. కాగా టీమిండియాను గాయాల బెడద వేధిస్తోంది. గాయాల కారణంగా కీలక ఆటగాళ్లు రోహిత్ శర్మ, రహానె జట్టుకు దూరంకానున్నారు. దీంతో ఫామ్‌లో లేని శిఖర్ ధవన్‌ను చాన్స్ రావచ్చు. -
ఆ సమయం వస్తే ధోనీయే తప్పుకుంటాడు
చెన్నై: భారత టి-20, వన్డే జట్ల కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి అపార అనుభవముందని మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ అన్నాడు. జట్టుకు ధోనీ అవసరం ఉన్నంత వరకూ కెప్టెన్‌గా కొనసాగాలని సూచించాడు. కెప్టెన్సీ నుంచి ధోనీని తప్పించి టెస్టు జట్టు సారథి విరాట్ కోహ్లీకి అన్ని ఫార్మాట్లలో పగ్గాలు అప్పగించాలని కొందరు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కపిల్ స్పందించాడు. జట్టును నడిపించే సామర్థ్యం ధోనీకి ఉందని, సమయం వచ్చినపుడు అతనే వీడ్కోలు చెబుతాడని అన్నాడు. ప్రస్తుతం టీమిండియా కెప్టెన్‌గా ధోనీ సమర్థవంతంగా పనిచేస్తున్నాడని, మరి కొంతకాల సారథిగా కొనసాగాలని కపిల్ అభిప్రాయపడ్డాడు. ధోనీతో విరాట్‌ను ఇప్పుడే పోల్చడం సరికాదని అన్నాడు. ఇద్దరి వ్యక్తిగత శైలి భిన్నంగా ఉంటుందని చెప్పాడు. ధోనీ ప్రశాంతంగా ఉంటాడని, కోహ్లీ దూకుడు స్వభావం గల వాడని కపిల్ విశ్లేషించాడు. ధోనీ, కోహ్లీ వేర్వేరు ఫార్మాట్ల జట్లకు సారథ్యం వహిస్తున్నారని, వారిది విభిన్న దృక్పథమని, ఇద్దరిని పోల్చడం కష్టమని కపిల్ అన్నాడు. ప్రతి ఒక్కరికీ సొంత శైలి ఉంటుందని చెప్పాడు. భారత సీమర్లు బౌలింగ్‌లో మెరుగుపడుతున్నారని కపిల్ ప్రశంసించాడు. భారత బౌలర్లు 140 ప్లస్ వేగంతో, లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేస్తున్నారని అన్నాడు. -
'అప్పటికి ధోనీ కెప్టెన్‌గా ఉండకపోవచ్చు'
న్యూఢిల్లీ: అత్యంత విజయవంతమైన భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ. తన సారథ్యంలో జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించాడు. అయితే మూడేళ్లుగా ధోనీ కెప్టెన్సీపై విమర్శలు వస్తున్నాయి. పరిమిత ఓవర్ల క్రికెట్‌పై పూర్తిగా దృష్టిసారించేందుకుగాను 2014లో టెస్టు క్రికెట్‌కు గుడ్ బై చెప్పాడు. అతడి స్థానంలో యువ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీకి జట్టు పగ్గాలు అప్పగించారు. కాగా పరిమిత ఓవర్ల క్రికెట్లోనూ మహీ మునుపటి మాదిరిగా జట్టును విజయపథంలో నడపలేకపోతున్నాడు. ఈ నేపథ్యంలో ధోనీ కెప్టెన్సీపై టీమిండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 2019లో ఇంగ్లండ్‌లో జరిగే వన్డే ప్రపంచ కప్ నాటికి ధోనీ కెప్టెన్‌గా ఉండకపోవచ్చని అన్నాడు. అప్పటివరకు సెలెక్టర్లు అతడినే కెప్టెన్‌గా కొనసాగిస్తే ఆశ్చర్యమేనని చెప్పాడు. వచ్చే ప్రపంచ కప్‌ను దృష్టిలో ఉంచుకుని భారత సెలెక్టర్లు కెప్టెన్సీ విషయంపై సముచిత నిర్ణయం తీసుకోవాలని దాదా కోరాడు. వన్డే జట్టు కెప్టెన్ పదవికి కోహ్లీ పేరును సూచించాడు. 'ధోనీ 9 ఏళ్లుగా కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. అతను అద్భుతమైన కెప్టెన్. అయితే మరో నాలుగేళ్ల వరకు జట్టుకు కెప్టెన్సీ వహించే సామర్థ్యం మహీకి ఉంటుందా? క్రికెట్ నుంచి అతను వైదొలగాలని నేను చెప్పడం లేదు. పరిమిత ఓవర్ల క్రికెట్లో టీమిండియాకు ధోనీ అవసరముంది. అతను క్రికెట్లో కొనసాగాలి. అయితే 2019 వరకు అతను కెప్టెన్‌గా ఉంటాడని నేను భావించడం లేదు. కోహ్లీ నిలకడగా రాణిస్తున్నాడు. టెస్టు కెప్టెన్‌గా అతని రికార్డు బాగుంది. మైదానంలో కోహ్లీ దృక్పథం సూపర్. ఆటలోనే కాదు మానసికంగా కూడా శక్తిమంతంగా కనిపిస్తాడు. కాబట్టి వచ్చే వరల్డ్ కప్‌నకు ఎవరు కెప్టెన్‌గా ఉండాలన్నది సెలెక్టర్లు నిర్ణయించుకోవాలి' అని దాదా అన్నాడు. -
కరాటే కిడ్ టు కెప్టెన్
జూన్ 21న బంగ్లాదేశ్‌తో రెండో వన్డే సందర్భంగా తుది జట్టులో రహానే స్థానం కోల్పోయాడు. సరిగ్గా ఎనిమిది రోజుల తర్వాత ఏకంగా భారత జట్టు కెప్టెన్‌గా మారిపోయాడు. దాదాపు 15 ఏళ్ల తర్వాత ముంబై నుంచి కెప్టెన్సీ దక్కించుకున్న ఆటగాడిగా నిలిచాడు. వివాదాలకు దూరంగా తన పనేదో చేసుకుంటూ వెళ్లే రహానే.. ప్రస్తుతం భారత జట్టులో కీలక ఆటగాడు. కొత్త వ్యక్తులతో అంత త్వరగా కలసిపోలేని రహానే భారత కెప్టెన్‌గా ఎదిగిన క్రమాన్ని పరిశీలిస్తే ఎన్నో ఆసక్తికర విషయాలు తెలుస్తాయి.. బంగ్లాదేశ్‌తో వన్డేలో అజింక్య రహానేను జట్టులోకి తీసుకోకపోవడంతో అతనికి గాయం అయ్యిండొచ్చని అందరూ భావించారు. అయితే కావాలనే తప్పించారనే విషయం తెలియగానే షాకవడం అభిమానుల వంతైంది. అయినా రహానే టాలెంట్ అతణ్ని నిలబెట్టింది. వారం తిరగకముందే భారత వన్డే జట్టు కెప్టెన్‌గా మారాడు. దీంతో సెలక్టర్లు అతనిపై ఉంచిన నమ్మకమేంటో మనకు అర్థమవుతోంది. కోహ్లికి వారసుడిగా రహానేను ఇప్పటినుంచే తయారుచేయాలని భావిస్తున్నారు. ఎవరిని ఒక్క మాట కూడా అనలేని రహానే కెప్టెన్సీకి పూర్తి న్యాయం చేయగలడా అని కొందరు అంటున్నా అవసరమోచ్చినప్పుడు తన అభిప్రాయాలను చెప్పడంలో మోహమాటపడడు అని అతని గురించి తెలిసిన వాళ్లు చెబుతున్నారు. తండ్రి భయం.. రహానే కుటుంబం ముంబై మెట్రోపాలిటన్‌లో ఒక మూలన ఉన్న డొంబ్లివాలీలో నివాసం ఉండేది. చిన్నప్పుడు రహానే ఎవరితోనూ ఎక్కువ మాట్లాడేవాడు కాదు. ఇలా ఉంటే అందరూ ఏడిపిస్తారనే భయంతో రహానే తండ్రి అతణ్ని కరాటే స్కూల్లో చేర్చాడు. 9 ఏళ్ల వయసులో కరాటే నేర్చుకోవడం మొదలుపెట్టిన రహానే.. మెల్లగా రాటుదేలాడు. అతని జీవితంలో అన్ని సవాళ్లకు ఎదురు నిలబడి పోరాడడంలో, దృఢంగా మారడంలో ఆ శిక్షణ ఎంతో ఉపయోగపడింది. కరాటే స్కూల్లో కూడా మృదుస్వభావిగానే ఉన్నా ప్రత్యర్థిపై అటాక్ చేసే విషయంలో మాత్రం ఎలాంటి వెనకడుగు వేసేవాడు కాదు. ప్రస్తుతం బౌలర్లపై విరుచుకుపడుతున్నట్లు. రిజర్వ్‌గా ఉండడం వల్ల చెప్పిన పనిని చాలా ఏకాగ్రతతో చేసేవాడు. కరాటేతో అతడు దృఢంగా తయారవడంతో తన కంటే పెద్ద వారితో క్రికెట్లో పోటీ పడడానికి భయపడేవాడు కాదు. సచిన్, కాంబ్లీలతో ఆడాలని.. తన వీధిలో క్రికెట్ స్టార్‌గా మారిన రహానేను అతని తండ్రి.. డొంబ్లివాలీలోని ఒక క్రికెట్ క్యాంప్‌లో చేర్చాడు. అక్కడి ట్రైనర్ రెండు ఫొటోలని రహానేకు చూపించి వారిని గుర్తించమని అడగగా, వాటిల్లోని వ్యక్తుల పేర్లు చెప్పడమే కాకుండా వారితో ఆడాలని ఉందనే కోరికను బయట పెట్టాడు. ఆ వ్యక్తులు సచిన్, వినోద్ కాంబ్లీ. తర్వాతి కాలంలో భారత జట్టులో సచిన్‌తో కలసి రహానే ఆడాడు. జిల్లా స్థాయిలో తన జట్టుకు నాయకత్వం వహించిన రహానే.. ఒక వన్డే మ్యాచ్‌లో ఏకంగా 300 పరుగులు చేసి అందరి దృష్టిలో పడ్డాడు. తర్వాత ముంబై నగరంలోని కొన్ని క్లబ్‌లకు ప్రాతినిథ్యం వహించాడు. కేవలం క్రికెట్ ఆడటానికి రోజు రెండు గంటలు ప్రయాణం చేసేవాడు. రహానే కోసం అతని కుటుంబం ముంబై నగరానికి దగ్గరగా ఉండే ఏరియాకు మారింది. 2013 తర్వాత అసలు ప్రదర్శన.. 2007లో భారత అండర్-19 జట్టుకు ఎంపికైన రహానే.. న్యూజిలాండ్‌తో సిరీస్‌లో రెండు సెంచరీలు బాదాడు. ముంబై జట్టులో చోటు సంపాదించి అద్భుత ప్రదర్శనతో 2011లోనే భారత వన్డే జట్టులోకి ఎంపికయ్యాడు. అయితే అతి జాగ్రత్తగా ఆడడంతో పరుగులు చేయలేక ఇబ్బందిపడి జట్టులో చోటు కోల్పోయాడు. 2010 వరకు ముంబై ఇండియన్స్ జట్టులో ఉన్నా ఐపీఎల్లో మెరిసింది తక్కువే. అయితే 2012లో రాజస్తాన్ జట్టులో అత్యుత్తమ ప్రదర్శన చేసి అందర్నీ ఆశ్చర్చపరిచాడు. దాంతో మళ్లీ సెలక్టర్ల నుంచి పిలుపు వచ్చింది. ఈ సారి ఇక వెనుదిరగలేదు. టెస్టు, వన్డే, టీ20లనే తేడా లేకుండా అదరగొడుతున్నాడు. కెప్టెన్‌గా అనుభవం తక్కువే.. రహానే రంజీల్లో ముంబై తరఫున ఆడేవాడు. కెప్టెన్‌గా అనుభవం చాలా తక్కువ. ముంబై జట్టుకు ఒక లిస్ట్-ఎ మ్యాచ్, ఒక టీ20 మ్యాచ్‌లకు మాత్రమే సారథిగా వ్యవహరించాడు. అయితే అండర్-19 లెవల్లో 2005-06 కూచ్ బెహార్ టోర్నీలో తన జట్టును విజేతగా నిలిపాడు. ఆ టోర్నీలో ఏకంగా 762 పరుగులు చేసి సెలక్టర్ల దృష్టిలో పడ్డాడు. రహానే సమర్థుడు: సచిన్ వన్డే జట్టుకు కెప్టెన్‌గా ఎంపికైన రహానేను భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పొగడ్తలతో ముంచెత్తాడు. కెప్టెన్ పదవిని సమర్థంగా నిర్వహించగలడని తెలిపా డు. ‘‘అజింక్య కెప్టెన్‌గా ఎంపికైనందుకు ఆనందంగా ఉంది. అతడు నిజాయితీ పరుడు. చాలా కష్టపడతాడు. అతని అంకితభావం చూసి ముగ్ధుడినయ్యాను. రహానే ఎప్పుడూ పూర్తి సామర్థ్యంతో ఆడతాడు. అతనికి నా శుభాకాంక్షలు’’అని అన్నాడు. 2000 లో సచిన్ కెప్టెన్సీ వదులుకున్నాక మళ్లీ భారత జట్టుకు కెప్టెన్ ఎంపికైన ముంబై ఆటగాడు రహానేనే. మరికొన్ని.. రహానే ఓపెనింగ్ పొజిషన్లో ఆడేవాడు. అయితే రోహిత్ శర్మ ఆ స్థానంలో కుదురుకోవడంతో మిడిలార్డర్‌కు మారాడు. ఆటను మెరుగుపరచుకుంటూ గత 18 నెలలుగా భారత జట్టులో అత్యుత్తమ ప్రదర్శన చేసిన ఆటగాడిగా నిలిచాడు. భారీ హిట్టర్ కాకపోయినా టీ20ల్లో కూడా స్టార్‌గా ఎదిగాడు. టైమింగ్ షాట్లతో క్రికెట్ పండితుల ప్రశంసలు అందుకున్నాడు. రహానేకు కుటుంబంతో అనుబంధం ఎక్కువ. ముంబై మెట్రోపాలిటన్‌లోని ములుంద్ ప్రాంతంలో భార్య రాధికతో పాటు చెల్లెలు, తమ్ముడు, తల్లిదండ్రులతో కలసి ఉంటున్నాడు. పార్టీలకు దూరంగా ఉంటాడు. ఖాళీగా ఉన్నప్పుడు స్నేహితులతో కలసి కేఫ్‌లలో టీ పార్టీ చేసుకుంటాడు. సీ ఫుడ్ అంటే చాలా ఇష్టం. బాలీవుడ్ సినిమాలు ఎక్కువగా చూస్తాడు -
మహేంద్ర సింగ్ ధోనీ ' సున్నా' ల రికార్డు!
బ్రిస్బేన్: మహేంద్ర సింగ్ ధోనీ..టీమిండియాకు ఘనమైన విజయాలు అందించిన కెప్టెన్. ఇటు కెప్టెన్ గాను, అటు ఆటగాడిగాను తనదైన ప్రత్యేక శైలితో ఆకట్టుకుంటున్న ధోనీ ఖాతాలో సరికొత్త రికార్డు నమోదైంది. ఇదేదో బ్యాట్ తో పరుగులు చేసి కొత్తగా నమోదు చేసిన రికార్డు కాదు. ధోనీ డకౌట్ల రికార్డు. బ్రిస్బేన్ లో జరిగిన రెండో టెస్టులో డకౌట్ కావడంతో సరికొత్త రికార్డును నమోదు చేశాడు. ఆ టెస్ట్ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ లో ధోనీ డకౌట్ గా వెనుదిరిగిన సంగతి తెలిసిందే. దీంతో ధోనీ ఖాతాలో రికార్డు వచ్చి చేరింది. భారత కెప్టెన్ గా ఎనిమిదిసార్లు డకౌటయిన ఘనతను ధోనీ సొంతం చేసుకున్నాడు.అంతకుముందు ఈ రికార్డు మన్సూర్ అలీఖాన్ పటౌడీ పేరు మీద ఉంది. భారత కెప్టెన్ గా పటౌడీ ఏడు సార్లు సున్నా పరుగులకే వెనుదిరిగాడు.