ధోనీ మాదిరే కోహ్లీ కూడా..
కోల్‌కతా: అన్ని ఫార్మాట్లకు టీమిండియా కెప్టెన్గా విరాట్ కోహ్లీని నియమించడం మంచి నిర్ణయమని మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అన్నాడు. కోహ్లీ కెప్టెన్సీలో జట్టు విజయపథంలో నడుస్తుందని చెప్పాడు. ధోనీ స్థానంలో కెప్టెన్గా విరాటే సరైన వ్యక్తని అభిప్రాయపడ్డాడు. ధోనీ మాదిరే కోహ్లీ కూడా సమాన స్థాయిలో జట్టుకు విజయాలు అందిస్తాడని, ఇందులో సందేహం లేదని అన్నాడు.
ఇంగ్లండ్‌తో వన్డే, టి-20 సిరీస్‌లకు ఈ రోజు భారత కెప్టెన్గా విరాట్ను నియమించారు. ఇటీవల ధోనీ కెప్టెన్సీ నుంచి వైదొలిగిన సంగతి తెలిసిందే. కాగా ఆటగాడిగా కొనసాగనున్నాడు. ఇంగ్లండ్‌తో సిరీస్కు ధోనీతో పాటు ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ను జట్టులోకి తీసుకున్నారు. యువరాజ్ను మళ్లీ జట్టులోకి తీసుకోవడం శుభపరిణామని, అతను రాణిస్తాడనే నమ్మకముందని గంగూలీ చెప్పాడు.