స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో క్లీన్ స్వీప్ అయిన అనంతరం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఓ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. 1969 తర్వాత టెస్ట్ క్రికెట్‌లో ఒకే క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక పరాజయాలు చవిచూసిన భారత కెప్టెన్‌గా అపఖ్యాతిని మూటగట్టుకున్నాడు.
1969లో మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ సారథ్యంలోని భారత జట్టు ఒకే ఏడాది నాలుగు టెస్ట్‌ల్లో ఓటమిపాలైంది. తాజాగా రోహిత్.. మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ చెత్త రికార్డును సమం చేశాడు. రోహిత్ సారథ్యంలోని టీమిండియా.. ఈ ఏడాది ఆరంభంలో ఇంగ్లండ్ చేతిలో ఓటమిపాలైంది. తాజాగా న్యూజిలాండ్ చేతిలో మూడు టెస్ట్‌ల సిరీస్‌లో క్లీన్ స్వీప్‌కు గురైంది.
సొంతగడ్డపై అత్యధిక పరాజయాలు ఎదుర్కొన్న భారత కెప్టెన్లు..
మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ-9
రోహిత్ శర్మ-5
విరాట్ కోహ్లి-3
కాగా, న్యూజిలాండ్‌తో తాజాగా ముగిసిన టెస్ట్ సిరీస్‌లో భారత్ 0-3 తేడాతో ఓటమిపాలైంది. బెంగళూరు వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో 8 వికెట్ల తేడాతో ఓటమిపాలైన భారత్.. పూణేలో జరిగిన రెండో టెస్ట్‌లో 113 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. ముంబై వేదికగా జరిగిన మూడో టెస్ట్‌లో టీమిండియా 25 పరుగుల తేడాతో పరాజయాన్ని ఎదుర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment