Mansoor Ali Khan Pataudi
-
రోహిత్ శర్మ చెత్త రికార్డు
స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో క్లీన్ స్వీప్ అయిన అనంతరం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఓ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. 1969 తర్వాత టెస్ట్ క్రికెట్లో ఒకే క్యాలెండర్ ఇయర్లో అత్యధిక పరాజయాలు చవిచూసిన భారత కెప్టెన్‌గా అపఖ్యాతిని మూటగట్టుకున్నాడు.1969లో మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ సారథ్యంలోని భారత జట్టు ఒకే ఏడాది నాలుగు టెస్ట్‌ల్లో ఓటమిపాలైంది. తాజాగా రోహిత్.. మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ చెత్త రికార్డును సమం చేశాడు. రోహిత్ సారథ్యంలోని టీమిండియా.. ఈ ఏడాది ఆరంభంలో ఇంగ్లండ్ చేతిలో ఓటమిపాలైంది. తాజాగా న్యూజిలాండ్ చేతిలో మూడు టెస్ట్‌ల సిరీస్‌లో క్లీన్ స్వీప్‌కు గురైంది.సొంతగడ్డపై అత్యధిక పరాజయాలు ఎదుర్కొన్న భారత కెప్టెన్లు..మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ-9రోహిత్ శర్మ-5విరాట్ కోహ్లి-3కాగా, న్యూజిలాండ్‌తో తాజాగా ముగిసిన టెస్ట్ సిరీస్‌లో భారత్ 0-3 తేడాతో ఓటమిపాలైంది. బెంగళూరు వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో 8 వికెట్ల తేడాతో ఓటమిపాలైన భారత్.. పూణేలో జరిగిన రెండో టెస్ట్‌లో 113 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. ముంబై వేదికగా జరిగిన మూడో టెస్ట్‌లో టీమిండియా 25 పరుగుల తేడాతో పరాజయాన్ని ఎదుర్కొంది. -
రోజుకు మూడుసార్లు వంటగదిలో పని చేయాలన్నాడు: సీనియర్ నటి
ప్రేమపెళ్లిళ్లు అనేవి బాలీవుడ్లో ఎప్పటినుంచో ఉన్నవే! మనసులు కలిశాక మనుషులు ఒక్కటైన సంఘటనలు కోకొల్లలు. బాలీవుడ్ సీనియర్ జంట షర్మిల ఠాగోర్- మన్సూర్ అలీ ఖాన్ పటౌడీలు కూడా ఇదే కోవలోకి వస్తారు. వీరిద్దరూ ప్రేమ బంధాన్ని 1968లో పెళ్లితో పదిలపర్చుకున్నారు.కిచెన్‌లోకి నోపెళ్లైన కొత్తలో జరిగిన విషయాలను తాజాగా ఓ షోలో గుర్తు చేసుకుంది షర్మిల. 'నా భర్త నన్ను రోజుకు మూడుసార్లు వంటగదికి వెళ్లాలని చెప్పాడు. ఇది చాలా చెడ్డ ఆలోచన.. నేను అన్నిసార్లు కిచెన్‌కు వెళ్లానంటే నీకే కష్టమవుతుందని భర్తకు వార్నింగ్ ఇచ్చాను. ఇదెక్కడుంది? ఆ వస్తువు ఎక్కడుంది? నాకు ఏదీ దొరకడం లేదంటూ నీ వెంటే పడతానని హెచ్చరించాను.అతడే స్వయంగా..దానికంటే నేను వంటగదికి వెళ్లకపోవడమే మేలని చెప్పాను. దీంతో అతడు తన వంట తానే చేసుకోవాల్సి వచ్చింది. నేను తెలివిగా అతడు వంటగదిలోకి వచ్చేలా చేశాను. ఏమాటకామాట కిచెన్‌లో అద్భుతాలు చేసేవాడు. యూట్యూబ్‌లో చూసి కొత్తరకం వంటలు చేసేవాడు. దానివల్ల తను మరింత కాన్ఫిడెంట్‌గా తయారయ్యాడు. అద్భుతంగా వండుతాడుఓసారి నేను లండన్‌లో ఉన్నప్పుడు ఒకరు నాకు కాల్ చేసి నీ భర్త వంట ఎంత సూపర్‌గా చేశాడో.. అని కాంప్లిమెంట్ ఇచ్చారు. నేను కిచెన్‌లోకి వెళ్లకపోవడం వల్లే అతడు అమోఘంగా వంటలు చేయగలిగాడు' అని షర్మిల చెప్పుకొచ్చింది. మన్సూర్ అలీ ఖాన్- షర్మిల ఠాగోర్లకు సైఫ్, సబా, సోహా అలీ ఖాన్ అని ముగ్గురు సంతానం. కాగా క్రికెటర్ మన్సూర్ 2011లోనే కన్నుమూశాడు.చదవండి: భర్తతో విడాకులు ప్రకటించిన తెలుగు నటి.. అర్థం చేసుకోండంటూ.. -
నా సంపాదన.. భర్తతో పంచుకోలే: సీనియర్ హీరోయిన్
షర్మిల ఠాగూర్.. బెంగాలీ, హిందీ చిత్రపరిశ్రమలో అగ్రకథానాయికగా వెలుగొందింది. సినీ ఇండస్ట్రీకి అందించిన సేవలకుగానూ ఫిలింఫేర్ లైఫ్‌టైం అచీవ్మెంట్ అవార్డు పొందింది. 2013లో భారత ప్రభుత్వం పద్మభూషణ్‌తో సత్కరించింది. ఈమె క్రికెటర్ మన్సూర్ అలీ ఖాన్‌ను పెళ్లి చేసుకుంది. వీరికి సైఫ్ అలీ ఖాన్ అనే కుమారుడితో పాటు సబ, సోహ అని ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మన్సూర్ 2011లోనే కాలం చేశాడు. తర్వాత సినిమాలవైపే వెళ్లని షర్మిల గతేడాది గుల్మొహర్ అనే సినిమాతో మళ్లీ కెమెరా ముందుకు వచ్చింది. ముగ్గురికీ సమానంగా వీలునామా.. తాజాగా తన పర్సనల్ ఫైనాన్స్ గురించి ఆసక్తికర విషయాన్ని బయటపెట్టింది. 'నేను కొన్న నగలు, కార్లు, ఇళ్లు.. ఇలా ఏవైనా సరే అవన్నీ నా పేరు మీదే ఉంటాయి. ఆ ఆస్తిని భర్తతో కూడా పంచుకోలేదు. అతడు కూడా తను సంపాదించిన ఆస్తులను తనే మేనేజ్ చేసుకునేవాడు. చనిపోవడానికి ముందే ఏవి ఎవరికి చెందాలనేది వీలునామా రాశాడు. నా ఆస్తులు కూడా నా ముగ్గురు పిల్లలకు సమానంగా పంచుతాను. ఆర్థిక విషయాలపై నాకంత అవగాహన లేకపోయేది. కానీ లాక్డౌన్లో నాకంటూ ఓ పోర్ట్‌ఫోలియో క్రియేట్ చేసుకున్నాను. అప్పటినుంచే దీనిపై ప్రత్యేక దృష్టి సారించాను' అని చెప్పుకొచ్చింది. చదవండి: నెల రోజుల తర్వాత ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు చిత్రం -
మైదానంలో ‘కింగ్’లైనా.. ‘రాణుల’ ప్రేమకు తలవంచిన వాళ్లే!
మన దేశంలో రెండు వినోద ప్రధానాంశాలు.. క్రికెట్- సినిమా. చాలా మంది క్రికెట్‌ను ఓ మతంలా ఆరాధిస్తే.. సినిమాను ప్రేమించే వాళ్లూ కోకొల్లలు. ఈ రెండిటి మధ్య.. ముఖ్యంగా బాలీవుడ్- క్రికెట్ మధ్య విడదీయరాని అనుబంధం ఉందని ఇప్పటికే ఆయా రంగాల సెలబ్రిటీలు పలువురు నిరూపించారు. ప్రేమ పక్షుల్లా విహరిస్తూ పాపరాజీలకు పని కల్పించిన వారు కొందరైతే.. ప్రణయాన్ని వైవాహిక బంధంగా మార్చుకుని పెళ్లిపీటలెక్కిన వారు మరికొందరు. ఆ జాబితాలో తాజాగా క్రికెటర్ కేఎల్ రాహుల్- బీ-టౌన్ సెలబ్రిటి అతియా శెట్టి జంట కూడా చేరిన విషయం తెలిసిందే. మరి ఈ ‘లవ్‌బర్డ్స్’ కంటే ముందు వివాహ బంధంతో ముడిపడి సక్సెస్ అయిన క్రికెట్- బాలీవుడ్ జోడీలు ఎవరంటే! మన్సూర్ అలీ ఖాన్ పటౌడ్- షర్మిలా ఠాగోర్ భారత క్రికెట్లో లెజండరీ ఆటగాడిగా పేరొందిన మన్సూర్ అలీ ఖాన్ పటౌట్ అలియాస్ టైగర్ పటౌడీ. పిన్న వయసులోనే టెస్టు కెప్టెన్‌గా వ్యవహరించిన టైగర్ మనసును గెలుచుకున్న మహరాణి.. షర్మిలా ఠాగోర్. బాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్న ఆమె.. టైగర్‌ను పెళ్లాడి నవాబుల కోడలైంది. ఇరు కుటుంబాల అంగీకారంతో 1968లో వీరి వివాహం జరిగింది. ఈ జంటకు ముగ్గురు సంతానం. కుమారుడు సైఫ్ అలీఖాన్, కుమార్తెలు సోహా, సబా. హర్భజన్ సింగ్- గీతా బస్రా భారత క్రికెట్ చరిత్రలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నాడు భజ్జీ. కెరీర్లో ఎన్నో ఎత్తుపళ్లాలు చూసిన టర్బోనేటర్.. 2011 ప్రపంచకప్ విజయంలో తన వంతు సాయం చేశాడు. తన ఆటతో అభిమానులను ముగ్ధుల్ని చేసిన ఈ ఆఫ్ స్పిన్నర్.. బాలీవుడ్ నటి గీతా బస్రా కొంటెచూపులకు బౌల్డ్ అయ్యాడు. ది ట్రెయిన్, దిల్ దియా హై వంటి సినిమాల్లో నటించిన గీతను 2015లో పంజాబీ సంప్రదాయంలో అంగరంగవైభవంగా పెళ్లాడాడు. వీరికి కుమార్తె హినయ హీర్ ప్లాహా, కుమారుడు జోవన్వీర్ సింగ్ ప్లాహా సంతానం. యువరాజ్ సింగ్- హాజిల్ కీచ్ టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్‌గా ఎన్నో రికార్డులు సృష్టించి కెరీర్లో శిఖరాగ్రాలను చూసిన యువరాజ్ సింగ్- నటి హాజిల్ కీచ్ ప్రేమ ముందు మాత్రం తలవంచాడు. క్యాన్సర్ బాధితుడైన యువీని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన హాజిల్.. 2016లో అతడితో కలిసి పెళ్లి బంధంలో అడుగుపెట్టింది. వీరి ప్రేమకు గుర్తుగా కుమారుడు ఓరియన్ ఉన్నాడు. కాగా సల్మాన్ ఖాన్- కరీనా కపూర్ జంటగా నటించిన బాడీగార్డ్ సినిమాలో హీరోయిన్ స్నేహితురాలిగా హాజిల్ నటించింది. జహీర్ ఖాన్- సాగరికా ఘట్కే టీమిండియా 2011 వన్డే వరల్డ్‌కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన లెఫ్టార్మ్ పేసర్ జహీర్ ఖాన్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. టెస్టు క్రికెట్లో టీమిండియా తరఫున మూడు వందల వికెట్లు తీసిన జాక్.. కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నాడు. అయితే, తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఎక్కువగా బయట ప్రపంచానికి తెలియకుండా జాగ్రత్త పడే జహీర్ ఖాన్.. 2017లో స్వయంగా తనే తన వివాహ ప్రకటన చేశాడు. బాలీవుడ్ నటి సాగరిక ఘట్కేను ప్రేమించి పెళ్లాడనున్నట్లు వెల్లడించాడు. హాకీ నేపథ్యంలో సాగే ‘చక్ దే ఇండియా’ సినిమాలో ప్రీతి పాత్రలో నటించిన అమ్మాయే సాగరిక! విరాట్ కోహ్లి- అనుష్క శర్మ టీమిండియా స్టార్, రన్‌మెషీన్ విరాట్ కోహ్లి- బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ ప్రేమకథ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఓ షాంపూ యాడ్‌లో అనుష్కను చూసిన ఈ పరుగుల వీరుడు తన మనసు పారేసుకున్నాడు. తమ బంధాన్ని బాహాటంగానే ప్రకటించిన విరుష్క జోడీ.. దాదాపు ఎనిమిదేళ్లు ప్రేమించుకున్న తర్వాత 2017 డిసెంబరులో పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. వీరి దాంపత్యానికి గుర్తుగా కుమార్తె వామిక జన్మించింది. హార్దిక్ పాండ్యా- నటాషా స్టాంకోవిక్ టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహించిన హార్దిక్ పాండ్యా.. అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రస్తుతం క్యాష్ రిచ్ లీగ్‌లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా ఉన్నాడు. అరంగేట్ర సీజన్లోనే తమ జట్టును విజేతగా నిలిపి.. భారత జట్టులో పునరాగమనం చేయడంతో పాటుగా భవిష్యత్తు సారథిగా మన్ననలు అందుకుంటున్నాడు. ఇక హార్దిక్ వ్యక్తిగత జీవితం విషయానికొస్తే.. సెర్బియా మోడల్, బీ-టౌన్ నటి నటాషా స్టాంకోవిక్‌తో ప్రేమలో పడిన అతడు.. 2019లో తనతో ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లు వెల్లడించాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు పెళ్లి చేసుకున్న ఈ జంట.. అంతకంటే ముందే కుమారుడు అగస్త్యకు జన్మనివ్వనున్నట్లు ప్రకటించింది. కాగా నటాషా ప్రకాశ్ ఝా దర్శకత్వం వహించిన సత్యాగ్రహ సినిమాతో నటిగా గుర్తింపు పొందింది. కేఎల్ రాహుల్- అతియా శెట్టి టీమిండియా టెస్టు జట్టు వైస్ కెప్టెన్‌గా ఉన్న కర్ణాటక బ్యాటర్ కేఎల్ రాహుల్- బాలీవుడ్ వెటరన్ నటుడు సునిల్ శెట్టి గారాల పట్టి అతియా శెట్టితో చాలా కాలంగా రిలేషన్షిప్లో ఉన్నాడు. 2019లో ప్రేమలో పడ్డ వీళ్లిద్దరు 2021లో తమ బంధం గురించి అందరికీ తెలిసేలా సోషల్ మీడియా వేదికగా ఫొటోలు పంచుకున్నారు. ఇక రాహుల్ బిజీ షెడ్యూల్ కారణంగా వివాహాన్ని వాయిదా వేసుకున్న ఈ జంట.. ఎట్టకేలకు జనవరి 23, 2023లో పెళ్లిపీటలెక్కింది. సునిల్ శెట్టికి చెందిన ఖండాలా ఫామ్‌హౌజ్‌లో వీరి వివాహం అత్యంత సన్నిహితుల నడుమ జరిగింది. ఇదిలా ఉంటే అజాహరుద్దీన్- సంగీత బిజ్లానీ పెళ్లి చేసుకున్నప్పటికీ బంధాన్ని కొనసాగించలేకపోయారు. ఇక రవిశాస్త్రి- అమృతా సింగ్, సౌరవ్ గంగూలీ- నగ్మా, రవిశాస్త్రి- నిమ్రత్ కౌర్ తదితరుల పేర్లు జంటలుగా వినిపించినప్పటికీ వీరి కథ సుఖాంతం కాలేదు. -వెబ్‌డెస్క్ చదవండి: Mohammed Shami: షమీకి ఏడాదికి రూ. 7 కోట్లు! నెలకు 10 లక్షల భరణం ఇవ్వలేరా? కోర్టు కీలక ఆదేశాలు అర్జున్ దగ్గర అన్నీ ఉన్నాయి.. నా దగ్గర నువ్వు ఉన్నావు, చాలు నాన్న: సర్ఫరాజ్ ఖాన్ -
ఆయన క్యాచ్ జారవిడిస్తే.. నాకు తిట్లు పడేవి: నటి
క్రికెటర్లు పెళ్లి చేసుకుని భార్యలతో టోర్నమెంట్లకు వస్తే, వచ్చాక సరిగా ఆడకపోతే ఆ భార్యలను ట్రోల్ చేసే అభిమానులు ఉన్నారు. విరాట్ కోహ్లి విఫలమైనప్పుడల్లా అనుష్క శర్మ ఈ విషయంలో బాగా ఇబ్బంది పడ్డారు. అయితే అనుష్కా మాత్రమే కాదని... తాను కూడా పటౌడి సరిగ్గా ఆడకపోతే తిట్లు తిన్నానని షర్మిలా టాగోర్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ‘పటౌడి గారు మా పెళ్లి సమయానికి ఇంకా ఆడుతున్నారు. ఆయన బరిలో దిగితే బాగా ఆడతారని పేరు. కాని మా పెళ్లయ్యాక ఆయన క్యాచ్ జార విడిచినా, సరిగ్గా బ్యాటింగ్ చేయకపోయినా నాకు తిట్లు పడేవి. అయితే అభిమానుల నుంచి కాదు. మా నాన్న నుంచే. ఆయన కామెంటరీ వింటూ ‘‘అరె... నువ్వతన్ని రాత్రి సరిగ్గా నిద్ర పోనిచ్చావా లేదా’ అని నా మీద కయ్యిమనేవారు’ అని తిట్టేవారు’’ అని నవ్వుతూ గుర్తు చేసుకున్నారు. షర్మిలా టాగోర్, పటౌడీలకు సైఫ్ అలీ కాకుండా ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సోహా అలీ ఖాన్, సాబా అలీ ఖాన్. అయితే వీరెవరికీ ఆమె ఇతర హీరోలతో కలిసి నటించిన సినిమాలు చూడటం ఇష్టం లేదు. చూడరు కూడా. సాబా అలీ ఖాన్ మాత్రం ‘నువ్వు నటించిన చుప్కే చుప్కే మాత్రం నాకు చాలా ఇష్టం’ అంటూ ఉంటుంది. పిల్లలు ముంబైలో ఉంటున్నా షర్మిలా ఢిల్లీలో నివసిస్తుంటారు. చదవండి: ఇక నుంచి మా అమ్మ సలహా తర్వతే సైన్ -
నటితో క్రికెటర్ ఫెయిల్యూర్ లవ్ స్టోరీ
క్రికెట్ స్టేడియంలో ఆ బాట్స్మన్ బ్యాటింగ్ తీరుకి ప్రత్యర్థులు బెంబేలెత్తుతున్నారు.. గ్యాలరీలో ఉన్న స్వదేశీయులు జేజేలు పలుకుతున్నారు. వాళ్లల్లో ఒక హీరోయిన్ అయితే ఆనందంతో కేరింతలు కొడ్తోంది. ఆ ఆనందం ఆ బ్యాట్స్‌మన్‌కి మరింత ఉత్సాహాన్నిస్తోంది. ఫోర్, సిక్సర్ కొట్టినప్పుడల్లా ఆమె వంక చూస్తున్నాడు. అభినందనలను చప్పట్లతో మారుమోగిస్తోంది ఆమె. అతను.. మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ.. బ్యాట్‌తో మెరుపుదాడి చేసి స్టేడియంలో బంతులను పరిగెత్తించే టైగర్.. ఆ హీరోయిన్.. షర్మిలా టాగోర్ .. కాదు. నాజూకు మేని.. అంతే నాజూకైన స్వరం... బ్రిటిష్ యాక్సెంట్ ఇంగ్లిష్ ప్రత్యేకతల సిమీ గరేవాల్. అవును.. షర్మిలాను జీవిత భాగస్వామిగా చేసుకునే కంటే ముందు పటౌడీ శ్వాస, ధ్యాస సిమీనే. ఆ ఫెయిల్యూర్ లవ్ స్టోరీనే ఈ వారం ‘మొహబ్బతే’. టైగర్ పటౌడీ పరిచయం అక్కర్లేని పర్సనాలిటీ. సిమీ అంతే పేమస్ బాలీవుడ్ ప్రేక్షకులకు. ‘సిద్ధార్థ’ సినిమాలో బోల్డ్ అండ్ బ్యూటిఫుల్‌గా కనిపించింది. ‘మేరా నామ్ జోకర్’, ‘చల్తే చల్తే’ వంటి సినిమాలతో మెప్పించింది. జాతీయ అంతర్జాతీయ సెలబ్రెటీలను కూర్చోబెట్టి మాటల్లో పెట్టి వాళ్ల జీవిత కథను (‘రెండవూ విత్ సిమీ గరేవాల్’ అనే టాక్ షోలో) వినిపిస్తూ బ్యూటీ విత్ బ్రెయిన్స్ అనీ నిరూపించుకుంది. పుట్టింది లుధియానా (పంజాబ్)లో, పెరిగింది ఇంగ్లాండ్‌లో. సిమీ సినిమాల్లోకి రావడం తల్లిదండ్రులకు ఇష్టం లేదు. నిరాహార దీక్ష చేసి పెద్దవాళ్ల చేత ‘ఎస్’ చెప్పించుకుంది. సిమీకి శ్వేత వర్ణం అంటే ఇష్టం. ఎక్కువగా ఆ రంగు దుస్తులనే వేసుకుంటుంది తన టాక్ షో అయినా.. సినిమా వేడుక అయినా. అందుకే ఆమెను ‘ది లేడీ ఇన్ వైట్’ అని పిలుస్తారు సినిమా రంగంలోని వాళ్లు. (చదవండి: ఆ హీరో ఇద్దరితో ప్రేమలో పడ్డాడు.. కానీ!) ఫస్ట్ లవ్.. తన పదిహేడేళ్ల వయసులో ఇంగ్లాండ్‌లో వాళ్లింటి పక్కనే ఉంటూండే జమ్నాగర్ మహారాజుతో ప్రేమలో పడింది. అతని వల్లే బయటి ప్రపంచం తెలిసింది అనీ చెప్పింది సిమి ఒక ఇంటర్వ్యూలో. మూడేళ్లు సాగిన ఆ బంధం బ్రేక్ అయింది. సినిమాలతో సివీమ బిజీగా ఉన్న సమయంలో ఒక పార్టీలో పటౌడీ పరిచయం అయ్యాడు. ఆటలు, ఇంగ్లిష్ కల్చర్ అంటే ఆ ఇద్దరికీ ఉన్న ఆసక్తి వాళ్లిద్దర్నీ స్నేహితులుగా మార్చింది. సిమీ ధైర్యం, నొప్పించకుండా ఉండే మాట తీరుకు ఆకర్షితుడై.. ఆమెను ప్రేమించడం మొదలుపెట్టాడు పటౌడీ. నిర్మొహమాటంగా, నిక్కచ్చిగా ఉండే అతని తీరునూ సిమీ ఇష్టపడింది. ఎక్కడ క్రికెట్ మ్యాచ్ ఉన్నా.. ఏ సినిమా వేడుకకైనా జంటగా వచ్చేవాళ్లిద్దరూ. క్రికెట్, సినిమా పరివారానికంతటికీ తెలిసిపోయింది వీళ్లిద్దరూ ప్రేమ పక్షులని. గ్యాలరీలో సిమీ కేరింతల కోసం పిచ్ మీద నుంచి ఆశగా చూసేవాడు పటౌడీ. ఆలంబనగా చేతులు చాచేది సిమీ. అంతే ఆమెను చూస్తూనే వచ్చే బంతిని బౌండరీ దాటించేవాడని చెప్తారు ఈ ఇద్దరి సన్నిహితులు. అందుకే ఆ రెండు రంగాల వాళ్లు వీళ్ల పెళ్లి పత్రిక కోసం ఎదురు చూడసాగారు. పటౌడీ కూడా వాళ్లింట్లో వాళ్లకు సిమీ గురించి చెప్పేసి ఆమెతో పెళ్లి నిశ్చయం చేసుకోవాలనే శుభ ఘడియ కోసం ఆగాడు. ఈలోపు.. ఏదో సందర్భంలో షర్మిలా కలిసింది పటౌడీని. తొలి చూపులోనే ఆమె రూపం అతని మనసులో ముద్ర పడిపోయింది. ఈసారి తాను సందర్భం కల్పించుకొని షర్మిలాను కలిశాడు. పటౌడీని ఇష్టపడింది ఆమె. అతనికీ ఇష్టం ఉంది. కాని ఇంకా సందిగ్ధంలో ఉన్నాడు. జీవితభాగస్వామిగా షర్మిలా చేయే పట్టుకోవాలనే నిశ్చయించుకున్నాడు కాని సిమీతో ఉన్న బంధం అతణ్ణి కన్ఫ్యూజన్లో పెట్టింది. అయినా ఏ కొంచెం సమయం చిక్కినా షర్మిలాతోనే సమయం వెచ్చించసాగాడు. ఆ స్నేహ సంభాషణలతో కన్ఫ్యూజన్ పోయి స్పష్టత వచ్చేసింది. ఒకరోజు సాయంకాలం.. సిమీ వాళ్లింటి కాలింగ్ బెల్ మోగింది. తలుపు తీసింది సిమీ. ఎదురుగా పటౌడీ. ఎప్పటిలా నవ్వుతూ ఆప్యాయంగా ఆహ్వానించింది ఆమె. ఇబ్బందిగానే హాల్లోకి వెళ్లి కూర్చున్నాడు. ‘లెమనేడ్ ఇష్టం కదా మీకు? తీసుకొస్తా’ అంటూ కిచెన్‌లోకి వెళ్లబోతుంటే ‘ఇప్పుడేం వద్దు. నీతో మాట్లాడాలి అంతే’ అన్నాడు పటౌడీ. ‘లెమనేడ్ తాగుతూ కూడా మాట్లాడొచ్చు కదా’ అని నవ్వుతూ వంటింట్లోకి వెళ్లి లెమనేడ్ తెచ్చి పటౌడీ చేతికిచ్చి అతనికి ఎదురుగా కూర్చుంది సిమి. ‘ఇప్పుడు చెప్పండి’ అన్నట్టుగా. చేతిలో ఉన్న గ్లాస్ టీపాయ్ మీద పెడుతూ అన్నాడు పటౌడీ ‘సిమీ.. ఇట్స్ ఓవర్’ అని. కనుబొమలు పైకి స్ట్రెచ్ చేస్తూ చూసింది ఆమె ‘ఏంటీ?’ అన్నట్టుగా. ‘యెస్.. నేను షర్మిలాను ఇష్టపడ్తున్నాను. తననే పెళ్లిచేసుకుంటున్నాను. ఇంక మనమధ్య.. ’ అని ఆగాడు. నవ్వుతూనే నిట్టూర్చుంది సిమీ. ‘ఐయామ్ సారీ సిమీ’ అన్నాడు పటౌడీ ఆమె కళ్లలోకి చూస్తూ. అదే నవ్వు ఆమె పెదవుల మీద. కాని ఆ కళ్లల్లో కనిపించిన నీటి పొర పటౌడీ దృష్టిని తప్పించుకోలేదు. అక్కడ ఎక్కువ సేపు ఉండలేకపోయాడు. ‘బై’ అంటూ లేచాడు. తనూ లేచింది ఎప్పటిలాగే లిఫ్ట్ దాకా పటౌడీని సాగనంపడానికి. వద్దంటూ ఒక్కతీరుగా వారించాడు. అయినా వినకుండా అతని వెంటే వెళ్లింది. లిఫ్ట్ దగ్గర.. పటౌడీ కోసం ఎదురుచూస్తూ నిలబడ్డ షర్మిలా కనిపించింది సిమీకి. ఊహించని దృశ్యానికి షర్మిలా ఇబ్బంది పడింది. ఈ లోపు లిఫ్ట్ వచ్చింది. షర్మిలా, వెనకాలే పటౌడీ.. లిఫ్ట్‌లో వెళ్లిపోయారు. ఒంటరి అయిపోయింది సిమీ. తర్వాత కొన్నాళ్లకు ఢిల్లీకి చెందిన రవి మోహన్ అనే వ్యాపారవేత్తను సిమీ పెళ్లి చేసుకుంది. కాని ఆ పెళ్లి ఎంతో కాలం నిలువలేదు. ఒంటరిగానే జీవనయానం సాగిస్తోంది సిమీ. - ఎస్సార్ -
నాకు బాయ్‌కాట్ కోపం తెప్పించారు: సైఫ్ అలీఖాన్
ముంబై: బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ తండ్రి మన్సూర్ అలీ ఖాన్ పటౌడి. మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ అంటే భారత క్రికెట్లో ఓ వెలుగు వెలిగిన క్రికెటర్. ఆయనకు 'టైగర్ పటౌడి' అనే ముద్దు పేరు కూడా ఉంది. అయితే టైగర్ పటౌడి తన కెరీర్లో ఎక్కువ భాగం ఒక కంటి చూపుతోనే క్రికెట్ ఆడారు. పటౌడి 1961లో ఇంగ్లండ్‌లో కారు ప్రమాదానికి గురికావడంతో ఆయన కుడి కన్ను దెబ్బతింది. అయినా అలాగే క్రికెట్ ఆడి పరుగుల వరద పారించారు. ప్రపంచ క్రికెట్లో ప్రత్యేక ముద్ర వేశారు. అయితే మన్సూర్ అలీఖాన్ పటౌడీ ఒక కన్ను పని చేస్తుందనే విషయం చాలా మందికి తెలియదు. తన తండ్రి టైగర్ పటౌడి కంటి సమస్య గురించి ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ జఫ్రీ బాయ్‌కాట్ చేసిన వ్యాఖ్యల గురించి తాజాగా మాట్లాడిన సైఫ్ అలీఖాన్.. ఆ మాటలు తనకు, తన తండ్రికి కోపం తెప్పించాయని తెలిపారు. (వరల్డ్‌కప్‌లో ఇది స్పెషల్ ఇన్నింగ్స్!) తాజాగా స్పోర్ట్స్ కీడాతో సైఫ్ ముచ్చటిస్తూ.. ‘ ఒకసారి బాయ్‌కాట్ నాతో మాట్లాడుతూ.. మీ నాన్న గారి గురించి విన్నాను. కానీ ఒకే కంటితో టెస్టు క్రికెట్ ఆడటమనేది అసాధ్యం’ అని అన్నాడు. దాంతో నేను మా నాన్న అబద్ధం చెబుతున్నారని, చీటింగ్ చేశారని అనుకుంటున్నారా? అని తిరిగి అడిగితే, అవును.. దాదాపు అలానే అనుకుంటున్నాను అని అన్నారు. దాంతో నాకు విపరీతమైన కోపం వచ్చేసింది’ అని సైఫ్ తెలిపారు. . అదే విషయం మా నాన్నకి చెబితే.. ‘ఆయన కూడా ఆవేశపడ్డారు. రెండు కళ్లతో నాకు బాగా కనపడేది.. ఒక కంటితో కూడా బాగానే కనపడుతోందని నాన్న అన్నారు. ఎవరేమన్నా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మనం ఏంటో అనేక తెలిస్తే చాలు’ అని నాన్న అన్నారని సైఫ్ పేర్కొన్నాడు. మన్సూర్ అలీఖాన్ పటౌడి 1961 నుంచి 1975 వరకు భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించి.. 46 టెస్టులు ఆడగా వాటిలో 40 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా చేశారు. టెస్టుల్లో 34.91 సగటుతో ఆరు సెంచరీలు, 16 అర్ధ సెంచరీలు సాధించారు. పటౌడి సెప్టెంబరు 22, 2011న మరణించారు. భారత్ 1967లో తొలిసారి న్యూజిలాండ్‌లో టెస్టు సిరీస్ గెలిచింది పటౌడీ సారథ్యంలోనే కావడం విశేషం. -
పొలిటికల్ ఎంట్రీపై కరీనా కామెంట్
బాలీవుడ్ బ్యూటీ, పటౌడీల కోడలు కరీనా కపూర్ రాజకీయ అరంగేట్రంపై కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. రానున్న లోక్ సభ ఎన్నికల్లో భోపాల్ నుంచి కరీనాను బరిలో దించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలపై కరీనా స్పందించారు. తన పొలిటికల్ ఎంట్రీపై వస్తున్న వార్తలన్ని అవాస్తమని ప్రకటించారు. తనను ఇంతవరకు ఏ పార్టీ సంప్రదించలేదని, ప్రస్తుతానికి తనకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదని ఆమె తెలిపారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం తన దృష్టంతా సినిమాల మీదే ఉన్నట్టుగా వెల్లడించారు. కరీనా హీరోయిన్గా నటించిన ‘గుడ్‌న్యూస్’ సెప్టెంబర్ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
రాజకీయాల్లోకి కరీనా?
-
లోక్‌సభ బరిలో కరీనా..?
ముంబై : మూడు రాష్ట్రాల ఎన్నికల విజయంతో ఉత్సాహంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ.. మధ్యప్రదేశ్‌లోనూ అధికారాన్ని చేజిక్కించుకునేందుకు గెలుపు వ్యూహాలు రచిస్తోంది. ఈ క్రమంలో రానున్న లోక్‌సభ ఎన్నికల్లో భోపాల్ టికెట్‌ను ప్రముఖ బాలీవుడ్ నటి కరీనా కపూర్‌కు ఇచ్చే యోచనలో ఉన్నట్లు సమాచారం. వివరాలు.. కాంగ్రెస్ నాయకులు గుడ్డు చౌహాన్, ఆనీస్ ఖాన్ ఈ విషయం గురించి పార్టీ అధిష్టానంతో చర్చించినట్లు తెలుస్తోంది. భోపాల్‌లో బీజేపీని ఓడించాలంటే బలమైన అభ్యర్థిని బరిలో దింపాలని.. దానిలో భాగంగా ఇక్కడ నుంచి కరీనాను పోటీ చేయిస్తే బాగుంటుందని భావిస్తున్నట్లు తెలిసింది. ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రమే కాక మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ కొడలు వంటి అంశాలు కరీనా గెలిచేందుకు సహకరిస్తాయని గుడ్డు చౌహన్ విశ్వసిస్తున్నారు. సైఫ్ అలీ ఖాన్ తాత ఒకప్పుడు భోపాల్ నవాబ్‌గా ఉన్నారు. దాంతో ఈ లోక్‌సభ ఎన్నికల్లో కరీనా.. కాంగ్రెస్ తరఫున భోపాల్ నుంచి పోటీ చేస్తే తప్పక గెలుస్తుందని గుడ్డు చౌహాన్ అధిష్టానానికి తెలిపినట్లు సమాచారం. అయితే ఈ విషయం గురించి అధికారిక ప్రకటన వెలువడక ముందే బీజేపీ నాయకులు విమర్శించడం ప్రారంభించారు. బీజేపీని ఎదుర్కోగల బలమైన అభ్యర్థి కాంగ్రెస్‌లో ఎవరూ లేరు. అందుకే సినితారలను నిలబెట్టాలని భావిస్తోంది. స్థానిక నాయకులు ఎవరూ ఆ పార్టీకి కనిపించడం లేదంటూ బీజేపీ విమర్శిస్తోంది. -
నేను హైదరాబాద్‌లో పుట్టలేదు
‘సినిమాలు నాకు ఎన్నో విషయాలు నేర్పాయి. నిజానికి ఎవరికైనా సినిమా జీవితం రావడం ఒక ఉత్తమ గురువు. వ్యక్తిగత జీవితం కూడా పబ్లిక్ అయ్యే పరిస్థితి. అదే సమయంలో ఎక్కడికి వె ళ్లినా గొప్ప గుర్తింపు’ అంటూ సినిమా జీవితంలోని వైరుధ్యాలను వెల్లడించారు సీనియర్ బాలీవుడ్ నటి, పద్మభూషణ్ షర్మిలా ఠాగూర్. బుధవారం నగరంలో యంగ్ ఫిక్కి లేడీస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘సెలబ్రేట్ ఉమెన్హుడ్’ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా షర్మిల సాక్షికి ఇంటర్వ్యూ ఇచ్చారు. హైదరాబాద్ : వికీపీడియాలో చెప్పినట్టుగా నేను 1946లో హైదరాబాద్‌లో పుట్టలేదు. 1944లో కాన్పూర్‌లో పుట్టాను. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ వంశంలో 5వ తరం మహిళను. నన్ను నటిగా జనం గుర్తించడం మొదలుపెట్టాక, వారి హృదయాల్లో స్థానం సంపాదించగలిగాను. అప్పుడే గ్లామర్ గాళ్ అనే ఇమేజ్ నుంచి దూరమవ్వాలనే ఆలోచన.. ఇంకా మంచి పేరు పొందాలనే తపన పెరిగింది. ‘ఈవెనింగ్ ఇన్ ప్యారిస్’ సినిమా పెద్ద హిట్. తర్వాత నేను టైగర్ మన్సూర్ అలీఖాన్ పటౌడీని కలిశాను. ఆ తర్వాత ‘ఆరాధన’ సినిమా రిలీజ్. ‘మౌసమ్’లో తల్లి, కూతురు పాత్రలు చేయడం ఎంజాయ్ చేశాను. ఏ పాత్రలో నటించినా, అది పూర్తి చేసిన వెంటనే అందులో నుంచి బయటకు వచ్చేయడం నా పద్ధతి. పెళ్లి ఓ గొప్ప బాధ్యత.. పెళ్లి, పిల్లల్ని కనడం ద్వారా మనం సొసైటీలో పెద్ద భాగం అవుతాం. మరింత మందితో కలిసి జీవించడం నేర్చుకుంటాం. మన బాధ్యతలూ ఇనుమడిస్తాయి. ఆది నుంచీ మాది ఉమ్మడి కుటుంబం. అందుకే షేరింగ్, కేరింగ్, సర్దుబాటు సహజంగానే వచ్చేసింది. టైగర్, నేను పాత కాలపు కుటుంబాల నుంచి వచ్చాం. మాకు కొన్ని ఆహారపు అలవాట్ల దగ్గర తప్ప పెద్ద వ్యత్యాసాలేవీ రాలేదు. పంచుకోవడాన్ని మరచిపోతున్నాం.. ప్రస్తుత తరం షేరింగ్, కేరింగ్ గురించి మరచిపోతున్నారు. టీవీ ఎదురుగా కూర్చుని భోజనాలే తప్ప కబుర్లతో కలిసి తినడం తగ్గిపోయింది. కలిసి జీవించడమనే కుటుంబ బంధం క్షీణిస్తోంది. మొబైల్, ఇంటర్నెట్ యుగం అన్నింటినీ మార్చేసింది. సినిమా ప్రొఫెషన్.. ఫ్యాషన్ అయింది నేను నటన ప్రారంభించినప్పుడు ఈ ప్రొఫెషన్‌కు అంత ఆదరణ లేదు. అయితే, కాలక్రమంలో యువతులు ఎంచుకుంటున్న టాప్ ప్రొఫెషన్లో ఒకటిగా మారింది. విదేశాలకు వెళితే ఆక్స్ఫర్డ్, స్టాన్ఫోర్డ్ వంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్లో చదువు ఆపేసి మరీ పిల్లలు సినిమాల్లో నటిస్తామంటూ వస్తున్నారు. అయితే ఇది కఠినమైన వృత్తి. యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు కొందరు నన్ను తక్కువగా చూసేవారు. మరికొందరు నా సినిమాలు అందులోని పాత్రల గురించి మాత్రమే మాట్లాడేవారు తప్ప నన్ను నన్నుగా చూసేవారు కాదు. అయితే ఒక మనిషి జీవితాన్ని అతని చదువు మాత్రమే నిర్మిస్తుందనేది వాస్తవం. నాకు 3 డాక్టరేట్స్ ఉన్నా, జీవితమనే విశ్వవిద్యాలయంలో ఇంకా నేర్చుకుంటూనే ఉన్నాను. -
మా మంచి మామగారు..
మాజీ క్రికెటర్ మన్సూర్ అలీ ఖాన్ పటౌడీని అతడి కోడలు, ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ ఖాన్ పొగడ్తలతో ముంచెత్తుతోంది. పటౌడీ జీవిత చరిత్రను సినిమాగా తీసేందుకు అతడి కుమారుడు సైఫ్ అలీఖాన్ ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కరీనా మాట్లాడుతూ సైఫ్ ఆలోచనను మెచ్చుకుంది. ‘నేను మా మామగారితో మూడేళ్లు పాటు ఉన్నా.. చాలా నెమ్మదస్తుడు.. తక్కువగా మాట్లాడేవారు.. సైఫ్ అన్నా, నేనన్నా చాలా ఇష్టపడేవారు..’ అని కరీనా చెప్పింది. ‘అతడు ఏనాడు నామీద అభిమానాన్ని ప్రత్యక్షంగా ప్రదర్శించలేదు. అయితే ఒకసారి నేను పటౌడీ(పట్టణం)లో ఉన్నప్పుడు నా భుజం మీద చెయ్యేసి మాట్లాడారు. అప్పుడు అర్థమైంది నాకు.. అతడి అభిమానం..’ అని చెప్పింది. ఆ అనుభవం నా జీవితాంతం గుర్తుంటుంది..’ అని ఆమె అప్పటి జ్ఞాపకాలను నెమరువేసుకుంది. ‘నన్ను, సైఫ్‌ను చూసి మా మామగారు చాలా గర్వపడేవారు. ఆయన నేను చేసిన ‘ఓంకార’ సినిమా చూశారు. అందులో నా నటనను చూసి చాలా మెచ్చుకున్నారు..’ అని వివరించింది. ‘పటౌడ్ సాబ్ మంచి క్రీడాకారుడు.. అతడి జీవితం ఎందరికో స్ఫూర్తిని కలిగించింది. మరెందరికో ఆయన మార్గదర్శకుడయ్యాడు.. ఆయన నిర్యాణం తర్వాత పలు జాతీయ, అంతర్జాతీయ మీడియాలలో అతడిపై వచ్చిన ఆర్టికల్స్ చదివా.. అతడిని ఎన్నికోట్ల మంది అభిమానిస్తున్నారో తెలిసి ఆశ్చర్యపోయా.. అతడికి కోడలిగా వచ్చినందుకు చాలా గర్వపడుతున్నా..’ అని తెలిపింది.ఇదిలా ఉండగా, సైఫ్ కుమార్తె సారా సినిమాల్లో నటించనున్నదన్న వార్తలపై కరీనా స్పందించింది. ‘సారా న్యూయార్క్‌లో చదువుకుంటోంది. ఇప్పుడిప్పుడే సినిమాల్లోకొచ్చే ఆలోచనలేదు.. అలాంటి ఆలోచన ఉంటే మీకే మొదట తెలియజేస్తాం..’ అంటూ నవ్వేసింది. కాగా, కరీనా ప్రస్తుతం అజయ్ దేవగన్ నటించిన ‘సింగం రిటర్న్స్’ సినిమాలో హీరోయిన్గా కనిపించనుంది. -
ఒంటి కన్ను ‘పులి’
ఒక కన్ను మూసుకుని.. మరో కన్నుతో చుట్టూ పరిసరాలను గమనించండి.. కనీసం ఐదు నిమిషాలు కూడా చూడలేని పరిస్థితి మనది. కానీ ఆ ఒంటి కన్నుతోనే 14 ఏళ్ల పాటు ప్రత్యర్థి జట్ల బౌలర్లు సంధించిన పదునైన బంతులను హెల్మెట్ కూడా ధరించకుండా తుత్తునియలు చేసిన వీరుడొకరున్నాడు. భయమనేది లేకుండా క్రికెట్ మైదానంలో చూపిన ఈ తెగువకు అందరూ అతడిని ముద్దుగా ‘టైగర్’ అని పిలుచుకున్నారు. అతనెవరో కాదు.. భారత క్రికెట్‌కు అత్యంత పిన్న వయస్సులోనే కెప్టెన్‌గా వ్యవహరించిన మన్సూర్ అలీఖాన్ పటౌడీ. - రంగోల నరేందర్ గౌడ్ పటౌడీలది నవాబుల వంశం. తన 11వ పుట్టిన రోజునాడే తండ్రి ఇఫ్తికార్ అలీ ఖాన్ మరణించడంతో భోపాల్, పటౌడీ ప్రాంతాలకు మన్సూర్‌ను నవాబ్‌గా ప్రకటించారు. ఇంగ్లండ్‌లో ఉన్నత విద్యనభ్యసించేందుకు వెళ్లినప్పటి నుంచే జూనియర్ పటౌడీలో క్రికెట్ సత్తా బయటపడింది. వించెస్టర్ కాలేజీలో టాప్ క్రికెటర్‌గా పేరుతెచ్చు కున్నాడు. 1957లో 16 ఏళ్ల వయస్సులో ససెక్స్ తరఫున ఫస్ట్‌క్లాస్ అరంగేట్రం చేశాడు. 1959లో స్కూల్ కెప్టెన్‌గా వ్యవహరించి ఆ సీజన్లో 1068 పరుగులు సాధించి పాత రికార్డులు బద్దలు కొట్టాడు. యూనివర్సిటీ స్థాయిలో ఆక్స్‌ఫర్డ్‌కు ఆడడమే కాకుండా జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన తొలి భారతీయుడయ్యాడు. అప్పటివరకు కెరీర్ జోరుగా సాగుతున్నా.. 1961లో అతడి జీవితంలో విషాదం చోటు చేసుకుంది. కారు ప్రమాదంలో తన కుడి కన్నులో అద్దాలు గుచ్చుకోవడంతో చూపు పోయింది. అటు మిగిలిన కంటితో చూసే దృశ్యాలు కూడా స్పష్టంగా కానరాని పరిస్థితి. ఇక మన్సూర్ క్రికెట్ కెరీర్ ముగిసినట్టే అని అంతా అనుకున్నారు. కానీ తన కెరీర్ ఇంత నిస్సారంగా ముగిసేందుకు వీల్లేదని పటౌడీ నిర్ణయించుకున్నాడు. నెట్స్‌లో తీవ్రంగా సాధన చేయడం ప్రారంభించాడు. ఉన్న ఒక్క కంటితోనే ఆడటమెలాగో నేర్చుకున్నాడు. కుడి కంటికి జరిగిన ప్రమాదాన్ని తనకు అనుకూలంగా మలుచుకున్నాడు. ఎందుకంటే పటౌడీ కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్. ఈ బ్యాట్స్‌మెన్‌కు ఎక్కువగా ఉపయోగపడేది ఎడమ కన్నే. ఈ ప్రమాదం జరిగిన ఆరు నెలల్లోపే పటౌడీ భారత టెస్టు జట్టులో చోటు దక్కించుకున్నాడంటే ఆ 20 ఏళ్ల కుర్రాడి పట్టుదల ఏమిటో స్పష్టమవుతుంది. 1961 డిసెంబర్లో ఇంగ్లండ్‌తో తన తొలి టెస్టును ఆడగా మద్రాస్‌లో జరిగిన మూడో టెస్టులో సెంచరీ సాధించి ఇంగ్లండ్‌పై తొలిసారిగా సిరీస్ విజయం సాధించేలా చేశాడు. ఆ త ర్వాత ఏడాదికి విండీస్ పర్యటనలో ఉన్న జట్టుకు పటౌడీ కెప్టెన్‌గా ఎన్నికయ్యాడు. అప్పటికి అతడి వయస్సు కేవలం 21 ఏళ్ల 77 రోజులు మాత్రమే. ఇంత చిన్న వయస్సులో జట్టు సారథిగా ఎన్నికవ్వడం అప్పటికి ప్రపంచ రికార్డు. ఆ తర్వాత తైబు (జింబాబ్వే) ఈ రికార్డు బ్రేక్ చేసినా భారత్ నుంచి మాత్రం ఇప్పటికీ తనదే రికార్డు. కెరీర్లో ఆడిన 46 టెస్టుల్లో 40 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా ఉన్న పటౌడీ భారత్ నుంచి అత్యంత గొప్ప సారథిగానూ పేరు తెచ్చుకున్నాడు. ఆయన కాలంలోనే విదేశీ గడ్డ (1968, కివీస్)పై భారత్ తొలిసారి టెస్టు సిరీస్‌ను గెలుచుకుంది. 1975లో కెరీర్‌ను ముగించిన తను 2,793 పరుగులు సాధించాడు. ఇందులో ఆరు సెంచరీలుండగా అత్యధిక స్కోరు 203 నాటౌట్. 1968లో విజ్డెన్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్‌గా నిలిచిన పటౌడీ 2011లో లంగ్ ఇన్ఫెక్షన్తో మృతి చెందారు.