మహేంద్ర సింగ్ ధోనీ ' సున్నా' ల రికార్డు! | Mahendra Singh Dhoni Leapfrogs Pataudi in Record of Zeroes as India Captain | Sakshi
Sakshi News home page

మహేంద్ర సింగ్ ధోనీ ' సున్నా' ల రికార్డు!

Published Tue, Dec 23 2014 4:24 PM | Last Updated on Sat, Sep 2 2017 6:38 PM

మహేంద్ర సింగ్ ధోనీ ' సున్నా' ల రికార్డు!

మహేంద్ర సింగ్ ధోనీ ' సున్నా' ల రికార్డు!

బ్రిస్బేన్: మహేంద్ర సింగ్ ధోనీ..టీమిండియాకు ఘనమైన విజయాలు అందించిన కెప్టెన్. ఇటు కెప్టెన్ గాను, అటు ఆటగాడిగాను తనదైన ప్రత్యేక శైలితో ఆకట్టుకుంటున్న ధోనీ ఖాతాలో సరికొత్త రికార్డు  నమోదైంది. ఇదేదో బ్యాట్ తో పరుగులు చేసి కొత్తగా నమోదు చేసిన రికార్డు కాదు. ధోనీ డకౌట్ల రికార్డు. బ్రిస్బేన్ లో జరిగిన రెండో టెస్టులో డకౌట్ కావడంతో సరికొత్త రికార్డును నమోదు చేశాడు. ఆ టెస్ట్ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ లో ధోనీ డకౌట్ గా వెనుదిరిగిన సంగతి తెలిసిందే. దీంతో ధోనీ ఖాతాలో రికార్డు వచ్చి చేరింది.

 

భారత కెప్టెన్ గా ఎనిమిదిసార్లు డకౌటయిన ఘనతను ధోనీ సొంతం చేసుకున్నాడు.అంతకుముందు ఈ రికార్డు మన్సూర్ అలీఖాన్ పటౌడీ పేరు మీద ఉంది.  భారత కెప్టెన్ గా పటౌడీ ఏడు సార్లు సున్నా పరుగులకే వెనుదిరిగాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement