వన్డే కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ?
ముంబై: టీమిండియా బ్యాటింగ్ సంచలనం విరాట్ కోహ్లీకి పూర్తి స్థాయిలో నాయకత్వ బాధ్యతలు అప్పగించడానికి రంగం సిద్ధమైంది. ప్రస్తుతం టెస్టు కెప్టెన్గా ఉన్న కోహ్లీకి వన్డే, టి-20 ఫార్మాట్లలోనూ జట్టు పగ్గాలు అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంగ్లండ్‌తో మూడు వన్డేలు, మూడు టి-20ల సిరీస్‌లకు భారత జట్టును ప్రకటించాల్సి వుంది. విరాట్ కోహ్లీ సారథ్యంలో జట్టును ఎంపిక చేయవచ్చని భావిస్తున్నారు. శుక్రవారం భారత సెలెక్టర్లు జట్టును ఎంపిక చేయనున్నారు.
వన్డే, టి-20 కెప్టెన్ ధోనీ బుధవారం రాత్రి అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ధోనీ వారసుడిని ఎంపిక చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మూడు ఫార్మాట్లలో జట్టును నడిపించడానికి కోహ్లీ సిద్ధంగా ఉన్నాడని చీఫ్ సెలెక్టర్ ఎంఎస్కే ప్రసాద్ చెప్పాడు. ఇంగ్లండ్‌తో సిరీస్‌కు ధోనీకి జట్టు స్థానం దక్కనుంది. ఇంగ్లండ్‌తో ఐదో టెస్టులో ట్రిపుల్ సెంచరీ చేసిన కరుణ్ నాయర్‌కు పిలుపు రావచ్చు. కాగా టీమిండియాను గాయాల బెడద వేధిస్తోంది. గాయాల కారణంగా కీలక ఆటగాళ్లు రోహిత్ శర్మ, రహానె జట్టుకు దూరంకానున్నారు. దీంతో ఫామ్‌లో లేని శిఖర్ ధవన్‌ను చాన్స్ రావచ్చు.