West Indies
-
విధ్వంసం సృష్టించిన విండీస్ బ్యాటర్లు.. సౌతాఫ్రికాకు సిరీస్ పరాభవం
టీ20 వరల్డ్‌కప్ 2024 ప్రారంభానికి ముందు టోర్నీ ఆతిథ్య దేశాల్లో ఒకటైన వెస్టిండీస్‌కు శుభ సూచకమైన విజయం లభించింది. సొంతగడ్డపై సౌతాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్‌ను విండీస్ మరో మ్యాచ్ మిగిలుండగానే కైవసం చేసుకుంది. జమైకా వేదికగా నిన్న (మే 25) జరిగిన రెండో మ్యాచ్‌లో విండీస్ 16 పరుగుల తేడాతో సఫారీలకు చిత్తు చేసి మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0 తేడాతో చేజిక్కించుకుంది.వివరాల్లోకి వెళితే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 207 పరుగుల భారీ స్కోర్ చేయగా.. ఛేదనలో తొలుత పోటీ ఇచ్చి, ఆతర్వాత పట్టువిడిచిన సఫారీలు నిర్ణీత ఓవర్లలో 191 పరుగులకు (7 వికెట్ల నష్టానికి) పరిమితమై లక్ష్యానికి 17 పరుగుల దూరంలో నిలిచిపోయారు.విజృంభించిన విండీస్ బ్యాటర్లు..ఈ మ్యాచ్‌లో బ్యాటర్లు విజృంభించడంతో విండీస్ భారీ స్కోర్ చేసింది. బ్రాండన్ కింగ్ (36), కైల్ మేయర్స్ (32), రోస్టన్ ఛేజ్ (67 నాటౌట్), ఆండ్రీ ఫ్లెచర్ (29), రొమారియో షెపర్డ్ (26) మెరుపు ఇన్నింగ్స్‌లతో సత్తా చాటారు. సౌతాఫ్రికా బౌలర్లలో ఎంగిడి, పీటర్, ఫెహ్లుక్వాయో తలో 2 వికెట్లు పడగొట్టగా.. ఫోర్టుయిన్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.తిప్పేసిన మోటీ..అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సౌతాఫ్రికాకు విండీస్ స్పిన్నర్ గుడకేశ్ మోటీ (4-0-22-3) అడ్డుకట్ట వేశాడు. మోటీ తన స్పిన్ మాయాజాలంతో ప్రొటీస్ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. మోటీతో పాటు రోస్టన్ ఛేజ్ (4-0-26-1), షెపర్డ్ (4-0-23-1) కూడా సత్తా చాటడంతో సౌతాఫ్రికాకు ఓటమి తప్పలేదు. ఆదిలో సౌతాఫ్రికా బ్యాటర్లు డికాక్ (41), రీజా హెండ్రిక్స్ (34) మెరుపు వేగంతో పరుగులు రాబట్టినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. ఆఖర్లో డస్సెన్ (30) సైతం రాణించినా ప్రొటీస్‌కు పరాభవం తప్పలేదు. నామమాత్రమైన మూడో టీ20 భారతకాలమానం ఇవాళ అర్దరాత్రి 12:30 గంటలకు (రేపు) ప్రారంభమవుతుంది. -
డొమినికా టెస్టు: భారత్ తొలి ఇన్నింగ్స్ 421/5 డిక్లేర్డ్
-
'రోహిత్ అద్భుతమైన కెప్టెన్.. ప్రపంచం మొత్తం అతని బ్యాటింగ్ చూస్తోంది'
ఈడెన్ గార్డెన్స్ వేదికగా వెస్టిండీస్‌తో జరగిన తొలి టీ20లో టీమిండియా 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కాగా భారత జట్టును విజయం పథంలో నడిపించిన కెప్టెన్ రోహిత్ శర్మపై సూర్యకూమార్ యాదవ్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ మ్యాచ్‌లో 35 బంతుల్లో 42 పరుగులు సాధించి రోహిత్ భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఓపెనర్‌గా రోహిత్ జట్టుకు అద్భుతమైన అరంభాన్ని ఇచ్చాడని సూర్యకూమార్ కొనియాడాడు. అదే విధంగా ఇలా దూకుడుగా ఆడడం రోహిత్‌కి కొత్త ఏమి కాదు అని అతడు తెలిపాడు. "రోహిత్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రపంచం మొత్తం అతని బ్యాటింగ్ చూస్తోంది. రోహిత్ ఒక అద్భుతమైన ఆటగాడు. ఇన్నాళ్లూ ఎలా దూకుడుగా ఆడాడో, ఈ మ్యాచ్‌లో కూడా అదే విధంగా ఆడాడు. అతడి బ్యాటింగ్‌లో ఎటు వంటి మార్పు కనిపించడం లేదు. రోహిత్ పవర్‌ప్లేలో అద్భుతంగా బ్యాటింగ్ చేస్తాడు. ప్రత్యర్ధి బౌలర్లకు చెమటలు పట్టిస్తాడు. అదే విధంగా అతడికి ఒక సారథిగా జట్టును విజయ పథంలో నడిపించే సత్తా ఉంది" అని విలేకరుల సమావేశంలో సూర్యకూమార్ యాదవ్ పేర్కొన్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో సూర్యకూమార్ యాదవ్ 18 బంతుల్లో 34 పరుగులు చేసి జట్టు విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. కాగా వరుస క్రమంలో కిషన్, కోహ్లి, పంత్ వికెట్లను భారత్ కోల్పోయి నప్పుడు యాదవ్ జట్టును ఆదుకున్నన్నాడు. వెంకటేష్ అయ్యర్‌తో కలిసి ఐదో వికెట్‌కు అజేయంగా 48 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఇక భారత్- విండీస్ మధ్య రెండో టీ20 ఫిబ్రవరి 18న జరగనుంది. చదవండి: IND Vs WI: జోష్ మీదున్న టీమిండియాకు దెబ్బ.. రెండో టి20కి ఆ ఇద్దరు డౌటే! -
Ind Vs Wi- IPL Auction: చాలా ఆశలు పెట్టుకున్నా.. వేలంలో జట్లు నా కోసం పోటీ పడాలి!
Ind Vs Wi ODI Series- IPL 2022 Mega Auction: వెస్టిండీస్ ఆల్‌రౌండర్ ఓడియన్ స్మిత్ త్వరలో జరగనున్న ఐపీఎల్ -2022 మెగా వేలంలో ఏదో ఒక ఫ్రాంఛైజీ తనను కొనుగోలు చేస్తుందని భావిస్తున్నాడు. బెంగళూరు వేదికగా ఫిబ్రవరి 12, 13 తేదీల్లో మెగా వేలాన్ని బీసీసీఐ నిర్వహించనుంది. కాగా వేలంలో రూ. 2కోట్లకు తన పేరును స్మిత్ రిజిస్టర్ చేసుకున్నాడు. అహ్మదాబాద్ వేదికగా భారత్‌తో జరిగిన రెండో వన్డే అనంతరం వర్చువల్ మీడియా ఇంటరాక్షన్‌లో స్మిత్ మాట్లాడుతూ... వేలంలో తొలిసారి పాల్గొనడం చాలా ఉత్సాహంగా ఉందన్నాడు. "నన్ను ఏదో ఒక ఫ్రాంచైజీ కొనుగోలు చేస్తే బాగుంటుంది. నేను ఎక్కువగా వేలంపై ఆశలు పెట్టుకున్నా. నేను ఆండ్రీ రస్సెల్‌ని ఆదర్శంగా తీసుకున్నాను. అతడు బ్యాటింగ్, బౌలింగ్లోను ఒకే రకమైన దూకుడు చూపిస్తాడు. అతడి బ్యాటింగ్ చూసి నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. ఇక అంతర్జాతీయ క్రికెట్లో ఆడడం అంత సులభం కాదు. టీ20ల్లో నాలుగు ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేయాలి. కానీ వన్డేల్లో మాత్రం 10 ఓవర్ల ఓవర్లు బౌలింగ్ చేయాలి, కాబట్టి పూర్తి ఫిట్నెస్తో ఉండాలి" అని స్మిత్ పేర్కొన్నాడు. ఇక భారత్‌తో జరిగిన రెండో వన్డేలో 24 పరుగులు, 2 వికెట్లు పడగొట్టాడు. అదే విధంగా 2016లో అండర్-19 ప్రపంచ కప్ గెలిచిన వెస్టిండీస్ జట్టులో స్మిత్ భాగమై ఉన్నాడు. చదవండి: IPL 2022 Auction: 8 కోట్లు.. అతడు ఇరగదీస్తున్నాడు.. 6 కోట్లు ఖర్చు చేశారు... ఈ ‘హిట్టర్’ మాత్రం.. ‘ముంబై’ తప్పుచేసిందా? -
టీమిండియా వైస్ కెప్టెన్‌గా రిషభ్ పంత్!
స్వదేశంలో వెస్టిండిస్‌తో టీమిండియా మూడు వన్డేలు, టీ20లు ఆడనుంది. కాగా అహ్మాదాబాద్ వేదికగా జరిగే తొలి వన్డేకు టీమిండియా పరిమిత ఓవర్ల వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ దూరమైన సంగతి తెలిసిందే. అధే విధంగా రెండవ వైస్-కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రాకి కూడా సెలెక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. ఈ క్రమంలో వైస్ కెప్టెన్ ఎవరన్నది ప్రస్తుత చర్చానీయాంశంమైంది. ఈ నేపథ్యంలో తొలి వన్డేకు వికెట్ కీపర్ రిషభ్ పంత్కి వైస్ కెప్టెన్సీ భాధ్యతలు అప్పజెప్పాలని బీసీసీఐ భావిస్తున్నట్లు సమాచారం. కాగా దక్షిణాఫ్రికా పర్యటనకు గాయం కారణంగా దూరమైన రోహిత్ శర్మ.. తిరిగి కెప్టెన్సీ బాధ్యతలు నిర్వర్తించడానికి సిద్దమయ్యాడు. "రెండో వన్డే నుంచి రాహుల్ జట్టులోకి రానున్నాడు. కాబట్టి తొలి వన్డే గురించి మాత్రమే ఆలోచించాలి. ధావన్, పంత్ ఇద్దరూ డిప్యూటీలుగా ఉండగలరు. కానీ రిషబ్కి కెప్టెన్‌గా అనుభవం ఉంది. ఫీల్డ్ ప్లేస్మెంట్ల గురించి కూడా అతడికి బాగా తెలుసు" అని బీసీసీఐ అధికారి ఒకరు పేర్కొన్నారు. వన్డే జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), రుతురాజ్, శిఖర్ ధావన్, కోహ్లి, సూర్యకుమార్, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్, దీపక్ చహర్, శార్దుల్ ఠాకూర్, యుజువేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, రవి బిష్ణోయ్, అవేశ్ ఖాన్, దీపక్ హుడా. చదవండి: Ind Vs WI: చార్టెడ్ ఫ్లైట్ లేదు.. ఆ విమానాల్లో వచ్చేయండి..! ఆ తర్వాత.. India Test Captain: రోహిత్ శర్మపై టీమిండియా మాజీ సెలక్టర్ సంచలన వ్యాఖ్యలు... సిరీస్‌కు ముందు గాయపడే కెప్టెన్ అవసరమా? -
ఇంగ్లండ్ కెప్టెన్‌గా మోయిన్ అలీ.. మోర్గాన్ దూరం
వెస్టిండీస్ పర్యటనలో ఉన్న ఇంగ్లండ్ జట్టుకు బిగ్ షాక్ తగిలింది. గాయం కారణంగా ఆ జట్టు కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ మిగితా రెండు టీ20ల నుంచి తప్పుకున్నాడు. ఈ విషయాన్ని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు గురువారం అధికారికంగా ధృవీకరించింది. "తొడ కండరాల గాయం కారణంగా మిగిలిన సిరీస్‌కు మోర్గాన్ దూరం కానున్నాడు" అని ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు పేర్కొంది. ఇక మోర్గాన్ దూరం కావడంతో మోయిన్ అలీ జట్టుకు సారథ్యం వహించనున్నాడు. అదే విధంగా మూడో టీ20 మ్యాచ్‌కు కూడా మోర్గాన్ దూరమైన సంగతి తెలిసిందే. అతడి స్ధానంలో అలీ కెప్టెన్సీ బాధ్యతలు నిర్వర్తించాడు. కాగా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో విండీస్ 2-1 తేడాతో ఆధిక్యంలో ఉంది. తొలి మ్యాచ్‌లో ఘోర పరజాయం చెందిన ఇంగ్లండ్.. రెండో టీ20లో అనూహ్యంగా 1 పరుగు తేడాతో విజయం సాధించింది. ఇక మూడో టీ20లో ఇంగ్లండ్ ఓటమి చెందింది. కగా ఆడిన రెండు మ్యాచ్‌ల్లో మోర్గాన్ అంతగా రాణించలేకపోయాడు. కేవలం 30 పరుగులు మాత్రమే సాధించాడు. చదవండి: తెర మీదే అయినా... తగ్గేదే లే! -
హైదరాబాదీ ఆల్‌రౌండర్‌కి బంపర్ ఆఫర్.. భారత జట్టులో చోటు!
హైదరాబాదీ ఆల్‌రౌండర్ రిషిత్ రెడ్డికి బంఫర్ ఆఫర్ తగిలింది. వెస్టిండీస్‌లో జరుగుతున్న అండర్-19 ప్రపంచ కప్‌కు రిజర్వ్ ప్లేయర్‌గా రిషిత్ రెడ్డిను బీసీసీఐ ఎంపిక చేసింది. రిషిత్ రెడ్డితో పాటు ఉదయ్ సహారన్, అభిషేక్ పోరెల్, రిషిత్ రెడ్డి, అన్ష్ గోసాయి, పుష్పేంద్ర సింగ్ రాథోడ్‌ను వెస్టిండీస్‌కు బీసీసీఐ పంపనుంది. కాగా భారత శిబిరంలో ఆరుగురు ఆటగాళ్లు కోవిడ్ బారిన పడిన సంగతి తెలిసిందే. భారత కెప్టెన్ యశ్ ధుల్, వైస్ కెప్టెన్ షేక్ రషీద్‌తో పాటు మరో నలుగురు ఆటగాళ్లు కరోనా బారిన పడ్డారు. దీంతో ఐర్లాండ్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌కు దూరమయ్యారు. అంతేకాకుండా శనివారం ఉగాండతో జరిగే చివరి లీగ్ మ్యాచ్‌కు వీరు దూరం కానున్నారు. కాగా రిజర్వ్ ఆటగాళ్లు విండీస్‌కు చేరుకున్నాక.. అక్కడ 6 రోజులు పాటు క్వారంటైన్లో ఉండునున్నారు. అనంతరం క్వార్టర్ ఫైనల్ సమయానికి జట్టులో చేరునున్నారు. -
పాకిస్తాన్‌తో తొలి మ్యాచ్.. భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ
వెస్టిండీస్ వేదికగా జరగనున్న మహిళల వన్డే ప్రపంచకప్-2022కు 16 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ గురువారం ప్రకటించింది. ఈ జట్టుకు మిథాలీ రాజ్ నాయకత్వం వహించనుంది. హర్మన్‌ప్రీత్ కౌర్ వైస్ కెప్టెన్‌గా ఎంపిక కాగా, తానియా భాటియా, రిచా ఘోష్ వికెట్ కీపర్ల లిస్ట్‌లో ఉన్నారు. ఇక ఈ మెగా టోర్నమెంట్ మార్చి 4న బే ఓవల్ వేదికగా ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో వెస్టిండీస్ తలపడనుంది. ఇక మార్చి 4న భారత్ తన తొలి మ్యాచ్‌లో దాయాది దేశం పాకిస్తాన్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. కాగా భారత్ ఈసారి టైటిల్ బరిలో హాట్ ఫేవరేట్ దిగనుంది. భారత జట్టు: మిథాలీ రాజ్ (కెప్టెన్), హర్మన్‌ప్రీత్ కౌర్ (వైస్ కెప్టెన్), స్మృతి మంధాన , షఫాలి వర్మ, యాస్తిక, దీప్తి, రిచా ఘోష్ (వికెట్ కీపర్), స్నేహ రాణా, ఝులన్, పూజ, మేఘనా సింగ్, రేణుకా సింగ్ ఠాకూర్, తానియా (వికెట్ కీపర్), రాజేశ్వరి గైక్వాడ్, పూనమ్ యాదవ్ స్టాండ్‌బై: ఎస్. మేఘన, ఏక్తా బిష్త్, సిమ్రాన్ దిల్ బహదూర్ చదవండి: SA Vs IND: ఎవరీ అల్లావుద్దీన్ పాలేకర్.. భారత్‌తో ఏంటి సంబంధం ? #TeamIndia squad for ICC Women's World Cup 2022 & New Zealand ODIs: Mithali Raj (C), Harmanpreet Kaur (VC), Smriti, Shafali, Yastika, Deepti, Richa Ghosh (WK), Sneh Rana, Jhulan, Pooja, Meghna Singh, Renuka Singh Thakur, Taniya (WK), Rajeshwari, Poonam. #CWC22 #NZvIND pic.twitter.com/UvvDuAp4Jg — BCCI Women (@BCCIWomen) January 6, 2022 -
ఆ ముగ్గురు వికెట్లు పడగొట్టడమే నా డ్రీమ్ హ్యాట్రిక్...
వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ షెల్డన్ కాట్రెల్ వికెట్ తీసిన ప్రతీసారి తనదైన సెలబ్రేషన్‌తో అభిమానులను అకట్టుకుంటాడు. ఇక పాకిస్తాన్ పర్యటనకు వచ్చిన కాట్రెల్.. కరోనా బారిన పడడంతో ఒక్క మ్యాచ్‌కూడా ఆడకుండా వెనుదిరిగాడు. ఈ క్రమంలో కాట్రెల్ ఓ స్పోర్ట్స్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. తన డ్రీమ్ హ్యాట్రిక్‌లో భాగం కావాలనుకుంటున్న ముగ్గురు బ్యాటర్ల గురించి అడిగినప్పుడు, కాట్రెల్ దానికి బదులుగా... “క్రిస్ గేల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి. మూడో వికెట్‌గా కోహ్లి వికెట్ సాధించడం నిజమైన డ్రీమ్ హ్యాట్రిక్ లాంటిది"అని తెలిపాడు. కాగా ఇటీవల జరిగిన అబుదాబి టీ10లీగ్‌లో టీమ్ అబుదాబి జట్టు తరుపున ఆడాడు. ఇక పాకిస్తాన్ పర్యటనకు వచ్చిన వెస్టిండీస్ జట్టు ఘోర పరాభావం మూటకట్టుకుంది. అతిథ్య పాకిస్తాన్ 3-0 తేడాతో సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. మరో వైపు వెస్టిండీస్ జట్టులో పలువురు ఆటగాళ్లు కరోనా బారిన పడడంతో వన్డే సిరీస్ వాయిదా పడింది. చదవండి: Mohammad Rizwan: ఇంగ్లండ్‌లో ఆడనున్న పాక్ స్టార్ క్రికెటర్.. -
AUS Vs WI: చెలరేగిన వార్నర్, మార్ష్.. విండీస్‌పై ఆసీస్ ఘన విజయం
చెలరేగిన వార్నర్, మార్ష్.. విండీస్‌పై ఆసీస్ ఘన విజయం సమయం 18:55.. విండీస్ నిర్ధేశించిన 158 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆసీస్ బ్యాటర్లు డేవిడ్ వార్నర్(56 బంతుల్లో 89 నాటౌట్; 9 ఫోర్లు, 4 సిక్సర్లు), మిచెల్ మార్ష్(32 బంతుల్లో 53; 5 ఫోర్లు, సిక్సర్లు) చెలరేగి ఆడారు. ఫలితంగా ఆసీస్ 16.2 ఓవర్లలో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించి 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో ఆసీస్ రన్‌రేట్‌ను మరింత మెరుగుపర్చుకుని సెమీస్ బెర్తును దాదాపు ఖరారు చేసుకుంది. విండీస్ బౌలర్లలో అకీల్ హొసేన్, క్రిస్ గేల్ తలో వికెట్ పడగొట్టారు. అంతకుముందు ఆసీస్ పేసర్ జోష్ హేజిల్‌వుడ్(4/39) రాణించడంతో విండీస్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. పోలార్డ్(31 బంతుల్లో 44; 4 ఫోర్లు, సిక్స్), ఎవిన్ లూయిస్(26 బంతుల్లో 29; 5 ఫోర్లు), హెట్‌మైర్(28 బంతుల్లో 27; 2 ఫోర్లు) ఓ మోస్తరుగా రాణించారు. ఆసీస్ బౌలర్లలో హేజిల్‌వుడ్‌కు జంపా(1/20), స్టార్క్(1/33), కమిన్స్(1/37) సహకరించారు. వార్నర్ దూకుడు.. ఆస్ట్రేలియా 122/1 సమయం: 18:38.. ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ దూకుడు కనబరుస్తున్నాడు. అతనికి తోడుగా ఉన్న మిచెల్ మార్ష్ కూడా బ్యాట్ ఝలిపిస్తుండడంతో ఆసీస్ లక్ష్యంత వైపు వేగంగా అడుగులు వేస్తుంది. 158 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 13 ఓవర్లలో వికెట్ నష్టానికి 122 పరుగులు చేసింది. వార్నర్ 68, మిచెల్ మార్ష్ 47 పరుగులతో ఆడుతున్నారు. టార్గెట్ 158.. తొలి వికెట్ కోల్పోయిన ఆసీస్ సమయం 17:44.. 158 పరుగుల లక్ష్య ఛేదనలో ఆసీస్ తొలి వికెట్ కోల్పోయింది. 3.3వ ఓవర్లో ఆకీల్ హొసేన్ బౌలింగ్ ఆరోన్ ఫించ్(11 బంతుల్లో 9; ఫోర్) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఫలితంగా ఆసీస్ 33 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. క్రీజ్‌లో వార్నర్(11 బంతుల్లో 23; 3 ఫోర్లు, సిక్స్), మిచెల్ మార్ష్ ఉన్నారు. చెలరేగిన హేజిల్‌వుడ్.. ఓ మోస్తరు స్కోర్‌కే పరిమితమైన విండీస్ సమయం 17:15.. ఆసీస్ పేసర్ జోష్ హేజిల్‌వుడ్(4/39) రాణించడంతో విండీస్ ఓ మోస్తరు స్కోర్‌కే పరిమితమైంది. నిర్ణీత ఓవర్లు ముగిసే సరికి 7 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. ఆఖరి రెండు బంతులను రసెల్(7 బంతుల్లో 18; ఫోర్, సిక్సర్లు) భారీ సిక్సర్లుగా మలచడంతో విండీస్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. విండీస్ ఇన్నింగ్స్‌లో పోలార్డ్(31 బంతుల్లో 44; 4 ఫోర్లు, సిక్స్), ఎవిన్ లూయిస్(26 బంతుల్లో 29; 5 ఫోర్లు), హెట్‌మైర్(28 బంతుల్లో 27; 2 ఫోర్లు) ఓ మోస్తరుగా రాణించారు. ఆసీస్ బౌలర్లలో హేజిల్‌వుడ్‌కు జంపా(1/20), స్టార్క్(1/33), కమిన్స్(1/37) సహకరించారు. ఐదో వికెట్ కోల్పోయిన విండీస్.. హెట్‌మైర్(27) ఔట్ సమయం 16:37.. ఆసీస్ బౌలర్ల ధాటికి విండీస్ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోతుంది. హేజిల్‌వుడ్ వేసిన 13వ ఓవర్లో మాథ్యూ వేడ్‌కు క్యాచ్ ఇచ్చి హెట్‌మైర్(28 బంతుల్లో 27; 2 ఫోర్లు) ఔటయ్యాడు. దీంతో విండీస్ 91 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. క్రీజ్‌లో పోలార్డ్(9), బ్రేవో(1) ఉన్నారు. నాలుగో వికెట్ కోల్పోయిన విండీస్.. ఎవిన్ లూయిస్(29) ఔట్ సమయం 16:18.. విండీస్ హార్డ్ హిట్టర్ ఎవిన్ లూయిస్(26 బంతుల్లో 29; 5 ఫోర్లు)ను ఆడమ్ జంపా బోల్తా కొట్టించాడు. స్టీవ్ స్మిత్ అద్భుతమైన డైవింగ్ క్యాచ్ అందుకోవడంతో లూయిస్ పెవిలియన్ బాట పట్టాడు. 10 ఓవర్ల తర్వాత విండీస్ స్కోర్ 74/4. క్రీజ్‌లో హెట్‌మైర్(19), పోలార్డ్(1) ఉన్నారు. ఆసీస్ బౌలర్ల ధాటికి బెంబేలెత్తిపోతున్న విండీస్ బ్యాటర్లు సమయం 15:52.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన విండీస్‌కు ఆసీస్ బౌలర్లు చుక్కలు చూపిస్తున్నారు. వరుస పెట్టి వికెట్లు తీస్తూ విండీస్ బ్యాటర్లను బెంబేలెత్తిస్తున్నారు. 3వ ఓవర్ రెండో బంతికి కమిన్స్ బౌలింగ్‌లో క్రిస్ గేల్(9 బంతుల్లో 15; 2 సిక్సర్లు) క్లీన్ బౌల్డ్ కాగా.. ఆ మరుసటి ఓవర్ తొలి బంతికి పూరన్(4), మూడో బంతికి రోస్టన్ ఛేజ్(0)లను హేజిల్‌వుడ్ పెవిలియన్‌కు పంపాడు. దీంతో విండీస్ 35 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకుంది. 4 ఓవర్ల తర్వాత విండీస్ స్కోర్ 37/3. క్రీజ్‌లో ఎవిన్ లూయిస్(14), హెట్‌మైర్(1) ఉన్నారు. అబుదాబి: టీ20 ప్రపంచకప్ 2021 సూపర్ 12 గ్రూప్-1లో భాగంగా శనివారం(నవంబర్ 6) మధ్యాహ్నం 3:30 గంటలకు షెడ్యూలైన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా, వెస్టిండీస్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మెగా టోర్నీలో ఆస్ట్రేలియా ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్‌ల్లో 3 విజయాలు, ఓ పరాజయంతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతుండగా.. వెస్టిండీస్ నాలుగు మ్యాచ్‌ల్లో ఒక్క విజయం, 3 పరాజయాలతో సెమీస్ రేస్ నుంచి నిష్క్రమించింది. ఇక పొట్టి ఫార్మాట్లో ఇరు జట్ల మధ్య ముఖాముఖి పోరు విషయానికొస్తే.. రెండు జట్ల మధ్య మొత్తం 16 మ్యాచ్‌లు జరగ్గా.. ఆసీస్ 6, వెస్టిండీస్ 10 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించాయి. ప్రపంచకప్ టోర్నీల్లో రెండు జట్ల మధ్య 5 మ్యాచ్‌లు జరగ్గా ఆసీస్ 2, వెస్టిండీస్ 3 మ్యాచ్‌ల్లో గెలుపొందాయి. తుది జట్లు: ఆస్ట్రేలియా: డేవిడ్ వార్నర్, ఆరోన్ ఫించ్ (కెప్టెన్), గ్లెన్ మాక్స్వెల్, స్టీవెన్ స్మిత్, మార్కస్ స్టోయినిస్, మాథ్యూ వేడ్ (వికెట్ కీపర్), పాట్ కమిన్స్, మిచెల్ మార్ష్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హేజిల్‌వుడ్ వెస్టిండీస్: క్రిస్ గేల్, ఎవిన్ లూయిస్, రోస్టన్ చేజ్, షిమ్రాన్ హెట్‌మైర్, కీరన్ పొలార్డ్(కెప్టెన్), ఆండ్రీ రస్సెల్, నికోలస్ పూరన్(వికెట్ కీపర్), డ్వేన్ బ్రావో, జాసన్ హోల్డర్, అకీల్ హొసేన్, హేడెన్ వాల్ష్ -
T20 World Cup 2021: అకేల్ హోసిన్ సింగిల్ హ్యాండ్ క్యాచ్.. వీడియో వైరల్
Akeal Hosein Takes Sensational One Handed Catch: టి20 ప్రపంచ కప్ 2021లో ఇంగ్లండ్ చేతిలో వెస్టిండీస్ చిత్తుగా ఓటమి చెందినప్పటికీ .. ఆ జట్టు స్పిన్నర్ అకేల్ హోసిన్ అద్భుతమైన క్యాచ్‌తో ఆభిమానులను ఆశ్చర్య పరిచాడు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో 6 ఓవర్ వేయడానికి వచ్చిన అకేల్ హోసిన్ బౌలింగ్‌లో లివింగ్‌స్టోన్ బౌలర్ దిశగా భారీ షాట్‌కు ప్రయత్నించాడు. అయితే అకేల్ హోసిన్ వేగంగా లాంగ్ డ్రైవ్ చేస్తూ సింగిల్ హ్యాండ్‌తో స్టన్నింగ్ క్యాచ్‌ను అందుకున్నాడు. అయితే ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియోను ఐసీసీ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. హోసిన్ స్టన్నింగ్ క్యాచ్‌కు నెటిజన్లు ఫిధా అవుతున్నారు. కాగా ఈ మ్యాచ్‌లో రెండు వికెట్లు పడగొట్టిన అకేల్ హోసిన్.. రెండు కూడా కాట్ అండ్ బౌల్డ్ కావడం విశేషం. ఇక మ్యాచ్ విషయానకి వస్తే.. వెస్టిండీస్‌పై 6వికెట్ల తేడాతో ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ కేవలం 55 పరుగులకే ఆలౌటై ఘోర పరాభవాన్ని మూట కట్టుకుంది. చదవండి: T20 World Cup 2021 Ind vs Pak: ఆ ముగ్గురి పేరు మీదే ఎక్కువ బెట్టింగ్‌లు! View this post on Instagram A post shared by ICC (@icc) -
వెస్టిండీస్ జట్టుకు బిగ్ షాక్.. స్టార్ ఆల్‌రౌండర్ దూరం
Akeal Hosein as replacement for Fabian Allen: టీ20 ప్రపంచకప్‌లో వెస్టిండీస్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ ఫాబియన్ అలెన్ గాయం కారణంగా టోర్నీ నుంచి తప్పుకున్నాడు. దీంతో గాయపడిన ఫాబియన్ అలెన్ స్థానంలో అకీల్ హోసిన్ను భర్తీ చేసేందకు ఐసీసీ ఈవెంట్ టెక్నికల్ కమిటీ ఆమోదించింది. ప్రస్తుతం హోసిన్ వెస్టిండీస్ జట్టు రిజర్వ్ జాబితాలో ఉన్నాడు. అయితే రిజర్వ్ జాబితాలో ఉన్న హోసిన్ స్థానంలో గుడకేష్ మోటీని కరిబీయన్ జట్టు భర్తీ చేసింది. కాగా ఈ మెగా టోర్నీలో జట్టులో మార్పులు చేయాలంటే ఈవెంట్ టెక్నికల్ కమిటీ ఆమోదం తప్పనిసరి. టి20 ప్రపంచకప్ 2021 ఈవెంట్ టెక్నికల్ కమిటీలో క్రిస్ టెట్లీ (ఈవెంట్స్ హెడ్), క్లైవ్ హిచ్‌కాక్(ఐసీసీ సీనియర్ క్రికెట్ ఆపరేషన్స్ మేనేజర్), రాహుల్ ద్రవిడ్, మరియు ధీరజ్ మల్హోత్రా (బీసీసీఐ ప్రతినిధులు), సైమన్ డౌల్ ఇయాన్ బిషప్ స్వతంత్ర సభ్యులుగా ఉన్నారు. కాగా వెస్టిండీస్ జట్టు ఆక్టోబర్ 23న తన తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌తో తలపడనుంది. వెస్టిండీస్ జట్టు: కిరాన్ పొలార్డ్ (కెప్టెన్), నికోలస్ పూరన్ (వైస్ కెప్టెన్), అకేల్ హోసిన్, డ్వేన్ బ్రావో, రోస్టన్ చేజ్, ఆండ్రీ ఫ్లెచర్, క్రిస్ గేల్, షిమ్రాన్ హెట్మెయర్, ఎవిన్ లూయిస్, ఓబెడ్ మెకాయ్, లెండెల్ సిమన్స్, రవి రాంపాల్, ఆండ్రీ రస్సెల్ థామస్, హేడెన్ వాల్ష్ జూనియర్. రిజర్వ్ జాబితా: డారెన్ బ్రావో, షెల్డన్ కాట్రెల్, జాసన్ హోల్డర్, గుడకేష్ మోటీ చదవండి: T20 WC IND Vs PAK: భారత్-పాక్ మ్యాచ్ పై కేంద్రమంత్రి కీలక వాఖ్యలు.. -
‘టీ20 వరల్డ్‌కప్ విజేత భారత్ కాదు.. ఆ జట్టే గెలుస్తుంది’
లండన్: ఐసీసీ తాజాగా టీ20 ప్రపంచకప్ 2021 పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. అక్టోబరు 17 నుంచి నవంబరు 14 వరకూ యూఏఈ, ఒమన్ వేదికగా మెగా టోర్నీ జరగనుంది. ప్రపంచకప్‌కు ఇంకా సమయం ఉన్నా.. అప్పుడే టోర్నీ గురించి చర్చ మొదలైంది. ఈసారి ఏ జట్టు గెలుస్తుందో అని క్రికెట్ నిపుణులు, మాజీలు అంచనాలు వేస్తున్నారు. తాజాగా ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ గ్రేమ్ స్వాన్ తన ఫేవరేట్ జట్టేదో చెప్పాడు. టీ20 ప్రపంచకప్ 2021ను భారత్ కంటే వెస్టిండీస్ జట్టే గెలిచే అవకాశం ఎక్కువగా ఉందని ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ గ్రేమ్ స్వాన్ జోస్యం చెప్పాడు. చదవండి:లార్డ్స్ టెస్ట్‌లో ఆండర్సన్, బుమ్రా ఎపిసోడ్‌పై మంజ్రేకర్ సంచలన వ్యాఖ్యలు ఓ ఇంటర్వ్యూలో భాగంగా ఈసారి టీ20 ప్రపంచకప్ విజేత ఎవరనుకుంటున్నారు అని గ్రేమ్ స్వాన్‌ను ప్రెజెంటర్ అడగ్గా..ఈ టోర్నమెంట్ ప్రణాళిక ప్రకారం భారతదేశంలో జరిగిఉంటే టీమిండియా ఫేవరేట్. కానీ ఇప్పుడు వేదిక మారింది. యూఏఈలో ప్రపంచకప్ జరుగుతుంది కాబట్టి.. కచ్చితంగా వెస్టిండీస్ గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఎందుకంటే వెస్టిండీస్ జట్టులో క్రిస్ గేల్, ఆండ్రీ రస్సెల్, పోలార్డ్ వంటి విధ్వంసకర ఆటగాళ్లు ఫామ్‌లో ఉన్నారని స్వాన్ తెలిపాడు. కాగా ఇటీవల ఇటీవల స్వదేశంలో జరిగిన దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, పాకిస్థాన్లతో జరిగిన టి 20 సిరీస్‌లో కరీబీయన్లు విజయం సాధించి టీ20 ప్రపంచకప్ కు ముందే సవాల్ విసిరారు అని స్వాన్ అన్నాడు. మరో వైపు విండీస్ ఆగ్రశ్రేణి ఆటగాళ్లు ఐపిఎల్ 2021 రెండో దశ కోసం యూఏఈ వెళ్తున్నారని.. అది వారికి ఎంతగానో కలిసి వచ్చే ఆంశమని స్వాన్ అభిప్రాయపడ్డాడు. కాగా 2012, 2016 టీ20 ప్రపంచకప్‌లను విండీస్ గెలుచుకుంది. చదవండి:IPL 2021: చెన్నై జట్టులో 'జోష్'.. మరింత పదునెక్కిన సీఎస్కే పేస్ దళం Here's why @Swannyg66 believes @windiescricket are the favourites to lift the ICC Men's #T20WorldCup 💬 Hear more from the former 🏴 spinner on Around The Wicket with @DanishSait, driven by @Nissan, premiering today 🤩 pic.twitter.com/M3nnAwdyky — T20 World Cup (@T20WorldCup) August 22, 2021 -
కరీబియన్ల పై ప్రతీకారం తీర్చుకున్న సఫారీలు..
గ్రెనడా: వెస్టిండీస్ చేతిలో తొలి టీ20 ఓటమికి దక్షిణాఫ్రికా ప్రతీకారం తీర్చుకుంది. గ్రెనడా వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 16 పరుగుల తేడాతో విజయాన్ని సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 7 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. 167 పరుగల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ 9 వికెట్లు కోల్పోయి 150 పరుగులకే పరిమితమైంది. దీంతో ఐదు టీ20ల ఈ సిరీస్ ను దక్షిణాఫ్రికా ప్రస్తుతం 1-1తో సమం చేసింది. టాస్ ఓడి మెదట బ్యాటింగ్ చేసిన ఓపెనర్లు హెండ్రిక్స్, డికాక్ శుభారంభం ఇచ్చారు. ఓపెనర్ హెండ్రిక్స్ (42), కెప్టెన్ బవుమా (46) డికాక్(26) మెరుగైన స్కోర్లు నమోదు చేశారు. వెస్టిండీస్ బౌలర్లలో మెకాయ్ మూడు వికెట్లు పడగొట్టగా.. కెవిన్ రెండు, హోల్డర్, రసెల్ ఒక్కో వికెట్ తీశారు. ఆనంతరం 167 పరుగల లక్ష్యంతో బరి లోకి దిగిన వెస్టిండీస్ కు ఓపెనర్లు ఎవిన్ లావిస్ (21), ఫ్లెచర్ (35) శుభారంభం ఇచ్చినా.. మిడిలార్డర్లో క్రిస్‌గేల్ (8), నికోలస్ పూరన్ (9), కీరన్ పొలార్డ్ (1), ఆండ్రీ రసెల్ (5) తేలిపోయారు. మధ్యలో ఫ్యాబియన్ అలెన్ సిక్స్‌లు, ఫోర్లుతో కాసేపు సఫారీలను కంగారు పెట్టినా వరస క్రమంలో వికెట్లు కోల్పోవడంతో కరీబియన్లకి 16 పరుగుల తేడాతో ఓటమి తప్పలేదు. దక్షిణాఫ్రికా జట్టులో రబాడకి మూడు వికెట్లు దక్కగా.. లిండేకి రెండు, లుంగి ఎంగిడి, నార్జ్, షంషీకి ఒక్కో వికెట్ పడ్డాయి. ఈ మ్యాచ్ లో రెండు కీలక మైన వికెట్లు పడగొట్లిన జార్జ్ లిండే కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది చదవండి: India Tour Of Sri Lanka: శ్రీలంకకు బయల్దేరిన భారత జట్టు ఇదే! -
‘యూకేలో పెరిగితే ఇంతకాలం బతికేవాడిని కాను’
జోహెన్నెస్‌బర్గ్: మాజీ వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ మైకెల్ హోల్డింగ్ జాత్యహంకార ధోరణిపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. అదృష్టవశాత్తు తాను ఇంగ్లండ్‌లో పెరగలేదని.. లేదంటే యువకుడిగా ఉన్నప్పుడే తాను మరణించేవాడినని పేర్కొన్నాడు. యవ్వనంలో ఉండగా తాను చాలా దూకుడుగా వ్యవహరిచేంవాడినని.. ఆ సమయంలో తాను ఇంగ్లండ్‌లో ఉంటే కచ్చితంగా ఈపాటికే మరణించేవాడినన్నాడు మైకెల్. అమెరికాలో చోటు చేసుకున్న జార్జ్ ఫ్లాయిడ్ హత్యోదంతం తర్వాత వచ్చిన బ్లాక్‌లైవ్స్ మ్యాటర్ ఉద్యమంలో మైకెల్ చురుకుగా వ్యవహరిస్తున్నాడు. జాత్యాహంకార ధోరణిపై మైకెల్ ‘‘వై వీ నీల్, హౌ వి రైజ్’’ అనే పుస్తకాన్ని రాశాడు. త్వరలోనే ఇది విడుదల కానుంది. ఈ క్రమంలో మైకెల్ మాట్లాడుతూ.. ‘‘నేను జమైకాలో పెరిగాను. కనుక ఎప్పుడు జాత్యహంకారాన్ని చవి చూడలేదు. కానీ అక్కడ నుంచి వేరే దేశాలకు వెళ్లిన ప్రతి సారి నేను నేను దాన్ని ఎదుర్కొన్నాను. ప్రతిసారి నాకు నేను సర్ది చెప్పుకునేవాడిని.. ఇది నీ దేశం కాదు.. త్వరలోనే నీవు నీ స్వస్థలం వెళ్తావు. అక్కడ నీకు ఇలాంటి చెడు అనుభవాలు ఎదురుకావని నాకు నేనే నచ్చచెప్పుకునేవాడిని’’ అని తెలిపాడు. ‘‘ఇక యువకుడిగా ఉన్నప్పుడు నేను చాలా దూకుడుగా ఉండేవాడిని. నేను న్యూజిలాండ్ (1980) లో ఉండగా మైదానం నుంచి ఒక స్టంప్‌ను బయటకు తన్నాను. అదృష్టం కొద్ది నేను ఇంగ్లండ్‌లో పెరగలేదు కాబట్టి సరిపోయింది. లేదంటే ఆనాటి నా ప్రవర్తన తర్వాత నేను ఇంతకాలం బతికి ఉండేవాడినే కాదు” అని హోల్డింగ్ ది టెలిగ్రాఫ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించాడు. “ఈ విషయంలో నేను ఓ స్టాండ్ తీసుకుంటే నా కెరీర్ ఇప్పుడున్నంత కాలం ఉండేది కాదు. అలానే నాకు ఈ సుదీర్ఘ టెలివిజన్ కెరీర్ కూడా ఉండేది కాదు. తమ హక్కుల కోసం నిలబడి అన్యాయాన్ని ఎదిరించిన నల్లజాతీయులు బాధితులవుతున్నారని మేము చరిత్ర ద్వారా తెలుసుకున్నాము. ఒకవేళ నేను కూడా ఈ జాత్యహంకార ధోరణి గురించి మాట్లాడి ఉంటే వారు ‘మరో యువకుడు మనల్ని ఎదరిస్తున్నాడు.. అతనిని వదిలించుకోండి’ అని చెప్పేవారు. అప్పుడు నేను పేడ కుప్పలో మరొక వ్యక్తిగా ఉండేవాడిని” అన్నాడు హోల్డింగ్. -
ప్రేయసిని పెళ్లాడిన నికోలస్ పూరన్
జమైకా: వెస్టిండీస్ విధ్వంసకర బ్యాట్స్‌మన్ నికోలస్ పూరన్ ఓ ఇంటివాడయ్యాడు. ఈ పంజాబ్ కింగ్స్ హిట్టర్ తన ప్రేయసి అలిస్సా మిగ్యూల్‌ను వివాహం చేసుకున్నాడు. ఈ విషయాన్ని పూరన్ స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. ‘‘జీసస్ ఈ నా జీవితంలో ఎన్నో సార్లు ఆశీర్వదించాడు. నా జీవితంలో నిన్ను కలిగి ఉండటం కంటే గొప్పది ఏదీ లేదు. మిస్టర్ అండ్ మిసెస్ పూరన్‌కు స్వాగతం’’ అంటూ ట్విటర్లో రాసుకొచ్చాడు. ఇక అలిస్సా మిగ్యూల్ కూడా తన ప్రేమను సోషల్ మీడియాలో పంచుకుంది. ‘‘అతను ఆ సమయంలో ప్రతిదీ అందంగా చేశాడు. నీవు నన్ను ప్రేమించినందుకు ప్రతిరోజు దేవునికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. లవ్ యూ నికోలస్ పూరన్’’ అంటూ తన ప్రేమను చాటుకుంది. ఇక పీబీకేఎస్ ప్రధాన కోచ్ అనిల్ కుంబ్లే, వెస్టిండీస్ ప్రముఖ క్రికెటర్ జాసన్ హోల్డర్, కరేబియన్ వన్డే, టీ-20 కెప్టెన్ కీరోన్ పొలార్డ్ ఈ సందర్భంగా ఆయనకు అభినందనలు తెలిపారు. ఇక పూరన్ నిశ్చితార్థం సమయంలో మోకాలిపై కూర్చుని మిగ్యూల్ చేతికి రింగ్ పెట్టిన ఫొటోను అభిమానులతో పంచుకున్న సంగతి తెలిసందే. ఈ ఫొటోకు ‘‘ఆ భగవంతుడి ఆశీస్సులతో మిగ్యూల్‌తో నా నిశ్చితార్థం జరిగింది. ఈ విషయాన్ని మీతో పంచుకుంటునందుకు సంతోషంగా ఉంది. లవ్ యూ మిగ్.. నిన్ను నేను పొందాను.’’ అంటూ రాసుకొచ్చాడు. (చదవండి: సుదీర్ఘ నిరీక్షణ తర్వాత కుటుంబాన్ని కలిసిన వార్నర్) -
సమమా... సంచలనమా!
ఇంగ్లండ్ గడ్డపై వెస్టిండీస్ టెస్టు సిరీస్ గెలిచి 32 ఏళ్లయింది. జట్టులో దిగ్గజాలు ఉన్న కాలంలో 1988లో ఈ ఘనత సాధించింది. ఇప్పుడు ఆ జట్టు ముందు బంగారు అవకాశం నిలిచింది. తొలి టెస్టు విజయం ఇచ్చిన స్ఫూర్తితో మరో గెలుపు అందుకుంటే ఈ సిరీస్ చిరస్మరణీయంగా మారిపోతుంది. అయితే అనూహ్యంగా గత మ్యాచ్‌లో ఓడిన ఇంగ్లండ్ సొంతగడ్డపై మళ్లీ కోలుకోవాలని పట్టుదలగా ఉంది. ఈ సిరీస్‌కు ముందు వరుసగా నాలుగు సిరీస్‌లలో తొలి టెస్టులో ఓడి కూడా ముందంజ వేసిన ఇంగ్లండ్ దానినే పునరావృతం చేయాలనుకుంటోంది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య రెండో టెస్టుకు రంగం సిద్ధమైంది. మాంచెస్టర్: ఇంగ్లండ్, వెస్టిండీస్ తొలి టెస్టు మ్యాచ్‌కు ముందు అంతా కరోనాకు సంబంధించిన హంగామాయే. మ్యాచ్ ఫలితంకంటే ఆట జరగడంపైనే అందరి దృష్టీ నిలిచింది. అయితే ఇప్పుడు అదంతా గతం. కరోనా ప్రస్తావన లేకుండా క్రికెట్ గురించి చర్చ మొదలైంది. ఇరు జట్ల మధ్య మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా నేటి నుంచి మాంచెస్టర్‌లోని ఓల్డ్‌ట్రాఫోర్డ్ మైదానం వేదికగా రెండో టెస్టు జరగనుంది. సౌతాంప్టన్‌లో తొలి మ్యాచ్ గెలిచిన విండీస్ ప్రస్తుతం 1–0తో ఆధిక్యంలో ఉంది. డెన్లీపై వేటు... అండర్సన్, వుడ్లకు విశ్రాంతి సిరీస్‌ను కాపాడుకునే ప్రయత్నంలో బరిలోకి దిగుతున్న ఇంగ్లండ్ తుది జట్టును మ్యాచ్ రోజే ప్రకటించనుంది. అయితే తొలి టెస్టులో ఆడిన ముగ్గురిని రెండో టెస్టుకు ఎంపిక చేయలేదు. వ్యక్తిగత కారణాలతో గత మ్యాచ్‌కు దూరమైన కెప్టెన్ జో రూట్ మళ్లీ బరిలోకి దిగుతున్నాడు. దాంతో జో డెన్లీని తుది జట్టు నుంచి తప్పించారు. నిజానికి రూట్ స్థానంలో తొలి టెస్టులో క్రాలీ ఆడినా... రెండో ఇన్నింగ్స్‌లో అతను బాగా ఆడటం, డెన్లీ రెండుసార్లు కూడా విఫలం కావడంతో వేటు తప్పలేదు. తొలి టెస్టులో ఆడిన బౌలర్లు అండర్సన్, మార్క్ వుడ్లకు విశ్రాంతి ఇచ్చారు. వారి స్థానాల్లో స్టువర్ట్ బ్రాడ్, ఒలీ రాబిన్సన్లను 13 మందితో ప్రకటించిన జట్టులోకి తీసుకున్నారు. తొలి టెస్టులో తనను తుది జట్టు నుంచి తప్పించడంపై స్టువర్ట్ బ్రాడ్ బహిరంగంగానే అసంతృప్తిని ప్రకటించాడు. మొత్తంగా చూస్తే బ్యాటింగ్ వైఫల్యం గత మ్యాచ్‌లో ఓటమికి కారణమైంది. కాబట్టి బ్యాట్స్‌మెన్‌పై ఈసారి బాధ్యత మరింత పెరిగింది. రూట్ రాకతో లైనప్ పటిష్టంగా మారింది. రెండు ఇన్నింగ్స్‌లలోనూ సొంతగడ్డపై ఇంగ్లండ్ స్థాయికి తగిన స్కోర్లు రాలేదు. కీపర్ బట్లర్ వైఫల్యం కూడా జట్టును దెబ్బతీస్తోంది. టాప్ ఆల్‌రౌండర్ స్టోక్స్ కెప్టెన్సీ సత్తా చాటితే ఇంగ్లండ్ మెరుగైన స్థితిలో నిలుస్తుంది. అదే విధంగా అండర్సన్ నుంచి కూడా జట్టు మరింత మంచి ప్రదర్శనను ఆశిస్తోంది. మార్పుల్లేకుండానే... తొలి టెస్టు విజయంలో విండీస్ ఆటగాళ్లు ప్రతీ ఒక్కరు కీలకపాత్ర పోషించారు. అవసరమైన సందర్భంలో పట్టుదలగా ఆడి సమష్టితత్వంతో గెలిపించారు. కాబట్టి సహజంగానే అదే తుది జట్టుతో బరిలోకి దిగే అవకాశం ఉంది. కాస్త ఉదాసీనత ప్రదర్శించకుండా ఉంటే మరో గెలుపు సాధించేందుకు టీమ్‌కు అన్ని రకాలుగా అర్హత ఉంది. నలుగురు పేస్ బౌలర్ల మంత్రం గత మ్యాచ్‌లో ఫలించింది. ముఖ్యంగా హోల్డర్, గాబ్రియెల్ ప్రత్యర్థిని బాగా దెబ్బ కొట్టారు. వీరికి తోడు రోచ్ కూడా చెలరేగాల్సి ఉంది. ఏకైక స్పిన్నర్ ఛేజ్ తన విలువేంటో మళ్లీ చూపించాడు. బ్యాటింగ్‌లో ఓపెనర్లు బ్రాత్‌వైట్, క్యాంప్‌బెల్ శుభారంభం అందిస్తే విండీస్ భారీ స్కోరుకు అవకాశం ఉంటుంది. తనలో ప్రతిభను బ్లాక్‌వుడ్ ఒక్క ఇన్నింగ్స్‌తో బయటపెట్టాడు. విడివిడిగా చూస్తే ఏ ఒక్కరూ స్టార్ కాకపోయినా జట్టుగా విండీస్ చెలరేగింది. అదే స్ఫూర్తిని కొనసాగిస్తే మరో గెలుపు అసాధ్యం కాబోదు. ఓల్డ్‌ట్రాఫోర్డ్ మైదానంలో ఇప్పటివరకు ఇంగ్లండ్, వెస్టిండీస్ జట్ల మధ్య 15 టెస్టులు జరిగాయి. 6 మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్, 5 మ్యాచ్‌ల్లో వెస్టిండీస్ గెలిచాయి. 4 మ్యాచ్‌లు ‘డ్రా’గా ముగిశాయి. ఈ వేదికలో ఇంగ్లండ్‌పై విండీస్ చివరిసారి 1988లో టెస్టు గెలిచింది. ఇంగ్లండ్ మాత్రం విండీస్‌తో ఇక్కడ జరిగిన చివరి నాలుగు టెస్టుల్లో మూడింటిలో గెలిచి, మరో దానిని ‘డ్రా’ చేసుకుంది. -
నిలవాలంటే గెలవాలి
భారత జట్టు సొంతగడ్డపై ఎప్పుడో 15 ఏళ్ల క్రితం వరుసగా రెండు వన్డే సిరీస్‌లు ఓడిపోయింది. స్వదేశంలో గతంలో ఎప్పుడూ వరుసగా ఐదు వన్డేలు ఓడిన పరాభవం కూడా ఎప్పుడూ ఎదుర్కోలేదు. కానీ విశాఖ వేదికగా రెండో మ్యాచ్‌లో తమ స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చకపోతే మాత్రం ఈ రెండు చెత్త రికార్డులు మన ఖాతాలో చేరతాయి. ఈ ఏడాది ఆరంభంలో ఆ్రస్టేలియా చేతిలో వరుసగా మూడు వన్డేలు ఓడి సిరీస్ కోల్పోయిన టీమిండియా... ఇప్పుడు వెస్టిండీస్‌కు ఆ అవకాశం ఇవ్వరాదని భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య రెండో వన్డేకు రంగం సిద్ధమైంది. భారత్‌కు అచ్చొచ్చిన వేదికల్లో వైజాగ్ ఒకటి కాగా... ఇక్కడ ఎదురైన ఏకైక పరాజయం విండీస్ చేతిలోనే కావడం గమనార్హం. సాక్షి, విశాఖపట్నం: వెస్టిండీస్‌పై టి20 సిరీస్ గెలుచుకున్న తర్వాత చెన్నై వన్డేలో అనూహ్య పరాజయం భారత్‌ను నేలకు దించింది. గత మ్యాచ్‌లో టాపార్డర్ వైఫల్యంతో ఓటమిని ఎదుర్కొన్న కోహ్లి సేన ఇప్పుడు పట్టుదలగా తర్వాతి సమరానికి సిద్ధమైంది. డాక్టర్ వైఎస్ఆర్ ఏసీఏ–వీడీసీఏ స్టేడియం వేదికగా నేడు జరిగే పోరులో ఇరు జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే సిరీస్‌లో నిలిచే స్థితిలో టీమిండియా ఉండగా... మరో దూకుడైన విజయంతో 2002 తర్వాత భారత గడ్డపై వన్డే సిరీస్‌ను అందుకోవాలని పొలార్డ్ బృందం పట్టుదలతో ఉంది. చహల్‌కు చోటు! చెన్నైలాంటి నెమ్మదైన పిచ్‌పై 288 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోవడంలో భారత్ విఫలమైంది. భారత బ్యాటింగ్ పటిష్టంగానే ఉన్నా... బౌలింగ్ వైఫల్యం విండీస్ పనిని సులువు చేసింది. ఈ నేపథ్యంలో ఆల్‌రౌండర్‌కంటే ఒక స్పెషలిస్ట్ బౌలర్ అదనంగా జట్టులో ఉంటే మంచిదని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తోంది. భిన్నమైన బంతులతో ప్రత్యర్థిని దెబ్బ తీయగల యజువేంద్ర చహల్‌పై అందరి దృష్టీ నిలిచింది. గత మ్యాచ్‌లో కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా కలిసి పెద్దగా ప్రభావం చూపలేకపోవడంతో ఈ లెగ్ స్పిన్నర్‌కు అవకాశం దక్కవచ్చు. అదే జరిగితే శివమ్ దూబే, జడేజాలలో ఒకరిని పక్కన పెట్టే అవకాశం ఉంది. చెన్నై మ్యాచ్‌లో దూబే ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి విఫలమయ్యాడు. బౌలింగ్‌లోనూ రాణించలేకపోయాడు. ఇక షమీ, దీపక్ చాహర్ కూడా మరింత మెరుగైన ప్రదర్శన కనబర్చాల్సి ఉంది. బౌలింగ్‌లో కేదార్ జాదవ్ ప్రత్యేకత చూపించకపోయినా అతను చేసిన కీలక పరుగులు జట్టులో స్థానానికి ఢోకా లేకుండా చేశాయి. సుదీర్ఘ కాలం తర్వాత భారత టాప్–3 బ్యాట్స్‌మెన్ విఫలం కావడం చెన్నై మ్యాచ్‌లోనే జరిగింది. విశాఖలో అద్భుత రికార్డు ఉన్న కోహ్లి, రోహిత్‌లలో ఏ ఒక్కరు చెలరేగినా విండీస్‌కు కష్టాలు తప్పవు. రెండో ఓపెనర్‌గా రాహుల్ బాగా ఆడుతున్నాడు కాబట్టి మయాంక్ అగర్వాల్‌కు ప్రస్తుతానికి అవకాశం లేదు. యువ ఆటగాళ్లు శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్ రాణించడం భారత్‌కు శుభసూచకం. తొలి వన్డేలో ఓటమి పలకరించినా ఓవరాల్‌గా భారత జట్టు పటిష్టంగానే ఉంది. అందరూ తమ స్థాయికి తగ్గ ప్రదర్శన కనబరిస్తే గెలుపు కష్టం కాకపోవచ్చు. లూయిస్ పునరాగమనం! సిరీస్‌లో శుభారంభం చేయడం వెస్టిండీస్ ఆత్మవిశ్వాసాన్ని అమాంతం పెంచిందనడంలో సందేహం లేదు. ముఖ్యంగా హెట్‌మైర్, షై హోప్ బ్యాటింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. కీలక సమయంలో ఒత్తిడిని తట్టుకొని వీరిద్దరు బాగా ఆడి 218 పరుగుల భాగస్వామ్యం నమోదు చేయడం అందరి ప్రశంసలకు కారణమైంది. సరిగ్గా ఏడాది క్రితం ఇదే వైజాగ్ వేదికపై వీరిద్దరు చక్కటి ఇన్నింగ్స్‌లతో తమ జట్టును ఓటమి నుంచి కాపాడి మ్యాచ్‌ను ‘టై’గా ముగించారు. ఇప్పుడు అదే స్ఫూర్తితో చెలరేగితే భారత బౌలర్లు ఇబ్బంది పడాల్సిందే. హెట్‌మైర్,షై హోప్ పూరన్, పొలార్డ్‌లతో జట్టు బ్యాటింగ్ మరింత బలంగా కనిపిస్తోంది. మరో భారీ హిట్టర్ ఎవిన్ లూయిస్ గాయం నుంచి కోలుకుంటే అతను ఆంబ్రిస్ స్థానంలో జట్టులోకి వస్తాడు. బ్యాటింగ్‌కు అనుకూలమైన విశాఖ పిచ్‌పై పేసర్లు కాట్రెల్, జోసెఫ్, హోల్డర్ ఎలా ప్రత్యర్థిని నిలువరిస్తారనేది ఆసక్తికరం. స్పిన్నర్లు వాల్ష్, ఛేజ్ కూడా గత మ్యాచ్‌లో మెరుగ్గానే బౌలింగ్ చేశారు. అయితే మొత్తంగా చూస్తే విండీస్ విజయరహస్యం, బలమంతా ఆ జట్టు విధ్వంసక బ్యాటింగ్‌పైనే ఆధారపడి ఉంది. కాబట్టి బ్యాట్స్‌మెన్ చెలరేగితే చిరస్మరణీయ సిరీస్ వారి ఖాతాలో చేరవచ్చు. విండీస్ మాజీ క్రికెటర్ బాసిల్ బుచర్ (86 ఏళ్లు) మృతికి సంతాపంగా నేటి మ్యాచ్‌లో విండీస్ క్రికెటర్లు చేతికి నల్ల బ్యాడ్జిలు ధరించి ఆడతారు. తుది జట్ల వివరాలు (అంచనా) భారత్: కోహ్లి (కెప్టెన్), రోహిత్, రాహుల్, అయ్యర్, పంత్, జాదవ్, జడేజా, దూబే/చహల్, చాహర్, షమీ, కుల్దీప్. విండీస్: పొలార్డ్ (కెపె్టన్), షై హోప్, ఆంబ్రిస్/లూయిస్, హెట్‌మైర్, పూరన్, ఛేజ్, హోల్డర్, కీమో పాల్, వాల్ష్, జోసెఫ్, కాట్రెల్. పిచ్, వాతావరణం పిచ్‌ను పరిశీలిస్తున్న జడేజా, ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్ బ్యాటింగ్‌కు అనుకూలం. భారీ స్కోర్లకు అవకాశం ఉంది. అయితే డిసెంబర్ మాసం కావడంతో రాత్రి మంచు ప్రభావంతో బౌలర్లకు పట్టు చిక్కడం కష్టంగా మారిపోవచ్చు. దీంతో పాటు ఛేదననే ఇరు జట్లు ఇష్టపడుతున్నాయి కాబట్టి టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్ ఎంచుకోవడం లాంఛనమే. మ్యాచ్ రోజు వర్షసూచన లేదు. -
ఒక్క క్లిక్‌తో నేటి క్రీడా వార్తలు
టీమిండియాతో ఆరంభమయ్యే ద్వైపాక్షిక సిరీస్‌లో భాగంగా తొలి రెండు టీ20లకు వెస్టిండీస్ జట్టును ప్రకటించారు.శ్రీలంక స్టార్ బౌలర్ లసిత్ మలింగ వన్డే క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నాడు.ప్రొ కబడ్డీ లీగ్ మాజీ చాంపియన్స్ జైపూర్ పింక్ పాంథర్స్ ఏడో సీజన్‌ను ఘనవిజయంతో ప్రారంభించింది. -
టి20ల్లో కెరీర్ అత్యుత్తమ ర్యాంకుకు కుల్దీప్
దుబాయ్: తాజాగా వెస్టిండీస్‌తో ముగిసిన టి20 సిరీస్... భారత ఆటగాళ్ల ర్యాంకులను మెరుగుపర్చింది. ఐసీసీ సోమవారం విడుదల చేసిన జాబితాలో బౌలర్ల విభాగంలో చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కెరీర్ అత్యుత్తమ (23) ర్యాంకులో నిలిచాడు. అతడు 14 స్థానాలు ఎగబాకాడు. పేసర్ భువనేశ్వర్ (19వ ర్యాంకు) టాప్20లోకి వచ్చాడు. బుమ్రాకు 21వ స్థానం దక్కింది. బ్యాట్స్‌మెన్‌లో రోహిత్‌శర్మ మూడు స్థానాలు మెరుగు పర్చుకుని 7వ ర్యాంకులో, ధావన్ ఐదు స్థానాలు దాటుకుని 16వ ర్యాంకుకు చేరుకున్నారు. జట్లలో పాకిస్తాన్ (138), భారత్ (127) తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. -
ఆఖరి బంతికి ముగించారు
అలవోకగా గెలిచేస్తోందనుకున్న మ్యాచ్‌లో ఫలితం కోసం ఆఖరి బంతి దాకా ఆగాల్సి వచ్చింది. విండీస్ ఫీల్డింగ్ వైఫల్యంతో భారత్ ఊపిరి పీల్చుకుంది కానీ లేదంటే ‘టై’తో మ్యాచ్ ముగించాల్సి వచ్చేది. ఇద్దరు దూకుడైన బ్యాట్స్‌మెన్ క్రీజ్‌లో ఉండి 18 బంతుల్లో చేయాల్సింది 19 పరుగులే... కానీ 17 బంతులు ముగిసేసరికి రెండు వికెట్లు చేజార్చుకొని వచ్చింది 18 పరుగులే! చివరి బంతికి మనీశ్ పాండే ఆడిన షాట్‌కు బంతిని ఆపి రనౌట్ చేయడంలో విండీస్ బౌలర్ అలెన్ విఫలమయ్యాడు. ఫలితంగా అతి కష్టమ్మీద సింగిల్ పూర్తి చేయడంతో భారత్ క్లీన్‌స్వీప్ సాధ్యమైంది. సొంతగడ్డపై ఆధిపత్యంతో మూడు ఫార్మాట్లలోనూ భారత్ సిరీస్‌లు గెలుచుకోగా... పర్యటన మొత్తంలో ఏకైక వన్డే మ్యాచ్ విజయంతో విండీస్ వెనుదిరిగింది. ఈ పోరుతో 2018లో స్వదేశంలో భారత్ ఆట ముగిసింది. చెన్నై: వెస్టిండీస్‌తో టెస్టు, వన్డే సిరీస్‌లను గెలుచుకున్న భారత్ టి20ల్లోనూ తమకు ఎదురు లేదని నిరూపించింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 3–0తో సొంతం చేసుకొని క్లీన్‌స్వీప్ సాధించింది. ఆదివారం ఇక్కడి చిదంబరం స్టేడియంలో జరిగిన చివరి మ్యాచ్‌లో భారత్ 6 వికెట్ల తేడాతో విండీస్‌ను ఓడించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన విండీస్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. నికొలస్ పూరన్ (25 బంతుల్లో 53 నాటౌట్; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ధ సెంచరీ సాధించగా, డారెన్ బ్రేవో (37 బంతుల్లో 43 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించాడు. అనంతరం భారత్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 182 పరుగులు చేసింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ శిఖర్ ధావన్ (62 బంతుల్లో 92; 10 ఫోర్లు, 2 సిక్సర్లు) అంతర్జాతీయ టి20ల్లో తన అత్యధిక స్కోరు నమోదు చేయగా, రిషభ్ పంత్ (38 బంతుల్లో 58; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) తొలి అర్ధ సెంచరీ సాధించాడు. వీరిద్దరు మూడో వికెట్‌కు 130 పరుగులు జోడించి భారత్ విజయాన్ని సునాయాసం చేశారు. కుల్దీప్ యాదవ్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు దక్కింది. పూరన్ దూకుడు... ఓపెనర్లు హెట్‌మైర్ (21 బంతుల్లో 26; 4 ఫోర్లు, 1 సిక్స్), హోప్ (22 బంతుల్లో 24; 3 ఫోర్లు, 1 సిక్స్) విండీస్‌కు శుభారంభం అందించారు. వీరిద్దరూ దూకుడైన ఆటను ప్రదర్శిస్తూ బౌండరీలతో చెలరేగారు. సుందర్ ఓవర్లో హెట్‌మైర్ రెండు ఫోర్లు కొట్టగా, కృనాల్ పాండ్యా తొలి ఓవర్లో ఇద్దరూ చెరో సిక్సర్ బాదారు. పవర్ ప్లే ముగిసేసరికి విండీస్ 36 బంతుల్లో 51 పరుగులు చేసింది. అయితే ఏడో ఓవర్ వేసిన చహల్ తొలి బంతికే హోప్‌ను ఔట్ చేయడంతో మొదటి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత తడబడిన విండీస్ 25 బంతుల పాటు ఒక్క ఫోర్ కూడా కొట్టలేకపోయింది. ఈ క్రమంలో హెట్‌మైర్ వికెట్ కూడా కోల్పోయింది. సుందర్ బౌలింగ్‌లో భారీ సిక్స్ కొట్టిన రామ్‌దిన్ (15) అదే ఓవర్లో వెనుదిరిగాడు. ఈ దశలో పూరన్ జోరు విండీస్‌కు చెప్పుకోదగ్గ స్కోరు అందించింది. పాండ్యా ఓవర్లో ఫోర్, సిక్స్ కొట్టిన బ్రేవో సహచరుడికి అండగా నిలిచాడు. భువనేశ్వర్ ఓవర్లో వరుస బంతుల్లో రెండు సిక్సర్లతో చెలరేగిన పూరన్... చహల్ వేసిన తర్వాతి ఓవర్లో మరో సిక్స్ బాదాడు. అయితే ఇన్నింగ్స్ చివరి ఓవర్ విండీస్‌కు బాగా కలిసొచ్చింది. అప్పటి వరకు వేసిన మూడు ఓవర్లలో 14 పరుగులు మాత్రమే ఇచ్చిన ఖలీల్... ఏకంగా 23 పరుగులు సమర్పించుకున్నాడు. తొలి బంతికి బ్రేవో సిక్స్ కొట్టగా... అదే ఓవర్లో పూరన్ వరుసగా 4, 6, 4తో ధాటిని ప్రదర్శించాడు. 24 బంతుల్లోనే పూరన్ అర్ధసెంచరీ పూర్తి కాగా, చివరి 5 ఓవర్లలో విండీస్ 64 పరుగులు సాధించింది. భారత్ 16 వైడ్లు సహా ఏకంగా 20 ఎక్స్‌ట్రాలు ఇవ్వడం విశేషం! భారీ భాగస్వామ్యం... ఛేదనలో ఆరంభంలోనే భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ (4) వికెట్ కోల్పోయింది. దూకుడుగా ఇన్నింగ్స్ ఆరంభించిన కేఎల్ రాహుల్ (10 బంతుల్లో 17; 4 ఫోర్లు) కూడా ఎక్కువ సేపు నిలవలేకపోయాడు. అయితే ఈ దశలో ధావన్ తన సత్తాను ప్రదర్శించాడు. అతనికి యువ పంత్ దూకుడు తోడైంది. థామస్ ఓవర్లో రెండు ఫోర్లు కొట్టిన ధావన్, ఆ తర్వాత బ్రాత్‌వైట్ ఓవర్లో మూడు ఫోర్లు బాదాడు. ఆ తర్వాత పంత్ ఏడు బంతుల వ్యవధిలో మూడు ఫోర్లు కొట్టి జోరును ప్రదర్శించాడు. థామస్ ఓవర్లో ఇద్దరూ చెరో సిక్స్ బాదడంతో 18 పరుగులు వచ్చాయి. పొలార్డ్ ఓవర్లో కూడా భారత్ 2 ఫోర్లు, సిక్స్‌తో 18 పరుగులు రాబట్టింది. ఈ క్రమంలో 36 బంతుల్లో ధావన్, ఆ తర్వాత 30 బంతుల్లోనే పంత్ అర్ధసెంచరీలు పూర్తి చేసుకున్నారు. ఇదే ఊపులో భారత జట్టు గెలుపునకు చేరువైంది. విజయానికి 11 బంతుల్లో 7 పరుగులు కావాల్సిన దశలో పంత్ బౌల్డ్ కాగా... మరో పరుగు చేయాల్సి ఉండగా ధావన్ కూడా వెనుదిరిగాడు. అయితే పాండే సింగిల్‌తో చివరి బంతికి భారత్ గట్టెక్కింది. 9 భారత్ గెలిచిన టి20 ద్వైపాక్షిక సిరీస్‌లు (మూడు అంతకంటే ఎక్కువ మ్యాచ్‌లు ఉన్నవి). పాకిస్తాన్ కూడా 9 గెలిచింది. అయితే భారత్ ఒక్కటి కూడా ఓడలేదు. 3 భారత్ చివరి బంతికి టి20 మ్యాచ్ గెలవడం ఇది మూడోసారి. గతంలో ఆస్ట్రేలియాపై (సిడ్నీలో 2016; లక్ష్యం 198), బంగ్లాదేశ్‌పై (కొలంబోలో 2018; లక్ష్యం 167) భారత్ ఆఖరి బంతికి గెలిచింది. 3 రెండేళ్ల క్రితం భారత గడ్డపై టి20 ప్రపంచ కప్ సాధించిన తర్వాత విండీస్ ఉపఖండంలో ఆడిన మూడు సిరీస్‌లు కూడా 0–3తోనే ఓడిపోయింది. మూడు సిరీస్‌లు ఇలా ఓడిన ఏకైక జట్టు విండీస్. స్కోరు వివరాలు వెస్టిండీస్ ఇన్నింగ్స్: హోప్ (సి) సుందర్ (బి) చహల్ 24; హెట్‌మైర్ (సి) కృనాల్ పాండ్యా (బి) చహల్ 26; డారెన్ బ్రేవో (నాటౌట్) 43; రామ్‌దిన్ (బి) వాషింగ్టన్ సుందర్ 15; పూరన్ (నాటౌట్) 53; ఎక్స్‌ట్రాలు 20; మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు) 181. వికెట్ల పతనం: 1–51; 2–62; 3–94. బౌలింగ్: ఖలీల్ అహ్మద్ 4–0–37–0; వాషింగ్టన్ సుందర్ 4–0–33–1; భువనేశ్వర్ కుమార్ 4–0–39–0; కృనాల్ పాండ్యా 4–0–40–0; యజువేంద్ర చహల్ 4–0–28–2. భారత్ ఇన్నింగ్స్: ధావన్ (సి) పొలార్డ్ (బి) అలెన్ 92; రోహిత్ (సి) బ్రాత్‌వైట్ (బి) కీమో పాల్ 4; రాహుల్ (సి) రామ్‌దిన్ (బి) థామస్ 17; పంత్ (బి) కీమో పాల్ 58; మనీశ్ పాండే (నాటౌట్) 4; దినేశ్ కార్తీక్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 182. వికెట్ల పతనం: 1–13; 2–45; 3–175; 4–181. బౌలింగ్: పియర్ 2–0–13–0; థామస్ 4–0–43–1; కీమో పాల్ 4–0–32–2; బ్రాత్‌వైట్ 4–0–41–0; కీరన్ పొలార్డ్ 3–0–29–0; అలెన్ 3–0–23–1. (మరిన్ని చిత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
సెహ్వాగ్‌ను తలపిస్తున్నాడు
వెస్టిండీస్‌కు మర్చిపోలేనిదిగా మిగిలిన ఈ పర్యటనను భారత జట్టు 3–0తో ముగించాలని భావిస్తోంది. పొట్టి ఫార్మాట్లో ప్రపంచ చాంపియన్ విండీస్ చెన్నైలో జరిగే చివరి మ్యాచ్‌లోనైనా ఆతిథ్య జట్టుకు పోటీనిస్తుందా చూడాలి. వారి నుంచి కనీస ప్రతిఘటన కూడా ఎదురుకావడం లేదు. టీమిండియా ఆటగాళ్లు అటు బంతితో, ఇటు బ్యాట్‌తో అదరగొడుతున్నారు. కొత్త ఆటగాళ్లు జట్టులో తమ స్థానాన్ని సుస్థిరం చేసుకునేందుకు యత్నిస్తున్నారు. వన్డే, టి20 సిరీస్‌ల్లో రోహిత్ శర్మ అద్భుత ప్రదర్శన చేశాడు.అచ్చం సెహ్వాగ్‌ను తలపించాడు. ఒక్కసారి జోరు అందుకుంటే అతన్ని ఆపడం కష్టం. భారీ సెంచరీల కోసం ఆకలిగొన్న వాడిలా విరుచుకుపడుతున్నాడు. ఓ బంతిని బౌండరీకి తరలించాక మరో భారీ షాట్ కొట్టే ముందు సెహ్వాగ్ ఓసారి మైదానాన్ని గమనించేవాడు. రోహిత్ మాత్రం అలవోకగా మరో షాట్‌కు యత్నిస్తాడు. రోహిత్ పరిమిత ఓవర్ల క్రికెట్లో కనబరిచే దూకుడు టెస్టుల్లోనూ కొనసాగించగలిగితే సంప్రదాయ క్రికెట్లో వివ్ రిచర్డ్స్, సెహ్వాగ్ తర్వాత ప్రపంచంలో అత్యంత విధ్వంసకర బ్యాట్స్‌మన్‌గా గుర్తింపు పొందుతాడు. సచిన్ టెండూల్కర్, లారా, పాంటింగ్ లాంటి దిగ్గజాలు నిలకడగా రాణిస్తూ ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించారు. కానీ రిచర్డ్స్, సెహ్వాగ్‌లాగా నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడలేదు. వీరిద్దరూ తమ ఆటతీరుతో బౌలర్లను బెంబేలెత్తించారు. చివరి మ్యాచ్‌లో కుల్దీప్కు విశ్రాంతి కల్పించడంతో చహల్‌కు అవకాశం దక్కనుంది. అతను కూడా విండీస్ పనిపట్టడానికి అస్త్రశస్త్రాలతో సిద్ధంగా ఉన్నాడు. ఆస్ట్రేలియా పర్యటనకు ముందు భువనేశ్వర్‌కు మరిన్ని ఓవర్లు బౌలింగ్ చేయడానికి ఇది మంచి అవకాశం. అరంగేట్రం ఆటగాళ్లు ఖలీల్ అహ్మద్, కృనాల్ పాండ్యా ఆకట్టుకున్నారు. చివరి మ్యాచ్‌లో ఫలితం ఎలా ఉన్నా... ఈ ఏడాది భారత్‌లో పర్యటించిన జట్లకు అంతగా కలిసి రాలేదు. -
విండీస్‌ను కొట్టేందుకు..
దాదాపు ఏకపక్షంగానే సాగిన సిరీస్‌లో తుది అంకం. రెండు టెస్టులనూ అలవోకగా గెలిచేసి, ఐదు వన్డేల సిరీస్‌ను ఒడిసి పట్టేసిన టీమిండియాకు టి20 ప్రపంచ చాంపియన్ వెస్టిండీస్‌ను క్లీన్‌స్వీప్ చేసే అవకాశం. విజయాల ఊపులో ఉన్న రోహిత్ బృందానికిది నల్లేరుపై నడకే! అటు ఆటలో, ఇటు దృక్పథంలో తేలిపోతున్న కరీబియన్లు విజయం అందుకోవాలంటే శక్తికి మించి ఆడాల్సిందే! చెన్నై: పెద్దగా శ్రమించకుండానే వెస్టిండీస్‌తో టి20 సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత్‌కు... దానిని సంపూర్ణ విజయంగా మార్చుకునే సందర్భం వచ్చింది. చెన్నైలోని చెపాక్ మైదానం వేదికగా ఆదివారం జరుగనున్న మూడో టి20 ఇందుకు వేదిక కానుంది. ఇప్పటికే సిరీస్ వశమైనందున టీమిండియా రెట్టించిన ఆత్మవిశ్వాసంతో బరిలో దిగనుంది. మరోవైపు పర్యాటక జట్టు పరాభవం తప్పించుకునే ప్రయత్నం చేయనుంది. తుది జట్టులోకి చహల్, సుందర్... బుమ్రా, కుల్దీప్లకు విశ్రాంతి ఇవ్వడంతో ఈ మ్యాచ్‌లో భారత తుది జట్టులో రెండు మార్పులు ఖాయమయ్యాయి. వీరి స్థానాల్లో లెగ్ స్పిన్నర్ యజువేంద్ర చహల్, స్థానిక కుర్రాడు వాషింగ్టన్ సుందర్ ఆడనున్నారు. గత మ్యాచ్‌ల్లో ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతో దిగిన టీమిండియా... చెన్నై పిచ్ స్వభావంరీత్యా ఇద్దరు పేసర్లు, ఆల్‌రౌండర్ సహా ముగ్గురు స్పిన్నర్ల వ్యూహానికి మొగ్గు చూపుతున్నట్లుంది. దీంతో సిద్ధార్థ్ కౌల్, ఎడంచేతి వాటం స్పిన్నర్ షాబాజ్ నదీమ్‌కు అవకాశం లేనట్లైంది. చివర్లో నిర్ణయం మారితే... నదీమ్ అరంగేట్రం చేయొచ్చు. కెప్టెన్ రోహిత్ గత మ్యాచ్‌లోలానే చెలరేగాలని జట్టు ఆశిస్తోంది. ఓపెనర్ ధావన్ ఫామ్‌లోకి రావడం మరింత బలం కానుంది. కేఎల్ రాహుల్, దినేశ్ కార్తీక్, రిషభ్ పంత్‌లతో బ్యాటింగ్ దుర్బేధ్యంగా ఉంది. భువనేశ్వర్, ఖలీల్ అహ్మద్ పేస్ బాధ్యతలు చూసుకుంటారు. ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యాతో పాటు చహల్, సుందర్ స్పిన్ భారం పంచుకుంటారు. విండీస్... ఈ ఒక్కటైనా! ప్రధాన ఆటగాళ్లు దూరమై... ముందే డీలాపడిన వెస్టిండీస్ టి20 సిరీస్‌లో మరీ తేలిపోయింది. లక్నోలో జరిగిన రెండో మ్యాచ్‌లో ఆ జట్టు అత్యంత పేలవంగా ఆడింది. హెట్‌మైర్, బ్రేవో, పొలార్డ్ వంటి ప్రతిభావంతులైన బ్యాట్స్‌మెన్ స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చడం లేదు. బౌలింగ్‌లో ఒషేన్ థామస్ పేస్ మినహా చెప్పుకొనేదేమీ లేదు. చెన్నైలోనైనా గెలిస్తే జట్టుకు కొంత ఉపశమనం దక్కుతుంది. ఈ మ్యాచ్‌కు వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ దినేశ్ రామ్‌దిన్‌ను తప్పించి రావ్మన్ పావెల్‌ను తీసుకోనుంది. నికొలస్ పూరన్ కీపింగ్ చేస్తాడు. సరైన వ్యవస్థ లేకే... విండీస్ క్రికెట్ దుస్థితిపై బ్రియాన్ లారా ఆవేదన సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం వెస్టిండీస్ క్రికెట్ దుస్థితికి కారణం తమ దేశంలో యువతరాన్ని తీర్చిదిద్దే సరైన వ్యవస్థ లేకపోవడమేనని దిగ్గజ క్రికెటర్, విండీస్ మాజీ కెప్టెన్ బ్రియాన్ లారా ఆవేదన వ్యక్తం చేశాడు. కృష్ణపట్నం పోర్టు గోల్డెన్ ఈగల్స్ గోల్ఫ్ చాంపియన్ షిప్ కోసం హైదరాబాద్‌కు విచ్చేసిన లారా తమ దేశ క్రికెట్‌కు సంబంధించిన పలు అంశాలపై మీడియాతో తన అభిప్రాయాలను పంచుకున్నాడు. విండీస్ క్రికెట్ బోర్డు శక్తిమంతంగా లేకపోవడం కూడా తమ స్థితికి కారణమన్నాడు. క్రికెట్ భవిష్యత్‌కు ఆధారమైన యువతరాన్ని చేరదీయడంలో తమ బోర్డు విఫలమైందని విమర్శించాడు. మౌలిక వసతులు, స్టేడియాలు బాగున్నప్పటికీ యువ క్రికెటర్లను తీర్చిదిద్దే సరైన వ్యవస్థ లేకపోవడంతో క్రికెట్ అభివృద్ధి కుంటుపడిందని వివరించాడు. ‘భారత్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా దేశాల తరహాలో దేశవాళీ క్రికెట్ అభివృద్ధి కోసం మా బోర్డు కృషి చేయడంలేదు. ఫలితంగా గత మూడు, నాలుగేళ్లుగా ప్రతిభ గల యువ క్రికెటర్లు వెలుగులోకి రాలేకపోతున్నారు. వారిని సానబెట్టే వ్యవస్థ ప్రస్తుతం మా దగ్గర లేదు’ అని పేర్కొన్నాడు. భారత పర్యటనలో టెస్టుల్లో విండీస్ విఫలమైన తీరుపై లారా విచారం వ్యక్తం చేశాడు. ‘టెస్టుల్లో ప్రదర్శనే ఒక జట్టు స్థాయిని నిర్ణయిస్తుంది. కానీ భారత్‌పై తొలి రెండు టెస్టులను విండీస్ మూడు రోజుల్లోనే ముగించింది. ఇది ఆశించదగినది కాదు. మూడు రోజులకు మించి విండీస్ టెస్టు ఆడలేకపోతోంది. ఈ అంశం నాకు చాలా నిరాశ కలిగించింది’ అని వివరించాడు. యువతరాన్ని తీర్చిదిద్దితేనే విండీస్ క్రికెట్ మళ్లీ పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుందని అభిప్రాయపడ్డాడు. వచ్చే ఏడాది తన బయోగ్రఫీని విడుదల చేస్తానని లారా ప్రకటించాడు. తుది జట్లు (అంచనా) భారత్: రోహిత్ (కెప్టెన్), ధావన్, రాహుల్, మనీశ్ పాండే, దినేశ్ కార్తీక్, పంత్, కృనాల్, సుందర్, చహల్, భువనేశ్వర్, ఖలీల్. వెస్టిండీస్: షై హోప్, పూరన్, హెట్‌మైర్, డారెన్ బ్రేవో, పొలార్డ్, బ్రాత్‌వైట్ (కెప్టెన్), రావ్మన్ పావెల్, కీమో పాల్, అలెన్, పియర్, థామస్. పిచ్, వాతావరణ చెపాక్ మైదానం స్పిన్‌కు అనుకూలిస్తుంది. రాత్రి వేళ మంచు ప్రభావం ఉంటుంది. ఇక్కడ ఇది రెండో టి20. ఆరేళ్ల క్రితం జరిగిన మ్యాచ్‌లో భారత్‌ను న్యూజిలాండ్ ఒక్క పరుగు తేడాతో ఓడించింది.చెపాక్ మైదానం స్పిన్‌కు అనుకూలిస్తుంది. రాత్రి వేళ మంచు ప్రభావం ఉంటుంది. ఇక్కడ ఇది రెండో టి20. ఆరేళ్ల క్రితం జరిగిన మ్యాచ్‌లో భారత్‌ను న్యూజిలాండ్ ఒక్క పరుగు తేడాతో ఓడించింది. రాత్రి గం.7 నుంచి స్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం -
రూ. 100 ... రూ. 3000
సాక్షి, హైదరాబాద్: భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య శుక్రవారం నుంచి ఉప్పల్ స్టేడియంలో జరిగే రెండో టెస్టు మ్యాచ్‌కు సంబంధించిన టికెట్లను ప్రేక్షకులకు అమ్మకానికి ఉంచారు. నేటి (బుధవారం) నుంచి ఈ టికెట్లు ఆన్లైన్ eventsnow.com)తో పాటు సికింద్రాబాద్‌లోని జింఖానా గ్రౌండ్స్‌లో లభిస్తాయి. ఒక రోజు ఆటకు సంబంధించి కనిష్ట ధర రూ. 100 కాగా, గరిష్టంగా రూ.1000గా నిర్ణయించారు. ఐదు రోజుల కోసం ఒకే సారి సీజన్ టికెట్ కొనుక్కుంటే రూ. 300 నుంచి రూ. 3000 వరకు విలువ గల టికెట్లు అందుబాటులో ఉన్నాయి. బీసీసీఐ నిబంధనల ప్రకారం కేవలం 10 శాతం మాత్రమే కాంప్లిమెంటరీ పాస్లుగా నిర్ణయించారు. దాంతో దాదాపు 39 వేల సామర్థ్యం గల రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో సుమారు 35 వేల వరకు టికెట్లు ప్రేక్షకులు కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉన్నాయి. -
వరల్డ్-11 జట్టు నుంచి పాండ్యా ఔట్
ముంబై : అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) వరల్డ్ ఎలెవన్ జట్టు నుంచి టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా దూరమయ్యాడు. వైరల్ జ్వరంతో బాధపడుతున్న పాండ్యా స్థానంలో టీమిండియా పేసర్ మహ్మద్ షమీని ఎంపిక చేశారు. ఇంగ్లండ్ లెగ్‌స్పిన్నర్ అదిల్ రషీద్‌కు సైతం తుది జట్టులో స్థానం కల్పించారు. గతేడాది హరికేన్ బీభత్సంతో కరేబియన్ స్టేడియాలకు తీవ్రస్థాయిలో నష్టం వాటిల్లింది. ధ్వంసమైన స్టేడియాలను నవీకరించడానికి నిధుల సేకరణ కోసం ఐసీసీ చారిటీ మ్యాచ్ నిర్వహిస్తోంది. ఇంగ్లండ్, లార్డ్స్ వేదికగా మే 31న జరిగే ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్‌తో ప్రపంచ ఎలెవన్ జట్టు పోటీ పడనుంది. ఈ వరల్డ్ ఎలెవన్ జట్టుకు ఇంగ్లండ్ ఆటగాడు ఇయాన్ మోర్గాన్ సారథ్యం వహించనున్నాడు. ప్రతి దేశం నుంచి ఆటగాళ్లు ఈ మ్యాచ్‌లో పాల్గొంటున్నారు. భారత్ నుంచి ఆల్‌రౌండర్ హర్దిక్ పాండ్యా, వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్‌లు అవకాశం కల్పించగా పాండ్యా దూరమయ్యాడు.ఈ టీ20కి ఐసీసీ ఇదివరకే అంతర్జాతీయ హోదా ఇచ్చింది. పాక్ తరపున అఫ్రిది, షోయబ్ మాలిక్, బంగ్లాదేశ్ నుంచి షకీబుల్ హసన్, తమీమ్ ఇక్బాల్, లంక నుంచి తిసార పెరీరా, అఫ్గానిస్తాన్ నుంచి రషీద్ ఖాన్లు ఎంపికయ్యారు. వరల్డ్ ఎలెవన్ తుది జట్టు: ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్), షాహిద్ అఫ్రిది, షోయబ్ మాలిక్, దినేశ్ కార్తీక్(వికెట్ కీపర్), షకీబుల్ హసన్, తమీమ్ ఇక్బాల్, తిసార పెరీరా, రషీద్ ఖాన్, మహ్మద్ షమీ, లూక్ రోంచి, మెక్లినగన్, అదిల్ రషీద్, సందీప్ లమిచ్చనే