జమైకా: వెస్టిండీస్ విధ్వంసకర బ్యాట్స్‌మన్ నికోలస్ పూరన్ ఓ ఇంటివాడయ్యాడు. ఈ పంజాబ్ కింగ్స్ హిట్టర్ తన ప్రేయసి అలిస్సా మిగ్యూల్‌ను వివాహం చేసుకున్నాడు. ఈ విషయాన్ని పూరన్ స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. ‘‘జీసస్ ఈ నా జీవితంలో ఎన్నో సార్లు ఆశీర్వదించాడు. నా జీవితంలో నిన్ను కలిగి ఉండటం కంటే గొప్పది ఏదీ లేదు. మిస్టర్ అండ్ మిసెస్ పూరన్‌కు స్వాగతం’’ అంటూ ట్విటర్‌లో రాసుకొచ్చాడు. ఇక అలిస్సా మిగ్యూల్ కూడా తన ప్రేమను సోషల్ మీడియాలో పంచుకుంది. ‘‘అతను ఆ సమయంలో ప్రతిదీ అందంగా చేశాడు. నీవు నన్ను ప్రేమించినందుకు ప్రతిరోజు దేవునికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. లవ్ యూ నికోలస్ పూరన్’’ అంటూ తన ప్రేమను చాటుకుంది.
ఇక పీబీకేఎస్ ప్రధాన కోచ్ అనిల్ కుంబ్లే, వెస్టిండీస్ ప్రముఖ క్రికెటర్ జాసన్ హోల్డర్, కరేబియన్ వన్డే, టీ-20 కెప్టెన్ కీరోన్ పొలార్డ్ ఈ సందర్భంగా ఆయనకు అభినందనలు తెలిపారు. ఇక పూరన్ నిశ్చితార్థం సమయంలో మోకాలిపై కూర్చుని మిగ్యూల్ చేతికి రింగ్ పెట్టిన ఫొటోను అభిమానులతో పంచుకున్న సంగతి తెలిసందే. ఈ ఫొటోకు ‘‘ఆ భగవంతుడి ఆశీస్సులతో మిగ్యూల్‌తో నా నిశ్చితార్థం జరిగింది. ఈ విషయాన్ని మీతో పంచుకుంటునందుకు సంతోషంగా ఉంది. లవ్ యూ మిగ్.. నిన్ను నేను పొందాను.’’ అంటూ రాసుకొచ్చాడు.
(చదవండి: సుదీర్ఘ నిరీక్షణ తర్వాత కుటుంబాన్ని కలిసిన వార్నర్)
ప్రేయసిని పెళ్లాడిన వెస్టిండీస్ క్రికెటర్ పూరన్
Published Tue, Jun 1 2021 9:45 AM | Last Updated on Tue, Jun 1 2021 2:48 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment