Jamaica
-
ఎనిమిదేళ్ల తర్వాత...
లాస్ వేగస్: కోపా అమెరికా కప్ ఫుట్‌బాల్ టోర్నీలో ఈక్వెడార్ జట్టు ఎనిమిదేళ్ల తర్వాత తొలి విజయాన్ని అందుకుంది. గ్రూప్‘బి’లో భాగంగా జమైకాతో జరిగిన మ్యాచ్‌లో ఈక్వెడార్ 3–1తో నెగ్గింది. 13వ నిమిషంలో జమైకా ప్లేయర్ కేసీ పాల్మెర్ సెల్ఫ్ గోల్‌తో ఈక్వెడార్ ఖాతా తెరిచింది. కెండ్రీ పెజ్ (45+4వ ని.లో) గోల్‌తో ఈక్వెడార్ ఆధిక్యం 2–0కు పెరిగింది. 54వ నిమిషంలో ఆంటోనియో జమైకాకు తొలి గోల్ అందించాడు. అలాన్ మిండా (90+1వ ని.లో) గోల్‌తో ఈక్వెడార్ విజయాన్ని ఖాయం చేసుకుంది. మరో మ్యాచ్‌లో వెనిజులా 1–0తో మెక్సికోను ఓడించి క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. -
బోల్ట్‌కు చేదు అనుభవం.. అకౌంట్ నుంచి 97 కోట్లు మాయం
జమైకా దిగ్గజ అథ్లెట్.. ఒలింపియన్ ఉసెన్ బోల్ట్‌కు చేదు అనుభవం ఎదురైంది. బోల్డ్ అకౌంట్ నుంచి దాదాపు 12 మిలియన్ డాలర్లు(భారత కరెన్సీలో దాదాపు రూ. 97 కోట్ల 60 లక్షలు) మాయమైనట్లు సమాచారం. అకౌంట్ నుంచి మాయమైన డబ్బంతా బోల్ట్ లైఫ్‌టైమ్ సేవింగ్ డబ్బులని అతని లాయర్ లింటన్ పి. గార్డన్ తెలిపారు. కింగ్స్టన్ అనుబంధ కంపెనీలో స్టాక్స్ అండ్ సెక్యూరిటీస్‌లో బోల్ట్ పెట్టుబడులు పెట్టినట్లు తెలిసింది. తాజాగా షేర్స్‌లో నష్టాలు రావడంతో బోల్ట్ అనుమతి లేకుండానే అతని అకౌంట్ నుంచి డబ్బు మాయం చేశారని లాయర్ తెలిపారు. ప్రస్తుతం బోల్డ్ అకౌంట్లో కేవలం 12వేల డాలర్లు మాత్రమే మిగిలాయన్నారు. ఈ వ్యవహారంపై తాము కోర్టులో కేసు వేయనున్నట్లు బోల్ట్ తరపు లాయర్ గార్డన్ వెల్లడించారు. ''ఇది వినడానికి షాకింగ్‌గా ఉంది. బోల్ట్ ఇన్వెస్ట్ చేసిన షేర్స్ నష్టాలు రావడంతో అనుమతి లేకుండా అతని అకౌంట్లో డబ్బులు మాయం చేయడం ఏంటని.. ఆ డబ్బులు బోల్ట్ లైఫ్‌టైమ్ సేవింగ్స్ అని.. ప్రైవేటు పెన్షన్ రూపంలో వాటిని పొందాలని బోల్ట్ ఇది వరకే బ్యాంకుతో ఒప్పందం చేసుకున్నాడు. అయితే ముందస్తు సమాచారం లేకుండా అకౌంట్ నుంచి డబ్బుల మాయం చేసిన కింగ్స్టన్ అనుబంధ సంస్థపై కోర్టులో కేసు వేసే అంశాన్ని పరిశీలిస్తున్నాం'' అంటూ లాయర్ గార్డన్ తెలిపారు. 2017లో అథ్లెటిక్స్‌కు గుడ్‌బై చెప్పిన బోల్ట్.. దాదాపు పదేళ్ల పాటు ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్ ఈవెంట్స్‌ను శాసించాడు. 100, 200, 400 మీటర్ల విభాగంలో పరుగుల రారాజుగా నిలిచిపోయాడు. వరుసగా ఎనిమిదిసార్లు ఒలింపిక్ గోల్డ్ మెడల్స్ సాధించి ఉసెన్ బోల్ట్ ఎవరికి సాధ్యం కాని రికార్డు నెలకొల్పి చరిత్ర సృష్టించాడు. చదవండి: Hashim Amla: మచ్చలేని క్రికెటర్.. కోహ్లితో పోటీపడి పరుగులు మాజీ బాయ్‌ఫ్రెండ్ మొహం చూడకూడదని గోడ కట్టించింది -
FIFA World Cup 2022: 36 ఏళ్ల తర్వాత...
టొరంటో: సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ కెనడా ఫుట్‌బాల్ జట్టు 36 ఏళ్ల తర్వాత మళ్లీ ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌కు అర్హత సాధించింది. ఉత్తర, మధ్య అమెరికా, కరీబియన్ దేశాల జోన్ క్వాలిఫయింగ్ టోర్నీలో భాగంగా జమైకాతో జరిగిన మ్యాచ్‌లో కెనడా 4–0 గోల్స్ తేడాతో గెలిచింది. గతంలో కెనడా 1986 ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నీలో ఆడి లీగ్ దశలోనే నిష్క్రమించింది. చదవండి: IPL 2022: ఎవరీ ఆయుష్ బదోని.. తొలి మ్యాచ్‌లోనే అదరగొట్టాడు -
మహిళల 100 మీటర్ల స్ప్రింట్‌లో జమైకా క్లీన్‌స్వీప్
స్ప్రింట్ రేసుల్లో జమైకా మహిళా అథ్లెట్లు మరోసారి తమ ఆధిపత్యం చాటుకున్నారు. టోక్యో ఒలింపిక్స్‌లో మహిళల 100 మీటర్ల రేసులో స్వర్ణ, రజత, కాంస్య పతకాలు సొంతం చేసుకొని క్లీన్‌స్వీప్ చేశారు. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లోనూ జమైకా తొలిసారి క్లీన్‌స్వీప్ చేసింది. 1928 ఒలింపిక్స్‌లో తొలిసారి మహిళల 100 మీటర్ల రేసును ప్రవేశపెట్టగా ఇప్పటి వరకు జమైకా మాత్రమే రెండు పర్యాయాలు స్వర్ణ, రజత, కాంస్య పతకాలను గెల్చుకుంది. 2016 రియో ఒలింపిక్స్ చాంపియన్ ఎలైన్ థాంప్సన్ హెరా ‘టోక్యో’లోనూ మెరుపు వేగంతో దూసుకుపోయి రెండోసారి ఒలింపిక్ చాంపియన్‌గా నిలిచింది. జమైకాకే చెందిన షెల్లీ ఆన్ ఫ్రేజర్‌కు రజతం... షెరికా జాక్సన్‌కు కాంస్యం లభించాయి. టోక్యో: స్ప్రింట్ బుల్లెట్ ఉసేన్ బోల్ట్ ‘రియో’ ఒలింపిక్స్‌లో ఆగిపోయాడు. కానీ... జమైకన్లు మాత్రం సాగిపోతున్నారు. పరుగు పెడితే... పతకం మెడలో పడిందా... లేదా అన్నట్లు ట్రాక్‌పై చెలరేగిపోతున్నారు. మహిళల 100 మీటర్ల పరుగులో అయితే ఎలైన్ థాంప్సన్ హెరా... బోల్ట్‌లా కాదు ముమ్మాటికి బోల్ట్‌నే తలపించింది. కొత్త ఒలింపిక్ రికార్డుతో స్వర్ణం చేజిక్కించుకుంది. ట్రాక్‌పై ఆమె మెరుపు వేగంతో దూసుకొచ్చేసింది. ఆమెకు సమీప దూరంలో ఎవరూ లేరు. ఈ 100 మీటర్ల షార్ట్ డిస్టెన్స్‌లో ఇంత వ్యత్యాసం చూపడం ఒక్క బోల్ట్‌కే సాధ్యమైంది. ఇప్పుడదే వేగాన్ని ఎలైన్ థాంప్సన్ కనబరిచింది. మిగిలిన పతకాలను కూడా ఆమె సహచరులే పట్టేశారు. దీంతో ఈ ఈవెంట్‌ను జమైకన్లే క్లీన్‌స్వీప్ చేశారు. శనివారం జరిగిన మహిళల 100 మీటర్ల స్ప్రింట్‌లో ఎలైన్ థాంప్సన్ పోటీని అందరికంటే ముందుగా 10.61 సెకన్లలో ముగించింది. తద్వారా ఆమె 33 ఏళ్ల ఒలింపిక్ రికార్డును తిరగరాసింది. 1988 సియోల్ ఒలింపిక్స్‌లో అమెరికాకు చెందిన ఫ్లారెన్స్ గ్రిఫిత్ జాయ్‌నెర్ నెలకొల్పిన 10.62 సెకన్ల రికార్డు 0.01 సెకను తేడాతో ఎలైన్ తన పేర లిఖించుకుంది. ఈ ఈవెంట్లో షెల్లీ అన్ ఫ్రేజర్ (10.74 సెకన్లు) రజతం గెలుపొందగా, షెరికా జాక్సన్ (10.76 సెకన్లు) కాంస్యం నెగ్గింది. బీజింగ్ ఒలింపిక్స్ (2008)లోనూ జమైకన్ అమ్మాయిలు ఇలాగే క్లీన్‌స్వీప్ చేశారు. కానీ ఆనాడు ఉసేన్ బోల్ట్ రికార్డు (9.69 సెకన్లు) ప్రదర్శన ముందు అమ్మాయిల ఘనత చిన్నబోయింది. అప్పుడు షెల్లీ అన్ ఫ్రేజర్ బంగారం గెలిచింది. షెల్లీ మళ్లీ లండన్ (2012)లోనూ స్వర్ణం నిలబెట్టుకుంది. మొత్తం మీద ఆమె ఖాతాలో నాలుగు (2 స్వర్ణాలు, 1 రజతం, రియోలో కాంస్యం) ఒలింపిక్ పతకాలున్నాయి. ఈ జమైకన్ లేడి చిరుతలకు క్లీన్‌స్వీప్ చేసేందుకు మరో అవకాశం 200 మీటర్ల స్పింట్ రేసు కల్పించనుంది. పైగా ఆ ఈవెంట్లో ఎలైన్ థాంప్సన్ డిఫెండింగ్ చాంపియన్. 200 మీటర్ల పరుగులో కూడా పతకాలన్నీ ఊడ్చేస్తే స్ప్రింట్‌లో జమైకన్లకు తిరుగుండదేమో! నేడే పురుషుల 100 మీటర్ల ఫైనల్ అందరూ గుడ్లప్పగించి చూసే అథ్లెటిక్ ఈవెంట్ పురుషుల 100 మీటర్ల పరుగు పోటీ నేడు జరగనుంది. బీజింగ్ (2008) నుంచి రియో (2016) దాకా ఉసేన్ బోల్ట్ వేగమే కనబడిన ఒలింపిక్స్‌లో ఇప్పుడు కొత్త చాంపియన్ స్ప్రింటర్‌ను చూడబోతున్నాం. జమైకన్ దిగ్గజం బోల్ట్ రిటైరైన తర్వాత జరుగుతున్న తొలి ఒలింపిక్స్‌లో స్ప్రింట్‌ను శాసించేది ఎవరో కొన్ని గంటల్లోనే తేలనుంది. ఆదివారమే జరిగే మూడు సెమీఫైనల్స్‌లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన వారు... ఆ తర్వాత అత్యుత్తమ సమయం నమోదు చేసిన మరో ఇద్దరు ఫైనల్‌కు అర్హత సాధిస్తారు. మొత్తం ఎనిమిది మంది ఫైనల్లో పోటీపడతారు. భారత కాలమానం ప్రకారం సాయంత్రం గం. 6.20 ఫైనల్ పోటీ జరుగుతుంది. ఒలింపిక్స్‌లో మహిళల 100 మీటర్ల విభాగంలో స్వర్ణాన్ని నిలబెట్టుకున్న నాలుగో అథ్లెట్ ఎలైన్. గతంలో వ్యోమియా టైయస్ (అమెరికా; 1964, 1968)... గెయిల్ డెవర్స్ (అమెరికా; 1992, 1996)... షెల్లీ ఆన్ ఫ్రేజర్ (జమైకా; 2008, 2012) మాత్రమే ఈ ఘనత సాధించారు. -
బోల్ట్ దంపతులకు కవలలు.. సునామీ సృష్టిస్తున్న పేర్లు
జమైకా: చిరుత వేగంతో పరుగెత్తే ప్రపంచ ప్రఖ్యాత అథ్లెట్ ఉసేన్ బోల్ట్(34) మరోసారి తండ్రి అయ్యాడు. ఆయన జీవిత భాగస్వామి బెన్నెట్ కవల పిల్లలకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని ఫాదర్స్ డే రోజున ఫ్యామిలీ ఫోటోతో ఉసేన్ బోల్ట్ సోషల్ మీడియాలో ఆదివారం పంచుకున్నారు. అయితే, బోల్ట్ పిల్లల పేర్లు ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్నాయి. వారి పేర్లు వరసగా ఒలింపియా లైటనింగ్ బోల్ట్, సెయింట్ లియో బోల్ట్, థండర్ బోల్ట్ కాగా.. ఒలింపియా లైటనింగ్ బోల్ట్ 2020 మేలో జన్మించింది. ఇక కవలల ఫొటో మాత్రమే పంచుకున్న బోల్ట్ వారు ఎప్పుడు జన్మించింది మాత్రం వెల్లడించలేదు. బోల్ట్ పిల్లల పేర్లపై ఓ నెటిజన్ స్పందిస్తూ.. ‘‘లైటనింగ్ (మెరుపు), థండర్ (ఉరుము)? ఇక ఇక్కడ తుపానే’’ అంటూ కామెంట్ చేశారు. ‘‘ఈ అందమైన కుటుంబానికి ఇక ఆనందం తప్ప మరేమీ ఉండదు.’’ అంటూ మరో నెటిజన్ రాసుకొచ్చారు. బోల్ట్ తన ఫ్యామిలీ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అభిమానుల నుంచి భారీ ఎత్తున స్పందన వచ్చింది. ఆయనకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కాగా, బోల్ట్ జీవిత భాగస్వామి బెన్నెట్ స్పందిస్తూ.. ‘‘ ఈ కుటుంబానికి ఉస్సేన్ బోల్ట్ ఓ పెద్ద బలం.. పిల్లలకు ఓ గొప్ప తండ్రి.. ఎప్పటికీ ప్రేమతో ఫాదర్స్ డే శుభాకాంక్షలు.’’ అంటూ రాసుకొచ్చారు. ఇక 2008, 2012, 2016 లో జరిగిన ఒలింపిక్స్‌లో ఉసేన్ బోల్ట్ ఎనిమిది బంగారు పతకాలు సాధించిన విషయం తెలిసిందే. వరుసగా మూడు ఒలింపిక్స్ క్రీడల్లో 100 మీటర్లు, 200 మీటర్ల రేసుల్లో రెండేసి పతకాలు గెలిచిన ఏకైక అథ్లెట్ ఉసేన్ బోల్ట్. Olympia Lightning Bolt ⚡️ Saint Leo Bolt ⚡️ Thunder Bolt ⚡️@kasi__b pic.twitter.com/Jck41B8j3J — Usain St. Leo Bolt (@usainbolt) June 20, 2021 చదవండి: Wrestler Khali: రెజర్ల్ కాళి ఇంట విషాదం -
ప్రేయసిని పెళ్లాడిన నికోలస్ పూరన్
జమైకా: వెస్టిండీస్ విధ్వంసకర బ్యాట్స్‌మన్ నికోలస్ పూరన్ ఓ ఇంటివాడయ్యాడు. ఈ పంజాబ్ కింగ్స్ హిట్టర్ తన ప్రేయసి అలిస్సా మిగ్యూల్‌ను వివాహం చేసుకున్నాడు. ఈ విషయాన్ని పూరన్ స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. ‘‘జీసస్ ఈ నా జీవితంలో ఎన్నో సార్లు ఆశీర్వదించాడు. నా జీవితంలో నిన్ను కలిగి ఉండటం కంటే గొప్పది ఏదీ లేదు. మిస్టర్ అండ్ మిసెస్ పూరన్‌కు స్వాగతం’’ అంటూ ట్విటర్లో రాసుకొచ్చాడు. ఇక అలిస్సా మిగ్యూల్ కూడా తన ప్రేమను సోషల్ మీడియాలో పంచుకుంది. ‘‘అతను ఆ సమయంలో ప్రతిదీ అందంగా చేశాడు. నీవు నన్ను ప్రేమించినందుకు ప్రతిరోజు దేవునికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. లవ్ యూ నికోలస్ పూరన్’’ అంటూ తన ప్రేమను చాటుకుంది. ఇక పీబీకేఎస్ ప్రధాన కోచ్ అనిల్ కుంబ్లే, వెస్టిండీస్ ప్రముఖ క్రికెటర్ జాసన్ హోల్డర్, కరేబియన్ వన్డే, టీ-20 కెప్టెన్ కీరోన్ పొలార్డ్ ఈ సందర్భంగా ఆయనకు అభినందనలు తెలిపారు. ఇక పూరన్ నిశ్చితార్థం సమయంలో మోకాలిపై కూర్చుని మిగ్యూల్ చేతికి రింగ్ పెట్టిన ఫొటోను అభిమానులతో పంచుకున్న సంగతి తెలిసందే. ఈ ఫొటోకు ‘‘ఆ భగవంతుడి ఆశీస్సులతో మిగ్యూల్‌తో నా నిశ్చితార్థం జరిగింది. ఈ విషయాన్ని మీతో పంచుకుంటునందుకు సంతోషంగా ఉంది. లవ్ యూ మిగ్.. నిన్ను నేను పొందాను.’’ అంటూ రాసుకొచ్చాడు. (చదవండి: సుదీర్ఘ నిరీక్షణ తర్వాత కుటుంబాన్ని కలిసిన వార్నర్) -
మోదీకి నా ప్రత్యేక ధన్యవాదాలు : గేల్
జమైకా : జమైకాకు కోవిడ్ -19 వ్యాక్సిన్లను పంపినందుకు విండీస్ స్టార్ క్రికెటర్ క్రిస్‌గేల్ భారత ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ఒక వీడియోలో గేల్ మాట్లాడుతూ ‘ కోవిడ్-19 వ్యాక్సిన్ విరాళంగా ఇచ్చినందుకు ప్రధాని మోదీ, భారత ప్రజలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జమైకన్లు ఈ సహాయాన్ని ఎప్పటికీ మరిచిపోలేరు. భారత అభిమానులను నేను త్వరలోనే కలుస్తాను’ అని అన్నారు. భారతదేశం గేల్‌కు ఎంతగానో నచ్చిందని, అక్కడ ఉండటానికి అతడు చాలా ఇష్టపడతాడని చెప్పిన విషయాన్ని జమైకాలోని హైకమిషన్ ఆఫ్ ఇండియా ఈ సందర్భంగా ట్వీట్ చేసింది. ‘జమైకన్ వీరుడి సుడిగాలి బ్యాటింగ్ మాకు ఎల్లపుడు ఆనందాన్ని ఇస్తుంది. భారత ప్రజలు గేల్ విధ్వంసకర బ్యాటింగ్ కోసం ఎదురుచూస్తున్నారు. వ్యాక్సిన్ మైత్రి పేరుతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న మా స్నేహితులకు వ్యాక్సిన్ల్ను పంపడం మాకు ఆనందంగానే ఉంది’’ అంటూ గేల్ మాటలకు కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి ట్విటర్ వేదికగా స్పందించారు. కాగా మానవతా దృక్ఫథంతో భారత ప్రభుత్వం ‘ వ్యాక్సిన్ మైత్రి’ కార్యక్రమంలో భాగంగా మేడ్ ఇన్ ఇండియా COVID-19 వ్యాక్సిన్లను ఇతర దేశాలకు అందిస్తోంది. ఇక కోవిడ్ వ్యాక్సిన్లను కరేబియన్ దీవులకు పంపినందుకుగానూ గతవారం, వెస్టిండీస్ మాజీ క్రికెటర్లు వివియన్ రిచర్డ్స్, రిచీ రిచర్డ్సన్, జిమ్మీ ఆడమ్స్, ఆండ్రీ రసెల్ కూడా ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపిన సంగతి తెలిసిందే. ( చదవండి : 'గేల్.. నీలాగా నాకు కండలు లేవు' ) -
ప్రధాని మోదీకి విండీస్ క్రికెటర్ రసెల్ ధన్యవాదాలు
జమైకా: జమైకాకు కరోనా వైరస్ వ్యాక్సిన్లను పంపినందుకు విండీస్ ఆటగాడు ఆండ్రీ రసెల్ ప్రధాని నరేంద్ర మోదీకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపాడు. "ప్రధాని మోదీకి, భారత హైకమిషనర్‌కు నా హృదయ పూర్వక ధన్యవాదాలు. ఈ చర్యతో మన రెండు దేశాల మధ్య బంధాలు మరింత బలపడ్డాయి" అంటూ రసెల్ బుధవారం ట్విటర్ వేదికగా వీడియోను పోస్ట్ చేశాడు. కాగా, మార్చి 8న మేడ్ ఇన్ ఇండియా వ్యాక్సిన్లను భారత్ జమైకాకు పంపింది. దీంతో జమైకా ప్రధాని ఆండ్రూ హోల్నెస్ భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపాడు. "భారత ప్రభుత్వం పంపిన 50000 డోసుల ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ను అందుకున్నట్లు చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాను" అంటూ ట్వీట్ చేశాడు. కరోనా నివారణకు ఇంతటి సహాయం చేసిన భారత ప్రభుత్వానికి , ప్రజలకు మా దేశ ప్రజల తరుపున కృతజ్ఞతలు తెలుపుతున్నానని పేర్కొన్నాడు. 'వ్యాక్సిన్ మైత్రి' పేరుతో ఇతర దేశాలకు వ్యాక్సిన్లు కాగా, కోవిడ్ వ్యాక్సిన్లను కరేబియన్ దీవులకు పంపినందుకుగానూ గతవారం, వెస్టిండీస్ మాజీ క్రికెటర్లు వివియన్ రిచర్డ్స్, రిచీ రిచర్డ్సన్, జిమ్మీ ఆడమ్స్ ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ఇరుదేశాల మధ్య భవిష్యత్తులోనూ ఇలాంటి స్నేహ సంబంధాలే కొనసాగాలని ఆకాంక్షిస్తున్నట్టు వారు పేర్కొన్నారు. కరోనా కష్టకాలంలో ఇంతటి సహాయం చేసిన భారత ప్రజలకు కూడా వారు కృతజ్ఞతలు తెలిపారు. జమైకా, బార్బడోస్, సెయింట్ లూషియా, సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ తదితర దీవులు భారత్ నుంచి వ్యాక్సిన్ డోసులు అందుకున్నాయి. 'I want to say a big thank you to PM @narendramodi & @hcikingston. The #COVID19 Vaccines are here & we are excited.' @PMOIndia '#India & #Jamaica - We are more than close, we are now brothers'. WI Cricketer Andre Russell praises #VaccineMaitri @Russell12A @DrSJaishankar pic.twitter.com/LhGi5OQeED — India in Jamaica (@hcikingston) March 16, 2021 -
మిస్ వరల్డ్‌గా జమైకా సుందరి
-
మిస్ వరల్డ్‌గా జమైకా సుందరి
లండన్: జమైకాకు చెందిన టోనీ–ఆన్ సింగ్ మిస్ వరల్డ్–2019 కిరీటం దక్కించుకున్నారు. లండన్‌లోని ఎక్సెల్ లండన్ కన్వెన్షన్ సెంటర్లో శనివారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగిన కార్యక్రమంలో ఆమెను ఈ కిరీటం వరించింది. గత ఏడాది మిస్ వరల్డ్‌గా నిలిచిన మెక్సికో సుందరి వనెస్సా పొన్స్.. టోనీ–ఆన్ సింగ్ తలపై మిస్ వరల్డ్ కిరీటాన్ని అలంకరించారు. ఈ పోటీలో ఫస్ట్ రన్నరప్‌గా ఫ్రాన్స్‌కు చెందిన ఒఫ్లి మెజినో, సెకండ్ రన్నరప్‌గా భారత్‌కు చెందిన సుమన్ రావ్ నిలిచారు. నవంబర్ 20వ తేదీ నుంచి మొదలైన 69వ మిస్ వరల్డ్–2019 పోటీలో 120 దేశాలకు చెందిన అందగత్తెలు పాల్గొన్నారు. పలు వడబోతల అనంతరం ఫైనల్స్ కోసం 10 మందిని ఎంపిక చేశారు. అంతిమంగా ఎంపికైన ఐదుగురికి ప్రముఖ వ్యాఖ్యాత పియర్స్ మోర్గాన్ నేతృత్వంలోని బృందం పలు ప్రశ్నలు సంధించింది. అందగత్తెల సమాధానాల ఆధారంగా విజేతలను ఎంపిక చేసింది. తన సొంతూరుతోపాటు ప్రపంచవ్యాప్తంగా లింగ సమానత్వం కోసం పోరాడతానని ఈ సందర్భంగా భారత్‌కు చెందిన రన్నరప్ సుమన్ రావ్ అన్నారు. జమైకా నుంచి మిస్ వరల్డ్ గెలుచుకున్న నాలుగో మహిళగా టోనీ–ఆన్ చరిత్ర సృష్టించారు. తొమ్మిదేళ్ల వయస్సులో ఆమె కుటుంబం అమెరికాకు వలస వెళ్లి, ఫ్లోరిడాలో స్థిరపడింది. సుమన్ రావ్ ► జననం: 1998 నవంబర్ 23 ► స్వస్థలం: రాజస్తాన్ రాష్ట్రం ఉదయ్‌పూర్ సమీపంలోని అయిదానా ► తల్లి: సుశీలా కున్వర్ రావ్, గృహిణి ► తండ్రి: రతన్ సింగ్, నగల వ్యాపారి ► విద్య: నవీముంబైలోని మహాత్మా స్కూల్ ఆఫ్ అకాడెమిక్స్ అండ్ స్పోర్ట్స్‌లో పాఠశాల విద్య పూర్తి చేశారు, ప్రస్తుతం ముంబై యూనివర్సిటీలో చార్టెర్డ్ అకౌంటెన్సీ చదువుతున్నారు. ► భాషలు: ఇంగ్లిష్, హిందీతోపాటు మాతృభాష మేవారీ ► వృత్తి: మోడల్, డ్యాన్సర్(కథక్) ► 2018లో మిస్ నవీముంబై పోటీలో పాల్గొని మొదటి రన్నరప్‌గా నిలిచారు. అనంతరం రాజస్తాన్ తరఫున పాల్గొని ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ –2019ను, ఆ పోటీల్లోనే మిస్ ర్యాంప్‌వాక్ అవార్డు గెలుచుకున్నారు. -
అయ్యో.. ఫీల్డ్‌లోనే కూలబడ్డ రసెల్!
జమైకా: కరీబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్)లో వెస్టిండీస్ ఆల్ రౌండర్ ఆండ్రీ రసెల్ తీవ్రంగా గాయపడ్డాడు. బంతిని హిట్ చేసే క్రమంలో అది రసెల్ హెల్మెట్ వెనుకబాగాన బలంగా తాకింది. కుడి చెవికి తగలడంతో రసెల్ మైదానంలో కుప్పకూలిపోయాడు. దాంతో ప్రాథమిక చికిత్స తర్వాత రసెల్‌ను ఆస్పత్రికి తరలించారు. సీపీఎల్‌లో భాగంగా జమైకా తలవాస్ తరఫున ఆడుతున్న రసెల్.. గురువారం సెయింట్ లూసియా జౌక్స్‌తో మ్యాచ్‌లో 14 ఓవర్లో బంతిని హిట్ చేసేందుకు యత్నించాడు. షార్ట్ పిచ్ బంతిని భారీ షాట్‌కు ప్రయత్నించగా అది కాస్తా అంచనా తప్పి రసెల్ హెల్మెట్‌ను తాకుతూ దూసుకుపోయింది. ఈ క్రమంలోనే కుడి చెవికి గాయం కావడంతో రసెల్ ఫీల్డ్‌లో నిలబడలేకపోయాడు. ఫీల్డ్‌లోనే కూలబడిపోయాడు. దాంతో ఒక్కసారిగా ఆందోళన రేకెత్తింది. ప్రత్యర్థి జట్టు ఫీల్డర్లు రసెల్ వద్దకు వచ్చి హెల్మెట్ తీసి చెక్ చేయడమే కాకుండా నెమ్మదిగా పైకి లేపారు. అదే సమయంలో హుటాహుటీనా అక్కడికి చేరుకున్న మెడికల్ విభాగం ప్రాథమికి చికిత్స తర్వాత రసెల్‌ను ఆస్పత్రికి తరలించింది. అనేక రకాలైన స్కాన్లు నిర్వహించిన తర్వాత రసెల్‌కు ఎటువంటి ప్రమాదం లేదని వైద్యులు తేల్చారు. రసెల్ గాయపడే సమయానికి మూడు బంతులు ఆడి పరుగులేమీ చేయలేదు. ఈ మ్యాచ్‌లో సెయింట్ లూసియా ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. -
డ్రెస్ సరిగాలేదని ఫ్లైట్ దింపేశారు..!
జమైకా : కుమారుడితో కలిసి విమానప్రయాణం చేస్తున్న ఓ మహిళా డాక్టర్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఉక్కపోత కారణంగా ఆమె సౌకర్యవంతమైన దుస్తులు ధరించడంతో ఫ్లైట్ ఎక్కేదిలేదంటూ విమాన సిబ్బంది అడ్డుచెప్పారు. హోస్టన్‌లో నివాసముండే డాక్టర్ తిషా రోయి స్వదేశం జమైకాలో వారంరోజులు పర్యటించి తన ఎనిమిదేళ్ల కుమారుడితో కలిసి అమెరికాకు తిరుగుపయనమయ్యారు. వేడి వాతావరణం కారణంగా ఒళ్లంతా చెమటపట్టడంతో ఆమె సౌకర్యవంతంగా డ్రెస్సింగ్ చేసుకుని విమానం ఎక్కేందుకు వెళ్లారు. అయితే, ఆమె డ్రెస్ అభ్యంతరకరంగా ఉందని, పైన జాకెట్ ధరిస్తేనే ప్రయాణానికి అనుమతిస్తామని అమెరికన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఫ్లైట్ సిబ్బంది తెగేసి చెప్పారు. అప్పటికే ఫ్లైట్ టేకాఫ్‌కు సమయం దగ్గర పడటంతో.. తన దగ్గర జాకెట్ లేదని.. కనీసం ఓ దుప్పటైనా ఇవ్వండని తిషా సిబ్బందిని కోరింది. ఫ్లైట్ సిబ్బంది ఎలాంటి సాయం చేయకపోగా మరింత కటువుగా మాట్లాడారు. దాంతో చేసేదేంలేక తిషా, ఆమె కుమారుడు వెనుదిరిగారు. ఈ ఘటనపై విచారిస్తున్నామని... డాక్టర్‌కు ఫ్లైట్ చార్జీలు రిఫండ్ చేస్తామని అమెరికన్ ఎయిర్‌లైన్స్ చెప్పింది. తనకెలాంటి రిఫండ్ ఇవ్వలేదని, నల్లజాతీయురాలిని కాబట్టే తన దుస్తులపై అనవసర రాద్దాంతం చేశారని తిషా ఆరోపించారు. తనలాగే డ్రెస్ చేసుకున్న మరో మహిళను ప్రయాణానికి అనుమతించారని విమర్శించారు. తనపట్ల జాతి, లింగ వ్యతిరేకత చూపించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై పై అధికారులకు ఫిర్యాదు చేస్తానని చెప్పారు. ఫ్లైట్ ఎక్కేముందు దిగిన ఫొటోను ఆమె ట్విటర్లో షేర్ చేశారు. -
కోట్లు గెలిచి.. ముఖానికి మాస్క్‌తో వచ్చి!
కింగ్స్టన్ : కష్టాల్లో ఉన్నవారికి ఎవరైనా చిన్నసాయం చేస్తేనే సంతోషిస్తారు. అలాంటిది ఓ మహిళకు ఏకంగా 180 మిలియన్ల జమైకన్ డాలర్ల లాటరీ ప్రైజ్‌మనీని(భారత కరెన్సీలో సుమారుగా 9.44 కోట్ల రూపాయాలు) నెగ్గారు. అయితే లాటరీ నెగ్గడం కంటే కూడా ఆ నగదు తీసుకోవడానికి వచ్చిన తీరే చూపరులను ఆకర్షించింది. ఆ వివరాలిలా.. ఎన్ గ్రే అనే జమైకా మహిళ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది జనవరిలో సూపర్ లొట్టో లాటరీ టికెట్ కొన్నారు. ఆమె పంట పండింది. తాజాగా తీసిన లాటరీ డ్రాలో ఎన్. గ్రే విజేతగా నిలిచారని ప్రకటించగా.. ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. లాటరీ ప్రైజ్‌మనీని తీసుకునే కార్యక్రమానికి ముఖానికి మాస్క్‌తో ఆ మహిళ వచ్చారు. తాను ఆ నగదులో కొంత భాగం తన అప్పులకు వెచ్చించగా, మరికొంత పర్యాటక ప్రదేశాలు చూసేందుకు ఖర్చు చేస్తానన్నారు. యువత కోసం, తన సామాజిక వర్గం కోసం కమ్యూనిటీ సెంటర్లను నిర్మించి సేవలు అందిస్తానని చెప్పారు. తన ఉనికిని అందరికీ తెలియజెప్పడం ఇష్టం లేని కారణంగా మాస్క్ ధరించినట్లు లాటరీ విజేత తెలిపారు. ముఖానికి మాస్క్ ధరించడంపై నెటిజన్లు స్పందించారు. ఎత్తుపల్లాలు ఎన్ని ఎదురైనా ఆమె సాధారణంగా ఉండాలని భావించడం సరైన నిర్ణయమని కొందరు పోస్టులు చేస్తున్నారు. ఇతరులు ఎలాగైతో ఆలోచిస్తారో.. అదే విధంగా తాను ఎవరన్నది తెలియకుండా ఆ మహిళ తెలివైన పని చేశారని మరికొందరు ప్రశంసిస్తున్నారు. -
‘మా జట్టు సిద్ధమైంది..’
పారిస్: ఇన్నాళ్లూ మనం దిగ్గజ అథ్లెట్ ఉసేన్ బోల్ట్ పరుగును, ప్రపంచ రికార్డులను చూశాం. ఇక మీదట అతని సారథ్యాన్ని చూడబోతున్నాం. ఈ జమైకన్ స్ప్రింట్ స్టార్ చిన్నారుల సంక్షేమం కోసం యూనిసెఫ్ సంస్థ నిర్వహిస్తున్న ఛారిటీ ఫుట్‌బాల్ మ్యాచ్‌లో తలపడేందుకు సిద్ధమయ్యాడు. ఫుట్‌బాల్ అంటే ఎంతో ఇష్టపడే ఉసేన్ బోల్ట్ ‘సాకర్ ఎయిడ్ వరల్డ్ ఎలెవన్’ జట్టుకు సారథిగా వ్యవహరిస్తాడు. అవతలి జట్టు (ఇంగ్లండ్)కు బ్రిటిష్ రాక్‌స్టార్ రాబీ విలియమ్స్ నాయకత్వం వహించనున్నాడు. మాంచెస్టర్ యునైటెడ్‌కు చెందిన ఓల్డ్ ట్రాఫోర్డ్ స్టేడియంలో జూన్ 10న ఈ మ్యాచ్ జరగనుంది. దీనికి సంబంధించిన ప్రచార వీడియోలో బ్రెజిల్ స్టార్ రొనాల్డినో, రియల్ మాడ్రిడ్ కోచ్ జినెదిన్ జిదాన్, అమెరికన్ కామెడీ యాక్టర్ విల్ ఫెరెల్ నటించారు. తన సాకర్ ముచ్చటపై బోల్ట్ ట్విట్టర్లో ‘సెలబ్రిటీస్, లెజెండ్స్, బ్రాండ్ న్యూ కెప్టెన్‌తో సాకర్ ఎయిడ్ వరల్డ్ ఎలెవన్ జట్టు సిద్ధమైంది’ అని ట్వీట్ చేశాడు. -
ఈ బామ్మకు 117 ఏళ్లు
నాట్ ఔట్ ‘నా ఆయుష్షు కూడా పోసుకుని బతుకు’ అని ఆశీర్వదించడం మన సంప్రదాయం. చూడబోతే ఈ బామ్మ అందరి ఆయుష్షు పోసుకొని హాయిగా జీవిస్తున్నట్టుంది. కారణం ఆమె వయసు. ఎంతో తెలుసా? 117 సంవత్సరాలు. ప్రస్తుతం ప్రపంచంలో జీవించిన ఉన్న దీర్ఘాయిష్కుల్లో ఈమే ప్రపథమరాలు అని కొన్ని సంస్థలు నిర్థారిస్తున్నాయి. కరేబియన్ దీవుల్లో ఉండే జమైకా దేశానికి చెందిన ఈ బామ్మ పేరు కూడా గమ్మత్తుగా ఉంటుంది. రెండు రంగుల పేరు అది. ‘వయొలెట్ బ్రౌన్’. చెరకు బట్టీల్లో పని చేసే తల్లిదండ్రులకు 1900 సంవత్సరంలో పుట్టిన ఈ బామ్మ తన పదమూడో ఏట నుంచి క్రిస్టియన్ మతం స్వీకరించి అందులో కొనసాగుతోంది. భర్త ద్వారా ఒక కుమార్తెకు తర్వాత తన సహజీవనంతో మరో ఐదు మంది సంతానానికి ఈమె జన్మనిచ్చింది. వీరిలో ఐదుగురు ఇంకా జీవించే ఉన్నారు. ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే వయొలెట్ బ్రౌన్ తన ఆయుష్షుతో రికార్డు సృష్టిస్తే ‘తల్లి బతికున్న దీర్ఘవయస్కురాలిగా’ ఈమె 97 సంవత్సరాల కుమార్తె మరో రికార్డు సృష్టించింది. ఇప్పటికే మీడియాలో ‘ఆంట్ వి’గా ప్రసిద్ధురాలైన వయొలెట్ బ్రౌన్ ఈ రోజుకు కూడా పన్ను కదలకుండా కాలు బెణకకుండా హాయిగా జీవిస్తూ ఉంది. ఆహారంలో చేపలు, మాంసం ఎక్కువ తీసుకోవడం చికెన్, పోర్క్ తక్కువ తినడం తన ఆరోగ్య రహస్యం కావచ్చని అంటోంది. ‘అది మీ భౌతిక ఆరోగ్యానికి కారణం కావచ్చు... మరి మానసిక ఆరోగ్యానికి’ అని అడిగితే చిర్నవ్వు నవ్వి ‘తల్లిదండ్రులని గౌరవించండి. మీ మనసు ఆయుష్షు బాగుంటాయి. నేను నా తల్లిదండ్రులను మనస్ఫూర్తిగా ప్రేమించాను, గౌరవించాను’ అని బదులు చెప్పింది. తల్లిదండ్రులను పట్టించుకోని ఈ రోజుల్లో బామ్మ మాట బంగారుబాట అనిపిస్తోంది కదూ. -
జమైకాలో అదే నా చివరి రేసు: బోల్ట్
కింగ్స్టన్: పరుగుల వీరుడు, జమైకా స్టార్ స్పింటర్ ఉసేన్ బోల్ట్ తన దేశంలో పాల్గొనబోయే చివరి రేసును ప్రకటించేశాడు. స్వదేశంలో వచ్చే జూన్ లో జరిగే రేసర్స్ గ్రాండ్ ప్రినే తనకు అక్కడ ఆఖరి రేసు అని బోల్ట్ స్ఫష్టం చేశాడు. ఇప్పటికే లండన్ లో జరిగే వరల్డ్ చాంపియన్ షిప్ తో తన రేసింగ్ కెరీర్‌కు ముగింపు పలకబోతున్నట్లు ప్రకటించిన బోల్ట్.. జమైకాలో పాల్గొనే ఆఖరి రేసును కూడా వెల్లడించాడు. 'రేసర్స్ గ్రాండ్ ప్రినే జమైకా ప్రజల సమక్షంలో పాల్గొనబోయే ఆఖరి రేసు. ఆ తరువాత ఇక్కడ నా పరుగు ఉండదు'అని బోల్ట్ పేర్కొన్నాడు. ఈ ఏడాది జరిగిన రేసర్స్ గ్రాండ్ ప్రిలో బోల్ట్ 100 మీటర్ల పరుగులో విజేతగా నిలిచాడు. వచ్చే ఏడాది కూడా ఇదే ఫామ్ ను చాటుకుని విజయంతో తన ప్రజలకు వీడ్కోలు పలకాలని భావిస్తున్నట్లు ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు. -
బాకులో చెస్ ఒలింపియాడ్
-
బోల్ట్ కు మంత్రి పదవి?
రియో డీ జనీరో: తన ఒలింపిక్స్ కెరీర్‌ను దిగ్విజయంగా ముగించిన జమైకా చిరుత ఉసేన్ బోల్ట్ తన రెండో ఇన్నింగ్స్ ను ఆరంభించేందుకు సిద్ధమవుతున్నాడు. ఇప్పటివరకూ పరుగులో అలరించిన బోల్ట్ రాజకీయాల్లోకి అడుగుపెట్టే యోచనలో ఉన్నాడు. ఈ మేరకు జమైకా ప్రధాని ఆండ్రూ హోల్నెస్ నుంచి ఓ సందేశం బోల్ట్ కు చేరింది. ఇప్పటికే తమ కీర్తిని ఎంతో ఉన్నతిలో నిలబెట్టిన బోల్ట్‌కు రాజకీయ ద్వారాలు తెరిచే ఉన్నాయంటూ ఆయన సంకేతాలు పంపారు. 'బోల్ట్ ప్రదర్శనతో జమైకాకు చాలా లాభం చేకూరింది. ఎన్నో ఘనతలను సాధించిన బోల్ట్ పేరును ఉపయోగించుకోవడం మాకు చాలా ముఖ్యం. అందుకు మా తలుపులు తెరిచే ఉన్నాయి' అని బీబీసీకి ఇచ్చిన ఇంటర్యూలో హాలెన్స్ పేర్కొన్నారు. అతను ఒకవేళ మంత్రి పదవి కోరుకున్నా ఇచ్చేందుకు సిద్ధమంటూ ఆయన స్పష్టం చేశారు. ఆదివారం 30వ బర్త్ డే చేసుకుంటున్న బోల్ట్..తన రెండో ఇన్నింగ్స్‌పై త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది. జమైకా ప్రజల కోరిక మేరకు బోల్ట్ రాజకీయ ప్రవేశం ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ బోల్ట్ రాజకీయ ప్రవేశం జరిగితే ఆ ఘనత సాధించిన తొలి ఒలింపియన్ గా బోల్ట్ నిలిచిపోతాడు. -
రియోలో పరుగుల చిరుత
రియోడిజనీరో: వరల్డ్ ఫాస్టెస్ట్ రన్నర్, జమైకా స్ప్రింటర్ ఉసేన్ బోల్ట్ బ్రెజిల్లో అడుగుపెట్టాడు. రియో ఒలింపిక్స్ ప్రారంభానికి వారం రోజుల ముందే రియోడిజనీరోకి రావడం పరుగుల వీరుడి అంకిత భావానికి నిదర్శనం. వరుసగా మూడు ఒలింపిక్స్ లో 100, 200, 4x100 విభాగాలలో స్వర్ణాలు సాధించిన తొలి అథ్లెట్ గా రికార్డు నెలకొల్పేందుకు బోల్ట్ ఎంతో ఆసక్తిగా ఉన్నాడు. బీజింగ్, లండన్ ఒలింపిక్స్ లో మూడు విభాగాలలో స్వర్ణాలు సాధించాడు బోల్ట్. గత శుక్రవారం 200 మీటర్ల రేస్ ను 19.89 సెకన్లలో పూర్తిచేసి తన ఫిట్ నెస్ మరోసారి నిరూపించుకున్నాడు. ఉసేన్ బోల్ట్ మ్యునిక్ లో ఒలింపిక్స్ కోసం శిక్షణ తీసుకున్న విషయం తెలిసిందే. ట్రయల్స్‌లో పాల్గొనకున్నా జమైకా దేశం బోల్ట్ ఎంట్రీని రియో ఒలింపిక్స్‌కు పంపించింది. అమెరికా స్ప్రింటర్ జస్టిన్ గాట్లిన్ తనపై చేసిన వ్యాఖ్యలకు పరుగుతోనే బదులివ్వాలని బోల్ట్ భావిస్తున్నాడు. మరోవైపు రికార్డు స్వర్ణాలపై కన్నేసిన బోల్ట్, రియోను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. -
రియో స్క్వాడ్‌లో బోల్ట్!
కింగ్స్టన్: రియో ఒలింపిక్స్ కు వెళ్లే జమైకా జట్టులో ఆ దేశ స్టార్ అథ్లెట్ ఉసేన్ బోల్ట్ కు స్థానం కల్పించే అవకాశాలు కనబడుతున్నాయి. రియోకు వెళ్లే జమైకా జట్టును సోమవారం ప్రకటించనున్న నేపథ్యంలో ఈ స్టార్ స్ప్రింటర్ పేరు ఇప్పటికే ఖరారైనట్లు తెలుస్తోంది. జమైకా ఒలింపిక్ ట్రయల్స్‌లో భాగంగా ఇటీవల జరిగిన 100మీ. సెమీఫైనల్ హీట్‌ను 10.04 సెకన్లలో ముగించి ఫైనల్‌కు అర్హత సాధించాడు. ఈ రేసు అనంతరం బోల్ట్ మోకాలు పైభాగంలో అసౌకర్యానికి గుర య్యాడు. బోల్ట్ తొడ కండరం నొప్పిని గ్రేడ్-1గా వైద్యులు నిర్ధారించారు. దీంతో రియోకు బోల్ట్ దూరం కానున్నాడని వార్తలు వినిపించాయి. కాగా, తాను రియో ఒలింపిక్స్‌లో పాల్గొనడానికి ప్రస్తుత గాయం ఏమాత్రం అడ్డుకాబోదని బోల్ట్ స్పష్టం చేశాడు. ఈ నేపథ్యంలో రియోకు వెళ్లే జమైకా జట్టులో బోల్ట్ పేరును పరిగణించాలని ఆ దేశ ఒలింపిక్ సంఘం నిర్ణయించింది. అయితే దీనికి ముందు లండన్ లో జరిగే యూనివర్శల్ గేమ్స్‌లో బోల్ట్ పాల్గొని రియోకు అర్హత సాధించాల్సి ఉంది. -
‘రియో’ నా చివరి ఒలింపిక్స్: బోల్ట్
కింగ్స్టన్: ఈ ఏడాది ఆగస్టులో జరిగే రియో ఒలింపిక్స్ తన కెరీర్లో చివరి ఒలింపిక్స్ అని జమైకా స్టార్ స్ప్రింటర్ ఉసేన్ బోల్ట్ ధ్రువీకరించాడు. పూర్తి ఫిట్నెస్తో ఉంటే 2020 టోక్యో ఒలింపిక్స్‌లోనూ బోల్ట్ బరిలోకి దిగే అవకాశముందని అతని కోచ్ గ్లెన్ మిల్స్ ఇటీవలే వ్యాఖ్యానించారు. 2008 బీజింగ్, 2012 లండన్ ఒలింపిక్స్ క్రీడల్లో మూడేసి స్వర్ణాలు సాధించిన బోల్ట్ ఇదే ఫలితాన్ని రియో ఒలింపిక్స్‌లోనూ పునరావృతం చేయాలనే పట్టుదలతో ఉన్నాడు. ‘రియో ఒలింపిక్స్‌లోనూ మూడు స్వర్ణాలు సాధించాలనే లక్ష్యం నిర్దేశించుకున్నాను. ఒకవేళ రియోలో నా లక్ష్యం నెరవేరితే మరో నాలుగేళ్లపాటు ఇదే ఉత్సాహంతో కొనసాగడం చాలా కష్టం. అందుకే నా కెరీర్లో రియోవే చివరి ఒలింపిక్స్ క్రీడలు కానున్నాయి’ అని బోల్ట్ స్పష్టం చేశాడు. -
చరిత్రలో దాగిన స్వరాలు వినిపిస్తున్న జేమ్స్
మ్యాన్ బుకర్ పురస్కారం నవలలోని పాత్రల్లో చిన్నవాళ్లు, ముసలివాళ్లు, స్త్రీలు, పురుషులు, జమైకా దేశస్థులు, అమెరికన్లు అందరూ ఉండటం వలన, వాడిన భాష కూడా అనేక రకాల యాసలతో, మాండలికాలతో వినపడుతూ ఉంటుంది. ‘కళ్లు తిప్పుకోలేని సుందర ప్రదేశం’గా క్రిస్టోఫర్ కొలంబస్చే కొనియాడబడ్డ జమైకా ఇవాళ ప్రపంచ సాహిత్యంలో ఎప్పటికీ వినిపించే ఒక తీపి కబురయింది. వలసవాదుల పాలన నుండి 1962లో స్వేచ్ఛను పొందిన జమైకా, పశ్చిమ దేశాలలోనే పటిష్టమైన నీటి పంపిణీ వ్యవస్థను, గోల్ఫ్ కోర్సును కలిగిన మొదటిదేశంగా పేరొందిన జమైకా... మనకు తెలిసిన జమైకా. చరిత్ర చెప్పిన జమైకా. కానీ, బానిసలను తయారుచేయడమే కాక, ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకున్న జమైకా, అతి భయంకరమైన నేర వ్యవస్థను ఇతర దేశాలకు ఎగుమతి చేసిన జమైకా... మనకు తెలియని జమైకా. చరిత్ర చెప్పని జమైకా. కాల ప్రయాణంలో మరుగున పడిపోయిన సంక్షోభాలను, వాటిల్లోంచి వినిపించే స్వరాలను ప్రపంచానికి పరిచయం చేస్తున్న జమైకా రచయిత మార్లోన్ జేమ్స్ A Brief History Of Seven Killings నవలకు 2015 సంవత్సరానికిగాను బుకర్ పురస్కారం వచ్చిన సందర్భంగా ఆ నవలను, జేమ్స్ శైలిని పరిశీలించడమే ఈ వ్యాస ఉద్దేశం. 1970లో పుట్టిన మార్లోన్ జేమ్స్ మొదటి నవల John Crow's Devill జమైకా గ్రామాలలో 1957లో చోటు చేసుకున్న రెండు ప్రత్యర్థి గ్రూపుల ఘర్షణలు వస్తువుగా 2005లో తీసుకువచ్చాడు. 2009లో, 18వ శతాబ్దంలో చెరకు ఉత్పత్తి దారులు పెంచి పోషించిన బానిస వ్యవస్థ మీద లిలిత్ అనే స్త్రీ బానిస పాత్రను కేంద్రంగా చేసుకుని The Book of Night Women రాసాడు. ప్రతి నాలుగు సంవత్సరాలకు అక్షరమై పలకరిస్తున్న జేమ్స్ రచనా వస్తువు ప్రధానంగా జమైకా చారిత్రక, రాజకీయ, సాంఘిక పరిస్థితుల నేపథ్యమే. చాలాకాలం జమైకా హింసాత్మక గతాన్ని ఎలా చెప్పాలా? అనే సంఘర్షణకు లోనైన జేమ్స్, డెబ్భైవ దశకపు సంక్షోభాన్ని A Brief History Of Seven Killings ఒక మహాకావ్యమై వినిపించాడు. ‘‘నేను చరిత్ర గురించి చెప్పాలనుకోవడం లేదు, అవినీతి గురించి చెప్పాలనుకోవడం లేదు, స్వలింగ సంపర్కం గురించి చెప్పాలనుకోవడం లేదు. I love my country to death but I also remember how much of our history is paid for in blood...’’ అన్నాడు జేమ్స్. 1976లో జమైకా రాజధాని కింగ్‌స్టన్‌లో ప్రఖ్యాత గాయకుడు బాబ్ మార్లేపై జరిగిన హత్యాప్రయత్నాన్ని ప్రధానంగా ఇందులో జేమ్స్ చిత్రించాడు. 1962లో బ్రిటిష్ ప్రభుత్వం జమైకాకు స్వాతంత్య్రాన్ని ప్రకటించి వెళ్లిపోయాక, జమైకాలో ఆర్థిక పరిస్థితి క్షీణించడం ప్రారంభమైంది. ఈ సమయంలోనే రెండు ప్రధాన రాజకీయ పార్టీలలో పీపుల్స్ నేషనల్ పార్టీ, సోవియట్ యూనియన్ బలపరుస్తున్న క్యూబాతోనూ, జమైకా లేబర్ పార్టీ అమెరికా గూఢచార సంస్థ సీఐఏతోనూ గట్టి బంధాలను ఏర్పాటు చేసుకొని, వాటి ద్వారా మిలిటెంట్లను తీసుకొచ్చి జమైకాలోని సామాన్య జీవనాన్ని, శాంతిని తమ సొంత ప్రయోజనాల కోసం భంగపరుస్తున్న సందర్భంలో, దీనికి వ్యతిరేకంగా గొంతు విప్పుతున్న బాబ్‌మార్లే వంటి వాళ్లపై జరుగుతున్న దాడుల వెనుక ఉన్న అపస్వరాలను జేమ్స్ అక్షరబద్ధం చేశాడు. ఈ దాడిని చిత్రిస్తున్నట్టు కనబడినా, మరొకపక్క షోవర్పాస్ అనే గ్యాంగ్‌స్టర్ యధార్థ జీవిత కథ ఆధారంగా నేర ప్రపంచం 60లలో కింగ్‌స్టన్‌లో ఎలా ప్రారంభమై ఎలా అమెరికా వరకు వ్యాప్తి చెందిందో, ఎనభైలలో న్యూయార్క్‌లోనూ, మయామీలోనూ ఎంతటి విధ్వంసాలను సృష్టించిందో చెప్పడం ఆశ్చర్యమనిపిస్తుంది. నవలలోని పాత్రల్లో చిన్నవాళ్లు, ముసలివాళ్లు, స్త్రీలు, పురుషులు, జమైకా దేశస్థులు, అమెరికన్లు అందరూ ఉండటం వలన, వాడిన భాష కూడా అనేక రకాల యాసలతో, మాండలికాలతో వినపడుతూ ఉంటుంది. బహుశా ఈ ప్రత్యేకత వల్లనే బుకర్ ప్రైజ్ కమిటీ ఛైర్మన్ మైఖేల్ ఉడ్- ‘‘ఫైనల్‌కు చేరిన ఆరు నవలల నుంచి మేము జేమ్స్ పుస్తకాన్ని ఎంపిక చేసుకోవడానికి ఏమాత్రం కష్టపడలేదు. ఒక విధంగా ఏకగ్రీవమైన నిర్ణయమిది. నవలలో ఎన్నో స్వరాలు వస్తూ వుంటాయి, పోతూ వుంటాయి, వాటి ప్రత్యేకతలను కాపాడుకుంటూ వుంటాయి. వాటి పని అవి చేస్తూ కథనంలో ఇమిడిపోవడమే గొప్పదనం’’ అనడం జేమ్స్‌కు ఒక క్రెడిట్‌గా భావించాలి. అనేక పాత్రలు ఉన్న ఈ నవలలో నీనా బర్జస్ ఒక మరపురాని పాత్ర. బహుశా జేమ్స్‌లోని ప్రత్యేకత ఒక ‘లిలిత్’ను, ఒక ‘నీనా’ను పాఠకులకు అందివ్వడమే. మొత్తం నవలనంతా ఆమె స్వరం పట్టుకునే ఉంటుంది. మార్లేపై జరిగిన దాడికి ఆమె మొదటి సాక్షి. ఆ తరువాత ఆమె ఎలా తన పేరుని, చిరునామాని మార్చుకుని, జమైకాకి దూరంగా అమెరికాకి వెళ్లిపోయిందో చెప్పడంలో నీనా పాత్రలోని విశిష్టతను పాఠకుడు పసిగడతాడు. కథకి దూరంగా తిరుగుతున్నట్టు కనిపించే నీనా సమాంతరంగా జమైకా సమాజపు వర్తమాన పరిస్థితిని వ్యాఖ్యానించే పాత్రగా కనపడడం కూడా ఈ నవలలోని ప్రత్యేకత. ‘Two years since the election'' she says "Jamaica never gets worse or better, it just finds new ways to stay the same. You can't change the country, but may be you can change yourself’’ అనే నీనా ద్వారా గొప్ప వాస్తవాన్ని మనం తెలుసుకోవచ్చు. తన మొదటి నవల సమయంలో టోనీ మార్సన్తోనూ, రెండవ నవల సమయంలో టెరాన్టిన్తోనూ పోల్చినప్పుడు ఇబ్బంది పడ్డ జేమ్స్, తనపై చార్లెస్ డికెన్స్ ప్రభావం ఉన్నట్లు పేర్కొన్నాడు. కథను చెప్పడంలోనూ, ఆశ్చర్యాన్ని బిగించడంలోనూ, ముగింపు అనిశ్చితిగా ఉంచడంలోనూ డికెన్స్ స్టైల్ కొనసాగించాడు. ఇంకొక విలక్షణత ఏమిటంటే నవలలోని వ్యంగ్య వైభవం. హింసలోనూ, సామూహిక అపశబ్దాలలోనూ సౌందర్యాన్ని వెతకడంలో విఫలయత్నం చేసిన రచయితగా జేమ్స్ మనకు కనపడతాడు. అంటే హింసలోనూ, అపస్వరాలలోనూ ఎప్పటికీ సౌందర్యముండదనే నిజాన్ని చెప్పడమే! నండూరు రాజగోపాల్ 9848132208 -
జమైకా రచయితకు మ్యాన్ బుకర్
లండన్: ప్రముఖ జమైకా నవలా రచయిత మార్లన్ జేమ్స్ చరిత్ర లిఖించుకున్నారు. ఈ ఏడాది(2015) ప్రతిష్టాత్మక మ్యాన్ బుకర్ ప్రైజ్ సొంతం చేసుకొని చరిత్ర కెక్కారు. జమైకా నుంచి తొలిసారి ఈ అవార్డు అందుకున్న వ్యక్తిగా నిలిచారు. ప్రతి ఏడాది కాల్పనిక సాహిత్య రచనా విభాగంలో మన్ బుకర్ సంస్థ ఈ అవార్డును అందిస్తుంది. ఈ ఏడాది మొత్తం ఆరుగురి ఫిక్షన్ స్టోరీలు తుది నామినీలుగా నిలవగా అందులో మార్లన్ జేమ్స్ ఫిక్షన్ 'ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ సెవెన్ కిల్లింగ్స్' ప్రైజ్ దక్కించుకుంది. ఈ అవార్డు కోసం పోటి పడిన వారిలో భారత సంతతికి చెందిన బ్రిటన్ రచయిత సంజీవ్ సహోతా కూడా ఉన్నాడు. 1970లో బాబ్ మార్లీలో జరిగిన మారణ హోమాన్ని తన నవలకు ప్రాథమిక అంశంగా తీసుకొని 686 పేజీల్లో మార్లన్ జేమ్స్ 'ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ సెవెన్ కిల్లింగ్స్' రాశాడు. లండన్‌లోని గిల్డ్ హాల్లో గతరాత్రి ఈ అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమం జరిగింది. మ్యాన్ బుకర్ ప్రైజ్‌ను 1969లో స్థాపించారు. ఆంగ్ల కాల్పనిక సాహిత్యంలో విశిష్ట రచనలు చేసిన వారికి ఈ అవార్డును అందిస్తారు. తుది నామినీలుగా ఎంపికైన రచనలు ఇవే.. 'బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ సెవెన్ కిల్లింగ్స్'..మార్లన్ జేమ్స్(జమైకా) సాటిన్ ఐస్ లాండ్-టామ్ మెక్ కార్తీ(బ్రిటన్) ది ఫిషర్ మెన్-చిగోజి ఒబియోమా(బ్రిటన్) ది ఇర్ ఆఫ్ ది రునావేస్- సంజీవ్ సహోతా(బ్రిటన్- భారతీయ సంతతి పౌరుడు) ఏ స్పూల్ ఆఫ్ బ్లూ థ్రెడ్-అన్నే టేలర్(అమెరికా) ఏ లిటిల్ లైఫ్-హన్యా యానాగిహారా(అమెరికా) -
ఆమె ఐదడుగుల రాకెట్
స్ప్రింట్ చాంపియన్లకు కేరాఫ్ అడ్రస్ జమైకా. మహిళలు, పురుషులు ఏ విభాగంలోనైనా జమైకన్లదే హవా. ఓ రేసులో తొలి మూడు స్థానాల్లో ఇద్దరు జమైకన్లు ఉన్నా ఆశ్చర్యం లేదు. సాధారణంగా స్ప్రింట్ రేసుల్లో పొడుగ్గా ఉంటే అథ్లెట్లు రాణిస్తుంటారు. జమైకా సంచలనం షెల్లీ ఆన్ ఫ్రేజర్ మాత్రం ఎత్తు కంటే వేగమే ముఖ్యమని నిరూపించింది. ఎత్తు ఐదడుగులే ఉన్నా 100 మీటర్ల రేసులో రికార్డుల మోత మోగిస్తోంది. షెల్లీ ముద్దుపేరు 'పాకెట్ రాకెట్'.. ట్రాక్‌పై మాత్రం 'ఐదడుగుల రాకెట్'. ప్రపంచంలో ఎక్కడ.. పురుషుల 100 మీటర్ల రేసు జరిగినా ప్రథమ స్థానం జమైకా చిరుత ఉసేన్ బోల్ట్‌దే. మిగిలిన స్ప్రింటర్లు రెండు, మూడు స్థానాలకు పోటీ పడాల్సిందే. పరుషుల విభాగంలో బోల్ట్ ఎలాగో.. మహిళల విభాగంలో షెల్లీ అలాగన్నమాట. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో షెల్లీ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ మెగా ఈవెంట్ 100 మీటర్ల రేసులో జమైకా స్టార్ ముచ్చటగా మూడోసారి స్వర్ణంతో మెరిసింది. ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ మహిళల 100 మీటర్ల రేసును మూడుసార్లు నెగ్గిన తొలి అథ్లెట్‌గా షెల్లీ అరుదైన ఘనత సాధించింది. సోమవారం జరిగిన రేసును 10.76 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానంలో నిలిచింది. 2009, 2013 ప్రపంచ చాంపియన్‌షిప్ 100 మీటర్ల విభాగంలో ఆమె పసిడి పతకాలు నెగ్గింది. ఇక మహిళల 100 మీటర్ల రేసులో ఒలింపిక్ స్వర్ణపతకం నెగ్గిన తొలి కరీబియన్ అథ్లెట్‌గా షెల్లీ మరో రికార్డు నెలకొల్పింది. 2008 బీజింగ్, 2012 లండన్ ఒలింపిక్స్‌లలో స్వర్ణ పతకాలు సాధించింది. -
భళా... బోల్ట్
మూడోసారి 100 మీటర్ల ప్రపంచ టైటిల్ కైవసం 9.79 సెకన్లలో గమ్యానికి గట్టిపోటీనిచ్చిన గాట్లిన్ బీజింగ్: గత ఏడేళ్లుగా తాను బరిలోకి దిగిన 100 మీటర్ల రేసులో పరాజయమెరుగని జమైకా స్టార్ స్ప్రింటర్ ఉసేన్ బోల్ట్ మళ్లీ మెరిశాడు. తన అజేయ రికార్డును కొనసాగిస్తూ మూడోసారి 100 మీటర్ల విభాగంలో ప్రపంచ చాంపియన్‌గా నిలిచాడు. ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భాగంగా ఆదివారం ఇక్కడి బర్డ్స్నెస్ట్ స్టేడియంలో జరిగిన పురుషుల 100 మీటర్ల రేసులో బోల్ట్ విజేతగా నిలిచాడు. 9.79 సెకన్లలో రేసును ముగించి అగ్రస్థానాన్ని దక్కించుకోవడంతోపాటు గత 28 రేసుల్లో ఓటమి ఎరుగని జస్టిన్ గాట్లిన్ (అమెరికా)ను ఓడించాడు. గతంలో రెండుసార్లు డోపింగ్‌లో పట్టుబడి నిషేధం ఎదుర్కొన్న జస్టిన్ గాట్లిన్ (9.80 సెకన్లు) ఎంత వేగంగా పరిగెత్తినా బోల్ట్ ధాటికి చివరకు సెకనులో వందో వంతు తేడాతో వెనుకబడి రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు. తొలి 50 మీటర్ల వరకు రెండో స్థానంలో ఉన్న బోల్ట్ ఆ తర్వాత వేగం పెంచి చివరి 10 మీటర్లలో గాట్లిన్‌ను అధిగమించాడు. ట్రెవన్ బ్రోమెల్ (అమెరికా-9.92 సెకన్లు) మూడో స్థానంలో నిలిచాడు. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో 100 మీటర్ల విభాగంలో బోల్ట్కిది మూడో స్వర్ణ పతకం. గతంలో అతను 2009, 2013లలో కూడా పసిడి పతకాలు సాధించాడు. ఇదే ప్రపంచ చాంపియన్‌షిప్‌లో బోల్ట్ 200 మీటర్లు, 4ఁ100 మీటర్ల రిలేలో కూడా బరిలోకి దిగనున్నాడు. ఇందర్జీత్కు 11వ స్థానం మరోవైపు ఈ మెగా ఈవెంట్లో భారత క్రీడాకారులు నిరాశపరిచారు. పురుషుల షాట్‌పుట్ ఈవెంట్లో ఇందర్జీత్ సింగ్ ఫైనల్‌కు చేరుకున్నా ఆఖరకు 11వ స్థానంతో సంతృప్తి పడ్డాడు. ఆసియా చాంపియన్ హోదాలో బరిలోకి దిగిన ఇందర్జీత్ సింగ్ ఇనుప గుండును 19.52 మీటర్ల దూరం విసిరాడు. జో కొవాక్స్ (అమెరికా-21.93 మీటర్లు) స్వర్ణం సాధించగా... డేవిడ్ స్ట్రోల్ (జర్మనీ-21.74 మీటర్లు), రిచర్డ్స్ (జమైకా-21.69 మీటర్లు) రజత, కాంస్య పతకాలు నెగ్గారు. పురుషుల 20 కిలోమీటర్ల నడకలో భారత్‌కు చెందిన బల్జీందర్ సింగ్ రేసును కూడా పూర్తి చేయలేకపోగా... గుర్మీత్ సింగ్ 35వ, చందన్ సింగ్ 41వ స్థానాల్లో నిలిచారు.