లాస్ వేగస్: కోపా అమెరికా కప్ ఫుట్‌బాల్ టోర్నీలో ఈక్వెడార్ జట్టు ఎనిమిదేళ్ల తర్వాత తొలి విజయాన్ని అందుకుంది. గ్రూప్‘బి’లో భాగంగా జమైకాతో జరిగిన మ్యాచ్‌లో ఈక్వెడార్ 3–1తో నెగ్గింది. 13వ నిమిషంలో జమైకా ప్లేయర్ కేసీ పాల్మెర్ సెల్ఫ్ గోల్‌తో ఈక్వెడార్ ఖాతా తెరిచింది.
కెండ్రీ పెజ్ (45+4వ ని.లో) గోల్‌తో ఈక్వెడార్ ఆధిక్యం 2–0కు పెరిగింది. 54వ నిమిషంలో ఆంటోనియో జమైకాకు తొలి గోల్ అందించాడు. అలాన్ మిండా (90+1వ ని.లో) గోల్‌తో ఈక్వెడార్ విజయాన్ని ఖాయం చేసుకుంది. మరో మ్యాచ్‌లో వెనిజులా 1–0తో మెక్సికోను ఓడించి క్వార్టర్ ఫైనల్‌కు చేరింది.
Comments
Please login to add a commentAdd a comment