‘మా జట్టు సిద్ధమైంది..’ | runner usain bolt captain in charity football match  | Sakshi
Sakshi News home page

చారిటీ ఫుట్‌బాల్‌ మ్యాచ్‌లో బోల్ట్‌ సారథ్యం 

Published Tue, Feb 27 2018 9:53 PM | Last Updated on Tue, Oct 2 2018 8:39 PM

runner usain bolt captain in charity football match  - Sakshi

పారిస్‌: ఇన్నాళ్లూ మనం దిగ్గజ అథ్లెట్‌ ఉసేన్‌ బోల్ట్‌ పరుగును, ప్రపంచ రికార్డులను చూశాం. ఇక మీదట అతని సారథ్యాన్ని చూడబోతున్నాం. ఈ జమైకన్‌ స్ప్రింట్‌ స్టార్‌ చిన్నారుల సంక్షేమం కోసం యూనిసెఫ్‌ సంస్థ నిర్వహిస్తున్న ఛారిటీ ఫుట్‌బాల్‌ మ్యాచ్‌లో తలపడేందుకు సిద్ధమయ్యాడు. ఫుట్‌బాల్‌ అంటే ఎంతో ఇష్టపడే ఉసేన్‌ బోల్ట్‌ ‘సాకర్‌ ఎయిడ్‌ వరల్డ్‌ ఎలెవన్‌’ జట్టుకు సారథిగా వ్యవహరిస్తాడు. 

అవతలి జట్టు (ఇంగ్లండ్‌)కు బ్రిటిష్‌ రాక్‌స్టార్‌ రాబీ విలియమ్స్‌ నాయకత్వం వహించనున్నాడు. మాంచెస్టర్‌ యునైటెడ్‌కు చెందిన ఓల్డ్‌ ట్రాఫోర్డ్‌ స్టేడియంలో జూన్‌ 10న ఈ మ్యాచ్‌ జరగనుంది. దీనికి సంబంధించిన ప్రచార వీడియోలో బ్రెజిల్‌ స్టార్‌ రొనాల్డినో, రియల్‌ మాడ్రిడ్‌ కోచ్‌ జినెదిన్‌ జిదాన్, అమెరికన్‌ కామెడీ యాక్టర్‌ విల్‌ ఫెరెల్‌ నటించారు. తన సాకర్‌ ముచ్చటపై బోల్ట్‌ ట్విట్టర్‌లో ‘సెలబ్రిటీస్, లెజెండ్స్, బ్రాండ్‌ న్యూ కెప్టెన్‌తో సాకర్‌ ఎయిడ్‌ వరల్డ్‌ ఎలెవన్‌ జట్టు సిద్ధమైంది’ అని ట్వీట్‌ చేశాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement