జమైకా: కరీబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్)లో వెస్టిండీస్ ఆల్ రౌండర్ ఆండ్రీ రసెల్ తీవ్రంగా గాయపడ్డాడు. బంతిని హిట్ చేసే క్రమంలో అది రసెల్ హెల్మెట్ వెనుకబాగాన బలంగా తాకింది. కుడి చెవికి తగలడంతో రసెల్ మైదానంలో కుప్పకూలిపోయాడు. దాంతో ప్రాథమిక చికిత్స తర్వాత రసెల్‌ను ఆస్పత్రికి తరలించారు. సీపీఎల్‌లో భాగంగా జమైకా తలవాస్ తరఫున ఆడుతున్న రసెల్.. గురువారం సెయింట్ లూసియా జౌక్స్‌తో మ్యాచ్‌లో 14 ఓవర్‌లో బంతిని హిట్ చేసేందుకు యత్నించాడు.
షార్ట్ పిచ్ బంతిని భారీ షాట్‌కు ప్రయత్నించగా అది కాస్తా అంచనా తప్పి రసెల్ హెల్మెట్‌ను తాకుతూ దూసుకుపోయింది. ఈ క్రమంలోనే కుడి చెవికి గాయం కావడంతో రసెల్ ఫీల్డ్‌లో నిలబడలేకపోయాడు. ఫీల్డ్‌లోనే కూలబడిపోయాడు. దాంతో ఒక్కసారిగా ఆందోళన రేకెత్తింది. ప్రత్యర్థి జట్టు ఫీల్డర్లు రసెల్ వద్దకు వచ్చి హెల్మెట్ తీసి చెక్ చేయడమే కాకుండా నెమ్మదిగా పైకి లేపారు. అదే సమయంలో హుటాహుటీనా అక్కడికి చేరుకున్న మెడికల్ విభాగం ప్రాథమికి చికిత్స తర్వాత రసెల్‌ను ఆస్పత్రికి తరలించింది. అనేక రకాలైన స్కాన్‌లు నిర్వహించిన తర్వాత రసెల్‌కు ఎటువంటి ప్రమాదం లేదని వైద్యులు తేల్చారు. రసెల్ గాయపడే సమయానికి మూడు బంతులు ఆడి పరుగులేమీ చేయలేదు. ఈ మ్యాచ్‌లో సెయింట్ లూసియా ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment