షెల్లీకే 100 మీటర్ల టైటిల్ | Jamaica's Shelly-Ann Fraser-Pryce wins 100 meters | Sakshi
Sakshi News home page

షెల్లీకే 100 మీటర్ల టైటిల్

Published Tue, Aug 13 2013 4:15 AM | Last Updated on Fri, Sep 1 2017 9:48 PM

షెల్లీకే 100 మీటర్ల టైటిల్

షెల్లీకే 100 మీటర్ల టైటిల్

మహిళల 100 మీటర్ల రేసులో షెల్లీ ఆన్ ఫ్రేజర్ (జమైకా-10.71 సెకన్లు) బుల్లెట్ వేగంతో దూసుకెళ్లి రెండోసారి విజేతగా నిలిచింది. 2009 బెర్లిన్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం నెగ్గిన ఈ 5 అడుగుల జమైకా స్టార్ 2011 పోటీల్లో మాత్రం నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. అయితే మాస్కోలో మాత్రం తన తడాఖా చూపించింది. రేసు ఆద్యంతం ఆధిపత్యం చలాయించి ప్రత్యర్థులను వెనక్కినెట్టి మళ్లీ విశ్వవిజేతగా అవతరించింది. మురెల్లి అరౌ (ఐవరీకోస్ట్-10.93 సెకన్లు) రజతం... జెటర్ (అమెరికా-10.94 సెకన్లు) కాంస్యం సాధించారు. పురుషుల 110 మీటర్ల హర్డిల్స్‌లో ఒలివెర్ (అమెరికా-13 సెకన్లు) స్వర్ణం సాధించాడు. మహిళల 400 మీటర్ల రేసులో ఒహురుగు (బ్రిటన్-49.41 సెకన్లు) విజేతగా నిలిచింది. పురుషుల పోల్‌వాల్ట్‌లో రాఫెల్ హోల్జ్‌డెపి (జర్మనీ-5.89 మీటర్లు), హ్యామర్‌త్రోలో  ఫాజ్‌దెక్ (పోలండ్-81.97 మీటర్లు) స్వర్ణాలు నెగ్గారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement